
సాక్షి, హైదరాబాద్: రేపు(గురువారం) ఉదయం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు.. సమయంలో మార్పులు చేశారు. ఉదయం 9:30 గంటలకే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
చదవండి: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
Comments
Please login to add a commentAdd a comment