పార్లమెంట్కు సీఎం కేసీఆర్ | cm kcr went parliament, meet to cabinet ministers | Sakshi

పార్లమెంట్కు సీఎం కేసీఆర్

Dec 8 2014 11:48 AM | Updated on Aug 15 2018 9:04 PM

పార్లమెంట్కు సీఎం కేసీఆర్ - Sakshi

పార్లమెంట్కు సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పార్లమెంట్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు.

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పార్లమెంట్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, తెలంగాణకు ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సహకాలు, అధికారుల పంపకాలు సహా పలు అంశాలను శాఖల వారీగా కేంద్రమంత్రులకు ఈ సందర్భంగా కేసీఆర్ మరోసారి గుర్తు చేయనున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, రైల్వేమంత్రి సురేశ్ ప్రభుత తదితరులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ...అవకాశాన్ని బట్టి మంత్రులందరనీ పార్లమెంట్లోని వారి చాంబర్లలో కలవనున్నట్లు  తెలుస్తోంది. కాగా ఈ రోజు మధ్యాహ్నం 1.15గంటలకు కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతితో కేసీఆర్ సమావేశం అవుతారు. అలాగే ఈరోజు సాయంత్రం కేసీఆర్..హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement