కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నెల్లూరు(టౌన్): పింఛన్ రాలేదని ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అకారణంగా అరెస్ట్ చేయడం దారుణమని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు కేశవనారాయణ ఆరోపించారు. రాహుల్‌గాంధీ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ గురువారం గాంధీబొమ్మ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. సంఘ నాయకులు ముమిత్‌షా, పవన్, నవీన్, గౌస్, మహేష్, శ్రావణ్, చైతన్య, మాబాషా పాల్గొన్నారు.