కాంగ్రెస్‌కు పూర్వ వైభవం | congress will regain its strength | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం

Published Fri, Aug 5 2016 11:57 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం - Sakshi

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం

  • కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి
  • ఉదయగిరి:  కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని నిలబడిందని, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా వచ్చే ఎన్నికల్లోగా పూర్వవైభవం తథ్యమని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. ఉదయగిరిలో శుక్రవారం జరిగిన నియోజకవర్గస్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన దోషిగా కాంగ్రెస్‌ను నిలబెట్టేందుకు టీడీపీ, బీజేపీలు గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నాయన్నారు. విభజన సమయంలో అన్ని పార్టీలు  లేఖలు ఇచ్చాయన్నారు. విధి లేని పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసినా ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా హామీని ఇచ్చిందన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా విషయమై  చేసిన వాగ్దానాలను టీడీపీ, బీజేపీలు మరిచాయన్నారు.

    ప్రత్యేక హోదా సంజీవినా అని చంద్రబాబు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఉదయగిరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చెంచలబాబు యాదవ్‌ అని ప్రకటించారు.  పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంచలబాబు యాదవ్‌ మాట్లాడుతూ ఉదయగిరిలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఉదయగిరిలో నీరు–చెట్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్నారు. అనంతరం పనబాక లక్ష్మిని చెంచలబాబు కూతురు రమ్య యాదవ్‌ సత్కరించారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు చేవూరి దేవకుమార్‌రెడ్డి, రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు సీవీ శేషారెడ్డి, పీసీసీ నాయకులు శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement