time change
-
కాస్త ముందుగానే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: రేపు(గురువారం) ఉదయం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు.. సమయంలో మార్పులు చేశారు. ఉదయం 9:30 గంటలకే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. చదవండి: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు -
వడ్డీ రేట్ల డెరివేటివ్స్ వేళల పొడిగింపు
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలను కాంట్రాక్టు ఎక్స్పైరీ తేదీల్లో సాయంత్రం 5 గం.ల వరకూ పొడిగించాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) నిర్ణయించింది. దీన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం కాంట్రాక్టుల ట్రేడింగ్ సమయం ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు ఉంటోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్ వేళలు ఫిబ్రవరి 23న (ఎక్స్పైరీ తేదీ) సాయంత్రం 5 గం. వరకు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. ఆ రోజున మిగతా వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల వేళల్లో మాత్రం మార్పులేమీ ఉండవని తెలిపింది. ఆయా కాంట్రాక్టుల ఎక్స్పైరీ తేదీల్లో మాత్రం సాయంత్రం 5 గం. వరకు ట్రేడింగ్ అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ వేళలను పొడిగించాలని ఎన్ఎస్ఈ యోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9.15 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ వేళలు ఉదయం 10 గం. నుంచి రాత్రి 11.55 గం. వరకు ఉంటున్నాయి. రిస్కుల హెడ్జింగ్‌కు ఉపయోగపడుతుంది.. దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను పొడిగిస్తే .. క్రితం రోజు అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల వల్ల తలెత్తే రిస్కులను హెడ్జింగ్ చేసుకునేందుకు ఉపయోగపడగలదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘అంతర్జాతీయంగా మార్కెట్లు ఒకదానికి మరొకటి మరింతగా అనుసంధానమవుతున్నాయి. అమెరికా, యూరప్ వంటి పెద్ద మార్కెట్లలో పరిణామాలకు మన స్టాక్ మార్కెట్లు స్పందిస్తున్నాయి. కాబట్టి ఆయా రిస్కులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ట్రేడింగ్ వేళల పెంపు ఉపయోగపడగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈడీ ఎ. బాలకృష్ణన్ తెలిపారు. ఈక్విటీ సెగ్మెంట్లో వేళల పెంపుతో మార్కెట్ వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లకూ ప్రయోజనం చేకూరగలదని వివరించారు. అంతర్జాతీయ అనిశ్చితుల రిస్కులను ఎదుర్కొనేందుకు ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ సెగ్మెంట్స్ ట్రేడింగ్ వేళలను పెంచడం చాలా అవసరమని ఫైయర్స్ సీఈవో తేజస్ ఖోడే చెప్పారు. దీన్ని వ్యతిరేకిస్తే మన క్యాపిటల్ మార్కెట్ల వృద్ధికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ట్రేడింగ్ వేళల పెంపుతో అంతర్జాతీయ ట్రేడర్లకు దీటుగా దేశీ ట్రేడర్లకు కూడా సమాన అవకాశాలు లభించగలవని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ట్వీట్ చేశారు. -
దుర్గ గుడి దర్శన వేళల్లో మార్పులు..
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కోవిడ్ నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు, ఆలయ సిబ్బంది భద్రత దృష్ట్యా దేవస్థాన అధికారులు, పాలక మండలి ప్రత్యేక నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. దేవస్థానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు ఇకపై పరోక్ష పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు మాత్రమే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. పంచహారతులు, ఏకాంత సేవలకు భక్తులను అనుమతించరు. రాత్రి 7 గంటల తర్వాత ఘాట్ రోడ్డుతో పాటు మహా మండపం మెట్ల మార్గాన్ని మూసివేస్తారు. అమ్మవారికి సమర్పించే పూజ సామగ్రి , ఇతర వస్తువులను ఆలయ అర్చకులు తాకరాదని ఆదేశాలు జారీ చేశారు. జలుబు, జ్వరం ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్న భక్తులను క్యూ లైన్లోకి అనుమతించరు. క్యూలైన్లోకి ప్రవేశించే ముందుగానే భక్తులకు శానిటైజర్ అందించడంతో పాటు థర్మల్ గన్స్‌తో శరీర ఉష్ణోగ్రత చెక్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆలయ సిబ్బంది ఎవరైనా మాస్క్ ధరించని పక్షంలో రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ద్వారకా తిరుమలలో కోవిడ్ నిబంధనలు కఠినతరం ద్వారకా తిరుమల: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో ఈ నెల 26 నుంచి కోవిడ్ నిబంధనలను మరింత కఠినతరంగా అమలు చేయనున్నట్లు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయ వీఐపీ లాంజ్‌లో ఎస్ఐ డి.దుర్గామహేశ్వరరావుతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇకపై అన్నప్రసాదాన్ని ప్యాకెట్ల రూపంలో తూర్పు రాజగోపుర ప్రాంతంలో, నిత్యాన్నదాన భవనం వద్ద భక్తులకు అందజేస్తామన్నారు. ఉచిత ప్రసాద పంపిణీని పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఉచిత బస్సులను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ కల్యాణ మండపాల్లో 100 మందితోనే వివాహాది శుభకార్యాలను జరుపుకోవాలని తెలిపారు. 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు ఆలయానికి రావొద్దని కోరారు. ఆలయ దర్శన వేళల్లో ఎటువంటి మార్పులు లేవని తెలిపారు. చదవండి: కరోనా విపత్తులో సీఎం జగన్ సేవలు భేష్ రాష్ట్రానికి చేరుకున్న 4 లక్షల కోవిషీల్డ్ డోసులు -
ఒక దేశం రెండు టైం జోన్లు...!
న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న ఒకే ‘టైం జోన్’ స్థానంలో రెండు టైం జోన్లు ఉంటే భారతదేశానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మన లాంటి సువిశాల దేశంలో భిన్నమైన వేషభాషలతో పాటు వాతావరణ మార్పుల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఒక్కో రకమైన పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ఒక టైంజోన్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు కలిపి మరో టైం జోన్ ఏర్పాటు చేస్తే మంచిదని సైంటిస్ట్‌లు తమ అధ్యయనంలో వెల్లడించారు.ఈ మేరకు ఢిల్లీలోని సీఎస్ఐఆర్– నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. తమ పరిశోధన ఆధారంగా ‘రెండు టైం జోన్ల ఆవశ్యకత’ శీర్షికతో రాసిన పత్రం ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్ జర్నల్ లో ప్రచురితమైంది. ఈశాన్యంలో ముందే సూర్యాస్తమయాలు... భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఈశాన్యరాష్ట్రాల్లో సూర్యుడు ముందుగా ఉదయించి, ముందుగానే ఆస్తమిస్తుండడంతో వెలుగుపరంగా కొన్ని గంటలు కోల్పోవాల్సి వస్తోంది. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రమై పగటి సమయం మరింత కుచించుకుపోవడంతో ఉత్పాదకత తగ్గిపోయి, అధిక విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రెండో టైంజోన్లోని రాష్ట్రాలు, ప్రాంతాల్లోని గడియారాలను మిగతా దేశంలోని (మొదటి టైంజోన్ రాష్ట్రాలు) ప్రాంతాల కంటే ఒక గంట సమయం ముందు ఉండేలా మార్పులు చేయాలని ఈ అధ్యయనంలో సూచించారు. దీని వల్ల ఈ ప్రాంతంలో పనివేళలు ముందుగా ప్రారంభమై ముందుగా ముగుస్తాయి. ఈ కారణంగా ఉత్పాదకత పెరగడంతో పాటు విద్యుత్ ఆదా కూడా చేయవచ్చునని పేర్కొన్నారు. ఇప్పుడున్నది ఒకే ఐఎస్టీ... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే భారత కాలమానం (ఐఎస్టీ) ఉదయం 5.30గా అమలవుతోంది. (అదే యూకేలోని గ్రీన్విచ్ మీదుగా ప్రయాణించే ఊహాత్మక రేఖాంశ గీత ఆధారంగా కోఆర్డినేటెడ్ యూనివరల్ టైం (యూసీటీ) అర్థరాత్రి 0.00 గంటలకు గ్రీన్విచ్ టైంగా లెక్కిస్తున్నారు). ఈ పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల్లో ఒక గంట ముందుకు జరిపితే పగటిపూట సమయం ఆదా అవుతుందా లేదా, ఈ విధానాన్ని అమలుచేయొచ్చా లేదా అన్న విషయాన్ని ఈ అధ్యయనంలో పరిశీలించారు. యూటీసీ కంటే అయిదున్నర గంటల స్థానంలో, ఆరున్నర గంటల టైమ్‌జోన్ పెడితే ఈశాన్యరాష్ట్రాలు, పోర్ట్‌బ్లెయిర్‌లలో ఉత్పాదకత పెరుగుతుందని తాము కనుక్కున్నామని ఎన్పీఎల్ డైరెక్టర్ దినేష్ కె ఆస్వల్ తెలిపారు. రెండు టైం జోన్ల కారణంగా రైలు ప్రమాదాలకు ఆస్కారమేర్పడుందనే ఆందోళనను కొందరు వ్యక్తం చేయగా, పశ్చిమబెంగాల్, అస్సాం సరిహద్దులోని అలిపుర్దౌర్ స్టేషన్లో రైలు గడియారాల సమయాలు మార్చితే ఈ ప్రమాదాన్ని అధిగమించవచ్చునని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. ‘మనదేశంలో రెండు టైంజోన్లు ఉండొచ్చునని శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించాం. దీనిని అమలు చేయాలా వద్ద నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది’ అని అస్వల్ చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల్లో ఐఎస్టీ–2ను అమలు చేసేందుకు ఎన్పీఎల్ ప్రైమరి టైమ్ స్కేల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండు టైంజోన్లను అమలు చేస్తే, ఏడాదికి 20 మిలియన్ల కిలో వాట్ల విద్యుత్‌ను ఆదాచేయొచ్చునని అంచనా వేశారు. పూర్వాపరాలు... బ్రిటీష్ పాలనలో ఉన్నపుడు భారత్‌ను బొంబాయి, కలకత్తా టైంజోన్లుగా విభజించారు 1947 సెప్టెంబర్ 1న భారత కాలమానం (ఐఎస్టీ)ఏర్పడింది 2014లో ఛాయ్‌బగాన్ లేదా బగాన్ టైమ్ (టీ ఎస్టేట్ టైం)ను పాటించాలని అస్సాం అనధికారికంగా నిర్ణయించింది. ఐఎస్టీ కంటే పగటి సమయం ఒక గంట ముందు ఉండేలా చేసుకున్న ఏర్పాటును గతంలో తేయాకు తోటలు, గనులు, చమురు పరిశ్రమ కోసం బ్రిటీషర్లు ఉపయోగించారు ఈశాన్య రాష్ట్రాలకు విడిగా టైం జోన్ ఉండాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది గువహటి హైకోర్టు తోసిపుచ్చింది. 2017 జూన్‌లో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పేమా ఖందు ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక టైంజోన్ కావాలని డిమాండ్‌ను పునరుద్ఘాటించారు -
మెట్రో వేళల్లో మార్పులు
సాక్షి, సిటీబ్యూరో: ఈనెల 16 నుంచి(సోమవారం) మెట్రో రైలు పని వేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఎల్‌అండ్‌టీహెచ్‌ఎంఆర్‌ఎల్ సంస్థ నూతన సమయపట్టిక ప్రకటించింది. ఎల్బీనగర్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయంతీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటికే నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న రైళ్ల పనివేళలు స్వల్పంగా మారనున్నాయి. ఇకపై సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తొలిరైలు 6.30 గంటలకు బయలుదేరనుంది. ఇక ఆదివారం రోజున ఉదయం 6 గంటలకు మొదలయ్యే తొలి రైలు ఉదయం 7గంటలకు బయలుదేరనుంది. ట్రయల్‌రన్ నేపథ్యంలో మెట్రో రైళ్ల పనివేళలను అరగంటపాటు కుదించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా రాత్రి 10 గంటల వరకు యథావిధిగా మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. కాగా ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో ఆగస్టు తొలివారంలో, అమీర్‌పేట్–హైటెక్‌సిటీమార్గంలో ఈ ఏడాది అక్టోబరులో మెట్రో రైళ్లు సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎంఆర్ ఏర్పాట్లు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే నిత్యం 75 వేల మంది ప్రయాణికులు నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ (30 కి.మీ)మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. -
రోజుకు మరో గంట పెరుగుతుంది...
రోజుకు 24 కంటే ఎక్కువ గంటలుంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా? మీ ఆశ ఇప్పుడు కాకపోయినా ఇంకో రెండు వేల ఏళ్లకైనా నిజం కానుంది! అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి నుంచి జాబిల్లి నెమ్మదిగా దూరం జరగడం దీనికి కారణమవుతోందని.. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉంటాయన్నది వీరి అంచనా. కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్–మాడిసన్ పరిశోధకులు దాదాపు తొమ్మిది కోట్ల ఏళ్ల క్రితం నాటి రాళ్లను పరిశీలించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పురాతన కాలంలో... కచ్చితంగా చెప్పాలంటే 140 కోట్ల ఏళ్ల క్రితం రోజుకు సగటున 18 గంటలు, గంటకు 41 నిముషాలు మాత్రమే ఉండేవని తెలిసింది.. భూమండలం కక్ష్య నుంచి చందమామ నెమ్మదిగా పక్కకు జరుగుతున్న కొద్దీ రోజులో గంటలు పెరుగుతున్నాయని తేల్చారు. ఈ విధంగా చంద్రుడు దూరం జరుగుతున్న కొద్ది భూభ్రమణం కూడా నెమ్మదిస్తుందని విస్కాన్సిన్–మాడిసన్ విశ్వవిద్యాలయ జియోసైన్స్ ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ వెల్లడించారు. భూమి నుంచి చందమామ ఏడాదికి 3.82 సెంటీ మీటర్ల చొప్పున దూరం జరుగుతున్నట్టు అంచనా. జాబిల్లితోపాటు అనేక ఇతర గ్రహాలు, నక్షత్రాల గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై ఉంటుందని.. ఇది కాస్తా భూభ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. సౌరవ్యవస్థలో వచ్చే మార్పుచేర్పులకు అనుగుణంగా రోజులో పగటి వేళల్లో మార్పులు సంభవిస్తున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉభయ కొరియాల్లో ఒక్కటే టైం
సియోల్: ఉత్తరకొరియా తన ప్రామాణిక సమయాన్ని 30 నిమిషాలు ముందుకు జరిపింది. దీంతో ఉభయ కొరియాల మధ్య శుక్రవారం నుంచి ఒకే టైం అమల్లోకి వచ్చినట్లయింది. గత వారం ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల తరువాత సమయంలో మార్పు చేయడం కీలక ముందడుగు అని ఉ.కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. ఉభయ కొరియాల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన సరిహద్దు గ్రామంలోని గడియారాల్లో వేర్వేరు సమయాలను చూసిన ఉ.కొరియా అధినేత కిమ్ వాటిని ఒకటి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జారీచేసిన ఉత్తర్వులకు ఉ.కొరియా పార్లమెంట్ సోమవారమే ఆమోదం తెలిపింది. ఉ.కొరియా నిర్ణయాన్ని ద.కొరియా స్వాగతించింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. -
విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పు
విశాఖపట్నం : విశాఖపట్నం, సికింద్రాబాద్ నగరాల మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరు వేళల్లో స్పల్ప మార్పులు చేశారు. ఈ మేరకు వాల్తేరు డివిజన్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాత్రి 8.15 గంటలకు బదులు అరగంట ముందుగానే అంటే 7.45 గంటలకు బయలుదేరనుందని తెలిపింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరు సమయంలో స్వల్ప మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది.