Kasturbha gandi girls schools
-
అన్నం, పప్పులో పురుగులొస్తున్నా సీఎంకు పట్టదా?
శంషాబాద్ రూరల్: ‘అన్నం, పప్పులో పురుగులు వస్తున్నాయని ఆడపిల్లలు రెండు కి.మీ. నడిచి జాతీయ రహ దారిపై ధర్నా చేస్తే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందనలేదు. విద్యా ర్థుల కన్నీళ్లు చూçస్తుంటే ఏడుపొస్తోంది. దీనికి సీఎంరేవంత్‌రెడ్డి సిగ్గుపడాలి. ఫెయిల్యూర్ సీఎం కారణంగా రాష్ట్రంలో గురుకులాలు, మైనారిటీ విద్యా వ్యవస్థ కుంటుపడింది’ అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకు లలో ఉన్న కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని మాజీ మంత్రి పి.సబితారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. హరీశ్, సబిత రాకతో పిల్లలు వారి బాధలు చెప్పుకొని ఏడ్చారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు.కడుపు నిండా భోజనం పెట్టట్లేదు..‘విద్యార్థినులకు కడుపు నిండా భోజ నం లేదు. పుస్తకాలు, బోధన, కనీస సౌకర్యా లు లేవని విద్యార్థినులు బాధ పడుతు న్నారు. ఆరో తరగతి వారికి ఒక జత యూనిఫాం మాత్రమే వచ్చినట్లు విద్యా ర్థినులు చెబుతున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు ఇవ్వలేదు. సమస్య ల గురించి చెబితే వారిపట్ల ఉపాధ్యా యులు వ్యవహరించిన తీరు బాధాకరం. గతంలో కేసీఆర్ సన్న బియ్యంతో అన్నం పెడితే ప్రస్తుతం గొడ్డు కారంతో భోజనం పెడుతున్నారు. మెనూ ప్రకా రం పిల్లలకు గుడ్లు, మాంసం పెట్టట్లేదు. సీఎం వద్ద విద్య, సాంఘిక సంక్షేమ శాఖ లున్నా సమీక్షల్లేక అంతా అస్తవ్యస్తంగా మారింది. ఈ ప్రభు త్వం వచ్చాక కస్తూ ర్బా, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని హరీశ్‌రావు విమర్శించారు.ప్రభుత్వానిది మొద్దునిద్ర..సంక్షేమ పాఠశాలల్లో విషాహారం తిని 500 మంది పిల్లలు ఆస్పత్రులపాలైతే 38 మంది పిల్లలు చనిపోయారని హరీశ్‌రావు ఆరోపించారు. ఓవైపు ఎలుకలు, మరోవైపు పాముకాట్లకు పిల్లలు గురవుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా ఉండేవన్నారు. ముఖ్యమంత్రి మాటలు కాకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పాల్మాకులలో ఉపాధ్యాయులందరినీ బదిలీ చేసి పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.విద్యావ్యవస్థను గాలికొదిలేశారు: సబితారెడ్డివిద్యావ్యవస్థను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి పి.సబితారెడ్డి ఆరోపించారు. ఎంత బాధ ఉంటే పిల్లలు రోడ్డు పైకి వస్తారో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. కలెక్టర్ ఇటువైవు చూసే తీరిక లేకుండా ఉన్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో 800 వరకు పాఠశాలలు ఉపాధ్యా యుల్లేక మూతపడినట్లు వార్తలు వచ్చాయన్నారు. అంతకు ముందు మాజీ మంత్రులు పాఠశాలలోని వంటగది, తరగతి గదులను పరిశీలించారు. చక్రధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పాఠాలొద్దు.. ప్రాణాలే ముద్దు..శిథిలమైన పాఠశాల భవనంలో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదని కొడంగల్‌లోని దుద్యాల మండలం హస్నాబాద్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం తరగతులు బహిష్కరించి పాఠశాల ఆవరణలో ఆందోళన చేపట్టారు. కనీ సం వర్షాకాలం ముగిసేవరకైనా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చేతు లు జోడించి మొక్కుతూ వినూత్న నిరసన తెలిపారు. నిజాం రాజుల కాలంలో సుమారు వందేళ్ల క్రితం నిర్మించిన భవనం వర్షాలకు కారుతోందని వివరించారు.గోడలు తడిసి, గదుల నిండా నీళ్లు నిండుతున్నాయని వాపోయారు. తమ సమస్యను అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఆరు నుంచి పది తరగతులకు చెందిన 234 మంది ఈ పాఠశా లలో చదువుతున్నారు. వర్షం కురిస్తే ఎలాగూ తరగతులు జరగవనే ఉద్దేశంతో చాలామంది పాఠశాల వైపు కూడా రాకపోవడం గమనార్హం. –దుద్యాలకేజీబీవీలో విద్యార్థులతో కలెక్టర్ భోజనంసాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) కలెక్టర్ శశాంక శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న ఆహారంలో నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి ఆయన భోజనం చేశారు. విద్యార్థినులు చెబుతున్న సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు ఉన్నారు. -
విద్యార్థినిపై హత్యాయత్నం
సాక్షి, చెన్నూర్ : కలిసి చదువుకునే విద్యార్థినులే తోటి విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన చెన్నూర్ కస్తూర్బా పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత విద్యార్థిని కథనం ప్రకారం.. చెన్నూర్ మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం తోటి విద్యార్థినులందరితో కలిసి వారికి కేటాయించిన గదిలో పడుకుంది. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అదే గదిలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థినులు తనపై హత్యాయత్నం చేశారని, ఇద్దరు కాళ్లు, చేతులు పట్టుకోగా.. మరో విద్యార్థిని గొంతుకు గుడ్డచుట్టి నులిమినట్లు పేర్కొంది. ఊపిరి ఆడక పోవడం.. కాళ్లు కొట్టుకోవడంతో పక్కనే ఉన్న విద్యార్థినులు లేచారు. ఉపాధ్యాయురాలు కూడా గదికి వచ్చారు. జరిగిన విషయాన్ని ఆమెకు తెలపడంతో ముగ్గురు విద్యార్థినులను చితకబాదింది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు ముగ్గురు విద్యార్థినులను వారివారి స్వగ్రామాలకు పంపించారని బాధిత విద్యార్థిని తెలిపారు. ఇంత జరిగినా గోప్యమెందుకో.. ? పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు తోటి విద్యార్థినిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మంగళవారం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులతో పాఠశాలకు వచ్చి ఘటన విషయాన్ని సిబ్బందిని అడిగేవరకూ పాఠశాల ప్రత్యేకాధికారి, సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారనే విషయం చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి విద్యార్థిని కేకలు వేయడంతో ఉపాధ్యాయురాలు వచ్చి సదరు ముగ్గురు విద్యార్థిను చితకబాదిందని బాధిత విద్యార్థిని చెబుతుంటే.. ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పక పోవడంలోని ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం వెలుగులోకి వస్తే పాఠశాలలో విద్యాభ్యాసం చేసే ఇతర విద్యార్థులు భయాందోళనలకు గురవుతారని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందనా..? లేక విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది కలుగుతుందనా..? అని తల్లిదండ్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. బిడ్డ చనిపోతే బాధ్యులు ఎవరు..? ‘గదిలో పడుకున్న నా బిడ్డ అరవకుంటే చనిపోయేది. నా బిడ్డా చనిపోతే ఎవరు బాధ్యత వహించేవారు..’ అని బాధిత విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం తన బిడ్డను చంపే ప్రయత్నం చేసినా.. ఉపాధ్యాయురాళ్లు తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఆదివారం పాఠశాలకు వచ్చిన లంబాడిపల్లి గ్రామానికి చెందిన కొందరు తన బిడ్డ ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో అదే రాత్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లానని, అక్కడ తనను చంపే ప్రయత్నం చేశారని చెప్పే వరకూ తమకు తెలియదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అడిగేందుకు వస్తే ప్రిన్సిపాల్ లేదంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు జిల్లా అధికారులను కోరారు. -
అదరహో కేజీఠీవీ !
సాక్షి, శ్రీకాకుళం : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీ) మంచి రోజులు రానున్నాయి. ప్రస్తుతం కేజీబీవీల్లో ప్రవేశాలకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో కేజీబీవీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడేషన్ చేస్తున్నారు. మొత్తం 32 కేజీబీవీల్లో గత ఏడాది 2 అప్‌గ్రేడ్ కాగా, ఈ ఏడాది మరో 19 అప్‌గ్రేడ్ అవుతున్నాయి. దీంతో జిల్లాలో మొత్తం జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ అయిన కేజీబీవీల సంఖ్య 21కు చేరుకుంది. వసతి సమస్య లేకుండా ఉంటే.. భవిష్యత్‌లో అన్ని కేజీబీవీల్లోను ఇంటర్మీడియెట్ కోర్సులు తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలికలకు విద్య చేరువ.. గ్రామీణ ప్రాంతాల్లోని నిస్సహాయ బాలికలకు విద్యను చేరువ చేసేందుకు 2004లో అప్పటి కేంద్రప్రభుత్వం కేజీబీవీలను తీసుకువచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ, వసతి, భోజనం కూడా కల్పించి వారిని తీర్చిదిద్దాలని భావించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు 32 కేజీబీవీలను కేటాయించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరిమితం చేస్తూ.. క్లాసుకు గరిష్టంగా 40 మంది చొప్పున విద్యార్థినులతో నిర్వహించారు. తొలిరోజుల్లో భవనాలు లేక కొన్ని అద్దె భవనాల్లో నడిపించారు. మరికొన్నింటిని ఆయా ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహణను కొనసాగించారు. 2010 నుంచి ఆర్వీఎంలోకి.. కేజీబీవీ పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం జరిగిన తర్వా త 2010లో అప్పటి రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) పరిధికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేజీబీవీల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఉత్తీర్ణత శాతంతోను రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో నిలుస్తూ వస్తున్నాయి. రూపాయి ఖర్చు లేకుండా ప్రస్తుతం సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిర్వహణలో కేజీబీవీలు నడుస్తున్నాయి. జిల్లాలో 32 కేజీబీవీల్లో ప్రస్తుతం 6600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. జూనియర్ కళాశాలలుగా ఉన్నతి.. కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ విద్యను గతంలో ప్రవేశపెట్టారు. జిల్లాలో కేవలం కోటబొమ్మాళి, జి.సిగడాం కేజీబీ వీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాకు చెందిన గత మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకటరావులు చెరో కళాశాలను పంచుకున్నారు. కేజీబీవీల్లో నియామకాలు సైతం ఈ మాజీ మంత్రుల సిఫారసుల మేరకే జరిగాయన్న విమర్శలు లేకపోలేదు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రాష్ట్రవ్యాప్తంగా 140 కేజీబీవీలను జూనియర్ కళాశాలలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లా నుంచి 19 కేజీబీవీలు ఉన్నాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు అప్‌గ్రేడ్ జరిగిన కేజీబీవీల సంఖ్య 21కు చేరింది. కొటబొమ్మాళి, గత ఏడాది అప్‌గ్రేడ్ అయిన జి.సిగడాంలలో ఎంపీసీ, బైపీపీ రెండేసి గ్రూపులను కేటాయింపు చేయగా.. ప్రస్తుతం కేటాయింపు చేసిన 19 కళాశాలలకు మాత్రం కేవలం ఒక గ్రూపును మాత్రమే మంజూరు చేసింది. ఆ ప్రాంతాల్లో ఆదరణ ఉన్న గ్రూపులకు అవకాశం కల్పించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, పలు ఒకేషనల్ కోర్సులను మంజూరుచేశారు. తరగతులు, వసతి ఇతర సదుపాయాలను ఉచితంగా కల్పిస్తూ.. కోర్సుకు గరిష్టంగా 40 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దీంతో 19 కేజీబీవీ కళాశాలలకు 40 మంది చొప్పున 760 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిల్లో విద్యార్థుకు పాఠాలు బోధించేందుకు పార్ట్‌టైమ్ లెక్చరర్ల నియామకాలకు సైతం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితాల్లోనూ అగ్రస్థానమే.. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులు సైతం ఉన్నతమైన ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2019 మే నెలలో వెలువడిన టెన్త్‌క్లాస్ ఫలితాల్లో 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులు 35 మంది ఉండటం గమనార్హం. రాష్ట్రంలో కేజీబీవీల్లో అత్యధికంగా 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించడంలో 38 మంది విద్యార్థినులతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. శ్రీకాకుళం 35 మందితో రెండోస్థానంలో నిలవడం విశేషం. గత ఐదేళ్లుగా జిల్లాలో కేజీబీవీలు టెన్త్‌లో సగటున 95 శాతానికిపైగా ఉత్తర్ణత సాధిస్తున్నాయి. -
కేజీబీవీల్లో నిరంతర విద్యుత్‌కు చర్యలు
విశాఖపట్నం : జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్భాగాందీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీ) 24 గంటలూ విద్యుత్ ఉండేలా ఎస్ఎస్ఏ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సింగిల్ ఫేస్‌తో నడుస్తున్న 18 కేజీబీవీలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండేలా త్రీ ఫేస్ అమర్చుతున్నారు. తొలుత కశింకోట, గొలుగొండ కేజీబీవీలకు ఈ సౌకర్యం కలగనుంది. త్వరలో త్రీ ఫేస్ దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్‌శాఖ అధికారులతో ఎస్ఎస్ఏ ఇంజినీరింగ్ అధికారులు మాట్లాడి త్రీ ఫేస్‌కు టాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు సమకూర్చాలని కోరారు. ఇందుకు అవసరమైన ఖర్చును ఎస్ఎస్ఏ అధికారులు భరిస్తారు. ప్రస్తుతం కశింకోట, గొలుగొండ మండలాల్లో ఉన్న కేజీబీవీలకు త్రీఫేస్ విద్యుత్ సమకూర్చనున్నారు. సింగిల్ ఫేస్‌తో చదువుకోవడానికి బాలికలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు విద్యుత్ సదుపాయం లేనప్పుడు మరుగుదొడ్లకు వెళ్లడానికి అవస్థలు పడడాన్ని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు పాఠశాలలకు త్రీఫేస్ ఇచ్చేందుకు ఇప్పటికే విద్యుత్‌శాఖకు డబ్బు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. మిగతా కేజీబీవీలకు త్వరలోనే త్రీ ఫేస్ సౌకర్యం కల్పించనున్నారు. వీరు తీసుకున్న చొరవతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.