విశాఖపట్నం : జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్భాగాందీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీ) 24 గంటలూ విద్యుత్ ఉండేలా ఎస్‌ఎస్‌ఏ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సింగిల్ ఫేస్‌తో నడుస్తున్న 18 కేజీబీవీలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండేలా త్రీ ఫేస్ అమర్చుతున్నారు. తొలుత కశింకోట, గొలుగొండ కేజీబీవీలకు ఈ సౌకర్యం కలగనుంది. త్వరలో త్రీ ఫేస్ దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్‌శాఖ అధికారులతో ఎస్‌ఎస్‌ఏ ఇంజినీరింగ్ అధికారులు మాట్లాడి త్రీ ఫేస్‌కు టాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు సమకూర్చాలని కోరారు.
ఇందుకు అవసరమైన ఖర్చును ఎస్‌ఎస్‌ఏ అధికారులు భరిస్తారు. ప్రస్తుతం కశింకోట, గొలుగొండ మండలాల్లో ఉన్న కేజీబీవీలకు త్రీఫేస్ విద్యుత్ సమకూర్చనున్నారు. సింగిల్ ఫేస్‌తో చదువుకోవడానికి బాలికలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు విద్యుత్ సదుపాయం లేనప్పుడు మరుగుదొడ్లకు వెళ్లడానికి అవస్థలు పడడాన్ని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు పాఠశాలలకు త్రీఫేస్ ఇచ్చేందుకు ఇప్పటికే విద్యుత్‌శాఖకు డబ్బు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. మిగతా కేజీబీవీలకు త్వరలోనే త్రీ ఫేస్ సౌకర్యం కల్పించనున్నారు. వీరు తీసుకున్న చొరవతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేజీబీవీల్లో నిరంతర విద్యుత్‌కు చర్యలు
Published Wed, Nov 19 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement