సియోల్: ఉత్తరకొరియా తన ప్రామాణిక సమయాన్ని 30 నిమిషాలు ముందుకు జరిపింది. దీంతో ఉభయ కొరియాల మధ్య శుక్రవారం నుంచి ఒకే టైం అమల్లోకి వచ్చినట్లయింది. గత వారం ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల తరువాత సమయంలో మార్పు చేయడం కీలక ముందడుగు అని ఉ.కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్‌ఏ పేర్కొంది.
ఉభయ కొరియాల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన సరిహద్దు గ్రామంలోని గడియారాల్లో వేర్వేరు సమయాలను చూసిన ఉ.కొరియా అధినేత కిమ్ వాటిని ఒకటి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జారీచేసిన ఉత్తర్వులకు ఉ.కొరియా పార్లమెంట్ సోమవారమే ఆమోదం తెలిపింది. ఉ.కొరియా నిర్ణయాన్ని ద.కొరియా స్వాగతించింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment