సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యూనిఫాం అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
మన ఊరు–మన బడి, యూనిఫాం సరఫరా అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. వచ్చే ఏడాది 25 లక్షల మంది విద్యార్థులకు రూ.121 కోట్లతో యూనిఫాం అందించాలని నిర్ణయించారు. విద్యార్థుల మధ్య తారతమ్యాల దూరానికి యూనిఫాం అవసరమని ఆమె తెలిపారు. ఏప్రిల్ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా స్థాయిలో యూనిఫాం సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment