అన్నం, పప్పులో పురుగులొస్తున్నా సీఎంకు పట్టదా? | Telangana Govt unmoved by plight of residential school students: Harish Rao and Sabitha Indra Reddy | Sakshi
Sakshi News home page

అన్నం, పప్పులో పురుగులొస్తున్నా సీఎంకు పట్టదా?

Sep 1 2024 4:22 AM | Updated on Sep 1 2024 4:22 AM

Telangana Govt unmoved by plight of residential school students: Harish Rao and Sabitha Indra Reddy

విద్యార్థినులు రోడ్డెక్కి ధర్నా చేసినా రేవంత్‌ స్పందించకపోవడం సిగ్గుచేటు

గతంలో కేసీఆర్‌ సన్న బియ్యం పెడితే ప్రస్తుతం గొడ్డుకారంతో భోజనం పెడుతున్నారు

ఫెయిల్యూర్‌ సీఎంతోనే విద్యార్థులకు కష్టాలు:  హరీశ్‌రావు

సబితారెడ్డితో కలిసి పాల్మాకుల కేజీబీవీ సందర్శన.. విద్యార్థినుల సమస్యలపై ఆరా

శంషాబాద్‌ రూరల్‌: ‘అన్నం, పప్పులో పురుగులు వస్తున్నాయని ఆడపిల్లలు రెండు కి.మీ. నడిచి జాతీయ రహ దారిపై ధర్నా చేస్తే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందనలేదు. విద్యా ర్థుల కన్నీళ్లు చూçస్తుంటే ఏడుపొస్తోంది. దీనికి సీఎంరేవంత్‌రెడ్డి సిగ్గుపడాలి. ఫెయిల్యూర్‌ సీఎం కారణంగా రాష్ట్రంలో గురుకులాలు, మైనారిటీ విద్యా వ్యవస్థ కుంటుపడింది’ అని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని పాల్మాకు లలో ఉన్న కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని మాజీ మంత్రి పి.సబితారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. హరీశ్, సబిత రాకతో పిల్లలు వారి బాధలు చెప్పుకొని ఏడ్చారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు.

కడుపు నిండా భోజనం పెట్టట్లేదు..
‘విద్యార్థినులకు కడుపు నిండా భోజ నం లేదు. పుస్తకాలు, బోధన, కనీస సౌకర్యా లు లేవని విద్యార్థినులు బాధ పడుతు న్నారు. ఆరో తరగతి వారికి ఒక జత యూనిఫాం మాత్రమే వచ్చినట్లు విద్యా ర్థినులు చెబుతున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు ఇవ్వలేదు. సమస్య ల గురించి చెబితే వారిపట్ల ఉపాధ్యా యులు వ్యవహరించిన తీరు బాధాకరం. గతంలో కేసీఆర్‌ సన్న బియ్యంతో అన్నం పెడితే ప్రస్తుతం గొడ్డు కారంతో భోజనం పెడుతున్నారు. మెనూ ప్రకా రం పిల్లలకు గుడ్లు, మాంసం పెట్టట్లేదు. సీఎం వద్ద విద్య, సాంఘిక సంక్షేమ శాఖ లున్నా సమీక్షల్లేక అంతా అస్తవ్యస్తంగా మారింది. ఈ ప్రభు త్వం వచ్చాక కస్తూ ర్బా, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని హరీశ్‌రావు విమర్శించారు.

ప్రభుత్వానిది మొద్దునిద్ర..
సంక్షేమ పాఠశాలల్లో విషాహారం తిని 500 మంది పిల్లలు ఆస్పత్రులపాలైతే 38 మంది పిల్లలు చనిపోయారని హరీశ్‌రావు ఆరోపించారు. ఓవైపు ఎలుకలు, మరోవైపు పాముకాట్లకు పిల్లలు గురవుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా ఉండేవన్నారు. ముఖ్యమంత్రి మాటలు కాకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పాల్మాకులలో ఉపాధ్యాయులందరినీ బదిలీ చేసి పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

విద్యావ్యవస్థను గాలికొదిలేశారు: సబితారెడ్డి
విద్యావ్యవస్థను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి పి.సబితారెడ్డి ఆరోపించారు. ఎంత బాధ ఉంటే పిల్లలు రోడ్డు పైకి వస్తారో ప్రభుత్వం ఆలోచించాలన్నారు.  కలెక్టర్‌ ఇటువైవు చూసే తీరిక లేకుండా ఉన్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో 800 వరకు పాఠశాలలు ఉపాధ్యా యుల్లేక మూతపడినట్లు వార్తలు వచ్చాయన్నారు. అంతకు ముందు మాజీ మంత్రులు పాఠశాలలోని వంటగది, తరగతి గదులను పరిశీలించారు. చక్రధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాఠాలొద్దు.. ప్రాణాలే ముద్దు..
శిథిలమైన పాఠశాల భవనంలో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదని కొడంగల్‌లోని దుద్యాల మండలం హస్నాబాద్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం తరగతులు బహిష్కరించి పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు. కనీ సం వర్షాకాలం ముగిసేవరకైనా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చేతు లు జోడించి మొక్కుతూ వినూత్న నిరసన తెలిపారు. నిజాం రాజుల కాలంలో సుమారు వందేళ్ల క్రితం నిర్మించిన భవనం వర్షాలకు కారుతోందని వివరించారు.

గోడలు తడిసి, గదుల నిండా నీళ్లు నిండుతున్నాయని వాపోయారు. తమ సమస్యను అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఆరు నుంచి పది తరగతులకు చెందిన 234 మంది ఈ పాఠశా లలో చదువుతున్నారు. వర్షం కురిస్తే ఎలాగూ తరగతులు జరగవనే ఉద్దేశంతో చాలామంది పాఠశాల వైపు కూడా రాకపోవడం గమనార్హం.    –దుద్యాల

కేజీబీవీలో విద్యార్థులతో కలెక్టర్‌ భోజనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్‌ మండలం పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) కలెక్టర్‌ శశాంక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న ఆహారంలో నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి ఆయన భోజనం చేశారు. విద్యార్థినులు చెబుతున్న సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ వెంట జిల్లా విద్యాధికారి సుశీందర్‌ రావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement