leaders meet
-
పార్టీని వీడే నేతలతో నష్టం లేదు
సాక్షి, హైదరాబాద్: పార్టీని వీడి వెళ్లే నేతలతో బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. పార్టీ ఓడిపోయిన చోట్ల కూడా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్లి కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపాలని పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరిగిన ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ వంటి నేతకే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని.. మనకూ తప్పవనే విషయాన్ని అర్థం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామని బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఈ వ్యతిరేకతను బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకునేలా పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ‘‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన పదేళ్ల పాలనలో ప్రజలకు చేయాల్సిందంతా చేశాం. దళితబంధు వంటి మంచి పథకం తెచ్చాం. ఎన్నికల్లో ఓట్లు ఆశించి అమలు చేయలేదు. రాష్ట్రంలో ప్రతి పథకాన్ని మనం ఆయా వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే అమలు చేశాం. అయినా ప్రతిపక్ష పాత్ర పోషించాలని మనకు ఓటర్లు తీర్పునిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విలువను ప్రజలు తెలుసుకుని కచి్చతంగా ఆదరిస్తారు..’’అని పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే గైర్హాజరు కేసీఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన వెంకట్రావు.. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కుటుంబ సమేతంగా కలసిన విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరినా.. చివరి నిమిషంలో తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీచేశారు. మరోవైపు సీఎం రేవంత్‌తో తెల్లం వెంకట్రావు భేటీ అయిన నేపథ్యంలో.. భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పార్టీని వీడినా.. స్థానిక నేతలు అభద్రతా భావానికి లోనుకావొద్దని, పార్టీ వెంటే కొనసాగితే గుర్తింపునిస్తామని భరోసా ఇచ్చారు. 11న కాంగ్రెస్‌లోకి వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ నెల 11న కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంబోత్సవం సందర్భంగా బూర్గంపాడులో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైంది
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైందని, అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీసే రోజులు ముందున్నాయని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నిలదీయడం బీఆర్ఎస్ పారీ్టకే సాధ్యమవుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వర్రావు, మాలోత్ కవితతో పాటు ఆయా సెగ్మెంట్ల పరిధిలోని ముఖ్యనేతలతో తెలంగాణ భవన్లో హరీశ్ సోమవారం భేటీ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలతో చర్చించారు. కాంగ్రెస్ మోసాలను నిలదీస్తూ ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రుణమాఫీ, విద్యుత్ కోతలు, ట్యాంకర్లతో పొలాలకు నీరు, గ్యాస్ సబ్సిడీలో 70 శాతం లబ్ధి దారులకు మొండి చేయి వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా ఢిల్లీ వేదికగా తెలంగాణ గొంతు వినిపించేందుకు బీఆర్ఎస్ ఎంపీలు అవసరమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలని హరీశ్ పిలుపునిచ్చారు. -
ఆసియా లీడర్ల భేటీకి కేటీఆర్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీ నుంచి జూరిచ్‌లో జరిగే ఆసియా లీడర్ల సిరీస్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఆసియా, యూరప్‌లోని అత్యంత ప్రభావశీల నాయకుల నడుమ బహిరంగ చర్చకు వీలు కల్పిస్తూ ఆసియా లీడర్స్ సిరీస్ ఒక తటస్థ వేదికగా పనిచేస్తోంది. దేశాల నడుమ భిన్నత్వం, భాగస్వామ్యాలకు మద్దతు, పరస్పర విశ్వాసంతో కూడిన సంబంధాలు మెరుగు పరచడం వంటి అంశాల్లో చర్చకు ఈ వేదిక అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. జూరిచ్‌లో జరిగే ఈ భేటీకి ఆసియా, యూరప్ నుంచి సుమారు వంద మంది ప్రముఖ వాణిజ్యవేత్తలు హాజరు కానున్నారు. యూరప్ ఆసియా కారిడార్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెద్ద కంపెనీలపై పెరుగుతున్న రాజకీయ అస్థిరత ప్రభావంపై జూరిచ్ ఆసియా లీడర్ల సిరీస్ వేదికగా చర్చ జరగనుంది. అర్థవంతమైన చర్చకు బాటలు వేయడం లక్ష్యంగా తమ వేదిక నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు రావాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రంలో ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ పేర్కొన్నారు. చదవండి: కేంద్రమంత్రిపై కస్సుమన్న హరీష్‌రావు.. స్ట్రాంగ్ కౌంటర్ -
ఏ స్థానం అడుగుదాం..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : మహాకూటమి పొత్తు లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎన్ని స్థానాలు, ఏయే స్థానాలు అడగాలనే అంశంపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం ప్రాథమికంగా సమాలోచనలు జరిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ఈ అంశంపై ఉమ్మడి జిల్లాకు చెందిన కొద్ది మంది నాయకులతో చర్చించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఒక స్థా నం టీడీపీకి కేటాయించాలని కోరుతూ అధినేత చంద్రబాబుకు ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, బోధన్ స్థానాల్లో ఏ స్థానాన్ని అడగాలనే అనే అంశం చర్చకొచ్చినట్లు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీకి బాల్కొండ స్థానం కేటాయించే అవకాశాలున్నట్లు రాజకీయవర్గాల్లో మొదటి నుంచి చర్చ జరుగుతోంది. అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. టీడీపీ గుర్తు సైకిల్‌పై పోటీ చేస్తే కాంగ్రెస్‌కు పడే ఓట్లు తమవైపు మళ్లే అవకాశాలు లేవని భావిస్తున్న మల్లికార్జున్‌రెడ్డి.., కాంగ్రెస్ గుర్తు నుంచే పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నట్లు అనుచరవర్గం పేర్కొంటోంది. ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మండవ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపడం గమనార్హం. కాగా ఇదంతా సాధారణ సమావేశమేనని, పొత్తుల గురించి అసలు ప్రస్తావన రాలేదని మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ‘సాక్షి’ ప్రతినిధితో తెలిపారు. ఎలాంటి తీర్మానాలు కూడా చేయలేదని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా నాయకులు అమర్‌నాథ్‌బాబు, గోపాల్‌రెడ్డి, కొడాలి రాము, రమాదేవి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
కాంగ్రెస్‌కు పూర్వ వైభవం
కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఉదయగిరి: కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని నిలబడిందని, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా వచ్చే ఎన్నికల్లోగా పూర్వవైభవం తథ్యమని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. ఉదయగిరిలో శుక్రవారం జరిగిన నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన దోషిగా కాంగ్రెస్‌ను నిలబెట్టేందుకు టీడీపీ, బీజేపీలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయన్నారు. విభజన సమయంలో అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయన్నారు. విధి లేని పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసినా ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా హామీని ఇచ్చిందన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా విషయమై చేసిన వాగ్దానాలను టీడీపీ, బీజేపీలు మరిచాయన్నారు. ప్రత్యేక హోదా సంజీవినా అని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఉదయగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెంచలబాబు యాదవ్ అని ప్రకటించారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ ఉదయగిరిలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఉదయగిరిలో నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం పనబాక లక్ష్మిని చెంచలబాబు కూతురు రమ్య యాదవ్ సత్కరించారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు చేవూరి దేవకుమార్‌రెడ్డి, రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు సీవీ శేషారెడ్డి, పీసీసీ నాయకులు శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్లో థర్డ్ ఫ్రంట్ సమావేశం
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు పేర్కొనడంతో వివిధ పార్టీల నేతలు థర్డ్ ఫ్రంట్‌పై దృష్టిసారిస్తున్నారు. పార్లమెంట్లో బుధవారం పలువురు అగ్రనాయకులు సమావేశమై చర్చలు జరిపారు. మాజీ ప్రధాని దేవేగౌడ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, జేడీయూ నాయకుడు శరద్ యాదవ్‌తో పాటు రాంగోపాల్, తంబిదురై తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికార యూపీఏ, ఎన్డీయేత పార్టీల నేతలు హాజరయ్యారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుందుకు తగిన మెజార్టీ లభించకపోవచ్చని సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇతర పార్టీలు కలిసొస్తే అవకాశాలుంటాయని పేర్కొన్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింటుందని సర్వేలు వెల్లడించాయి.