Parlaiment
-
‘పార్లమెంట్’పై కాంగ్రెస్ గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా..
సాక్షిప్రతినిధి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ గురి పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో వరించిన విజయంతో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న ఆ పార్టీ దూకుడుగా ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్‌పై వేగంగా పావులు కదుపుతోంది. 12 అసెంబ్లీ స్థానాలకు పదింటిలో గెలిచిన కాంగ్రెస్ వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల ను గెలుచుకోవాలని కుతూహలపడుతోంది. అందులో భాగంగానే తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించిన ఆ పార్టీ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్‌కు సైతం నియమించింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్‌కు ఖమ్మం జిల్లాకు చెందిన రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ధనసరి సీతక్కను ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్గా నియమించింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ లోక్‌సభ స్థానం పరిధి ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాలు, మండలాల నేతలతో సమన్వయం చేయనున్నారు. పీఏసీలో ఓరుగల్లు ప్రస్తావన.. వరంగల్, మహబూబాబాద్.. పార్లమెంట్ స్థానాలను గెలవడం కాంగ్రెస్ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇదే అంశాన్ని సూచించడం గమనార్హం. 12 స్థానాలకు 10 అసెంబ్లీ సీట్లను గెలిచామన్న భావనతో పార్లమెంట్ ఎన్నికలను నిర్లక్ష్యం చేయరాదని ఈ కమిటీలో సూచించినట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ 131 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 28న నాగ్‌పూర్‌లో జరిగే వేడుకలకు వరంగల్, మహబూబాబాద్ నుంచి పదివేలకు తగ్గకుండా మందిని రైలుమార్గంలో తరలించాలన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకంటే ముందుగానే అసెంబ్లీ టికెట్లను వదులుకున్న వారిని నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేయాలని, అందుకు సంబంధించిన ఉమ్మడి జిల్లా జాబితా కూడా సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రతీ కార్యకర్త అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన పట్టుదల, తెగువ, కృషి.. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపుగా చూపాలని సూచించింది. పోటాపోటీగా ఆశావహులు.. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్నారు. మాజీ ఎంపీలు, సీనియర్లు, టీపీసీసీ, ఏఐసీసీ నేతలను సంప్రదిస్తున్నారు. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి, కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శనిగపురం ఇందిర పేరు కూడా వినిపిస్తున్నది. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, నెహ్రూనాయక్, బెల్లయ్యనాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నలుగురు సీనియర్లు కూడా వరంగల్, మహబూబాబాద్ కాంగ్రెస్ టికెట్ల కోసం లోపాయికారిగా మాట్లాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో 17 స్థానాల్లో దాదాపు 15–16 స్థానాలు కై వసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వరంగల్, మహబూబాబాద్ ఎంపీలను గెలిపించుకోవడానికి పావులు కదుపుతోంది. ఇవి కూడా చదవండి: మెదక్‌కు దామోదర.. జహీరాబాద్‌కు సుదర్శన్‌రెడ్డి -
సీఈసీ, ఈసీల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన కీలకమైన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) బిల్లు–2023ని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బిల్లును తెచ్చామని న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ చెప్పారు. ‘‘1991 నాటి చట్టంలో సీఈసీ, ఈసీల నియామక నిబంధనలు లేవు. తాజా బిల్లులో వాటిని పొందుపరిచాం. సీఈసీ, ఈసీ నియామకాలను ఇప్పటిదాకా ప్రభుత్వమే చేపట్టేది. ఇకపై వాటిని ప్రత్యేక కమిటీ చూసుకుంటుంది. వారి వేతనాలు తదితరాలను బిల్లులో పొందుపరిచాం. సీఈసీ, ఈసీలకు చట్టపరమైన రక్షణలను కల్పించాం’అని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం బిల్లులోని అంశాలు ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రధాని, ఆయన నామినేట్ చేసే సభ్యులు సీఈసీ, ఈసీలను నియమించడమంటే ఎన్నికల సంఘాన్ని నామమాత్రంగా మార్చడమేనని రణదీప్ సూర్జేవాలా (కాంగ్రెస్) అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎంపిక కమిటీలో చేర్చకపోవడమేమిటని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రశ్నించారు. సీఈసీ, ఈసీల హోదాను కేబినెట్ సెక్రటరీ స్థాయికి కేంద్రం దిగజార్చిందని జవహర్ సర్కార్ (టీఎంసీ) మండిపడ్డారు. బీజేడీ, డీఎంకే సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
పార్లమెంట్ లో మణిపూర్ ప్రకంపనలు
-
పార్లమెంట్‌పై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
-
ఓబీసీ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు
-
కేంద్ర హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు
-
రైతు ఉద్యమానికి మద్దతుగా పార్లమెంట్ ప్రాంగణంలో రాహుల్ ఆందోళన
-
పోలవరానికి ఇవ్వవలసిన నిధులు కేంద్రం వెంటనే విడుదల చేయాలి : వంగా గీతా
-
ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించాలని రూల్ 267 నోటీసు ఇచ్చిన విజయసాయి రెడ్డి
-
దోషులను ఉరి తీయాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం వంటి ఘటనల్లో దోషులకు కఠిన శిక్ష పడేలా చట్టాన్ని తేవడానికైనా కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదని, ఏ పదాలతో దీనిని ఖండించాలో కూడా అర్థం కావడం లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై లోక్‌సభ జీరో అవర్‌లో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ ఒక దశలో ఆయన కూడా భావోద్వేగానికి లోనయ్యారు. హైదరాబాద్‌లో గత బుధవారం రాత్రి జరిగిన అత్యాచార ఘటనపై సోమవారం లోక్‌సభలో వాడీవేడిగా చర్చ జరిగింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి దిశ ఘటనపై చర్చించేందుకు వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే సభా కార్యకలాపాలు వాయిదా వేసి దీనిపై చర్చించాలంటూ రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలంతా ప్లకార్డులు ప్రదర్శించారు. ‘రేపిస్టులను శిక్షించండి.. అత్యాచారాలను ఆపండి’అంటూ నినాదాలు చేశారు. డీఎంకే నేత టీఆర్ బాలు కూడా లేచి ఇదే అంశాన్ని సభాపతి దృష్టికి తెచ్చారు. అయితే సభాపతి ఓం బిర్లా.. ఈ అంశంపై చర్చించేందుకు జీరో అవర్‌లో అవకాశం ఇస్తానని చెప్పడంతో రేవంత్‌రెడ్డి సభాపతితో సంవాదానికి దిగారు. ‘ఈ అంశం చాలా తీవ్రమైంది. జీరో అవర్‌లో చర్చించే అంశం కాదిది. వాయిదా తీర్మానానికి జీరో అవర్‌కు ఎలా ముడిపెడతారు. ఒక అమ్మాయిపై జరిగిన అత్యాచారకాండపై దేశం రోదిస్తోంది’అని అన్నారు. దీనికి సభాపతి స్పందిస్తూ ‘మొత్తం దేశం విచారం వ్యక్తం చేసింది. ఈ సభ కూడా విచారం వ్యక్తం చేస్తోంది. అయితే జీరో అవర్‌లో అందరూ దీనిపై మాట్లాడొచ్చు’అని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు శాంతించారు. జీరో అవర్‌లో ఈ అంశంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఖండించేందుకు మాటలు లేవు రాజ్‌నాథ్ హత్యాచార ఘటనపై జీరో అవర్‌లో పలు పార్టీల నేతలు మాట్లాడిన తరువాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ జోక్యం చేసుకుని దోషులకు కఠిన శిక్ష విధించేందుకు ఎలాంటి చట్టమైనా తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో జరిగిన ఘటనను మించిన అమానవీయ చర్య ఇంకొకటి ఉండదు. ఈ ఘటనపై యావత్తు దేశం విచారం వ్యక్తం చేస్తోంది. ఘటనను అందరూ ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని అంద రూ కోరుకుంటున్నారు. నిర్భయ ఘటన తరువాత దేశంలో ఒక కఠిన చట్టాన్ని ప్రవేశపెట్టాం. దేశంలో మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవని అప్పుడు అందరూ అనుకున్నారు. అయితే దీని తరువాత కూడా అలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు దోషులను శిక్షించేందుకు ఎంత కఠిన చట్టాన్ని చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. సభ దీనిపై చర్చించాలనుకుంటే చర్చించండి. సలహాలు ఇవ్వండి. ఈ ఘటనపై స్పందించేందుకు నాకు మాటలు రావడం లేదు. ఏ పదాలతో దీనిని ఖండించాలో కూడా తెలియడం లేదు’అని పేర్కొన్నారు. మార్పులకు సిద్ధం కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి ‘ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ బాధ్యతను బోర్డు ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు అప్పగించాం. ఇప్పటికే రాష్ట్రాలకు లేఖలు రాసి సూచనలు కోరాం. డ్రాఫ్ట్ కూడా సిద్ధంగా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలోనే బిల్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్ ఘటనలో పోలీసులు ఇంకా క్రియాశీలకంగా పనిచేయాల్సింది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టంను ప్రారంభించాం. కేంద్రం మహిళల రక్షణపై నిబద్ధతతో ఉంది. ఉగ్రవాదం, అవినీతి నిర్మూలనకు మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో.. అలాగే మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు పనిచేస్తోంది’అని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే.. :ఉత్తమ్ ‘తెలంగాణ పోలీసుల నిర్లక్ష్యం, జాతీయ రహదారుల పక్కన విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే హైదరాబాద్ నగర శివారులో దిశ హత్య జరిగింది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు మొదట ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేయకపోగా.. మీ అమ్మాయి ఎవరితోనో వెళ్లిపోయి ఉంటుందంటూ అవమానకరంగా మాట్లాడారు. అప్పుడే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఉంటే ఆ యువతి ప్రాణాలతో బతికుండేది. మరోవైపు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో జాతీయ రహదారి పక్కన విచ్చలవిడి మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. దీనిపై కేంద్రం దృష్టిసారించాలి. ఇక ఘటనకు ముందు బాధితురాలు కుటుంబ సభ్యులకు కాకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉంటే బతికుండేదని రాష్ట్ర హోం మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడటం తగదు.’ వెంటనే శిక్షలు పడాలి: బండి సంజయ్ ‘దిశపై అత్యాచారం, హత్య ఘటన దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. మహిళల రక్షణకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాటి అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా వారి రక్షణకు తీసుకుంటున్న చర్యల అమలు ఏ మేరకు జరుగుతోంది అన్నదానిపై చర్చ జరగాలి. ఇలాంటి ఘటనల్లో దోషులకు వెంటనే శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకురావాలి’ ఉరిశిక్ష పడేలా...: ఎం. కవిత ‘మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే దోషులకు వెంటనే ఉరిశిక్ష పడేలా ప్రత్యేక చట్టం చేయాలి. శంషాబాద్‌లో యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సమాజం సిగ్గుపడాల్సిన విషయం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొందరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలు చేయకుండా పార్టీలకతీతంగా మహిళల రక్షణకు ఎలాంటి చట్టాలు చేయాలన్నదానిపై మాట్లాడాలి. దోషులకు ఉరిశిక్ష పడేలా కఠిన చట్టాలు రూపొందించాలి.’ స్వేచ్ఛగా బతకనివ్వండి: వంగా గీత ‘భవిష్యత్‌లో మహిళలు బయటకు రాకుండా ఉండే పరిస్థితులు ఏర్పడకుండా సమాజంలో స్వేచ్ఛగా బతకనివ్వాలి. మ హిళలను పూజించాల్సిన అవసరం లేదు.. స్వేచ్ఛగా బతకనిస్తే చాలు. హత్యాచార ఘటనలకు పాల్పడిన దోషులకు ఉరిశిక్ష పడేలా రాష్ట్రాలతో కలసి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి.’ అవగాహన కల్పించాలి: రామ్మోహన్నాయుడు ‘దిశ హత్య ఘటనతో దేశంలోని ప్రతి మహిళ భయాందోళన చెందుతోంది. ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష వేయాలి. విద్యార్థి దశ లోనే యువకుల్లో అవగాహన కల్పించాలి. ‘నో మీన్స్ నో(లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం)’ పై స్కూలు, కాలేజీల్లో, పని ప్రదేశాల్లో అవగాహన కల్పించాలి.’ ఉరిశిక్ష అమలేది?: రేవంత్‌రెడ్డి ‘దిశ ఘటన పోలీసుల వైఫల్యం వల్లే జరిగింది. హాజీపూర్‌లో 9 నెలల అ మ్మాయి హత్యాచారం కేసులో దోషికి సెషన్స్‌కోర్డు ఉరి శిక్ష విధించింది. కానీ హైకోర్టు దాన్ని జీవితఖైదుగా మా ర్చింది. ఉరిశిక్షను ఎందుకు అమలు చేయలేదు. నిర్భయ ఘటన దోషులను ఇప్పటి వరకు శిక్షించలేదు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలి.’ ముక్తకంఠంతో ఖండించిన అన్ని పార్టీలు దిశ ఘటనను లోక్‌సభలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. లోక్‌సభలో బీజేడీ సభ్యుడు పినాకి మిశ్రా, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, అప్నాదల్ నుంచి అనుప్రియా పటేల్, శివసేన నుంచి వినాయక్ బి.రౌత్, బీఎస్పీ నుంచి కున్వర్ దమ్షిఅలీ, టీఎంసీ నుంచి సౌగత్‌రాయ్ మాట్లాడారు. కాగా, చర్చ ముగిసిన అనంతరం ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా పార్ల మెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. -
జన గణ మన కశ్మీరం
మోదీ నేతృత్వంలోని కేంద్రం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే అత్యంత సంచలన, సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దశాబ్దాల సంఘ్ పరివార్ కలను, ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కశ్మీర్లో 72 ఏళ్ల నుంచి నలుగుతున్న వేర్పాటువాదం, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తూ.. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణాలను రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేసింది. అలాగే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన తీర్మానం, బిల్లులను కేంద్రం సోమవారమే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది. ఈ బిల్లులు, తీర్మానాన్ని లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనుండగా, దిగువ సభలో ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉండటంతో అక్కడ కూడా వీటిని ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి నల్లేరు మీద నడకే కానుంది. కేంద్రం చర్యను అనేక పార్టీలు, వివిధ వర్గాల ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించగా, కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు తదితర ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ పార్టీల సభ్యులు తీవ్ర నిరనలకు దిగారు. కేంద్ర ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందనీ, భారత చరిత్రలో ఇదో చీకటి రోజని వారు ఆరోపించారు. గతకొన్ని రోజులుగా కశ్మీర్లో నెలకొన్న హైడ్రామాకు సోమవారం తెరపడింది. భారీ సంఖ్యలో బలగాల తరలింపు, అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులను కశ్మీర్ నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలనడం తదితరాల నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠ వీడింది. ప్రతిపక్షాల భయాల్ని నిజం చేస్తూ, లేదు లేదంటూనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేసిన అనంతరం ఆ తీర్మానాన్ని హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టగా, సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అలాగే జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడగొట్టి లదాఖ్ ప్రాంతాన్ని పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేసింది. లదాఖ్ కాకుండా, మిగిలిన జమ్మూ కశ్మీర్‌ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగానే మార్చింది. అయితే ఢిల్లీ, పుదుచ్చేరిల్లో లాగానే జమ్మూకశ్మీర్ కూడా అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. సరిహద్దుల మార్పులకు సంబంధించి ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’ని కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశ పెట్టగా, ఓటింగ్ అనంతరం సభ ఈ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. ఈ తీర్మానం, బిల్లులను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అక్కడ అధికార పక్షానికి భారీ ఆధిక్యం ఉండటంతో ఆమోదం సులభం కానుంది. తీర్మానం, బిల్లులు ఆమోదం పొందడంతో బీజేపీతోపాటు పలు పార్టీల నేతలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్దాల నాటి చారిత్రక తప్పిదాన్ని తమ పార్టీ సరిచేసిందని బీజేపీ పేర్కొంది. మరోవైపు జమ్మూ కశ్మీర్లో ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)లతోపాటు ప్రధాన విపక్ష పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు కేంద్రం చర్యను తీవ్రంగా నిరసించాయి. కాగా, ఎన్సీ, పీడీపీ నేతలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతోపాటు పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జద్ లోనేను కూడా సోమవారం సాయంత్రం శ్రీనగర్‌లో అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ కనెక్షన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు జెండాలు ఉండవు: షా సభ అనంతరం అమిత్ షా ఓ ట్వీట్ చేస్తూ ఇకపై కశ్మీర్లో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండవని పేర్కొన్నారు. ‘ఐక్య భారత దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసిన దేశ భక్తులందరికీ మా ప్రభుత్వం అర్పిస్తున్న నివాళే ఈ నిర్ణయం. యావత్ దేశానికీ అభినందనలు. ఎన్నో ఏళ్ల నుంచి నలుగుతున్న చరిత్రాత్మక తప్పిదాన్ని ఈరోజు మోదీ ప్రభుత్వం సరిచేసింది’అని అమిత్ షా ట్విట్టర్లో తెలిపారు. మాతృభూమి ఐక్యత, సమగ్రత కోసం దృఢ సంకల్పంతో నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అభినందించారు. జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల్లో శాంతి, అభివృద్ధితో కూడిన కొత్త ఉదయానికి తమ చరిత్రాత్మక నిర్ణయం తలుపులు తెరుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ నాయకుడు రాం మాధవ్ కూడా ట్వీట్ చేస్తూ, జమ్మూకశ్మీర్ దేశంలో సంపూర్ణంగా భాగం అవ్వడం కోసం పోరాడి త్యాగాలు చేసిన, డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నుంచి అనేక మంది దేశభక్తులకు గౌరవం దక్కిందని కొనియాడారు. అమిత్ షా ప్రసంగానికి మోదీ ప్రశంసలు రాజ్యసభలో చర్చ సందర్భంగా అమిత్ షా చేసిన ప్రసంగాన్ని మోదీ అభినందించారు. గతంలో జరిగిన చారిత్రక అన్యాయాలను అమిత్ షా ఎంతో సవ్యంగా వివరించారనీ, జమ్మూ కశ్మీర్ ప్రజల పట్ల ప్రభుత్వ దృక్పథాన్ని చక్కగా వివరించారని ప్రశంసించారు. అమిత్ షా ప్రసంగాన్ని మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. షా ప్రస్తావించిన విషయాలు విస్తృతంగా, లోతైన విశ్లేషణలతో ఉన్నాయని మోదీ అన్నారు. ఇంతకుముందు.. ఇకపై.. ► మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉండేవి.. ► ఇకపై ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉండవు ► రాష్ట్రప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉండేది.. ► ఇకపై ఒకే పౌరసత్వం ► రాష్ట్రానికి ప్రత్యేకంగా జెండా ఉంది.. ► ఒకే పతాకం.. అది త్రివర్ణమే.. ► ఆర్టికల్ 360(ఆర్థిక అత్యయిక స్థితి) అమలు చేయలేం.. ► ఆర్టికల్ 360 అమలు చేయొచ్చు.. ► పంచాయతీలకు హక్కులు లేవు ► మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే.. పంచాయతీలకు హక్కులు ► శాసనసభ కాలపరిమితి ఆరేళ్లు ► శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు ► హిందువులు, సిక్కులు తదితర మైనార్టీలకు రిజర్వేషన్లు లేవు ► ఇప్పుడు 16 శాతం రిజర్వేషన్ల అమలు ► వేరే రాష్ట్రాల వారు ఇక్కడ భూములు, ఆస్తులు కొనడం నిషేధం ► అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ భూమి, ఆస్తులు కొనవచ్చు ► సమాచారహక్కు చట్టం వర్తించదు ► సమాచారహక్కు చట్టం అమలు ► వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఇక్కడి మహిళ పెళ్లాడితే ఆమెకున్న స్థానిక పౌరసత్వం, హక్కులు పోతాయి. ► భారతీయుడ్నిగానీ, విదేశీయుడ్నిగానీ పెళ్లాడినా స్థానిక హక్కులు పోవు. భారత పౌరసత్వం ఉంటుంది.. -
‘డిపాజిట్’ అంటే..
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఎన్నికల్లో పోటీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని అర్హతలు నిర్దేశించింది. అభ్యర్థుల నుంచి నామినేషన్ రుసుం వసూలు చేస్తుంది. నిర్దేశిత ఓట్లు వచ్చిన వారికి ఆ రుసుం తిరిగి చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని డిపాజిట్ అని పిలుస్తారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ తో పాటుగా జనరల్, బీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేల చొప్పున నామినేషన్ రుసుం(డిపాజిట్) చెల్లించాల్సి ఉంటుంది. ఫలితాల అనంతరం అభ్యర్థికి కనీస ఓట్లు వస్తేనే డిపాజిట్(నామినేషన్ రుసుం) తిరిగి ఇస్తారు. డిపాజిట్ రావాలంటే పోలై, చెల్లిన ఓట్లలో కనీసం 1/6వంతు(16.66)ఓట్లు పొందాలి. అంటే నూటికి దాదాపుగా 17ఓట్లు పొందాలి. బీ–ఫారం, ఏ ఫారం అంటే.. ఎన్నికల సమయంలో తరుచుగా ఏ ఫారం,బీ ఫారం పేర్లు వింటుంటాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే ఇవి అవసరం. అవేమిటో.. ఎలా ఇస్తారో తెలుసుకోండి. ఏ ఫారం అంటే.. పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో.. వారికీ ’బీ’ఫారం అందిస్తారు..... బీ ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ’ఏ’ ఫారం. ఎవరినైతే పార్టీ ఎంపిక చేసి ‘ఏ’ ఫారం అందిస్తుందో వారికి మాత్రమే తర్వాత బీ ఫారం అందిస్తారు. ‘ఏ’ ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ’ఏ’ ఫారం ను ఎన్నికల అధికారులకు అందిస్తారు. ’బీ’ ఫారం... గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనని ఇచ్చేదే ‘బీ’ఫారం. నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని దాఖలు చేస్తే పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధుల ద్వారా ఈ ఫారాన్ని అందిస్తారు. -
ఉభయ కొరియాల్లో ఒక్కటే టైం
సియోల్: ఉత్తరకొరియా తన ప్రామాణిక సమయాన్ని 30 నిమిషాలు ముందుకు జరిపింది. దీంతో ఉభయ కొరియాల మధ్య శుక్రవారం నుంచి ఒకే టైం అమల్లోకి వచ్చినట్లయింది. గత వారం ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల తరువాత సమయంలో మార్పు చేయడం కీలక ముందడుగు అని ఉ.కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. ఉభయ కొరియాల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన సరిహద్దు గ్రామంలోని గడియారాల్లో వేర్వేరు సమయాలను చూసిన ఉ.కొరియా అధినేత కిమ్ వాటిని ఒకటి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జారీచేసిన ఉత్తర్వులకు ఉ.కొరియా పార్లమెంట్ సోమవారమే ఆమోదం తెలిపింది. ఉ.కొరియా నిర్ణయాన్ని ద.కొరియా స్వాగతించింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. -
అవిశ్వాసంపై కొనసాగుతున్న ఉత్కంఠ
సాక్షి, ఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో ఉత్కంఠ కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని పలు పార్టీలు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గందరగోళం మధ్య లోక్‌సభ వరుసగా ఆరు రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెల్సిందే. మూడు రోజుల సెలవుల తర్వాత లోక్‌సభ నేడు సమావేశమవుతోంది. లోక్ సభ స్పీకర్‌కు మొత్తం 7 అవిశ్వాస తీర్మానాలు అందాయి. టీడీపీ నుంచి తోట నరసింహం, కేశినేని నాని, వైఎస్సార్సీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, సీపీఎం నుంచి పి.కరుణాకరన్, ఎండీ సలీం, ఆరెస్పీ నుంచి ప్రేమచంద్రన్ అవిశ్వాస నోటీసులు సమర్పించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సమయంలో ఆందోళన చేయకూడదని టీఆర్ఎస్ తాజాగా నిర్ణయం తీసుకుంది. మంగళవారం సభలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయకపోతే స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించే అవకాశముంది. -
వారు చనిపోయినట్లు టీవిలోనే చూశాను
న్యూఢిల్లీ: ఇరాక్‌లో 30 మంది భారతీయులు చనిపోయారంటూ రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ప్రకటనపై వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. తమ వారు చనిపోయారని నేరుగా రాజ్యసభలో ఎలా ప్రకటిస్తారని వారు తప్పుపడుతున్నారు. సుష్మా తీరు తమను తీవ్రంగా బాధించిందని కుటుంబసభ్యులు తెలిపారు. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అపహరించిన 39 మంది భారతీయుల్లో.. 30 మంది చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని కేంద్ర మంత్రి సుష్మా చేసిన ప్రకటన చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని, తన తమ్ముడు కూడా మృతి చెందాడన్న వార్తను నమ్మలేకపోతున్నామని మృతుడి సోదరి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. సుష్మా ముందుగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ‘సుష్మా ప్రకటనను నేను టీవిలో చూశాను. వారు మృతి చెందారన్న వార్త మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నా సోదరుడు మజీందర్ సింగ్ ఫోన్‌ను మైసూల్లో స్వాధినం చేసుకున్నారు. అతన్ని ఐసిస్ చంపి ఉంటుందని అనుకుంటున్నాం’ అని గుర్విందర్ కౌర్ తెలిపారు. గత నాలుగేళ్లుగా వారు బ్రతికే ఉన్నారని మంత్రి తమతో చెప్తూ వచ్చారని, కానీ ఎప్పుడూ ఒక్క ఆధారం చూపలేదని ఆమె తప్పుబట్టారు. ఈ విషయమై సుష్మా స్వరాజ్‌తో మాట్లాడానికి వేచిచూస్తున్న సమయంలోనే వారు మృతి చెందారని పార్లమెంట్లో ప్రకటించడంతో షాక్తిన్నామని చెప్పారు. తమ కుటుంబసభ్యులు మృతి చెందారన్న వార్త ముందుగా తమకు కాకుండా బయటి ప్రపంచానికి తెలిపారని సుష్మా తీరును తప్పబట్టారు. ఇరాక్‌లో భారతీయులు చనిపోయారన్న పక్కా సమాచారంతోనే పార్లమెంట్లో ప్రకటన చేస్తున్నట్లు సుష్మా తెలుపగా.. దీనిపై గుర్విందర్ కౌర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహాలు స్వాధీనం చేసుకున్న తరువాత కూడా తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే, ఈ విమర్శలపై స్పందించిన సుష్మా.. ముందుగా పార్లమెంట్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే పార్లమెంటులో ప్రకటన చేశామని చెప్పుకొచ్చారు. -
దూకుడు పెంచిన వైఎస్ఆర్ సీపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. 15 రోజులుగా పార్లమెంట్లో పోరాడుతున్నా కేంద్రం ఒక్కసారి కూడా చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ సీపీ వ్యూహం మార్చింది. పార్లమెంటు సమావేశాలను ముందస్తుగానే వాయిదా వేస్తారనే సమాచారంతో మార్చి 21న కాకుండా రేపు (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. అంతేకాకుండా అవిశ్వాసంపై మద్దతు కూడగట్టేందుకు టీడీపీ సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కోరనుంది. ఈ మేరకు ఆయా పార్టీల నేతలను వైఎస్ఆర్ సీపీ ఎంపీలు కలుస్తున్నారు. బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్, టీడీపీ ఎంపీ తోట నరసింహం, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులను కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా రోజే వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. కాగా అంతకు ముందు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు సమావేశం అయ్యారు. పార్లమెంట్ సమావేశాలు త్వరగా ముగియనున్న నేపథ్యంలో అవిశ్వాసం పెట్టాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయించినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, హోదాపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. హోదాపై మొదట నుంచి పోరాడుతుంది వైఎస్ఆర్ సీపీనే అన్నారు. తమ స్వప్రయోజనాల కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని, తమ పోరాటం వల్లే చంద్రబాబు దారిలోకి వచ్చారన్నారు. నాలుగేళ్లుగా హోదాపై మాట్లాడని పవన్ కల్యాణ్ ఇప్పటికైనా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆందోళన ఇవాళ కూడా కొనసాగింది. గురువారం లోక్‌సభలో ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్ స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక రాజ్యసభలోనూ ఎంపీ విజయసాయి రెడ్డి ఆందోళన కొనసాగించారు. అంతకు ముందు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఏపీకి న్యాయం చేయలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. -
తుని-కొత్తవలస రైల్వేలైన్ సర్వే పూర్తి
సాక్షి, న్యూఢిల్లీ : తుని నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల మీదుగా కొత్తవలస వరకు సింగిల్ లైన్ బ్రాడ్ గేజ్ రైల్వే మార్గం నిర్మాణం కోసం సర్వే పనులు పూర్తయినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రాజెన్ గొహైన్ శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. తుని నుంచి నర్సీపట్నం, చోడవరం, మాడుగుల మీదుగా రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే పనులను 2016-17లో రైల్వే శాఖ మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 3771.21 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ మొత్తంపై వచ్చే రాబడి (రేట్ ఆఫ్ రిటర్న్) మైనస్ 4.14 శాతంగా తేలింది. సర్వే నివేదిక ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు కోసం బృహత్తర ప్రణాళికలు రైతుల ఆదాయం 2022 నాటికల్లా రెట్టింపు చేయాలన్న లక్ష్య సాధన కోసం ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ రాజ్య సభలో ప్రకటించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపడుతోందని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఈ దిశగా సాగిస్తున్న ప్రయత్నాలు, ప్రణాళికలను సోదాహరణంగా వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఇందుకోసం ఒక వ్యూహాన్ని రూపొందించడానికి ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లోనే నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా సీఈవో అధ్యక్షతన మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కమిటీ దఫదఫాలుగా ఇప్పటి వరకు తొమ్మిది నివేదికలను సమర్పించిందని, ఆ నివేదికల ఆధారంగా ఇప్పటికే పలు చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్య సాధన దిశగా తీసుకుంటున్న అనేక చర్యలను మంత్రి వివరించారు. అందులో వ్యవసాయోత్పత్తులకు గిరాకీతోపాటు గిట్టుబాటు ధర లభించే వాతావరణం కల్పించేందుకు సమగ్రమైన స్టేట్ మార్కెట్ చట్టం తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే సీజన్‌కు ముందే రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకునేలా ఒక మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు మంత్రి చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, డిమాండ్‌ను ముందుగానే పసిగట్టే విధంగా టెక్నాలజీని వ్యవస్థను రూపుదిద్దడానికి డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్, ఇన్‌స్పెక్షన్‌ను పునఃవ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. అయిదేళ్ళలో ఏటా 24 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాల ఉత్పాదన లక్ష్యం సాధించేందుకు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాం. నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు కూడా సమగ్రమైన ప్రణాళికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు మంత్రి వివరించారు. వ్యవసాయ, వ్యవసాయ సంబంధింత రంగాల కార్యకలాపాలను, రైతుల సంక్షేమాన్ని సమగ్రంగా సమీక్షించేందకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో సంస్థాగతమైన వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నాం. వచ్చే మూడేళ్ళ కాలంలో దేశంలోని అన్ని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ను కంప్యూటరీకరణ చేయడానికి బడ్జెట్లో తగిన కేటాయింపులు. రైతులు తమ ఉత్పాదనలను నేరుగా విక్రయాలు జరుపుకోవడానికి వీలుగా వచ్చే మూడేళ్ళ కాలంలో దేశ వ్యాప్తంగా 22 వేల గ్రామీణ సంతలను దశల వారీగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే వ్యవసాయ రంగాన్ని ఉత్పత్తి ప్రాధాన్యత నుంచి ఆదాయం సమకూర్చే వనరుగా మార్పులు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కరువు నుంచి ఉపశమనం కోసం ఐఫాడ్‌తో ఏపీ ఒప్పందం కరువు నుంచి ఉపశమనం కోసం ప్రత్యేక ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ (ఐఫాడ్)తో ఒప్పంద కుదుర్చుకున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్య సభలో వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక జవాబిస్తూ, 2017 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు అయిదేళ్ళపాటు ఈ ప్రాజెక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర కరువు, వర్షాభావంతో తల్లడిల్లే అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ అమలు అవుతుందని చెప్పారు. ఆయా జిల్లాల్లోని ఒక లక్షా 65 వేల వ్యవసాయ ఆధారిత కుటుంబాల ఆదాయ వనరులను మెరుగుపరుస్తూ, కరువు పరిస్థితులను దీటుగా ఎదుర్కోగల సామర్ధ్యం వారిలో కలిగించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్ట్ కోసం అయ్యే మొత్తం వ్యయం 1042 కోట్ల రూపాయల నిధులను ఐఫాడ్‌తోపాటు, నాబార్డ్ ఆధ్వర్యంలోని గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాష్ట్రీయ క్రిషి వికాస్ యోజన నుంచి సమకూర్చడం జరుగుతుందని చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో ఐఫాడ్ ఒక్కటే 528 కోట్ల రూపాయలు భరిస్తుంది. ఆర్ఐడీఎఫ్ 43.76 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 96.9 కోట్లు, ఉపాధి హామీ పథకం, కృషి వికాస్ యోజన నుంచి 311.53 కోట్లు, లబ్దిదారుల వాటాగా 61.47 కోట్ల రూపాయల చొప్పున నిధుల సమీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అమలు తీరును గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. -
బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన బీసీ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. జనాభాలో సగభాగం బీసీలున్నారని, వారి ఓట్లతోనే ఏ పార్టీకైనా అధికారం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రలోభాల రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకపై బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే ఓట్లు పడతాయన్నారు. ఇప్పటివరకు పార్లమెంటులో బీసీలకు సముచిత న్యాయం జరగలేదని.. వందల కులాలకు ప్రాతినిధ్యం దక్కలేదని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. -
ఎంపీల అలవెన్సు పెంపునకు ఓకే
న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులకు అందజేస్తున్న అలవెన్సులను పెంచాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఎంపీలకు ప్రతినెల చెల్లించే నియోజకవర్గ అలవెన్సు రూ.45 వేల నుంచి రూ.70 వేలకు చేరుకోనుంది. అలాగే ఆఫీస్ ఖర్చుల కోసం అందిస్తున్న అలవెన్సు మొత్తం రూ.45 వేల నుంచి రూ.60 వేలకు చేరుకోనుంది. వీటికి అదనంగా ఐదేళ్లకోసారి అందించే ఫర్నీచర్ అలవెన్సును రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అంతేకాకుండా ఎంపీల మూలవేతనాన్ని ప్రస్తుతమున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవి వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పార్లమెంటు సభ్యుడిపై ప్రస్తుతం ప్రభుత్వం నెలకు రూ.2.70 లక్షల మేర ఖర్చుపెడుతోంది. అక్రమరవాణా కేసులు ఎన్ఐఏకు: ఉగ్రవాద కేసుల్ని విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు మనుషుల అక్రమరవాణా కేసుల్ని విచారించే బాధ్యతను కూడా కేంద్రం అప్పగించింది. ఈ మేరకు మనుషుల అక్రమ రవాణా(నిరోధం, రక్షణ , పునరావాసం) బిల్లు–2018కి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం తరచూ మనుషుల్ని అక్రమంగా తరలించేవారికి యావజ్జీవశిక్ష కూడా విధించవచ్చు. ఎన్ఐఏలో ఏర్పాటుచేయనున్న ప్రత్యేక విభాగానికి నిర్భయ ఫండ్ నుంచి ఆర్థికసాయం అందిస్తారు.ప్రధానమంత్రి ఉద్యోగ కల్పనా కార్యక్రమం (పీఎంఈజీపీ) కాలపరిమితిని 2019–20 వరకూ పెంచుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. దీనికి రూ.5,500 కోట్లను కేటాయించింది. దీంతో ఏటా 15 లక్షల చొప్పున మూడేళ్లలో 45 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నది లక్ష్యం. -
మతాతీత సంస్కరణలే మేలు
విశ్లేషణ ముస్లిం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు అని చెప్పి ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో నేటి పాలకుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అయ్యే రీతిలో వ్యవహరిస్తే అది ప్రజల మధ్య విద్వేషాలకు దారితీసి, దేశంలో మతపరమైన అశాంతికి ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉంది. దేశంలో 24 లక్షలమంది భర్తలు వదిలివేసిన స్త్రీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతర స్త్రీలే. వారు ఎంతో వ్యధకు, బతుకు బాధలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మహిళలందరికీ న్యాయం చేసే రీతిలో చట్టం రావాలి. ఇస్లాం మతం ప్రకారం తలాక్ తలాక్ తలాక్ అని ఒక భర్త మూడు సార్లు ఉచ్చరించినా లేదా ఫోన్లో గానీ, వాట్సాప్ వంటి వానిలో గానీ, మెసేజ్ ద్వారా సందేశం పంపినా ఆ భార్యకు భర్తతో విడాకులు జరిగిపోయినట్లేనని ప్రచారం! అందువలన ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనీ, ఈ విషాదస్థితి నుంచి వారిని విముక్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. ముస్లిం మహిళలకు సైతం మిగిలిన స్త్రీల వలే సమన్యాయం కలిగించేందుకు చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందలేదు. రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది కనుక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీ వివిధ పార్టీల ప్రతి నిధుల బృందానికి పంపి ఆసాంతం పరిశీలించిన తర్వాత, ఆ కమిటీ ఆమోదంతోనే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల వాదన! మూడుసార్లు తలాక్ అని చెప్పినంత మాత్రానే స్త్రీకి అన్యాయం చేస్తూ విడాకులు పొందే ఇస్లాం మత చట్టాన్ని రద్దు చేస్తే ప్రతిపక్షాలకు వ్యతిరేకత ఎందుకు? ముస్లిం మతతత్వవాదుల కొమ్ముకాయడం తప్ప మరేమిటి? అని మోదీ ప్రభుత్వ పెద్దల అభియోగం. సాధారణ దృష్టితో చూస్తే ఇది సవ్యం గానే తోస్తుంది. అయితే ఆ బిల్లు ప్రకారం అలా విడాకులు పొందిన ముస్లిం భర్తకు, మూడేళ్ల కఠిన కారాగారం విధించే అవకాశం ఉండటమే కాకుండా తాను విడాకులు ఇచ్చిన భార్యకు పోషణ నిమిత్తం కొంత భాగాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి గృహ హింసతో స్త్రీని శారీరకంగా, మానసికంగా హింసి స్తే–ఎలాగూ గృహహింస నిరోధక చట్టం ప్రకారం శిక్ష విధింపవచ్చు. ఇది అన్ని మతాల వారికి సమానమే. అలాంటప్పుడు ఒకే నేరానికి రెండు శిక్షలా అన్న సంగతి అటుంచి, భర్తను జైలులో నిర్బంధిస్తే, విడాకులు పొందిన భార్యకు పోషణ నిమిత్తం భరణం ఇమ్మంటే ఎలా తెచ్చి ఇస్తారు? అని మరో ధర్మసందేహం! ఇవేవీ అధిగమించలేని ఆటంకాలు కావు. కాలం చెల్లుతున్న తలాక్‌పై ఇంత రభసా..? పైకి ఏదో స్త్రీ జనోద్ధరణ కార్యంగా ప్రచారం చేసుకునే ఈ బిల్లు ముస్లిం మత వ్యతిరేక దుష్ప్రచారానికి ఆస్కారమిచ్చే రీతిలో ఉంది. ఇలా 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు పొందే అవకాశం నేటి ముస్లిం మత ఆచరణలో లేదు. అలా విడాకులు పొందేందుకు ఇస్లాం ప్రకారమే ఆచరణలో మొత్తం 5 నెలల వ్యవధిలో 3 సార్లు అలా తలాక్ అనాల్సి ఉంటుంది. ఈ లోపు భార్యాభర్తలకు చెందిన ఇరుపక్షాల పెద్దలు కూర్చుని, పరస్పర వాదనలు విని వారిని కలి పేందుకు ప్రయత్నించి, అవన్నీ విఫలమైన తర్వాతే తలాక్ అమలవుతుంది. నిజానికి కలహాల కాపురంలో పెద్దల జోక్యంతో పరిష్కారం కోసం జరిగే, సామరస్యపూర్వక యత్నం ఏ మతంలోని భార్యాభర్తల విషయంలోనైనా వాంఛనీయమే కదా. కాదు.. మా మతంలో అల్లా ఆదేశించిన దానిని సవరించే హక్కు పాలకులకు, ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నించే మత పెద్దలు అన్ని మతాలలో ఉండకపోరు. 4 వర్ణాలు అనే కులవిభజన నేనే చేశాను అని సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటించాడు. మరి అస్పృశ్యతతో సహా పరమ దుర్మార్గమైన ఈ వర్ణ వ్యవస్థ కొనసాగాల్సిందేనని ఎవరైనా హిందూ మతతత్వవాదులు అంటే అంగీకరించలేం కదా. అదలా ఉంచినా, హిందూమతంలో సతీసహగమనం, బహుభార్యత్వం ఆచారంగా అనుశ్రుతంగా ఉండేవి. అలాంటి దురాచారాలకు వ్యతిరేకంగా తీవ్ర అంతర్మథనం జరిగి వాటిని రద్దు చేయించుకోగలిగింది హిందూ సమాజం. అలాగే ఈ తలాక్ పేరుతో పురుషులు స్త్రీలను భోగవస్తువుగా చూడటం, వారిపట్ల అన్యాయంగా వ్యవహరించడం, కుటుంబ జీవితం అస్తవ్యస్తమై మహిళల పరిస్థితి దారుణ అణచివేతకు గురవడం వంటివాటిని ముస్లిం ప్రజానీకం, నేతలు మొదట గ్రహించి సంస్కరణలు తీసుకువచ్చారు. ముస్లిం లా లోనూ మార్పులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 3సార్లు వెనువెంటనే తలాక్ చెప్పడం ఇస్లాం చట్టంలో నేడు ఆచరణలో లేదు. పైగా ఈ తలాక్ వల్ల విడిపోయిన భార్యాభర్తలు ఇతర ఏ మతంతో పోల్చి చూసినా చాలా తక్కువ మందే ఉన్నారు. ముస్లిం స్త్రీకి ఆదినుంచే విడిపోయే హక్కు అంతే కాదు, ఇస్లాం చట్టంలో పురుషులకు తలాక్ ఎలా ఉన్నదో, అలాగే ముస్లిం స్త్రీలకు కూడా ‘కులా’ (విడిపోయే హక్కు) ఉన్నది. ముస్లిం స్త్రీ తన భర్త దుష్ప్రవర్తన వల్ల తానెంత వ్య«థ చెందుతున్నదో వారి మతగురువు ముందు వివరించి, తాను కూడా ‘కులా’ కోరవచ్చు. ఆయన ఇతర పెద్దలతో సంప్రదించి, ఆ హక్కు ఆమెకు మంజూరు చేయనూవచ్చు. అయితే అలాంటి హక్కు ద్వారా విడిపోయిన స్త్రీల సంఖ్య చాలా స్వల్పమే. ఒక ముస్లిం మతంలోనే స్త్రీలకు అన్యాయం జరుగుతున్నదని వాదించడం అసంబద్ధం. నిజానికి ఏ మతంలోనూ లేనట్లుగా ముస్లిం మతంలో చాలా ముందునుంచే స్త్రీకి ఆస్తిలో వాటా హక్కు ఉంది. ఆ మతంలోని మౌఢ్య పార్శా్వన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారు కానీ.. వైవాహిక బంధంలో పురుషునికెంత గౌరవం, హక్కూ ఉన్నదో స్త్రీకి కూడా అంతే సమానంగా ఉండాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఒకటి. ముస్లిం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు అని చెప్పి ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో నేటి పాలకుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకం అయ్యే రీతిలో వ్యవహరిస్తే అది ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో మతపరమైన అశాంతికి ఆస్కారం ఇచ్చే ప్రమాదం ఉంది. ఉదా‘‘ దేశంలో 24 లక్షలమంది భర్తలు వదిలివేసిన స్త్రీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు ముస్లిమేతర స్త్రీలే. వారు ఎంతో వ్యథకు, బతుకుబాధలకు గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ మహిళలందరికీ న్యాయం చేసే రీతిలో చట్టం రావాలి. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశాన్ని పార్లమెంటులోనే నేరుగా ప్రస్తావించినట్లున్నారు. అలా భర్తచేత తిరస్కృతులైన ఒంటరి భార్యలందరికీ న్యాయం జరిగే చట్టం చేయడం అవసరం. దాదాపు అంతరించిపోతున్న ప్రస్తుత తలాక్ చట్టంతోపాటు, అదేదో ముస్లిం మతాచారాల పట్ల వ్యతిరేకత అన్న భావనకు తావు లేకుండా ఉండటం కోసమైనా మామూలు చట్టం చేయడం అత్యవసరం. పైగా, బహుభార్యత్వం అనే దురాచారం ముస్లి మతాచారంలోనే కాదు.. హిందూమతంలో సైతం ‘ఆరాధనీయంగా’ ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. చరిత్ర ప్రకారం మహమ్మద్ ప్రవక్తకు పలువురు భార్యలట. అందులో అనాథలు, వితంతువులు, పతితులు ఉన్నారని చెబుతారు. అలాంటి మహిళ లను ఉద్ధరించేందుకోసమే ఆయన అన్ని వివాహాలు చేసుకున్నారని విశ్వసించే వారూ ఉన్నారు. ఇక హిందూ దేవుళ్ల గురించి మనకు తెలిసిందే. మన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామినే తీసుకుందాం. ‘శ్రీదేవి వంకకు చిలి పిగా చూడకు, అలివేలుమంగకు అలుక రానీయకు’ అంటూ ఆ జగత్పతి సైతం ఇద్దరు భార్యలను ఎలా ముద్దుగా చూసుకోవాలో సూచిస్తూ గానం చేస్తాం. ప్రవక్త మాదిరే కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు సైతం తాను రామావతారంలో ఉన్నప్పుడు తనను ఆరాధించిన వారందరికీ ఈ అవతారంలో కుదరదు (ఏకపత్నీవ్రత) కనుక వచ్చే కృష్ణావతారంలో మీరందరూ గోపికలుగా జన్మించినప్పుడు మిమ్మల్ని స్వీకరిస్తాను అని వాగ్దానం చేశాడట. అందుకే కృష్ణుడికి పద్నాలుగు వేలమంది గోపికలు అని భక్తులు అంటుంటారు. మౌనం అంగీకారమా? అర్ధాంగీకారమా? ఎవరి విశ్వాసాలు వారివి కావచ్చు. కానీ మన లౌకిక వ్యవస్థలు అన్ని మతాలను సమానంగా చూడాలి. ప్రభుత్వం మతం విషయంలో ఒక్క మతాన్ని కూడా పక్షపాతంతో చూడరాదు. మతం వేరు, మతతత్వం వేరు. మన లౌకిక వ్యవస్థ మతాన్ని నిషేధించదు. అదే సమయంలో మతతత్వాన్ని సహించదు. దురదృష్టవశాత్తూ బీజేపీ నేతలు, మంత్రులు కూడా పరమత ద్వేషం ప్రవచిస్తున్నప్పుడు, వారిని మోదీవంటివారు కనీసం బహిరంగంగా ఖండించని ఫలితంగానే, మొన్న తలాక్‌పై చర్చ సందర్భంగా, ‘హిందూ సంస్కృతిలో కలవని ఇతరులకు, ఈ దేశంలోని ముస్లింలకు స్థానం ఉండదు, తమ ఇష్టం వచ్చిన దేశం వెళ్లిపోవచ్చు’నని ఆ పార్టీ నేతలు నిర్భయంగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మోదీ పాటించే మౌనవ్రతం అర్ధాంగీకారమేనా? ఇలా మతమూ, మతతత్వ ప్రాతిపదికన కాకుండా, మహిళలకు ఇంతకంటే గుణాత్మకంగా మెరుగైన జీవనం లభించాలంటే సహేతుకమైన సవరణలతో తలాక్ బిల్లు వంటివాటిని ఆమోదించడం అవసరం. అంతకంటే ముఖ్యంగా చట్టసభలలో కనీసం 33 శాతం స్థానాల్లో రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి. అప్పుడే మహిళలకు వాస్తవికంగా మేలు చేకూర్చే చట్టాలు రూపొందే అవకాశం పెరుగుతుంది. కానీ దశాబ్దాలుగా, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం లేదు. ఇప్పుడు బీజేపీకి పార్లమెంటులో సరిపడా మెజారిటీ ఉంది. ఈ తలాక్ బిల్లు సందర్భంగా ఆ పార్టీ నేతలు, ముస్లి మహిళలకు న్యాయం కలిగించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతిపక్షాలు సైతం కాస్త సవరణ కోరుతున్నాయే తప్ప గంపగుత్తగా ఈ బిల్లును వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు కూడా ఇదే అదును. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీ అయినా సరే మహిళా శ్రేయస్సు అటుంచితే, మహిళల ఓట్లను మరవజాలదు. పైగా అన్ని పార్టీలూ తరతమ భేదాలతో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేవే. చట్టసభలో సాధారణ రిజర్వేషన్ అమలయ్యేందుకు లేని అభ్యంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ఎందుకుండాలి? పైగా ప్రస్తుత పరిస్థితిలో ఇది సహేతుకమైన డిమాండే. లేకుంటే ఇప్పుడు చట్టసభలలో అసమానతలు గోచరిస్తున్నాయి. ప్రజలలో నూటికి 20 శాతం గర్భదరిద్రులు కాగా 60 శాతం మంది పేదరికం అనుభవిస్తున్నారు. కానీ పార్లమెంటులో నూటికి 50 శాతంపైగా సభ్యులు కోటీశ్వరులు. వారిలో 10 శాతం మంది మరీ కోటీశ్వరులు. మన ఓటర్లలో దాదాపు 50 శాతం మంది మహిళలు. చట్టసభల్లో నూటికి 10–12 మంది మాత్రమే మహిళలు. ప్రజానీకంలో అగ్రకులాలు, ఆధిపత్య కులాలు 15–20 శాతం ఉంటారు. పార్లమెంటులో మాత్రం వీరు 50 శాతం మించే ఉంటారు. ఇది వాస్తవం. దీన్ని బట్టి చూస్తే పార్లమెంటును నిజమైన ప్రజాప్రాతినిధ్య సంస్థగా మార్చాల్సిన అవసరం ఉంది. మతం, మతతత్వం, దైవం ఇవన్నీ విశ్వాసాలు. అందుకే మార్క్స్ మాటలు గుర్తుంచుకోవాలి. ‘తమ కష్టాలకు, కన్నీళ్లకు కారణం తెలియని వ్యక్తి మతం ఒడిలో సేద తీరుతాడు. బాధాతప్త హృదయం విడిచే వేడి నిట్టూర్పు వంటిది మతం’. కనుక కష్టాలకు, కన్నీళ్లకు కారణాలను తెలుసుకుని నివారించుకోగలిగిన మేర వేడి నిట్టూర్పులు, మతం ఒడిలో సేద తీరడాలు ఉండవు. కావలసింది అదే. మన కృషి ఆ దిశగా సాగాలి. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
పార్లమెంట్‌కు సీఎం కేసీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, తెలంగాణకు ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సహకాలు, అధికారుల పంపకాలు సహా పలు అంశాలను శాఖల వారీగా కేంద్రమంత్రులకు ఈ సందర్భంగా కేసీఆర్ మరోసారి గుర్తు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, రైల్వేమంత్రి సురేశ్ ప్రభుత తదితరులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ...అవకాశాన్ని బట్టి మంత్రులందరనీ పార్లమెంట్‌లోని వారి చాంబర్లలో కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు మధ్యాహ్నం 1.15గంటలకు కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతితో కేసీఆర్ సమావేశం అవుతారు. అలాగే ఈరోజు సాయంత్రం కేసీఆర్..హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం. -
మేం మద్దతివ్వకుంటే బిల్లు పాసయ్యేదే కాదు
తెలంగాణపై వెంకయ్యనాయుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ వల్లనే ఆలస్యమైంది హైదరాబాద్: పార్లమెంట్లో బీజేపీ మద్దతు ఇవ్వకుంటే తెలంగాణ బిల్లు ఆమోదం పొందేదే కాదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎం. వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాష్ట్ర ఏర్పాటు ఇంత ఆలస్యం కావడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే బాధ్యత తీసుకోవాలన్నారు. ఉద్యమంలో ఈ ప్రాంత యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికీ ఆ రెండు పార్టీలు కారణమని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామని ప్రకటించడంవల్లే కాంగ్రెస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్లు కాలయాపన చేసి ఎన్నికల ముందు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ముందుకొచ్చిందని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి జైరాంరమేష్ తెలంగాణ బిల్లు చర్చ జరిగే సమయంలో ఎనిమిదిసార్లు తనను ఎందుకు కలవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరడం తన తప్పా? అని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబులది అపవిత్ర కలయిక అంటున్నారు గానీ, చంద్రబాబు కింద తానేమీ పని చేయలేదు, మీరే ఆయన కింద పనిచేశారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పడు తనపై విమర్శలు చేస్తున్న ఈయనే 2009లో ఎన్డీయేతో కలిసేందుకు తన ఇంటికి వచ్చారని చెప్పారు. ఈ ప్రాంతం వారే ముఖ్యమంత్రి కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటారు కానీ, వలస వచ్చిన వాళ్లను సీఎం కావడానికి అంగీకరించరని వ్యాఖ్యానించారు. ఎవరు వసూళ్ల రాజానో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. హుందాగా వ్యవహరించాలని, కుల ప్రస్తావన మానుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఆపేశక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటిస్తారనుకుంటున్నా సీమాంధ్ర ప్రాంతంలో పొత్తుల్లో బీజేపీకి కేటాయించిన సీట్లలో మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులను బరిలో నిలిపిందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తనతో చెప్పారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పొత్తు నిర్ణయం సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని.. పొత్తు ధర్మాన్ని పాటిస్తారని అనుకుంటున్నానని చెప్పారు. రేపటి నుంచి సీమాంధ్రలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. -
అజాత శత్రువుకు అశ్రునివాళి
అంత్యక్రియల్లో పాల్గొన్న అభిమానులు మంచిర్యాల అర్బన్ న్యూస్‌లైన్ : పార్లమెంట్ మాజీ సభ్యుడు గడ్డం సర్సింహరెడ్డికి అభిమానులు, రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, అధికారులు, పుర ప్రముఖులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న నర్సింహరెడ్డి శనివారం హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి చెం దిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన పార్థివదేహాన్ని మంచిర్యాలలోని స్వగృహంకు తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీఎస్పీ రమణకుమార్, సీఐ సురేశ్, మంచిర్యాల, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు కమలాకర్‌రావు, కొత్త సత్తయ్య, మాజీ చైర్మన్లు పెంట రాజయ్య, బుచ్చన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోనె శ్యాంసుందర్‌రావు, కాంగ్రెస్ నాయకుడు సంజీవరావు, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగల దయానంద్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరవింద్, మాజీ కౌన్సిలర్లు మినాజ్, రైసాభాను, సువ్వాబాయి, మమతా సూపర్ బజార్ చైర్మన్ యాదగిరిరావు, బీజేపీ నాయకుడు కెవీ ప్రతాప్, టీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, పొన్నం మురళీధర్, మంచాల రఘువీర్, మాదం శెట్టిసత్యనారాయణ, గోగుల రవిందర్‌రెడ్డి, శ్యాంరావు, వెంకటేశ్వర్రావు, ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం నాయకుడు బాలాజీ, బంధువులు నర్సింహరెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన తన యులు ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి, గంగారెడ్డి, అచ్యుతమ్త్రెడ్డిలకు సంతాపం ప్రకటించారు. ఓదార్పు నిచ్చారు. అనంతరం అంతిమ యాత్ర నిర్వహించారు. స్థానిక గోదావరి తీరాన హిందు సాంప్రదాయం ప్రకారం వేద పండితులు శాస్త్రో్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. -
రాజకీయ కురువృద్ధుడు మృతి
మంచిర్యాల అర్బన్ న్యూస్‌లైన్ : గడ్డం నర్సింహారెడ్డి.. ఆయనో వివాదరహితుడు. ముక్కుసూటి మనిషి. అజాత శత్రువుగా పేరొందిన గడ్డం నర్సింహారెడ్డి (81) శనివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి తండ్రి అయిన నర్సింహారెడ్డి మంచిర్యాల పురపాలక సంఘం చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అప్పట్లో జనరల్ స్థానం కాగా నర్సింహారెడ్డి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 1970 నుంచి 1984 రెండు పర్యాయాలు ఎంపీగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సభ్యునిగా కూడా కొనసాగారు. అలాగే డీసీసీ ప్రెసిడెంట్‌గానూ చేశారు. అలా ఢిల్లీ వరకు ప్రయాణం సాగిచి జాతీయ రాజకీయాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. మృతిచెందే నాటికి కూడా ఏఐటీసీసీ సభ్యుడిగానే ఉన్నారు. అంతకు ముందు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న ఐదేళ్లు విద్యాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మంచిర్యాల లోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల భవనాలు ఆయన హయాంలోనే నిర్మాణం జరిగాయి. మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి పట్టణ నడిబొడ్డులోని విలువైన స్థలాన్ని ఇచ్చారు. తన తండ్రి గంగారెడ్డి స్మారక ఆస్పత్రిగా నామకరణం చేశారు. తునికాకు కాంట్రాక్టర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో ఏ అగ్ర నాయకుడు వచ్చినా నర్పింహారెడ్డి నివాసంలోనే బస చేస్తుండేవారు. అందుకే ఆయన నివాసాన్ని స్థానికులు గాంధీభవన్‌గా పిలుస్తుంటారు. నర్సింహారెడ్డి పెద్ద కుమారుడు అరవింద్‌రెడ్డి రాజకీయాల్లోకి వారసునిగా 2002లో రంగ ప్రవేశం చేశారు. టీఆర్ఎస్ తరఫున రెండు పర్యాయాలు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. భార్య చందనారెడ్డి ఉండగా గంగారెడ్డి, అచ్యుత్‌రెడ్డి ఇద్దరు కుమారులు వ్యాపారం రంగంలో స్థిరపడ్డారు. కూతురు అనురాధ ఉన్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న నర్సింహారెడ్డి మృతిచెందడం స్థానిక రాజకీయ వ ర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం ఆయన పార్థివ దేహాన్ని మంచిర్యాలకు తీసుకురానున్నారు -
'కాంగ్రెస్ మాత్రమే మాటమీదే నిలబడి ఉంది'
ఏలూరు : రాష్ట్ర విభజన విషయంలో మిగిలిన రాజకీయ పార్టీలు మాట మార్చాయని కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ విభజనపై కాంగ్రెస్ మాత్రమే మాటమీద నిలబడి ఉందన్నారు. పార్లమెంట్లో విభజన బిల్లుపై ఇంకా సంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడలేదని జేడీ శీలం అన్నారు. కాగా అంతకు ముందు హనమాన్ జంక్షన్ వద్ద జేడీ శీలం కాన్వాయ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ చీపుర్లు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు.