వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు పేర్కొనడంతో వివిధ పార్టీల నేతలు థర్డ్ ఫ్రంట్పై దృష్టిసారిస్తున్నారు.
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు పేర్కొనడంతో వివిధ పార్టీల నేతలు థర్డ్ ఫ్రంట్పై దృష్టిసారిస్తున్నారు. పార్లమెంట్లో బుధవారం పలువురు అగ్రనాయకులు సమావేశమై చర్చలు జరిపారు.
మాజీ ప్రధాని దేవేగౌడ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, జేడీయూ నాయకుడు శరద్ యాదవ్తో పాటు రాంగోపాల్, తంబిదురై తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికార యూపీఏ, ఎన్డీయేత పార్టీల నేతలు హాజరయ్యారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుందుకు తగిన మెజార్టీ లభించకపోవచ్చని సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇతర పార్టీలు కలిసొస్తే అవకాశాలుంటాయని పేర్కొన్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింటుందని సర్వేలు వెల్లడించాయి.