cabinet ministers
-
Delhi: రేఖా గుప్తా క్యాబినెట్ మంత్రులలో ఎవరి విద్యార్హతలేమిటి?
న్యూఢిల్లీ: బీజేపీ మహిళా నేత, ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) ఈరోజు(ఫిబ్రవరి 20) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో నేడు ఆరుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సీఎం రేఖ గుప్తా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారి విద్యార్హతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ ప్రవేశ్ ఎంబీఏ పూర్తి చేశారు. ఈయన ఢిల్లీకి చెందినవారు. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రవేశ్ వర్మ(Pravesh Verma) తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని ఆర్కే పురంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బి.కామ్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఫర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎంబీఏ పట్టా పొందారు.ఎమ్మెల్యే ఆశిష్ సూద్ ఆశిష్ సూద్ బి.కామ్ పూర్తి చేశారు. జనక్‌పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్ కూడా క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఆశిష్ సూద్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాల నుండి బి.కామ్ పూర్తి చేశారు. ఈ సమయంలో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా సిర్సా 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయనను అత్యంత ధనిక ఎమ్మెల్యే అని చెబుతుంటారు. మజీందర్ సింగ్(Majinder Singh) హర్యానాలోని సిర్సా నివాసి. ఆయనకు సిర్సాలో రూ.248 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.ఎమ్మెల్యే రవీందర్ సింగ్ రవీందర్ సింగ్ బిఎ పాసయ్యారు. పట్పర్గంజ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధ్యాపకుడు అవధ్ ఓజాను ఓడించారు. రవీందర్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందారు. రవీందర్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది.కపిల్ మిశ్రా కపిల్ మిశ్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సోషల్ వర్క్‌లో ఎంఏ చేశారు. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు.పంకజ్ కుమార్ సింగ్ పంకజ్ కుమార్ వృత్తిరీత్యా దంతవైద్యుడు. బీహార్‌లోని బుద్ధగయలోని మగధ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) పూర్తిచేశారు. వికాస్పురి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రభుత్వంలో మంత్రి కాబోతున్నారు.ఇది కూడా చదవండి: Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు రూ. 501.. ఎందుకంటే? -
ఇదేనా పొదుపు..! టీడీపీ కట్టించిన సచివాలయం వారికే నచ్చడం లేదు..
-
శాఖల కేటాయింపుపై తీవ్రంగా కసరత్తు చేసిన చంద్రబాబు
-
మంత్రులకు శాఖల కేటాయింపు
-
ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు
-
ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపుపై కొనసాగుతున్న సస్పెస్స్
-
చంద్రబాబు కేబినెట్ లో మిగిలిన ఆ ఒక్క బెర్తుపై ఆసక్తి
-
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు.. .. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. తమిళిసైకి షా వార్నింగ్చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్‌గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మెగా బ్రదర్స్‌తో మోదీ సందడిప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామ్మోహన్ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనంవేదికపైకి చేరుకున్న రజినీకాంత్రజినీకాంత్ దంపతులతో నందమూరి బాలకృష్ణ➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే➡️ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీపవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే -
బాధ్యతలు స్వీకరించిన పలువురు కేంద్ర మంత్రులు
ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం చేసిన మంత్రులకు నిన్న (సోమవారం) మంత్రిత్వ శాఖలు కేటాయించబడ్డాయి.Priority areas for Jaishankar in Modi 3.0 government: Border stability with China, cross-border terror solution with PakistanRead @ANI Story | https://t.co/bSVWKuPFfA#Jaishankar #MEA #India #China #Pakistan pic.twitter.com/kmHQatgmbf— ANI Digital (@ani_digital) June 11, 2024 దీంతో మంగళవారం పలువురు కేంద్ర మంత్రులు తమ మంత్రిత్వ శాఖ బాధ్యతులు స్వీకరించారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్. జయశంకర్ బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించించారు.#WATCH | Delhi: Suresh Gopi takes charge as Minister of State (MoS) in the Ministry of Tourism. pic.twitter.com/qaolUiCV3Y— ANI (@ANI) June 11, 2024 అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి, పెట్రోల్ శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి, అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి భూపేంద్ర యాదవ్ మంత్రులు బాధ్యతలు స్వీకరించారు.#WATCH | Delhi: Manohar Lal Khattar takes charge as the Minister of Power. pic.twitter.com/HmaLfC9BUv— ANI (@ANI) June 11, 2024సమాచార, ప్రసార మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. #WATCH | Delhi: Ashwini Vaishnaw takes charge as Information and Broadcasting (I&B) Minister pic.twitter.com/gf4QMPvuo6— ANI (@ANI) June 11, 2024 కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షాకు స్వాగతం పలికిన సహాయ మంత్రులు బండి సంజయ్, నిత్యానంద రాయి. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహన్, కిరణ్ రిజీజు, జ్యోతిరాధిత్యసిందియా, జేపీ నడ్డా. -
మోదీ 3.0 : కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి కేంద్రమంత్రులకు శాఖలను కేటాయించారు. ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణాల్లో 3కోట్ల గృహాలు నిర్మించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయిఅమిత్ షా : కేంద్ర హోం శాఖనిర్మల సీతారామన్ : ఆర్థిక శాఖజయశంకర్ - విదేశాంగ శాఖరాజ్ నాథ్ సింగ్ :రక్షణ శాఖమనోహర్ లాల్ కట్టర్ : పట్టణ అభివృద్ధి శాఖశివరాజ్ సింగ్ చౌహన్ : వ్యవసాయ శాఖ మంత్రి , పంచాయతీరాజ్ శాఖసీఆర్ పాటిల్ : జలశక్తిపీయూష్ గోయల్ : వాణిజ్య శాఖ మంత్రిఅశ్విని వైష్ణవ్ : సమాచార శాఖ మంత్రిధర్మేంద్ర ప్రధాన్ : మానవ వనరులు అభివృద్ది శాఖగజేంద్ర సింగ్ శేకావత్ : టూరిజం, సాంస్కృతిక శాఖ జేపీ నడ్డా : వైద్య ఆరోగ్య శాఖ మంత్రిజితిన్ రాం మాంజీ : సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రిఅన్నపూర్ణ దేవి : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిభూపేంద్ర యాదవ్ : అటవీ, పర్యావరణ శాఖకిరణ్ రిజిజు : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిచిరాగ్ పాశ్వాన్: క్రీడా శాఖ మంత్రికుమారస్వామి : భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ : షిప్పింగ్ శాఖ మంత్రిజ్యోతి ఆదిత్య సింధియా: టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖప్రహ్లాద జోషి : రెన్యూవబుల్ ఎనర్జీరవణీత్ సింగ్ బిట్టు : మైనార్టీ శాఖ సహాయ మంత్రిహర్ష మల్హోత్ర - రోడ్లు జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రిసురేష్ గోపి : టూరిజం సహాయ శాఖ మంత్రితెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేకిషన్ రెడ్డి : కేంద్ర గనుల శాఖ మంత్రిబండి సంజయ్ : హోంశాఖ సహాయ మంత్రిరామ్మోహన్ నాయుడు : కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిశ్రీనివాస్ వర్మ : ఉక్కు, భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రిపెమ్మసాని చంద్రశేఖర్ : గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రులు వీరే.. ఇక్కడ క్లిక్ చేయండిమరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ మంత్రి వర్గం సమావేశం లోపే నేతలకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు ఎవరికి ఏయే శాఖ కేటాయిస్తారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతుండగా..సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొలువుదీరిన మోదీ 3.0 కేబినెట్లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు చేరారు. వారికి కీలక శాఖలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. హోం,రక్షణ శాఖ, ఆర్ధిక శాఖ వంటి కీలక పదవులు బీజేపీ నేతలకేననే ప్రచారమూ కొనసాగుతుంది.ప్రాధన్యాత కలిగిన శాఖపై కిషన్ రెడ్డి పట్టుమరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతున్నాయనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ, తెలంగాణలకు రెండు కేబినెట్, మూడు సహాయమంత్రి పదవులు దక్కనున్నాయి. అయితే తెలంగాణ నుంచి గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖ అప్పగించాగా.. ఈ సారి మాత్రం ఈసారి ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్ రెడ్డి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలపైనా ఇక క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈనెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం కానుందని, 15 నుంచి మూడు రోజులపాటు ఎంపీల ప్రమాణస్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అనంతరం ఈనెల 22న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. -
గల్లీ నుంచి ఢిల్లీకి..
-
మోదీ అనే నేను..
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన నాయకునిగా రికార్డులకెక్కారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 73 ఏళ్ల మోదీతో ప్రధానిగా ప్రమాణంచేయించారు. ఆయన దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అన్ని రంగాలకూ చెందిన అతిరథ మహారథుల సమక్షంలో కార్యక్రమం 155 నిమిషాల పాటు అత్యంత వేడుకగా జరిగింది.మోదీ సహా 72 మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కూడా ఈ సందర్భంగా కొలువుదీరింది. 30 మందితో కేబినెట్ మంత్రులుగా, ఐదుగురితో స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాని నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన ఎన్డీఏ మిత్రపక్షాలకు మంత్రివర్గంలో 11 బెర్తులతో సముచిత ప్రాధాన్యం దక్కింది. బీజేపీ నుంచి రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ వంటి అతిరథులతో పాటు మిత్రపక్షాల నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), లలన్‌సింగ్ (జేడీయూ), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ), హెచ్.డి.కుమారస్వామి (జేడీఎస్) తదితరులు ప్రమాణస్వీకారం చేసిన ప్రముఖుల్లో ఉన్నారు.ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమంలో పాల్గొనగా తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీతో పాటు పలు విపక్షాలు గైర్హాజరవడం విశేషం. 140 కోట్ల మంది భారతీయులకు మరోసారి సేవ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని కార్యక్రమం అనంతరం మోదీ పేర్కొన్నారు.‘‘నూతన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రగతి పథంలో దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేస్తా. అనుభవం, యువత కలబోతగా కొత్త మంత్రివర్గం అలరారుతోంది. ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు నిరంతరం శ్రమిస్తాం’’ అంటూ ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. నూతన మంత్రులకు శాఖల కేటాయింపు సోమవారం జరిగే అవకాశముంది. ఆరుగురు మాజీ సీఎంలు మోదీ 3.0 మంత్రివర్గం పలు విశేషాల సమాహారంగా రూపుదిద్దుకుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఐదేళ్ల విరామం తర్వాత కేంద్ర మంత్రివర్గంలోకి అడుగు పెట్టారు. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, కుమారస్వామిలకు తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వారితో పాటు నూతన మంత్రివర్గంలో 33 మంది కొత్త ముఖాలున్నాయి. శివరాజ్, కుమారస్వామి, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్, జితిన్‌రాం మాంఝీ రూపంలో నూతన మంత్రివర్గంలో ఆరుగురు మాజీ సీఎంలుండటం విశేషం! 43 మందికి మూడుసార్ల కంటే ఎక్కువగా కేంద్ర మంత్రులుగా చేసిన అనుభవముంది. యూపీకి అత్యధికంగా 9 బెర్తులు కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా 9 స్థానాలు దక్కాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న కీలకమైన బిహార్‌కు ఏకంగా 8 బెర్తులు దక్కాయి! ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు కూడా ఆరు బెర్తులు లభించాయి. గుజరాత్‌కు ఐదు; మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు ఐదేసి; హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు మూడేసి; ఒడిశా, అసోం, జార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, పశి్చమబెంగాల్‌కు రెండేసి చొప్పున స్థానాలు దక్కాయి.అయితే యూపీకి ఒకే కేబినెట్ హోదా బెర్తు దక్కగా బిహార్‌కు ఏకంగా నాలుగు లభించడం విశేషం! గుజరాత్‌కు కూడా మోదీ, అమిత్ షా, మాండవీ, సీఆర్ పాటిల్ రూపంలో ఏకంగా నాలుగు కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి! మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లకు మూడేసి; మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలకు రెండేసి కేబినెట్ మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణ, ఏపీలతో పాటు హరియాణా, పంజాబ్‌లకు ఒక్కో కేబినెట్ హోదా బెర్తు దక్కాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి 13 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. 37 మందికి ఉద్వాసన మోదీ 2.0 మంత్రివర్గంలో పని చేసిన వారిలో స్మృతీ ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణే సహా ఏకంగా 37 మందికి ఈసారి కేబినెట్లో చాన్స్ దొరకలేదు. వీరిలో పలువురు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2.0 మంత్రివర్గంలోని 19 మంతి కేబినెట్ మంత్రులతో సహా మొత్తం 34 మంది తిరిగి చోటు దక్కించుకున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఎల్ మురుగన్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఓడినా చాన్స్ దక్కడం విశేషం. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కొత్త మంత్రుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు చొప్పున 12 మంది రాజ్యసభ సభ్యులున్నారు. 58 మంది లోక్‌సభ సభ్యులు కాగా రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, జార్జి కురియన్ ఏ సభలోనూ సభ్యలు కారు. వారు ఆర్నెల్లలోగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవాల్సి ఉంటుంది. భాగస్వాములకు పెద్దపీట ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు నూతన మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కింది. తాజా మాజీ మంత్రివర్గంలో వాటికి ఒక్క కేబినెట్ హోదా, స్వతంత్ర హోదా మంత్రి పదవి కూడా లేదు. ఈసారి మాత్రం కుమారస్వామి (జేడీఎస్), మాంఝి (హెచ్ఏఎల్), లలన్‌సింగ్ (జేడీయూ), రామ్మోహన్ నాయుడు (టీడీపీ), చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ–ఆర్వీ) రూపంలో ఏకంగా ఐదు కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి! ప్రతాప్‌రావ్ జాదవ్ (శివసేన), జయంత్ చౌదరి (ఆరెల్డీ)లకు స్వతంత్ర హోదా కూడిన పదవులు లభించాయి. 2.0 మంత్రివర్గంలో సహాయ మంత్రులైన అనుప్రియా పటేల్ (అప్నాదళ్–యూపీ), రామ్‌దాస్ అథవాలె (ఆర్పీఐఏ–మహారాష్ట్ర)లకు మళ్లీ చాన్సిచ్చారు. వారితో పాటు రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ)లకు సహాయ మంత్రి పదవులు దక్కాయి. కొత్త మంత్రులు 33 మంది మోదీ 3.0 మంత్రివర్గంలో 33 కొత్త ముఖాలకు చోటు దక్కింది. మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్, కుమారస్వామి, మనోహర్‌లాల్ ఖట్టర్ తదితర దిగ్గజాలతో పాటు తొలిసారి ఎంపీలుగా నెగ్గిన సురేశ్ గోపి తదితరుల దాకా వీరిలో ఉన్నారు. 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కేంద్ర మంత్రివర్గంలో 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం దక్కింది. గోవా, అరుణాచల్ వంటి చిన్న రాష్ట్రాలను మినహాయిస్తే నలుగురు, అంతకంటే ఎక్కువ మంది లోక్‌సభ సభ్యులున్న ప్రతి రాష్ట్రం నుంచీ కనీసం ఒక్కరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఏడుగురు మహిళలు నూతన మంత్రివర్గంలో మహిళలు 10 శాతం కంటే తక్కువే ఉన్నారు. మొత్తం ఏడుగురికి స్థానం దక్కింది. ఇదీ కులాల కూర్పు మోదీ 3.0 మంత్రివర్గంలో 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు. కా>గా ఐదుగురు మైనారిటీలున్నారు. అయితే ముస్లింలు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. ఇంకో 8 మందికి అవకాశం కేంద్ర మంత్రివర్గ గరిష్ట పరిమాణం 81 (543 మంది లోక్‌సభ సభ్యుల్లో 15 శాతం). దాంతో మరో 9 మందికి మంత్రులుగా అవకాశముంది. అయితే 2019–24 మధ్య మోదీ 2.0 మంత్రివర్గంలో 78 మంది సభ్యులే ఉన్నారు. అత్యంత పిన్న వయసు్కలు రామ్మోహన్, ఖడ్సే నూతన కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే (బీజేపీ) అత్యంత పిన్న వయసు్కలు. వారికి 37 ఏళ్లు. అత్యంత పెద్ద వయసు్కనిగా 79 ఏళ్ల హెచ్ఏఎల్ అధినేత జితిన్‌రాం మాంఝీ నిలిచారు. బాక్సు నేడు కేబినెట్ తొలి భేటీ మోదీ 3.0 మంత్రివర్గ తొలి సమావేశం సోమవారం జరగనుంది. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసంలో సాయంత్రం భేటీ ఉంటుందని సమాచారం. నూతన మంత్రివర్గ సభ్యులందరికీ బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. -
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు.ఆదివారం (జూన్9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం స్వీకారం చేయించారు. మోదీతో పాటు 30 మంది కేబినెట్ హోదాలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.72 మందితో మోదీ కేబినెట్ కొలువు దీరింది. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య మంత్రులు, ఓబీసీ(27), ఎస్సీలు(10), ఎస్టీలు(6), మైనార్టీలకు (5) మంత్రి పదవులు దక్కాయి. వీరిలో #WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF— ANI (@ANI) June 9, 2024 1.రాజనాథ్ సింగ్2.అమిత్ షా3.నితిన్ గడ్కరీ 4.జేపీ నడ్డా 5.శివరాజ్ సింగ్ చౌహాన్ 6.నిర్మలా సీతారామన్ 7.జై శంకర్ 8.మనోహర్‌లాల్ ఖట్టర్ 9.హెచ్డీ కుమార్ స్వామీ10.పియూష్ గోయల్11.ధర్మేద్ర ప్రధాన్12.జితిన్ రామ్ మాంజీ13.రాజీవ్ రంజన్ సింగ్14.సర్వానంద్ సోనోవాల్15.వీరేంద్రకుమార్16.కింజరపు రామ్మోహన్ నాయుడు17.ప్రహ్లాద్ జోషి18.జువల్ ఓరం19.గిరిరాజ్ సింగ్20.అశ్వినీ వైష్ణవ్21.జోతిరాధిత్య సింధియా22.భూపేందర్ యాదవ్23.గజేంద్ర సింగ్ షెకావత్24.అన్నపూర్ణాదేవి25.కిరణ్ రిజిజు26.హర్దీప్ సింగ్‌పూరి27.మన్సుఖ్ మాండవీయ28.జి.కిషన్ రెడ్డి29.చిరాగ్ పాశ్వాన్ 30.సీఆర్ పాటిల్ -
కేంద్ర కేబినెట్: మోదీ 3.0 మంత్రులు వీరే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు మరోసారి కేబినెట్ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్, జైశంకర్, పాత కేబినెట్లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లకు కేబినెట్లో చోటు దక్కింది.రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్ పవార్ ఎన్సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్‌దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్‌నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్ -
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శాఖల వారీగా శ్వేత పత్రం
-
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు..ఎవరికి ఏ శాఖ..?
-
కీలక పదవులు !..11 మంది కొత్త మంత్రులు వీళ్ళే
-
నేడు కర్ణాటక కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం
-
2024లో రిషి గెలుపు కష్టమే!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు ఆయన కేబినెట్లోని 15 మంది మంత్రులు 2024 ఎన్నికల్లో గెలవడం కష్టమేనని తాజా సర్వేలో తేలింది. ఈ మేరకు వివరాలను ది ఇండిపెండెంట్ వెల్లడించింది. రిషి, డిప్యూటీ పీఎం డొమినిక్ రాబ్, ఆరోగ్య మంత్రి స్టీవ్ బార్క్లేతో పాటు అధికార కన్జర్వేటివ్ పార్టీలోని సీనియర్ సభ్యులకు ఓటమి గండముందని ఒక్కో సీటుకు వేర్వేరుగా చేపట్టిన ఫోకల్‌డేటా పోలింగ్‌లో వెల్లడైంది. బెస్ట్ ఫర్ బ్రిటన్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. రిషి కేబినెట్లో జెరెమీ హంట్, సుయెల్లా బ్రేవర్మన్, మైకేల్ గోవ్, నదీమ్ జహావీ, కేమీ బడెనోక్ మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. రిషి కేబినెట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుందని ‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోమి స్మిత్ చెప్పారు. అయితే తమ సర్వేలో ఓటెవరికో చెప్పలేని వారు ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు కన్జర్వేటివ్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఫలితం వేరుగా ఉంటుందని తెలిపారు. -
అసెంబ్లీ స్పీకర్, ఇద్దరు మంత్రులకు నాన్ బెయిలబుల్ వారెంట్!
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర శాసనసభా స్పీకర్, ఇద్దరు మంత్రులు సహా మొత్తం 9 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. నాన్ బెయిలబుల్ వారెంట్ అందుకున్న వారిలో స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, కేబినెట్ మంత్రులు గుర్మీత్ సింగ్ మీట్ హేయర్, లల్జిత్ సింగ్ భుల్లార్ సహా పలువురు ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సరిహద్దు జిల్లాలైన అమృత్సర్, తరన్ తరన్‌లో కల్తీ మద్యం మరణాలకు వ్యతిరేకంగా 2020, ఆగస్టులో నిరసనలు చేపట్టారు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. దీనికి సంబంధించి పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ప్రస్తుత స్పీకర్, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కేసులో భాగంగా కోర్టుకు హాజరుకావాలని ఇటీవలే ఆదేశించింది న్యాయస్థానం. అయితే, వారు హాజరుకాకపోటంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. మరోవైపు.. కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్ఏ) అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు ఎక్సైజ్, టాక్సేషన్ శాఖ మంత్రి హర్పల్ సింగ్ చీమా. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి.. రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఈఎన్ఏ రవాణాను నియంత్రించాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ‘ఆప్ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’ -
యోగి సర్కారుపై అసమ్మతి స్వరం.. అమిత్‌షా వద్దకు పంచాయితీ!
Yogi Adityanath cabinet.. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బీజేపీ సర్కార్‌లో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయాలపై కాషాయ పార్టీ నేతలు, మంత్రులు గుర్రుగా ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివరాల ప్రకారం.. యూపీ జలశక్తి శాఖ సహాయ మంత్రి దినేష్ ఖటిక్ యోగి ప్రభుత్వం నుండి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే, పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా యోగి సర్కార్‌పై అసంతృప్తితో ఉన్నారని జాతీయ మీడియాతో కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా, అయితే తన ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD) అధికారి అనిల్‌కుమార్ పాండే బదిలీపై జితిన్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తపరిచినట్టు సమాచారం. కాగా, అనిల్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తన శాఖలో బదిలీలు, హస్తినాపురంలో తన మద్దతుదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల జలశక్తి సహాయ మంత్రి దినేష్ ఖటిక్.. సీఎం యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఖటిక్.. తన ప్రభుత్వ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి, వాహనాన్ని వదిలిపెట్టి హస్తినలోని తన వ్యక్తిగత నివాసానికి వెళ్లినట్లు సమాచారం. కాగా, మంగళవారం అర్థరాత్రి వరకు ఇద్దరు మంత్రుల ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండటం గమనార్హం. మరోవైపు.. యూపీలో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోం మంత్రితో జితిన్ ప్రసాద్ బుధవారం సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. PWD minister Jitin Prasada is also said to be upset with the government over the transfer of his OSD | @abhishek6164 #UttarPradesh https://t.co/PyDqzoVw6c — IndiaToday (@IndiaToday) July 20, 2022 ఇది కూడా చదవండి: తమిళనాడు మరో ట్విస్ట్.. పన్నీర్‌సెల్వానికి ఎదురుదెబ్బ -
Johnson Government: సంక్షోభంలో జాన్సన్ సర్కారు
లండన్: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న బోరిస్ జాన్సన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు మంగళవారం రాజీనామా చేశారు. భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో పాటు పాక్ మూలాలున్న ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం కలకలం రేపుతోంది. పార్టీ గేట్ మొదలుకుని పలు ఆరోపణలు, సమస్యలతో అల్లాడుతున్న జాన్సన్ ప్రభుత్వం తాజా పరిణామాలతో కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని నాయకత్వంపై నమ్మకం కోల్పోయామంటూ ఆయనకు రాసిన రాజీనామా లేఖల్లో మంత్రులిద్దరూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని ట్విట్టర్లో పెట్టారు. కొంతకాలంగా జాన్సన్ పనితీరు దారుణమంటూ లేఖలో సునక్ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వం సజావుగా, సమర్థంగా, సీరియస్‌గా పని చేయాలని ప్రజలు ఆశిస్తారు. ఆ ప్రమాణాలు లోపించాయి గనుకనే తప్పుకుంటున్నా’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘చాలా సందర్భాల్లో మీ వైఖరిని వ్యక్తిగతంగా ప్రశ్నించినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా అందరి ముందూ మాత్రం సమర్థించాను. కానీ మౌలికంగా మనిద్దరివీ వేర్వేరు దారులు. ఇలా కలిసి కొనసాగలేమన్న నిర్ధారణకు వచ్చా’’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రధాని నాయకత్వంలో పని చేసేందుకు తన అంతరాత్మ అంగీకరించడం లేదని సాజిద్ కూడా లేఖలో పేర్కొన్నారు. తానిక మళ్లీ మంత్రి చేపట్టకపోవచ్చని సునక్ చెప్పగా, జాతీయ ప్రయోజనాలను కన్జర్వేటివ్ పార్టీ సమర్థంగా కాపాడుతుందన్న ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయామంటూ సాజిద్ తన లేఖలో పదునైన విమర్శలు చేశారు. జాన్సన్ నేతృత్వంలో పరిస్థితులు మెరుగు పడే అవకాశాలు ఏ మాత్రమూ లేవని తేల్చేశారు. వారి రాజీనామాకు ముందు మంగళవారం రోజంతా భారీ పొలిటికల్ డ్రామా నడిచింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ ఎంపీ క్రిస్ పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్‌గా కీలక పదవిలో నియమించడం పొరపాటేనంటూ జాన్సన్ ప్రకటన చేశారు. అందుకు తీవ్రంగా చింతిస్తున్నట్టు చెప్పారు. ఆ వెంటనే జాన్సన్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలతో మంత్రుల రాజీనామా ప్రకటనలు వెలువడ్డాయి. కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో అధికార నివాసంలో మందు పార్టీ చేసుకున్నారన్న ఆరోపణలపై జాన్సన్ ఇప్పటికే పలుమార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం, క్షమాపణలు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా ఆయనకు మద్దతు నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. ఇటీవలి బలపరీక్షలో జాన్సన్ బొటాబొటిగా బయటపడ్డారు. -
సామాజిక న్యాయంలో ఓ విప్లవం!
ఆంధ్రప్రదేశ్‌లో పునర్ వ్యవస్థీకరించిన మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పించడం చరిత్రాత్మకం. ఇది అత్యంత ధైర్యసాహసాలతో కూడిన చర్య. ఇది దేశ చరిత్రలో తొలి రికార్డు. 74 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంతవరకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ వర్గాలకు 50 శాతం మించి ఇవ్వలేదు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ముఖ్యమంత్రులు అయిన రాష్ట్రాలలో కూడా 50 శాతం మంత్రి పదవులు ఇచ్చే ధైర్యం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వీరోచితంగా ఈ వర్గాలకు జనాభా ప్రాతిపదికన మంత్రివర్గంలో స్థానం కల్పించి, సామాజిక న్యాయానికి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో పునర్ వ్యవస్థీకరించిన 25 మంది మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మందికి అవకాశం కల్పించారు. ఇందులో బీసీలు 10 మంది, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీ, మైనారిటీల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ ఘట్టంతో బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ ఆప్తుడయ్యారు. దీని వలన బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఆయన పట్ల తిరుగులేని అభిమానం, మద్దతు పెరిగింది. ఇతర రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి తప్ప చిత్తశుద్ధితో ఈ వర్గాల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి పాటుపడలేదని బీసీలు గుర్తించారు. అందుకే మెజారిటీ ప్రజలైన బహుజనులలో రోజు రోజుకూ జగన్‌పై క్రేజ్ పెరుగుతోంది. గత ఎన్నికలలో 50 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ఈ దఫా 60 శాతం ఓట్లతో 170 సీట్లకు పైగా గెలుస్తుంది అనడంలో అనుమానం లేదు. మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాశారు. వైఎస్సార్సీపీ రెండు సంవత్సరాల క్రితం రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టింది. దీనికి మద్దతుగా 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. విశేషం ఏమిటంటే, గత 74 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో ఈ బిల్లు పెట్టలేదు. చివరకు పార్లమెంటులో బీసీ పార్టీలుగా చలామణీ అవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, అప్నాదళ్, జనతాదళ్ లాంటి పార్టీలు కూడా ఈ బిల్లు పెట్టలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలను వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పనులలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవులలో 53 బీసీ కులాలకు (39 శాతం) ఇచ్చారు. ఈ కార్పొరేషన్లలోని 484 డైరెక్టర్ పదవులలో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కలిపి 58 శాతం పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. అంతేగాక 56 బీసీ కులాల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్లలో పోస్టులు మొత్తం 100 శాతం బీసీలకు కేటాయిం చారు.193 కార్పొరేషన్లలో బీసీలకు 109 చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగింది. దీని మూలంగా బీసీ కులాల నాయకత్వం పెరిగింది. ఆ కులాలలో తరతరాలుగా పేరుకుపోయిన భావదాస్యం, బానిస ఆలోచనా విధానం పోయి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే, దానికి పార్టీ పరంగా అదనంగా మరో 20 శాతం చేర్చి మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు ఇచ్చారు జగన్. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్‌లను వైసీపీ గెలవగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగానూ వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ గెలిస్తే, ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 12 పదవులను అంటే 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలు అధికార పార్టీకి దక్కితే వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 73 శాతం ఇచ్చారు. ఇది ఇలా ఉండగా, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేద కులాలు పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య, వృత్తి విద్యల వరకు ఉచితంగా చదువుకోవాలనే మహత్తర ఆశయంతో అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థికీ 15 వేలు, కాలేజీ కోర్సులు చదివే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రతి కాలేజీ విద్యార్థికి సంవత్సరానికి 20 వేల స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఈ పథకాల వలన కూలీ నాలీ చేసుకొనేవారు ఉన్నత విద్య చదివే అవకాశం లభించింది. దీని వల్ల సమాజంలో సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేటాయించని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీల అభివృద్ధికి 30 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆశ్చర్యపరిచారు. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలకు రూ.1,460 కోట్లు కేటాయిస్తే లోటు బడ్జెట్‌తో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీసీల సంక్షేమానికి రూ.30వేల కోట్లు కేటాయించడం చూసి దేశంలోని బీసీలందరూ ఆశ్చర్యపోయారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా బీసీలకు రూ.6 వేల కోట్లకు మించి కేటాయించలేదు. అలాగే బీసీ కులాలు అభివృద్ధి చెందడానికి ‘బీసీ సబ్ ప్లాన్’ ఏర్పాటుచేసి, అన్ని కులాల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చారు. బలహీన వర్గాలను పరిశ్రమల అధిపతులుగా చేయాలని, పెద్ద కాంట్రాక్టర్లుగా చేయాలనే చిత్తశుద్ధితో పారిశ్రామిక పాలసీ రూపొందించారు. రాష్ట్రంలో 196 మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 బీసీలకు ఇచ్చారు. 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే, అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే! వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో నాలుగు స్థానాలు దక్కితే, అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. మన దేశంలో మంత్రి పదవి, చైర్మన్ పదవి, ఇతర రాజకీయ పదవులు అంటే ఒక హోదా, ఒక సామాజిక గౌరవం అని ప్రజలు నమ్ముతారు. ఈ హోదాను, పదవిని, అధికారాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందించడానికే రిజర్వేషన్లు లేదా కోటా ఇవ్వాలి. తద్వారా దేశ పరిపాలనలో తాము కూడా భాగం అవుతున్నామన్న అభిప్రాయం ఈ వర్గాల్లో కలుగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేనో, మంత్రో, చైర్మనో అయితే ఆ జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఆ కులస్థులు ‘మావాడు మంత్రి అయ్యాడు, చైర్మన్ అయ్యా’డనే భావంతో ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ భావన జాతి ఐక్యతకు, దేశ సమగ్రతకు ఉపయోగపడుతుంది. బలమైన సామాజిక, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కావాలంటే పటిష్ఠమైన, సమగ్రమైన రాజకీయ వ్యవస్థ ఉండాలి. భారతదేశంలో పటిష్ఠ మైన వ్యవస్థ నిర్మాణాన్ని కుల వివక్ష దెబ్బ కొడుతోంది. జాతి పరస్పరం సంఘర్షించుకొని వేలాది కులాలుగా చీలిపోయింది. ఇది జాతి ఐక్యత, సామాజిక సామరస్యం, మానవ వికాసానికి అవరోధంగా తయారైంది. సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో ఈ కుల వివక్ష తొలగాలంటే అన్ని రంగాలలో ముఖ్యంగా విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగం, పాలన రంగంలో ఈ కులాలకు ప్రాతినిధ్యం కల్పించడం చారిత్రక అవసరం. దేశంలో 56 శాతం జనాభా గల బీసీ కులాలను అభివృద్ధి చేయకుండా భారత్ అగ్రదేశంగా రూపొందదు. ఈ చారిత్రక అన్యాయాన్ని గుర్తించి వై.ఎస్.జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. - ఆర్. కృష్ణయ్య ధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం. మొబైల్: 90000 09164 . -
తండ్రి, తనయుడి కేబినెట్లలో ఆ నలుగురు..
సాక్షి, అమరావతి: ఇక తండ్రీ, తనయుల మంత్రివర్గాల్లో చోటు దక్కించుకుని, పనిచేయడం అరుదు. తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్‌లు పనిచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలోనూ ఈ నలుగురు స్థానం దక్కించుకుని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే, వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీశాఖ, ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖలు దక్కించుకున్నారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మంత్రివర్గంలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్, గనులు భూగర్భవనరులతోపాటు అటవీశాఖను దక్కించుకోగా... ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు. తండ్రీ, తనయుల మంత్రివర్గంలో ఒకే శాఖను దక్కించుకున్న మరో అరుదైన రికార్డును కూడా వీరు సొంతం చేసుకున్నారు. ఇక సోమవారం ప్రమాణస్వీకారం చేసిన 25 మందిలో 13 మంది తొలిసారి మంత్రులయ్యారు. చదవండి: (శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం) -
సీదిరి అప్పలరాజు అనే నేను..
-
మళ్లీ అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్ కు రుణపడి ఉంటా
-
Chandrababu: బాబు మాటలన్నీ చిలక పలుకులే..
సాక్షి, అమరావతి: ఒడ్డు దాటే వరకే ఓడ మల్లన్న.. ఆ తరువాత బోడి మల్లన్న అనే సామెత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహార శైలికి అతికినట్లుగా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీకి బీసీలే వెన్నెముక.. వారు లేనిదే పార్టీ లేదని ఆయన పలికే చిలుక పలుకులన్నీ కేవలం బలహీన వర్గాల ఓట్లతో అందలం ఎక్కడానికేనని అధికారంలో ఉండగా పలుమార్లు రుజువు చేసుకున్నారు. ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా? అని తూలనాడి ఆ సామాజిక వర్గాన్ని అవమానించారు. తాత్కాలిక సచివాలయంలో నాడు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తా, తోలు తీస్తానంటూ వేలు చూపించి బెదిరించారు. పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించకుండా అణగదొక్కి సామాజిక న్యాయాన్ని అపహాస్యం చేశారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలో 58 శాతం మంది అగ్రవర్ణాల వారే ఉండటం గమనార్హం. తరువాత మంత్రివర్గ విస్తరణలో ఓసీల ప్రాతినిథ్యం మరింత పెరిగింది. మరోవైపు ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ఓట్ల కోసం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కిడారి శ్రావణ్ కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని ఎమ్మెల్యే /ఎమ్మెల్సీని చేయకుండా తన కపట వైఖరిని మరోసారి ప్రదర్శించారు. ఇక మైనార్టీల పట్ల దారుణంగా వ్యవహరించారు. నాడు మంత్రివర్గం నుంచి బీజేపీ వైదొలగిన తరువాతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ముంచుకొస్తున్న ఎన్నికల భయంతో ఎస్టీ, మైనార్టీలకు అవకాశమిచ్చారు. అదే నారా లోకేష్‌ను మంత్రిని చేసేందుకు ఆగమేఘాలపై ఎమ్మెల్సీగా చేసి ఎస్సీ మంత్రులను తొలగించి మరీ అవకాశమివ్వడం గమనార్హం. ఓసీ, బీసీల నుంచి ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులుగా చంద్రబాబు అవకాశం కల్పించినా వీరిలో ఒక్క మహిళ కూడా లేరని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు 1999లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా 42 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలోనూ 26 మంది అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. అంటే 62 శాతం మంది ఓసీలకు ఆయన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అప్పటి నుంచి సామాజిక న్యాయంపై ఆయన ఇదే ఫార్ములాను పాటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చదవండి: (సామాజిక మహా విప్లవం) ఆది నుంచే సామాజిక అన్యాయం.. రాష్ట్ర విభజన అనంతరం బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన టీడీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకుంది. 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అదే రోజు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 11 మంది అగ్రవర్ణాలకు, ఇద్దరు ఎస్సీలకు, ఆరుగురు బీసీలకు స్థానం కల్పించారు. గిరిజనులకు, మైనార్టీలకు స్థానం కల్పించలేదు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారు. దామాషా ప్రకారం బీసీలకు దక్కాల్సిన పదవుల కంటే అతి తక్కువగా ఆరు మాత్రమే కేటాయించారు. తనయుడి కోసం చట్టం అపహాస్యం.. నారా లోకేష్‌ను హడావుడిగా ఎమ్మెల్సీని చేసిన చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు 2017 ఏప్రిల్ 2న మొదటిసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టగా బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో 2018 నవంబర్ 11న రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. లోకేష్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ఇద్దరు ఎస్సీ మంత్రులు పీతల సుజాత, రావెల కిశోర్‌బాబులపై వేటు వేశారు. ఓసీలైన పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు బీసీ మహిళ కిమిడి మృణాళినిని మంత్రివర్గం నుంచి తప్పించారు. వారి స్థానంలో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకుని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచారు. 25 మంది ఉన్న మంత్రివర్గంలో చంద్రబాబు ఏకంగా ఓసీ వర్గాలకు చెందిన 15 మందికి స్థానం కల్పించడం గమనార్హం. బీసీల నుంచి ఎనిమిది మందికి, ఎస్సీల నుంచి ఇద్దరికి మాత్రమే చోటిచ్చి సామాజిక న్యాయాన్ని నవ్వుల పాలు చేశారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) గిరిజనులు, మైనార్టీలపై కపట ప్రేమ ఆ తరువాత రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఇద్దరు బీజేపీ మంత్రులు వైదొలగడంతో ఎన్నికలకు నాలుగు నెలల ముందు కేవలం ఓట్ల కోసం మైనార్టీ, గిరిజన వర్గాలకు స్థానం కల్పిస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు(ఎస్టీ)ను మావోయిస్టులు హత్య చేయడంతో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే/ఎమ్మెల్సీని చేయకుండా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2018 నవంబర్ 11న రెండోసారి విస్తరించాక 25 మందితో మంత్రివర్గం ఏర్పడింది. ఇందులో అగ్రవర్ణాల నుంచి 13 మంది (52 శాతం), బీసీల నుంచి ఎనిమిది మంది (32 శాతం), ఎస్సీల నుంచి ఇద్దరు (ఎనిమిది శాతం) ఎస్టీల నుంచి ఒకరు(నాలుగు శాతం), మైనార్టీల నుంచి ఒకరికి (నాలుగు శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు ద్రోహం చేసి సామాజిక న్యాయంపై చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. పెద్దల సభకు ఒక్కర్నీ పంపలేదు.. టీడీపీ అధికారంలో ఉండగా అగ్రవర్ణాలకు చెందిన వారినే రాజ్యసభ సభ్యులుగా చంద్రబాబు ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఏ ఒక్కరినీ రాజ్యసభకు పంపకుండా ఆయా సామాజిక వర్గాలపై తీవ్ర వివక్ష ప్రదర్శించారు. మహిళలపై చిన్నచూపు.. మహిళా సాధికారతపై అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే చంద్రబాబు పరిపాలనలో వారికి అన్యాయమే జరిగింది. 2014 జూన్ 8న తొలుత ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు (ఓసీ, బీసీ, ఎస్సీల నుంచి ఒక్కొక్కరు) స్థానం కల్పించగా మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ వర్గానికి పీతల సుజాతపై వేటు వేశారు. 2017 ఏప్రిల్ 2న తొలిసారి మంత్రివర్గ విస్తరణ ఇన్: 1.నారా లోకేష్ (ఓసీ) 2.పితాని సత్యనారాయణ (బీసీ) 3.కిమిడి కళా వెంకట్రావు (బీసీ) 4.కొత్తపల్లి శామ్యూల్ జవహర్ (ఎస్సీ) 5.సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (ఓసీ) 6.నక్కా ఆనందబాబు (ఎస్సీ) 7.కాల్వ శ్రీనివాసులు (బీసీ) 8.ఎన్.అమర్నాథ్రెడ్డి (ఓసీ) 9.ఆర్వీ సుజయ కృష్ణరంగారావు (ఓసీ) 10.భూమా అఖిలప్రియ (ఓసీ) 11.సి.ఆదినారాయణరెడ్డి (ఓసీ) ఔట్: 1.పల్లె రఘునాథరెడ్డి (ఓసీ) 2.బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (ఓసీ) 3.కిమిడి మృణాళిని (బీసీ) 4.పీతల సుజాత (ఎస్సీ) 5.రావెల కిశోర్‌బాబు (ఎస్సీ) 2018 నవంబర్ 11న రెండోసారి మంత్రివర్గ విస్తరణ ఇన్ 1.మహ్మద్ ఫరూఖ్ (మైనార్టీ) 2.కిడారి శ్రావణ్ కుమార్ (ఎస్టీ) ఔట్ (రాజీనామాలు) 1.కామినేని శ్రీనివాస్ (ఓసీ) 2.పైడికొండల మాణిక్యాలరావు (ఓసీ) -
పడిన ప్రతిసారి అంతే వేగంగా నిలబడ్డాడు.. ప్రతిఫలంగా నేడు..
సాక్షి, అమరావతి: సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అంబటి రాంబాబు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పడిన ప్రతీసారి అంతకంటే వేగంగా లేచి నిలబడడం అంబటి నైజం. అనర్గళంగా మాట్లాడడం అంబటికి ఉన్న వరం. ఎంతటి కఠిన విషయమైనా సరే, విడమరిచి చెప్పడం ఆయన ప్రత్యేకత. విపక్షంపై ఎదురుదాడి చేయాలంటే అంబటి తర్వాతే ఎవరైనా. వ్యక్తిగతంగా అంబటిని లక్ష్యంగా చేసుకుని ఎన్ని దాడులు వచ్చినా.. కఠినంగా వాటిని తట్టుకుని నిలబడ్డారు అంబటి. తనకు అప్పగించిన ఏ బాధ్యతనయినా నూటికి నూరు శాతం నెరవేర్చడంలో పరిపాటి అంటారు అంబటి గురించి తెలిసిన వాళ్లు. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా అంబటి బలమైన గళం వినిపించారు. గుంటూరు జిల్లా, రేపల్లెలో ఏవీ ఎస్ఆర్ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ దంపతులకు అంబటి రాంబాబు జన్మించారు. ఆయన విశాఖపట్నంలోని న్యాయ విద్య పరిషత్ లా కాలేజీ నుంచి 1986లో లా డిగ్రీ పూర్తి చేశారు. చదవండి: (AP New Cabinet: ఆ అంశాలే కాకాణికి కలిసొచ్చాయి..) రాజకీయ జీవితం 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా చేశారు. 1989లో రేపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లోనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో సత్తెనపల్లినుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా.. టీడీపీ అభ్యర్థి, అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై 20,876 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎన్నికల సమయానికి సత్తెనపల్లి వీఐపీ నియోజకవర్గం. ఈ సెగ్మెంట్లో సతైనపల్లి పట్టణంతో పాటు, సత్తెనపల్లి రూరల్ మండలం, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, మండలాలు సత్తెనపల్లిలో ఉన్నాయి. కోడెలపై విజయం తర్వాత విపక్షం అంబటిని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో టార్గెట్ చేసినా.. వాటికి ఎదురొడ్డి అసత్య ప్రచారాన్ని తిప్పగొడుతూ నిలబడ్డారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) -
‘సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం’
సాక్షి,అమరావతి: తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తానని, జిల్లా అభివృద్ధితో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శ్రమిస్తానని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవిని అందించిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు గెలిపించి తనని మంత్రిని చేశారని, వారందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే డా.సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. తనను కేబినెట్లో కొనసాగిస్తూ అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. గతంలో మంత్రిగా తన పనితీరును గుర్తించి ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. తనతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావుకు కేబినెట్లో స్థానం కల్పించారు. తమ ప్రాంత ప్రజలపై సీఎంకు ఉన్న ప్రత్యేకమైన అభిమానం, ప్రేమకు ఇదే నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. మంత్రి పదవి రావడం చాలా ఆనందంగా ఉందని, వైఎస్సార్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. ప్రొఫెసర్‌గా చేస్తున్న తనకి ఆనాడు దివంగత సీఎం వైఎస్సార్ అవకాశమివ్వగా, ఈ రోజు ఆయన తనయుడు తనని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా అవకాశమిచ్చారన్నారు. ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి దయ వల్లే మళ్ళీ మంత్రి పదవి వస్తోంది.. ఆయనకు తాను ఎప్పుడూ విధేయుడినేనని తెలిపారు. నాటి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయింపు నుంచి మంత్రి పదవులు కేటాయింపు వరకు సీఎం జగన్‌కు ఋణపడి ఉంటానన్నారు. కాగా రెండవసారి మంత్రి పదవి అంజాద్ బాషాకు వరించడంతో ఆయన ఇంటి వద్ద సంబరాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.. కేబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు. గతంలో బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు గానే చూశారని, సీఎం జగన్ బీసీలను బ్యాక్ బోన్ క్లాస్‌గా గుర్తించారని కొనియాడారు. -
కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
ఈ కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ మంచివాళ్ళే
-
మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు
-
రాజీనామా చేసిన మంత్రులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. 'మీరు సమర్థులు, అనుభవం ఉన్నవారు కాబట్టే ఆరోజు మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకున్నాను. ఇవాళ కూడా మీకున్న అనుభవాన్ని, సమర్థతను పార్టీకి వినియోగించుకోవాలన్నది నా ఆలోచన. మంత్రులుగా మీలో కొందర్ని తొలగించి, కొందర్ని కొనసాగిస్తున్నంతమాత్రాన ఎవ్వరినీ తక్కువ చేసినట్టుకాదు. మంత్రులుగా కన్నా, పార్టీకి సేవచేయడాన్ని, పార్టీకి పనిచేయడాన్ని నేను గొప్పగా భావిస్తాను. పార్టీ కోసం పనిచేసేవారినే గొప్పగా చూస్తాను. 2024 ఎన్నికల్లో మీరు గెలిపించుకు రండి.. మీరు మళ్లీ ఇవే స్థానాల్లో కూర్చుంటారు. 2024 ఎన్నికలు కూడా మనకు అత్యంత కీలకం. 2019లో మనమీద ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు మనల్ని గెలిపించారు. వారి ఆశలు నెరవేర్చేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్నిరకాలుగా ప్రజలకు తోడుగా నిలిచాం. వారి అభిమానాన్ని సంపాదించుకున్నాం. చరిత్రలో ఏ ప్రభుత్వం చూపని గొప్ప పనితీరుతో మళ్లీ మనం ప్రజల దగ్గరకు వెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో 2019లో మనకు 151 సీట్లు వచ్చినట్టుగా ఎందుకు రావు? కచ్చితంగా వస్తాయనే నేను విశ్వాసంతో ఉన్నాను. ఈ ప్రక్రియలో మీరు భాగస్వాములు కావడం చాలా గొప్ప విషయం. గడపగడపకూ వెళ్లగలిగినప్పుడు, ప్రజల మధ్య ఉన్నప్పుడు మరింత ఎదుగుతామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజల్లో ఉండి పార్టీకోసం పనిచేయడాన్ని నేను గొప్పగా భావిస్తాను కూడా. మంత్రులుగా మీరంతా చాలా చక్కగా పనిచేశారని' ప్రస్తుత మంత్రులతో నిర్వహించిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ అన్నారు చదవండి: (ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. రాజీనామా చేసిన మంత్రులు) కాగా, మూడేళ్లపాటు ప్రభుత్వంలో మా బాధ్యతలను మేం నిర్వహించామని మంత్రులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని మంత్రులు తెలియజేశారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. పార్టీని పటిష్టం చేస్తామని మంత్రులు సీఎం జగన్‌తో అన్నారు. చదవండి: (Perni Nani: మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందు) -
మరో మలుపు తిరిగిన శ్రీలంక సంక్షోభం..
-
పంజాబ్‌లో కొలువు దీరిన ఆప్ సర్కార్.. కేబినెట్ మంత్రులు వీరే..
చంఢీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కార్ కొలువుదీరిసింది. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మంత్రివర్గంలో 10 మందిని తీసుకోగా.. ఒకే ఒక్క మహిళకు ప్రస్తుతం చోటు లభించింది. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈరోజు కొత్తగా ఏర్పడిన కేబినెట్‌తో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. హర్పాల్ సింగ్ చీమా, డాక్టర్ బల్జీత్ కౌర్, హర్బజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మిత్ సింగ్, కుల్దీప్ సింగ్ ధలివాల్, లల్జిత్ సింగ్ భుల్లార్, బ్రామ్ శంకర్(జింపా), హర్జోత్ సింగ్ బెయిన్స్లు ఉన్నారు. కొత్త కేబినెట్లో హర్జోత్ సింగ్ బెయిన్స్ అత్యంత యువ మంత్రి కావడం విశేషం. చదవండి: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు! ਅੱਜ ਪੰਜਾਬ ਦੇ ਨਵੇਂ ਮੰਤਰੀ ਮੰਡਲ ਨੇ ਸਹੁੰ ਚੁੱਕੀ ਅਤੇ ਨਾਲ਼ ਹੀ ਲੋਕਾਂ ਦੀਆਂ ਉਮੀਦਾਂ ਨੂੰ ਪੂਰਾ ਕਰਨ ਦਾ ਵੀ ਪ੍ਰਣ ਲਿਆ। ਸਾਰੇ ਨਵੇਂ ਮੰਤਰੀਆਂ ਨੂੰ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ। ਸਾਨੂੰ ਮਿਲ਼ ਕੇ ਪੰਜਾਬ ਦੇ 3 ਕਰੋੜ ਲੋਕਾਂ ਲਈ ਪੂਰੀ ਇਮਾਨਦਾਰੀ ਨਾਲ਼ ਕੰਮ ਕਰਨਾ ਹੈ, ਪੰਜਾਬ ਨੂੰ ਫ਼ਿਰ ਤੋਂ ਸੁਨਿਹਰਾ ਬਣਾਉਣਾ ਹੈ। pic.twitter.com/PFYVTvUwZT — Bhagwant Mann (@BhagwantMann) March 19, 2022 కాగా శుక్రవారం ట్విట్టర్ ద్వారా తన మంత్రుల జాబితాను ప్రకటించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వారికి అభినందనలు తెలిపారు అలాగే పంజాబ్ ప్రజలకు నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడానికి మంత్రులు కష్టపడి పనిచేయాలని సూచించారు. చదవండి: పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం.. ఇంతలోనే వివాదంలో సీఎం భగవంత్ మాన్..! ఇక ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు వైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కాకుండా పంజాబ్‌లో తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ విప్లవవీరుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖాట్కర్ కలాన్‌లో ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. -
పదవి రాని వారితో పాటు వచ్చిన వారూ పేచీ: సీఎంకు తలనొప్పి
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు రోజురోజుకూ అసమ్మతుల బెడద పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మంత్రి పదవులు రానివారితో పాటు, వచ్చినవారు కూడా శాఖ బాగాలేదని పేచీలందుకున్నారు. మొదట గళమెత్తిన పర్యాటక మంత్రి ఆనంద్‌సింగ్ తన శాఖను మార్చకపోతే మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. అసంతృప్తి బాటలో ఇంకొందరు.. బి.శ్రీరాములు, ఎంటీబీ నాగరాజు కూడా శాఖలపై అసంతృప్తితో ఉన్నారు. ఇంధన శాఖపై ఆశ పెట్టుకున్న ఆనందసింగ్‌కు పర్యాటక శాఖను, హోంశాఖ ఆశించిన ఎంటీబీ నాగరాజుకు పరిపాలన శాఖ ఇచ్చారు. ప్రజాపనుల శాఖ కావాలన్న బి.శ్రీరాములుకు రవాణా శాఖ ఇవ్వడంతో కినుక వహించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ రాలేదని మంత్రులు వి.సోమణ్ణ, ఆర్.అశోక్‌లలోనూ అసంతృప్తి గూడుకట్టుకుంది. వారిని చల్లార్చడానికి శాఖలను మార్చే అవకాశం లేకపోలేదు. ఆనందసింగ్‌తో మాట్లాడుతా: సీఎం మంత్రి ఆనంద్‌సింగ్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని సీఎం బొమ్మై తెలిపారు. త్వరలోనే అన్నీ సద్దుమణుగుతాయని బుధవారం అన్నారు. ఆనంద్‌సింగ్ రాజీనామా చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మంత్రి ఆఫీసుపై బోర్డు తొలగింపు.. హొసపేటె: మంత్రి ఆనంద్‌సింగ్‌కు హొసపేటెలోని రాణిపేటలో ఉన్న ఆఫీసుకు మంగళవారం రాత్రి ఆకస్మికంగా తాళం వేశారు. ఆఫీసు ముందు ఉన్న బోర్డును కూడా జేసీబీతో తొలగించారు. పర్యాటకశాఖ ఇష్టం లేక ఇలా చేశారా అని నగరంలో చర్చనీయాంశమైంది. చదవండి: వాహనదారులకు తీపి కబురు -
12 మందికి ఉద్వాసన..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కీలక శాఖలు చేపట్టిన వారిలో ఏకంగా ఆరుగురు కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు ఆరుగురు సహాయమంత్రులు సైతం బుధవారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు రాజీనామాలు సమర్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 12మంది కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. కేంద్ర మంత్రుల రాజీనామాల వెనుక వారి వయస్సు, కరోనా సమయంలో శాఖల పనితీరు, బెంగాల్ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిíపించింది. ఇందులో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిగా ఉన్న తావర్‌చంద్ గెహ్లాట్‌ను వయస్సు రీత్యా మంత్రివర్గం నుంచి తప్పించి కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. ఈయనతోపాటు విద్య, వైద్య, పర్యావరణ శాఖలకు చెందిన కేబినెట్ మంత్రితో పాటు సహాయమంత్రులను సైతం పక్కనబెట్టేశారు. కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలోని ఆరోగ్య సేవల పేలవమైన పరిస్థితి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఉద్వాసనకు దారితీసింది. అదే శాఖలోని సహాయమంత్రి అశ్విని చౌబేపై వేటు పడింది. బెంగాల్లో బీజేపీ ఓటమి ప్రభావంతో ఇద్దరు బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో, దేబోశ్రీ చౌదరిలపై వేటు పడింది. వీరితో పాటు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ, కేంద్ర న్యాయ, ఐటీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కార్మిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) సంతోష్ కుమార్ గంగ్వార్లకు ఉద్వాసన పలికారు. వీరితోపాటు సంజయ్ ధోత్రే, రతన్‌లాల్ కటారియా, ప్రతాప్ సారంగీ తమ పదవులకు రాజీనామా చేశారు. కరోనా కారణంగా హర్షవర్ధన్ ఉద్వాసన కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు కుప్పకూలి పోయిన కారణంగా వై ద్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ హర్షవర్థన్‌పై వేటు పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మోదీ ప్రభుత్వం పైపెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ కారణంగా హర్షవర్ధన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించారు. అటువంటి పరిస్థితిలో హర్షవర్థన్ రాజీనామాతో 2 కీలక శాఖలు ఖాళీ అయ్యాయి. అనారోగ్య కారణాలతో పోఖ్రియాల్ ఔట్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమేష్ పోఖ్రియాల్ కేంద్ర విద్యాశాఖ బాధ్యతలకు రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణాలతో నిశాంక్‌ను తొలగించినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారినపడి ఒక నెల పాటు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలో దేశంలో విద్యారంగంలో పరిస్థితి ఘోరంగా దిగజారిందనే విమర్శలు వచ్చాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల ఒత్తిడి నేపథ్యంలో సీబీఎస్ఈపై నిర్ణయం తీసుకొనే విషయంలో ప్రధాని మోదీ స్వయంగా ముందుకు రావలసి వచ్చింది. ప్రధాని మోదీ ఎంతో కీలకంగా భావించే జాతీయ విద్యావిధానం అమలులో మంత్రిగా చొరవ చూపలేదన్నది కూడా పదవి కోల్పోవడానికి కారణమని తెలిసింది. బెంగాల్ ఎన్నికల కారణంగా.. పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ బాబుల్ సుప్రియో కేంద్ర పర్యావరణ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఆయనను బాధ్యుడిగా చేసిన కారణంగా పార్టీపై సుప్రియో ఆగ్రహంగా ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. సుమారు 50వేల ఓట్ల తేడాతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మోడీ ప్రభుత్వ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న తావర్‌చంద్ గెహ్లాట్ తన వయస్సు రీత్యా పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. అయితే, ఆయనను కర్ణాటక గవర్నర్‌గా చేయడం ద్వారా క్రియాశీల రాజకీయాల నుంచి గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చారు. 3 శాఖలపై కరోనా తీవ్ర ప్రభావం ► ఆరోగ్య శాఖ: సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవటంలో, నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఇద్దరు మంత్రులను తొలగించారు. ► విద్యా శాఖ: నూతన జాతీయ విద్యావిధానాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ రాలేదు. దీంతో ఇద్దరు మంత్రులను తొలగించారు. ► కార్మిక శాఖ: కార్మికుల వలస, సుప్రీంకోర్టు మందలించడం, అసంఘటిత రంగ కార్మికుల కోసం పోర్టల్‌ను సృష్టించలేకపోవడం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై మంత్రి రాసిన లేఖ వైరల్ కారణంగా మంత్రిపై వేటు. -
Puducherry: 40 ఏళ్లకు మహిళా మంత్రి
పుదుచ్చేరిలో 40 ఏళ్ల అనంతరం ఓ మహిళ మంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ ఛాన్స్ కారైక్కాల్ నెడుంగాడు నుంచి గెలిచిన చంద్ర ప్రియాంకకు దక్కింది. మంత్రి వర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుంది. సాక్షి, చెన్నై : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ఎట్టకేలకు 52 రోజుల తర్వాత మంత్రి వర్గం జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. జాబితాను ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు. ఇందుకు కేంద్ర హోం శాఖ, రాష్ట్రపతి భవన్ ఆమోద ముద్ర వేశాయి. ఆదివారం సాయంత్రం 3 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం రాజ్ నివాస్‌లో జరగనుంది. బీజేపీకి చెందిన నమశ్శివాయం, సాయి శరవణన్ కుమార్, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మినారాయణన్, తేని జయకుమార్‌కు మంత్రి పదవులు దక్కాయి. 40 ఏళ్ల తర్వాత మహిళకు అవకాశం పుదుచ్చేరి మంత్రి వర్గంలో 40 ఏళ్ల అనంతరం ఓ మహిళకు చోటు దక్కింది. 1980– 1983లో కాంగ్రెస్– డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుకఅప్పాదురై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మహిళలకు మంత్రి పదవులు దక్కలేదు. తాజాగా రంగన్న కేబినెట్లో కారైక్కాల్ ప్రాంతీయం నుంచి నెడుంగాడు రిజర్వుడు స్థానంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన చంద్రప్రియాంకకు మంత్రి పదవి దక్కింది. పదిహేను నిమిషాల్లో ప్రమాణ స్వీకారం ముగిసేలా రాజ్ నివాస్‌లో ఏర్పాట్లు జరిగాయి. వంద మందికి మాత్రమే అనుమతిచ్చారు. మాజీ మంత్రి, ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రాజవేలుకు పదవి దక్కని దృష్ట్యా ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే బీజేపీ నేత, ఎమ్మెల్యే జాన్‌కుమార్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చదవండి: మిషన్ 2022పై కమలదళం కసరత్తు -
'నా మంత్రివర్గంలో ఇద్దరికి కరోనా సోకింది'
పుదుచ్చేరి : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సీనీ పలువురు సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, వ్యవసాయ శాఖ కైలాష్ చౌదరితో సహా పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకింది. తాజాగా పుదుచ్ఛేరి మంత్రివర్గంలోనూ కరోనా కలకలం రేగింది. తన క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులు కందసామి, కమలకన్నన్ లకు కరోనా సోకిందని ముఖ్యమంత్రి వీ నారాయణ సామి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. కరోనా భారిన పడిన మంత్రులతో సన్నిహితంగా మెలిగిన వారందరూ క్వారంటైన్‌కి వెళ్లాల్సిందిగా సీఎం కోరారు. మంత్రులిద్దరూ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 53,601 పాజిటివ్ కేసులు నమోదుకాగా 871 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. (దేశంలో మరో 53,601 కరోనా కేసులు) Two of my ministers in the Cabinet, Kandasamy and Kamalakannan tested positive for COVID-19. I appeal to people moved with them to go for testing: Puducherry Chief Minister, V Narayanasamy pic.twitter.com/25G8YFJUt6 — ANI (@ANI) August 11, 2020 -
మానవత్వంతో కరోనాను అధిగమిస్తాం: ప్రధాని
న్యూఢిల్లీ: కరోనా ముప్పును మానవత్వాన్ని ప్రదర్శించడం ద్వారా అధిగమిస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశానికే తాళాలు వేసుకున్న ఈ పరిస్థితుల్లో నిరుపేదలకు సాయం చేయడంలో కేంద్ర మంత్రులు శక్తివంచన లేకుండా చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ‘కోవిడ్‌పై ప్రపంచం కలసికట్టుగా పోరాడుతోంది. మానవత్వంతో ఈ విపత్తు నుంచి బయటపడతాం’ అని మోదీ ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న భారతీయులు కరోనాపై పోరాటానికి సంఘీభావంగా వెయ్యి మీటర్ల భారత త్రివర్ణ పతాకాన్ని జెర్మట్లో ఎగురవేశారు. ఈ విషయాన్ని అక్కడి భారత ఎంబసీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌ని మోదీ రీ ట్వీట్ చేస్తూ కోవిడ్‌పై పోరాటంలో భాగస్వాములైన వారందరినీ అభినందించారు. ప్రత్యేకంగా కేంద్ర కేబినెట్లో మంత్రులు చేస్తున్న కృషిని కొనియాడారు. -
16న కేజ్రీవాల్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా 16న ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్‌తోపాటు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరూ లాంఛనప్రాయంగా కేజ్రీవాల్‌ను ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. భారీగా జన సమీకరణ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆప్ సన్నాహాలు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఒకప్పుడు అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఆయనకు కుడిభుజంగా పని చేసి దేశ ప్రజలందరి దృష్టిని కేజ్రీవాల్ ఆకర్షించారు. కేబినెట్లో పాత ముఖాలే ? గత ప్రభుత్వంలో పనిచేసిన వారికే మళ్లీ కేజ్రీవాల్ కేబినెట్లో అవకాశం ఇవ్వనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎలాంటి మార్పులు చేయకపోవచ్చునని తెలుస్తోంది. మనీశ్ సిసోడియా, రాజేంద్ర పాల్ గౌతమ్, సత్యేంద్ర జైన్, కైలాస్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌లు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకోనున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి, ఆప్ విద్యా రంగ సంస్కరణల్లో భాగస్వామిగా నిలిచిన ఆప్ నాయకురాలు అతిషి మర్లేనా, పార్టీకి కొత్త శక్తిగా మారిన రాఘవ్ చద్దాకు ఆర్థిక శాఖ కట్టబెడతారన్న ప్రచారమూ సాగింది. -
ఇది కోటీశ్వరుల మంత్రిమండలి!
సాక్షి ముంబై : మహారాష్ట్రలో నూతనంగా ఏర్పాటైన మహావికాస్ ఆఘాడి మంత్రి మండలిలోని 42 మంది మంత్రులలో 41 మంత్రులు కోటీశ్వరులే ఉన్నారు. తొలిసారిగా పోటీ చేసిన సహాయక మంత్రి అదితి తట్కరే మాత్రం లక్షాధికారిగానే నిలవడం గమనార్హం. ఆమె మినహా మిగతా 41 మంది మంత్రుల సగటు వార్షిక ఆదాయం రూ. 21.9 కోట్లు ఉందని సమాచారం. ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్’ అనే సంస్థ మహారాష్ట్రలోని మంత్రుల ఆస్తులతోపాటు నేరచరిత్రకు సంబంధించిన వివరాలు ఇతర వివరాలను వెల్లడించింది. ఎన్నికల సమయంలో నామినేషన్లను ప్రకటించిన వివరాల మేరకు ఈ సంస్థ ఓ రిపోర్టును వెల్లడించింది. ఈ సంస్థ వివరాల మేరకు 42 మంది మంత్రులలో కాంగ్రెస్‌కు చెందిన విశ్వజీత్ కదం అత్యధిక సంపన్నుడిగా తెలిసింది. ఆయన ఆస్తులు రూ. 216 కోట్లు కావడం విశేషం. 2014లో రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి మండలిలోకంటే ఈ సారి మంత్రి మండలిలో 82 శాతం మంత్రులు కోటీశ్వరులున్నారు. వీరిలో ముగ్గురు అత్యధికంగా తమ ఆస్తులను ప్రకటించినవారిలో ఉన్నారు. విశ్వజీత్ కదం రూ. 216 కోట్లు, అనంతరం ద్వితీయ స్థానంలో ఎన్సీపీ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ రూ. 75 కోట్లు, ఆతర్వాత ఎన్సీపీ నేత రాజేష్ టోపే రూ. 53 కోట్లతో తృతీయ స్థానంలో ఉన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కోటీశ్వరుడా లేదా అనేది తెలియరాలేదు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆయన ఆస్తుల వివరాలు తెలియరాలేదు. అదేవిధంగా తొలిసారిగా పోటీ చేసిన ఎన్సీపీ నేత సునీల్ తట్కరే కూతురు అదితి తట్కరే ఆస్తులు మాత్రం రూ. 39 లక్షలున్నాయని ప్రకటించారు. వార్షిక ఆదాయంలో అజిత్ ప్రథమం.. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి మండలిలోని 42 మంది మంత్రులలో రూ. 3.86 కోట్ల వార్షిక ఆదాయంతో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన అనంతరం దివంగత కాంగ్రెస్ నేత విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్ వార్షిక ఆదాయం రూ. 2.26 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉండగా విశ్వజీత్ కదం రూ. 2.35 కోట్లతో తృతీయ స్థానంంలో ఉన్నారు. 42 మంత్రులలో 37 మంత్రులు తమపై అప్పులున్నట్టు ప్రకటించారు. వీరిలో విశ్వజీత్ కదం అత్యధికంగా రూ. 121 కోట్లు అప్పు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఎన్సీపీ నేత జితేంద్ర అవాడ్‌పై రూ. 37 కోట్లు, కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టవార్పై రూ. 22 కోట్ల అప్పులున్నాయి. 27 మంత్రులపై కేసులు... రాష్ట్ర మంత్రి మండలిలోని 27 మంత్రులపై కేసులున్నాయి. వీరిలో 18 మంది మంత్రులపై తీవ్రమైన నేరారోపనల కేసులున్నాయి. మరోవైపు విద్యాభ్యాసాన్ని పరిశీలిస్తే 42 మంత్రులలో ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన 18 మంది మంత్రులుండగా 22 మంది మంత్రులు డిగ్రీ పూర్తి చేసిన వారున్నారు. వయసు ప్రకారం పరిశీలిస్తే 17 మంది మంత్రుల వయసు 25 నుంచి 50 ఏళ్ల వరకు ఉండగా 25 మంది మంత్రుల వయసు 51 నుంచి 80 ఏళ్ల వరకు ఉంది. ఈ సారి ఉద్ధవ్ నేతృత్వంలోని మంత్రి మండలిలో కేవలం ముగ్గురు మహిళా మంత్రులే ఉన్నారు. -
మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు హాజరుకాని, రోస్టర్ విధులను సరిగా నిర్వర్తించని కేంద్ర మంత్రులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు హాజరుకాని కేంద్ర మంత్రుల జాబితాను ఏరోజుకారోజు సాయంత్రానికల్లా తనకు ఇవ్వాలని మోదీ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. ఈ సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడాలని మోదీ సూచించారు. క్షేత్ర స్థాయి అధికారులతో కలిసి నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు. టీబీ, క్షయ వంటి వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నీటి, జంతు సంరక్షణపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతోన్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని ఎంపీలను ఆదేశించారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రధానికి తెలిపారు. కాగా, పార్లమెంటు సమావేశాలకు ఎంపీల గైర్హాజరుపై ఇటీవల జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలోనూ ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
సామాజిక న్యాయం
-
బదులు తీర్చుకున్న నితీశ్
పట్నా: కేంద్ర మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై బదులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించిన ఆయన.. ఎన్డీఏలోని బీజేపీ, ఎల్జేపీలను పక్కనబెట్టి కేవలం తమ పార్టీకే చెందిన 8 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ పరిణామంపై ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. ఎన్డీఏలో ఎటువంటి విభేదాల్లేవని, జేడీయూ తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణలో బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వజూపగా వారు అయిష్టత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఖాళీ అయిన మంత్రి పదవులనే తాజా విస్తరణలో భర్తీ చేశామన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించారు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘సీఎం నితీశ్ మా పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ, మేం ప్రస్తుతానికి వద్దని చెప్పాం’ అని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లాల్జీ టాండన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్ కేబినెట్లోని బీజేపీకి చెందిన ఇద్దరు, ఎల్జేపీకి చెందిన ఒకరు ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నిక కావడం, ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో ఆరోపణలున్న మంజు వర్మ రాజీనామాతో నాలుగు పోస్టులు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర కేబినెట్లో ఉన్న బీజేపీకి చెందిన రాజీవ్ రంజన్ సింగ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, దినేశ్ చంద్ర యాదవ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, ఎల్జేపీ నేత పసుపతి కుమార్ పరాస్ మత్స్యశాఖ మంత్రిగా ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన విషయం తెలిసిందే. నితీశే మా నేత: పాశ్వాన్ బిహార్‌లో ఎన్డీఏ ఐక్యంగా>నే ఉందని, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ నేత అని ఎల్జేపీ నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో చేరకూడదన్న జేడీయూ నిర్ణయం ఎన్డీఏపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. ‘ఈ అంశంపై అపార్థాలు వెదకడం తగదు. ఎన్డీఏలోనే ఉన్నాం, ఉంటామంటూ నితీశ్ కుమార్ ఇప్పటికే చెప్పారు కూడా. విభేదాలు ఏవైనా ఉంటే నేను చూసుకుంటా’ అని అన్నారు. కేంద్ర కేబినెట్లో చేరేలా నితీశ్‌ను ఒప్పిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. ఎన్డీఏలోనే ఉంటా మంటూ నితీశ్ కుమార్ స్పష్టం చేసినప్పుడు ఇంకా సమస్యెందుకు? అని పాశ్వాన్ తిరిగి ప్రశ్నించారు. -
మోదీ కేబినెట్ @ 58
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, ఎస్.జయశంకర్ సహా మొత్తం 58 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది కేబినెట్ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు. 2014లో బీజేపీ పగ్గాలు చేపట్టి పార్టీ విస్తరణకు కృషి చేయడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అఖండ విజయానికి తోడ్పడిన అమిత్ షా కేబినెట్లో చేరడం తొలినుంచీ ఊహించిందే అయినా..ఆశ్చర్యకరంగా మోదీకి సన్నిహితుడిగా భావించే విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్‌కు మంత్రివర్గంలో స్థానం లభించింది. రాష్ట్రపతి భవన్ ఎదుటి ఆవరణలో వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో 68 ఏళ్ల మోదీతో రాష్ట్రపతి కోవింద్ పదవీ స్వీకార, గోప్యత పరిరక్షణ ప్రమాణం చేయించారు. ‘దేశానికి సేవ చేసే గౌరవం దక్కింది’ అని వరసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ ట్వీట్ చేశారు. కాగా అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కారీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్, పాశ్వాన్, నరేంద్ర తోమర్, రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ, జవదేకర్, గోయల్, నఖ్వీ తదితరులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలైన అకాలీదళ్ (హర్సిమ్రాత్ కౌర్ బాదల్), శివసేన (అర్వింద్ సావంత్), ఎల్జేపీ (పాశ్వాన్)లకు కేబినెట్ హోదా మంత్రి పదవులు లభించాయి. తెలంగాణకు ప్రాతినిధ్యం సంతోష్‌గంగ్వార్, రావ్ ఇంద్రజీత్ సింగ్, జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు తదితరులు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డితో పాటు ఫగ్గాన్ సింగ్ కులస్తే, అశ్వినీకుమార్ చౌబే, పర్షోత్తమ్ రూపాలా, రామ్‌దాస్ అథావలే, సాధ్వి నిరంజన్ జ్యోతి, బాబుల్ సుప్రియో తదితరులు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ గత ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ రాథోడ్, మేనకా గాంధీలు కొత్త మంత్రివర్గంలో లేరు. సురేష్ ప్రభు, జేపీ నడ్డాలకు చోటు దక్కలేదు. అమిత్ షా స్థానంలో నడ్డా బీజేపీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం కారణంగా సుష్మాస్వరాజ్ ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యానే కేబినెట్లో చేరలేనని పేర్కొంటూ మరో సీనియర్ మంత్రి జైట్లీ బుధవారం మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కేబినెట్లో తిరిగి చోటు సంపాదించుకోగలిగారు. మాజీ దౌత్యవేత్త అయిన పూరితో పాటు జైశంకర్ ఆరు నెలల్లోగా పార్లమెంటుకు ఎన్నిక కావాలి. పాశ్వాన్ ఏ సభలోనూ సభ్యులు కాదు. గత ఏడాదే ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) నుంచి రిటైర్ అయిన జైశంకర్ ఓ ప్రధాన మైలురాయి వంటి భారత్–అమెరికా అణు ఒప్పందంపై చర్చలు జరిపిన బృందంలో కీలక సభ్యుడు. కేబినెట్లో ఆరుగురు మహిళలకు అవకాశం దక్కింది. మోదీ గత మంత్రివర్గంలో 8 మంది మహిళలు ఉండటం గమనార్హం. షా, జైశంకర్‌తో పాటు 20 మంది (1/3) కొత్త వారున్నారు. గరిష్టంగా ఉత్తరప్రదేశ్ నుంచి 9 మందికి చోటు లభించింది. బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న పశ్చిమబెంగాల్లో ఇద్దరికి (బాబుల్ సుప్రియో, దేబశ్రీ చౌధురి) అవకాశం ఇచ్చారు. కర్ణాటక నుంచి మళ్లీ ముగ్గురికే మోదీ అవకాశం ఇచ్చారు. పాత మంత్రుల్లో ఒకరిని కొనసాగించి, తొలగించిన ఇద్దరి స్థానంలో కొత్తవారిని తీసుకున్నారు. మొత్తం మీద గత మంత్రివర్గంలో ఉన్న 37 మంది మళ్లీ అవకాశం చేజిక్కించుకున్నారు. గాంధీ, వాజ్‌పేయికి మోదీ నివాళులు గురువారం ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు మోదీ ఘన నివాళులర్పించారు. ఇక్కడి ఇండియా గేట్ పక్కనే ఉన్న యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. ఉదయం ఏడు గంటల సమయంలో ప్రధాని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. అక్కడి నుంచి కమలాకృతిలో తీర్చిదిద్దిన వాజ్‌పేయి సమాధి సదైవ్ అటల్ వద్దకు వెళ్లారు. అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు ఆయనతో ఉన్నారు. ఈ ఏడాది గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని, ఈ ప్రత్యేక సందర్భం.. బాపూజీ ఉదాత్త సిద్ధాంతాలు మరింత ప్రజాదరణ పొందేలా చేయాలని, బడుగు, బలహీనవర్గాలకు సాధికారత కల్పన దిశగా మనలో ఉత్సాహాన్ని కొనసాగింపజేయాలని మోదీ ఆకాంక్షించారు. వాజ్‌పేయి ఉండి ఉంటే ప్రజలకు సేవ చేసేందుకు బీజేపీకి లభించిన గొప్ప అవకాశాన్ని చూసి బాగా ఆనందించేవారన్నారు. అటల్జీ జీవితం, ఆయన కార్యదక్షత ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో మరింత మార్పు తెచ్చేందుకు, మరింత మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తామని గురువారం నాటి వరుస ట్వీట్లలో మోదీ పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన వారిని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. కేబినెట్లో చేరని జేడీ(యూ) బీజేపీ ప్రధాన మిత్రపక్షం జేడీ(యూ) కేంద్ర కేబినెట్లో చేరలేదు. ఆ పార్టీకి మంత్రి పదవుల విషయంలో తలెత్తిన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కేబినెట్ బెర్తుల విషయంలో చివరి నిమిషం వరకు అమిత్ షాతో చర్చలు జరిపారు. అయితే ‘మోదీ ప్రభుత్వంలో మేము చేరడం లేదు. ఇది మా నిర్ణయం..’ అని జేడీ(యూ) అధికార ప్రతినిధి పవన్ వర్మ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి కొద్దిసేపటి ముందు నితీశ్ కూడా బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు. అయితే ఎన్డీయేకి నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీకి బీజేపీ ఒకేఒక్క మంత్రి పదవి ఆఫర్ చేసిందని, పైగా ఇవ్వజూపిన శాఖ కూడా జేడీ(యూ)ని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో జేడీ(యూ) 16 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీ(యూ) 2017లోనే బీజేపీతో జట్టు కట్టినా మోదీ మొదటి ప్రభుత్వంలో కూడా చేరలేదు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో దాదాపు 80 మంది వరకు మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానితో కలిపి మొత్తం కేంద్ర మంత్రుల సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యుల్లో 15 శాతానికి మించి ఉండటానికి వీల్లేదు. మోదీ సర్కార్ 2.0 ఇదే గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోని ప్రమాణ స్వీకార వేదికపై నూతన కేబినెట్ మంత్రులతో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ముందు వరసలో కూర్చున్న సీజేఐ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తున్న తల్లి హీరాబా -
ఫ్యాన్ గాలి సునామీకి టీడీపీ చిరునామా గల్లంతు
-
రాజస్ధాన్‌లో 23 మంది మంత్రుల ప్రమాణం
-
రాజస్ధాన్‌లో 23 మంది మంత్రుల ప్రమాణం
జైపూర్ : కొత్తగా కొలువుతీరిన రాజస్థాన్ ప్రభుత్వంలో 23 మంది మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 22 మంది మంత్రులు కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కాగా ఆర్ఎల్డీ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 13 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో బులకి దాస్, శాంతికుమార్ దరివాల్, ప్రసాదిలాల్ మీనాలున్నారు. ఈనెల 17న రాజస్ధాన్ సీఎం, డిప్యూటీ సీఎంలుగా అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్లు మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా అధిష్టాన పెద్దలతో మూడు రోజుల పాటు విస్తృత సంప్రదింపులు జరిపారు. తీవ్ర తర్జనభర్జనలు, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల ఎంపికపై కసరత్తు పూర్తిచేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సహా 30 మందికి మంత్రులుగా అవకాశం ఉండగా మిగిలిన మరికొన్ని మంత్రి పదవులను తర్వాత విస్తరణలో భాగంగా భర్తీచేస్తారని భావిస్తున్నారు. -
మంత్రుల లేఖలు బుట్టదాఖలు
సాక్షి, అమరావతి: సాక్షాత్తూ మంత్రుల లేఖలనే సర్కారు పట్టించుకోకుండా బుట్టదాఖలు చేస్తుంటే ఇక సామాన్యుల ఫిర్యాదులకు దిక్కెవరు? ముగ్గురు కేబినెట్ మంత్రులు ఓ సమస్య పరిష్కారం కోసం సిఫారసులతో ప్రభుత్వానికి లేఖ రాస్తే ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి లేఖను సైతం లక్ష్యపెట్టకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హామీని నిలబెట్టుకోవాలని మంత్రుల సూచన రాష్ట్రంలో కాంట్రాక్టు వైద్యులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. తమ సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ వీరు పలుమార్లు మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. మూడేళ్లు పనిచేస్తే తమను క్రమబద్ధీకరిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఎన్నిసార్లు అభ్యర్థించినా పట్టించుకోకపోవడంతో మంత్రుల దృష్టికి తెచ్చారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏజన్సీ ప్రాంతాల్లో పలువురు కాంట్రాక్టు వైద్యులు ఇప్పటికే విధుల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు వైద్యులు దీర్ఘకాలంగా పని చేస్తున్నందున వారిని క్రమబద్ధీకరించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని సూచిస్తూ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కిమిడి కళావెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. మూడేళ్ల సర్వీసు దాటిన వారిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని గతంలో ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. వైద్య ఆరోగ్యశాఖకు ముఖ్యమంత్రే ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తుండటంతో దీనిపై వివరణ ఇవ్వాల్సిన పని లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మంత్రుల లేఖలను చిత్తు కాగితాలు కింద పరిగణించి బుట్ట దాఖలు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాళీగానే చాలా పోస్టులు.. కొన్నేళ్లుగా పలువురు కాంట్రాక్టు వైద్యులు గ్రామీణ ప్రాం తాల్లో పని చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నందున రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి. దీనిపై వైద్యులు పదేపదే కోరుతున్నారు. త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీచేయాలి. – కేఈ కృష్ణమూర్తి (డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి) మానవత్వంతో నిర్ణయం తీసుకోవాలి కాంట్రాక్టు వైద్యుల రెగ్యులైజేషన్ అంశాన్ని మీ (ముఖ్యమంత్రి) దృష్టికి తీసుకువస్తున్నా. ఇప్పటికే పలు వైద్య సంఘాలు ఈ విషయంపై నాకు విన్నవించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. – కిమిడి కళావెంకట్రావు (విద్యుత్ శాఖ మంత్రి) క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులు క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కామినేని శ్రీనివాస్ మంత్రిగా ఉండగా హామీ ఇచ్చారు. దీనిపై త్వరలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలి. – కాల్వ శ్రీనివాసులు (గృహ నిర్మాణ శాఖ మంత్రి) -
ఇమ్రాన్‌ఖాన్ కొత్త టీం ఇదే!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తన నూతన మంత్రివర్గాన్ని ప్రకటించారు. విదేశాంగ మంత్రితో కలుపుకుని మొత్తం 21 మందితో కేంద్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో 15 మంది కేంద్ర మంత్రులు కాగా, మరో ఐదుగురు ప్రధానికి సహాయకులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరీ ఆదివారం మంత్రుల పేర్లను ప్రకటించారు. మహ్మద్ ఖురేషీ విదేశాంగ మంత్రి బాధ్యతులు చేపట్టాగా, పర్వేజ్ కట్టక్ రక్షణ, అసద్ ఉమర్ ఆర్థిక, రావాల్పిండి నుంచి ఎన్నికైన షేక్ రషీద్ రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు మంత్రులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనునట్లు సమాచారం. కాగా విదేశాంగ మంత్రిగా ఎన్నికైన ఖురేష్ గతంలోనే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ప్రభుత్వంలో (2008-2011) విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ముంబై దాడులు జరగడంతో భారత పర్యటనను వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మంత్రి వర్గంలో ముగ్గురు మహిళలకు కూడా చోటు లభించింది. వారిలో షీరిన్ మాజరీ, ఝుబైడా జలాల్, మీర్జాలు ఉన్నారు. కాగా పాకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఆరీఫ్ అల్వీని ప్రకటించే అవకాశం ఉందని పీటీపీ తెలిపింది. సెప్టెంబర్ 5న నూతన అధ్యక్షుడిని ఎనుకోనున్నారు. -
సోమవారం సీఎంగా కుమారస్వామి..ప్రమాణ స్వీకారం
-
సోమవారం సీఎంగా కుమారస్వామి.. కేబినెట్ ఇదేనా !
సాక్షి, బెంగుళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ ఎల్పీనేత కుమారస్వామి ఈనెల 21న (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో కుమారస్వామి సోమవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే బెంగళూరులోని హిల్టన్ హోటల్లో జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కూర్పు, ఇతర పదవుల పంపకాలకు సంబంధించి చర్చ జరిగింది. మంత్రులు వారి శాఖలను కూడా ప్రకటించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి దేశం నలుమూలల నుంచి వివిధపక్షాల నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అందిన సమాచారం మేరకు మంత్రులు వారి పదవులు ఇలా ఉండవచ్చు ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి : కుమారస్వామి ఉప ముఖ్యమంత్రి : జి పరమేశ్వర్ ప్రజా పనుల శాఖ : హెచ్ డీ రేవణ్ణ విద్యుత్ శాఖ : డీకే శివకుమార్ నీటిపారుదల శాఖ : హెచ్‌కే పాటిల్ భారీ పరిశ్రమల శాఖ : ఏటీ రామస్వామి రవాణా శాఖా : రామలింగారెడ్డి చిన్న నీటిపారుదల శాఖ : కేఎం శివలింగే గౌడ్ రెవెన్యూ శాఖ : శివ శంకరప్ప ఆరోగ్య శాఖ : యూటీ ఖదీర్ మహిళా సంక్షేమ శాఖ : లక్ష్మీ హెబ్బల్కర్ వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ : సీఎస్ పుత్తరాజు విద్యాశాఖ : హెచ్ విశ్వనాథ్ గ్రామీణాభివృద్ధి శాఖ : సతీష్ జరకిహోలి పట్టనాభివృద్ధి : కేజే జార్జ్ క్రీడల శాఖ : కృష్ణప్ప సమాచార శాఖ : కృష్ణ బైరేగౌడ సాంఘీక సంక్షేమ శాఖ : హెచ్‌కే కుమారస్వామి కోపరేటివ్ శాఖ : జీటీ దేవెగౌడ టెక్స్టైల్ శాఖా : బండెప్ప కశంపూర కార్మిక శాఖ : డీసీ తమ్మన్నా ఎక్సైస్ శాఖ : దినేష్ గుండు రావు వైద్య, విద్య శాఖ : తన్వీర్ సైత్ ఉన్నత విద్య శాఖ : కే సుధాకర్ అటవీ శాఖ : రోషణ్ బైగ్ ఆహార, పౌర సరఫరా శాఖ : శరణబసప్ప గౌడ దర్శణాపూర్ న్యాయశాఖ : ఆర్వీ దేశ్‌పాండే చిన్న తరహ పరిశ్రమలు : అజయ్ సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ : ప్రియాంక్ ఖర్గే -
హిందీ.. హమారీ రాష్ట్ర భాష హై క్యా?
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ భాష హిందీని ఎలాగైనా సరే దేశప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా యత్నించింది. అయితే కొన్ని చోట్ల హిందీకి వ్యతిరేకంగా.. ముఖ్యంగా దక్షిణ భారతంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గింది. హమారీ మాతృభాష హిందీ హమారీ.. పెహ్చాన్ హై హమేఁ ఇస్పే గర్వ్ కర్నా చాహియే అంటూ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు ఓ మీటింగ్ వ్యాఖ్యలు కూడా చేశారు. అదే సమయంలో పార్లమెంటులో కూడా సభ్యులు హిందీలోనే మాట్లాడాలనే ప్యానెల్ విధించిన రూల్ ఆయన గుర్తుచేసారు. కట్ చేస్తే... ఇప్పుడు మన మంత్రులు ఎంత సాధించారు? పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. కేబినెట్ లో ఇప్పుడున్న ఎక్కువ మంది మంత్రులు పూర్తి స్థాయిలో హిందీ భాషను అధికారికంగా ఉపయోగించటం లేదని విషయం తెలుస్తోంది. హోం శాఖ, నీతి ఆయోగ్, ఐబీ మంత్రిత్వ శాఖ ఇలా 20 శాఖల్లో నిర్వహించిన సమీక్షతో ఈ విషయం వెలుగు చూసింది. ఇక శాఖల వారీగా పరిశీలిస్తే... ఉమా భారతి జలవనరుల శాఖ ఒక్కటి మాత్రమే గరిష్టంగా హిందీ భాషను ఉపయోగిస్తోంది. ఫైల్ నోటింగ్‌లు దాదాపు 58 శాతం హిందీలోనే అవుతుండగా... ఆ శాఖకు సంబంధించి 44 మంది అధికారుల్లో 40 మంది పని వేళలో హిందీలోనే మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఆమె ఎక్కువగా హిందీలోనే మాట్లాడుతుండటంతో.. అధికారులు కూడా ఉమా భారతి బాటలోనే పయనిస్తున్నారని అర్థమౌతోంది. కీలకమైన హోం శాఖ విషయానికొస్తే... 112 సీనియర్ అధకారులు తమకు హిందీ వచ్చనే గతంలో చెప్పగా.. 49 మంది 30 శాతం కంటే తక్కువగా ఆ భాషను వినియోగించటం గమనార్హం. ఇక మిగిలిన వారిలో మరో 38 మంది 30 నుంచి 70 శాతం మాత్రమే హిందీ భాషను వినియోగిస్తున్నారని తేలింది. 55 శాతం ఫైల్ నోటింగ్స్ హిందీలోనే జరుగుతున్నప్పటికీ.. వాటికి బదులు ఆంగ్లంలోనే ఇస్తున్నారన్నది వెల్లడైంది. నీతి ఆయోగ్ లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. 59 మంది అధికారుల్లో ఒక్కరు కూడా హిందీలో మాట్లాడకపోవటం విశేషం. అదే సమయంలో 39 శాతం.. అది కూడా ఫైల్ నోటింగ్ కోసం హిందీని వినియోగిస్తున్నారు. ఇక తమ విభాగంలో సాంకేతిక సేవలకు చెందిన అధికారులు ఎక్కువగా ఉండటంతోనే హిందీని వినియోగించటం కష్టతరంగా ఉందని ఐబీ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫైల్ నోటింగ్ కోసం 35 శాతం వినియోగిస్తుండగా.. 98 మంది అధికారుల్లో 36 మంది 70 శాతం మేర హిందీని వినియోగిస్తున్నారు. పర్యావరణ శాఖ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కావటంతో ఆ శాఖలోనూ హిందీయేతర కార్యకలాపాలే ఎక్కువ దర్శనమిస్తున్నాయి. మిగతా మంత్రిత్వ శాఖల్లోనూ, పైగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. మొత్తానికి మంత్రులకు తగ్గట్లే ఆయా శాఖలు.. అందులోని అధికారులు కూడా హిందీ భాషను నిర్లక్ష్యం చేస్తూ.. ప్రజలకు మాత్రం స్పీచులు ఇస్తున్నారన్న మాట. -
మంత్రివర్గం కోసం ఓ వాట్సప్ గ్రూప్!
ఆయన ఓ రాష్ట్ర మంత్రి. తన సహచర సభ్యులంతా కలిసి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వీలుగా వాట్సప్‌లో ఓ గ్రూప్ క్రియేట్ చేశారు. ఇది జరిగింది పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రంలో. సుపరిపాలన కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని భావించిన షా.. 'కేబినెట్' అనే పేరుతోనే ఈ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. అందులో మంత్రులతో పాటు సలహాదారులు, ప్రత్యేక సహాయకులు.. వీళ్లంతా కూడా ఉన్నారట. ఇంతకీ ఈ గ్రూప్ అడ్మిన్ ఎవరో తెలుసా.. సాక్షాత్తు సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రే! కేబినెట్లోని మంత్రులంతా తమ తమ కార్యకలాపాలు, సమస్యల గురించి ఈ వాట్సప్ గ్రూపులో తెలియజేయాలని ఆయన చెప్పారు. దాంతో తమ పర్యటనలు, సమావేశాలకు సంబంధించిన ఫొటోలు, వివరాలన్నింటినీ మంత్రులు ఈ గ్రూపులో షేర్ చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. -
పారిస్ దాడుల కేసులో కీలక నిందితుడి అరెస్టు
బ్రస్సెల్స్: పారిస్ ఉగ్ర దాడుల కేసులో కీలక నిందితుడు సలాహ్ అబ్దేస్లామ్ను శుక్రవారం బ్రస్సెల్స్ సమీపంలోని మోలెన్బీక్లో అరెస్టుచేశారు. 26 ఏళ్ల అబ్దేస్లామ్ కోసం ఐదు నెలలుగా వేట కొనసాగుతోంది. ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో సలాహ్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. అతనికి బ్రస్సెల్స్‌లోని సెయింట్ పియరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. పోలీసు అధికారులు ఉగ్రవాద హత్యానేరం మోపుతూ కేసు నమోదు చేశారు. అబ్దేస్లామ్ను ఫ్రాన్స్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తామని అతని న్యాయవాది స్వెన్ మేరీ చెప్పారు. వీలై నంత త్వరలో సలాహ్‌ను ఫ్రాన్స్ తీసుకొస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చెప్పారు. శనివారం ఆయన కేబినెట్ మంత్రులు, అధికారులతో భేటీ అయి విచారణలో ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. గత ఏడాది నవంబర్‌లో పారిస్‌లో జరిగిన దాడుల్లో 130 మంది చనిపోయారు. -
ట్రంప్‌కు నిరసనల సెగ
ప్రతి సభలోనూ ఆందోళనకారుల అలజడి వారిని జైల్లో పెట్టాలన్న ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ టికెట్ రేసులో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను నిరసనలు వెంటాడుతున్నాయి. ఎన్నికల ప్రచార చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నిరసనలు ఎదురవుతున్నాయి. షికాగో ర్యాలీతో మొదలైన ఆందోళనకారుల నిరసన శనివారమూ కొనసాగింది. ఒహాయోలోని డేటన్లో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ ఆందోళనకారుడు బారికేడ్లు దూకి వేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అడ్డుకుని ట్రంప్‌కు రక్షణ కల్పించారు. ట్రంప్ అతనిపై నోరు పారేసుకున్నారు. ‘ఆ వ్యక్తి ఉగ్రవాది అయి ఉండొచ్చు. ఐసిస్ మద్దతుదారైనా అయి ఉండొచ్చు. అతన్ని జైల్లో పెట్టాలి. మన కోర్టులు అతన్ని అంత తేలిగ్గా వదలవని అనుకుంటున్నా’ అని అన్నారు. అనంతరం మిస్సోరీలోని కాన్సాస్‌లో మూడు సభల్లోనూ నిరసనకారులు ట్రంప్ ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకున్నారు. ట్రంప్ స్పందిస్తూ ‘వారు చెడ్డవాళ్లు, దేశానికి కీడు చేసేవాళ్లు, వాళ్లని జైల్లో పెట్టాలి’ అని విరుచుకు పడ్డారు. ప్రసంగాన్ని అడ్డుకున్న మహిళను అరెస్టు చేయాలని పోలీసులకు సూచించారు. కాగా, టికెట్ రేసుకు సంబంధించి వాషింగ్టన్, వ్యోమింగ్ ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థులైన రూబియో, కాషిష్ల చేతిలో ఓడిపోయారు. చైనా సూట్లు ధరిస్తూ వారిపై విమర్శలా..? చైనీస్, భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలు లాక్కొంటున్నారని విమర్శలు గుప్పించే ట్రంప్ చైనాలో తయారైన షర్ట్లు, టైలు ధరిస్తారని అమెరికా మీడియా వెల్లడించింది. -
ఆర్టీఐ పరిధిలోనే మంత్రులు
{పజలకు జవాబుదారీగా ఉండాలి కేంద్ర, రాష్ట్ర మంత్రులకు సూచించిన సీఐసీ న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్రాల కేబినెట్ మంత్రులు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తారని, ప్రజా సేవకులైన వారు పౌరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టం ప్రకారం నిర్దేశిత అభ్యర్థనతో ప్రజలు ప్రశ్నలను నేరుగా మంత్రులకు పంపొచ్చని తెలిపింది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రతి మంత్రికీ సమకూర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేసింది. ఈ మేరకు సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు. ‘గోప్యతా ప్రమాణం’ స్థానంలో ‘పారదర్శకతా ప్రమాణం’ పాటించాలని సూచించారు. పార్లమెంట్ ఆమోదించిన ఆర్టీఐ చట్టాన్ని ప్రతి మంత్రీ గౌరవించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర కేబినెట్ మంత్రులను ప్రజలు కలిసే సమయాలను తెలపాలంటూ అహ్మద్‌నగర్‌కు చెందిన హేమంత్ ధాగే దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా గంట కొడితే శ్రీరాముడు అంతఃపురం నుంచి వెంటనే బయటకు వచ్చి వారిని కలిసి సమస్యేమిటో తెలుసుకుని పరిష్కరించేవాడన్నారు. కానీ... ప్రజలకు మంత్రి అందుబాటులో ఉండే సమయం తెలుసుకోవడానికి ఓ పౌరుడు ఆర్టీఐ చట్టాన్ని ఆశ్రయించాడంటే విచారించాల్సిన విషయమన్నారు. ‘సెక్షన్ 4(1)(బీ) ప్రకారం మంత్రులు స్వయంగా ఇలాంటి సమాచారాన్ని అందించాలి. అలాంటి సదుపాయం లేకపోతే మంత్రి కార్యాలయం ఆ విషయం చెప్పాలి. మంత్రికి ఇవన్నీ చూసుకోవడం కుదరకపోతే అందుకు తగిన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలి’ అని చెప్పారు. ఆర్టీఐకి సంబంధించి ఓ కచ్చితమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర, రాష్ర్ట మంత్రులకు సూచించారు. -
'తీరు మార్చుకోకపోతే తిప్పలే'
‘‘మంత్రివర్గం ఏర్పాటై ఏడాదిన్నర దాటింది. ఏ విషయాన్ని మీరు సీరియస్‌గా పట్టించుకోవడంలేదు. మీ శాఖల అంశాలపై లోతుగా పట్టు సాధించడంలేదు. పార్టీ వ్యవహారాలను అంత శ్రద్ధగా పట్టించుకోవడంలేదు. మంత్రులం అయిపోయాంలే ఇక మాకు తిరుగు ఏముందిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మీ పద్ధతులు మార్చుకోండి. మీ మీ శాఖలపై పట్టు పెంచుకోండి. జిల్లాల్లోనూ పట్టు సాధించండి’’ అని ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పనితీరు ఎలా ఉంది? మీ జిల్లాల్లో మీ పరిస్థితి ఏంటి? అన్ని సమగ్ర వివరాలు నా వద్ద ఉన్నాయి. మీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించా రు. పనితీరు మార్చుకోకపోతే తరువాతి పరిణామాలకు చింతించాల్సి ఉంటుందని కేబినేట్ సమావేశంలో ఆయన పరోక్షంగా భవిష్యత్తు సూచనలను తెలియజేసినట్లు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. జన్మభూమి నిర్వహణ అంశంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలోనూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నాయకులు బాడీలాంగ్వేజ్ మార్చుకోవాలని, వ్యవహారశైలిలో, మాటతీరులో మార్పురావాలని సూచించారు. వారి చేరికవల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందని భావిస్తే ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానించండని ఆదేశించారు. ప్రస్తుతం పరిశ్రమలకు ఉన్న టారిఫ్‌పై 4% విద్యుత్తు ఛార్జీలను పెంచాలని కేబినెట్లో నిర్ణయం జరిగింది. గృహ వినియోగంలో 200 యూనిట్లు మించిన వారికి 2.5% ఛార్జీలను పెంచాలనే సూత్రప్రాయ నిర్ణయం జరిగింది. దీనిపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో మరోసారి చర్చించి నిర్ణయానికి వద్దామని మంత్రివర్గం అభిప్రాయపడింది. -
స్వైన్ గణగణ
ప్రమాదంలో ప్రజారోగ్యం ప్రాణాలు పోతున్నా పట్టని పాలకులు అధ్వానంగా పారిశుద్ధ్యం మన సర్కారు ఆశ... ఆకాశంలో మెట్రో వేగంతో పరుగెడుతోంది. ‘విశ్వ’మంత ఎదగాలనే ‘కల’ల బండి... కళ్ల ముందు నిరంతరం కదులుతోంది. ఈ వేగాన్ని అందుకోలేక ‘వాస్తవం’ చతికిలబడుతోంది. పారిశుద్ధ్యలోపం రూపంలో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. స్వైన్ ఫ్లూను జనంపైకి వదిలి... మృత్యువు వికటాట్ట హాసం చేస్తోంది. మహా నగరపు దారి పొడవునా గుండె నెత్తురులు చిమ్ముతూ... ‘స్వైన్’ మృత్యు గంటలు మోగిస్తోంది. నేలపైకి చూడాలని సర్కారుకు స్పృహ వచ్చేలోపు ఇంకెన్ని ప్రాణాలు స్పృహ కోల్పోతాయోనని మహా నగరం బెంగటిల్లుతోంది. ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలను చార్మినార్ శిరస్సు వంచి కోరుతోంది. ఇదే సమయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో సాక్షాత్తూ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘మహానగరానికి మామూలు వైద్యం కాదు...శస్త్ర చికిత్స చేయాల’నడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్వైన్ ఫ్లూ.. ఎబోలా.. డెంగీ.. చికున్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు సిటీలో విజృంభిస్తున్నాయి.. మూడు నెలలుగా స్వైన్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజూ మరణ మృదంగం మోగుతూనే ఉంది.. వందలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. అయినా అధికారులు... ప్రజాప్రతినిధుల్లో చలనం లేదు. ఎక్కడ చూసినా చెత్తాచెదారాలు.. రోడ్లపై పరుగులు తీస్తున్న మురుగు.. దోమల విజృంభణతో కంటిమీద కునుకు కరువైంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి.. అనేక ప్రాంతాల్లో మురుగునీరే తాగునీరవుతోంది. నగరాన్ని విశ్వనగరంగా మార్చేస్తాం.. మురుగు వాడలను అద్భుతంగా మార్చేస్తాం.. ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తాం.. హైటెక్ హంగులు కల్పిస్తాం.. అంటూ సీఎం కేసీఆర్ నుంచి కేబినేట్ మంత్రులు, జీహెచ్ఎంసీ అధికారులు నిత్యం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలకు... వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.. నరగంలో పారిశుద్ధ్యం పరిస్థితిపై శనివారం ‘సాక్షి’ విజిట్‌లో అధికారుల నిర్లక్ష్యంతో పాటు విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. నగరానికి శస్త్రచికిత్స చేయాల్సిందేనని సాక్షాత్తూ సీఎం ప్రకటించడం భాగ్యనగరిలో అధ్వాన పరిస్థితికి అద్దం పడుతోంది. - సాక్షి, నెట్వర్క స్వాగతం పలుకుతున్న మురుగు నీరు... మన్సూరాబాద్: నగరానికి ముఖద్వారం.. సిటీకి వచ్చేవారికి మురుగునీరు స్వాగతం పలుకుతోంది. డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి.. ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని ప్రాంతాలను పరిశీలిస్తే ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. చెత్తాచెదారాలు.. పొంగిపొర్లుతున్న మురుగునీరు ఇళ్లల్లోకి సైతం వచ్చేస్తోందని, వ్యాధుల బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. జాతీయ రహాదారిపై డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా అధికారుల్లో స్పందన లేదు. మున్సిపల్, జోనల్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో అధికారులు నిత్యం ప్రయాణించే రహదారులపై డ్రైనేజీ పొంగిపోర్లుతున్న ఉన్నతాధికారులకాని, శానిటేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. లక్షలు మింగేస్తున్నారు... కుత్బుల్లాపూర్: పారిశుద్ధ్యం పేరుతో అధికారులు లక్షలు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చెత్త సమస్య కుత్బుల్లాపూర్వాసులకు పెద్ద గుదిబండగా మారింది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా చె త్తాచెదారమే దర్శనమిస్తోంది. ప్రజలు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. చెత్త తరలించేందుకు అధునాతన వాహనాలున్నాయి. డంపర్ బిన్స్ ఉన్నాయి. అయినా నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. ప్రజలు రోగాల బారినపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పారిశుద్ధ్యం నిర్వహణకు రూ. లక్షలు వెచ్చిస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గాజులరామారం, జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్‌నగర్ రైతు బజార్, సూరారం కాలనీ, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ పరిధిలోని కాలువల్లో చెత్త పేరుకుపోయింది. ప్రత్యక్ష నరకం దిల్సుఖ్నగర్: ఇళ్ల మధ్య మురుగునీరు..చెత్తతో నిండిన రోడ్లు...పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..పందుల స్వైర విహారంతో ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది.. ఆస్ప్రతుల్లో ఓపీల సంఖ్య పెరిగిపోతోంది. ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా, చికున్ గున్యా, ఎబోలా వంటి ప్రాంణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలోపం, ప్రజలలో అవగాహన లేమి వెరసి కాలనీల్లో అధ్వానంగా ఉంది. దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, సైదాబాద్, అక్బర్‌బాగ్, ఐఎస్‌సదన్, అజంపుర, మాదన్నపేట్, ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల పరిధిలోని ప్రజలు విషజ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కాలనీలలో పారిశుద్ధ్య సేవలు అందించడంలో శానిటేషన్ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఓల్డ్‌మలక్‌పేట్, ఆర్కేపురం, సరూర్‌నగర్, ఐఎస్‌సదన్, మూసారంబాగ్,మూసారంబాగ్ తదితర డివిజన్లలో అధికశాతం మురికివాడల నిర్వాసితులు డెంగ్యూ, మలేరియాతోపాటు పలురోగాల బారిన పడుతూ ఆందోళనకు గురవుతున్నారు. అధికారుల స్పందన మొక్కుబడిగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్వైన్ విజృంభిస్తున్నా... మెహిదీపట్నం/గోల్కొండ: ప్రముఖ పర్యాటక కేంద్రం.. నగర శివారు ప్రాంతాలు.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీలు ఎన్నో ఉన్నాయి. శానిటేషన్ అధ్వానంగా ఉంది. దోమలు విజృంభిస్తున్నాయి. కంటిమీద కునుకు కరువైంది. విషజ్వరాలు ప్రబలి ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పందులు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నాయి. స్వైన్‌ఫ్లూ భయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. చెత్త తరలింపు పనులను పర్యవేక్షించేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. షేక్‌పేట్, గుడిమల్కాపూర్, షాహిద్‌నగర్, మురాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెత్త తరలింపు సవ్యంగా జరగడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌యార్డ్‌లా వీధులు ఉప్పల్: చెత్తాచెదారాలతో వీధులన్నీ డంపిగ్ యార్డులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన వీధుల్లో నిత్యం మురుగునీరు పొంగిపొర్లుతూనే ఉంటోంది. పందులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫిర్యాలు చేసినా అధికారులుల్లో ఉలుకు..పలుకు లేదు.. కాప్రా డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ, సాయిబాబానగర్, సాయిరాంనగర్ల్లో పందుల బెడద అధికంగా ఉంది. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల వెనుక ప్రధాన రహదారిలో వారం రోజులుగా మురుగు పరుగులు తీస్తోంది. పలు మార్లుగా ఫిర్యాదుచేసినా శానిటేషన్ విభాగంలో చలనం లేకపోవడం శోచనీయం. రామంతాపూర్ చిన్న చెరువు ఒడ్డున చెత్త పేరుకుపోయి చెత్త డంపింగ్ యార్డులా మారిపోయింది. సమీపంలోని ఇందిరానగర్, నెహ్రూనగర్, నేతాజీనగర్ ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. వివేక్‌నగర్, రాంశంకర్‌నగర్, సత్యానగర్లకు సమీపంలో బైపాస్ రోడ్డులో ఉన్న చెత్త డంపింగ్‌యార్డులో కూడా పందులు సంచరిస్తు స్థానిక బస్తీలోకి వెల్తున్నాయి. బాలకృష్ణనగర్‌లో కొంతమంది పందుల పెంపకం చేపట్టడంతో అవి విచ్చలవిడిగా వీధుల్లోకి వస్తున్నాయి. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కదలని మురుగు... అల్వాల్/నేరేడ్మెట్/యాప్రాల్/మౌలాలి/మల్కాజిగిరి/గౌతంనగర్: అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం, ఏకలవ్యనగర్, జొన్నబండ, సూర్యనగర్, గ్రీన్‌ఫీల్డ్స్, ఖానాజిగూడ, సుభాష్‌నగర్, తుర్కపల్లి, బటన్‌గూడ ప్రాంతాలలో పారిశుద్య నిర్వాహన కొరవడింది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అల్వాల్‌లో ఇప్పటివరకు ఐదుగురు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. నేరేడ్మెట్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ఓపెన్ నాలాల్లో చెత్త పేరుకపోవడంతోమురుగు నీరు రోడ్డుపై పారుతోంది. అంతే కాకుండా రామకృష్ణాపురం, కేశవనగర్, నేరేడ్మెట్ తదితర ప్రాంతాలలో రోడ్లపై పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. గౌతంనగర్ డివిజన్ పరిధిలోని రామాంజనేయనగర్, జేఎల్ఎన్ఎస్ నగర్. గోపాల్‌నగర్, జ్యోతినగర్ వరకూ ఓపెన్నాలలో చెత్త చెదారం రోజుల తరబడి పేరుకుపోయి ఉంది. మౌలాలి డివిజన్ పరిధిలోని ఓల్డు మౌలాలి, ఓల్డు సఫిల్గూడా, పీబీ కాలనీ, ద్వారకా మయికాలనీ, భరత్‌నగర్, షఫీనగర్లలో ఓపెన్ డ్రైనేజీలలో చెత్త చెదారం పేరుకుపోయి ప్రవాహానికి అడ్డుపడుతుంది. షఫీనగర్‌లో చెత్త డంపింగ్ యార్డుతో దుర్వాసనతో స్థానికులకు ఇబ్బందిగా మారింది. సంతోషిమానగర్, ఎస్పినగర్, చందాబాగ్, మౌలాలి, ఎన్కృష్ణానగర్,వినాయకనగర్,ప్రగతినగర్ తదితర బస్తీలలో చెత్త కుప్పలుగా పేరుకుపోయి అపరిశుభ్రత నెలకొంది. షఫీనగర్, ఎస్పీనగర్, శ్రామికనగర్లలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. కలుషిత నీరే దిక్కు ఆల్విన్ కాలనీ: కూకట్పల్లి సర్కిల్ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గందం వెదజల్లుతోంది. పలు కాలనీల్లో డ్రైనేజీ సౌకర్యం లేదు. దీంతో రోడ్లపై మురుగునీరు పొంగిపొర్లుతోంది. మంజీర, బోర్‌వాటర్ పైపుల్లో, వాల్స్‌లో కలుస్తూ కలుషిత నీరుగా మారిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా శానిటేషన్ సమస్య ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట రామకృష్ణానగర్, రిక్షాపుల్లర్స్ కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతూ బోర్‌వాటర్ వాల్ వద్ద కలిసిపోవడంతో సరఫరా అయ్యే నీరు కలుషితం అవుతోంది. ఆస్బెస్టాస్ కాలనీలో ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. సుమిత్రానగర్, దయారుగూడ, నైనా గార్డెన్ సమీపంలో చెత్త కుప్పలు తెప్పలుగా వేయడంతో ఈగలు, దోమలకు ఆవాసాలుగా మారడంతో అవి వృద్ధి చెంది రాత్రివేళలో కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి.కేపీహెచ్‌బీకాలనీ మొదటిరోడ్డు, ధనలక్ష్మి సెంటర్, బస్టాప్ సెంటర్లలో చెత్తను తరలించేవారు లేరు. ఫాగింగ్ చేసిన పాపాన పోలేదు. -
చీపురు పట్టిన కేంద్ర మంత్రులు
బెంగళూరు: ఎప్పుడూ ఫైళ్లు, అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపే కేంద్ర మంత్రులు చీపురుపట్టారు. నగరంలోని రోడ్డును స్వయంగా శుభ్రం చేసి ‘స్వచ్ఛభారత్’ పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారమిక్కడ నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ పాల్గొన్నారు. ‘స్వచ్ఛతా’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని అవెన్యూ రోడ్‌ను కేంద్ర మంత్రులు శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...స్వచ్ఛభారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. చాలా మంది ప్రముఖులు, స్వామీజీలు, క్రీడాకారులు, యువత ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏదో ఫొటోలకు ఫోజులిచ్చేందుకు జరుగుతున్నదని కాదని, ప్రజలే ఓ మార్పు కోసం స్వచ్ఛందంగా ముందుకొస్తున్న కార్యక్రమమని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్‌కు సీఎం కేసీఆర్
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పార్లమెంట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు, తెలంగాణకు ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సహకాలు, అధికారుల పంపకాలు సహా పలు అంశాలను శాఖల వారీగా కేంద్రమంత్రులకు ఈ సందర్భంగా కేసీఆర్ మరోసారి గుర్తు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, రైల్వేమంత్రి సురేశ్ ప్రభుత తదితరులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ...అవకాశాన్ని బట్టి మంత్రులందరనీ పార్లమెంట్‌లోని వారి చాంబర్లలో కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు మధ్యాహ్నం 1.15గంటలకు కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతితో కేసీఆర్ సమావేశం అవుతారు. అలాగే ఈరోజు సాయంత్రం కేసీఆర్..హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం. -
రాష్ట్రాలకు ముఖ్య పాత్ర
* ప్రణాళికా సంఘం స్థానంలో సీఎంల కౌన్సిల్.. ప్రధాని మోదీ ప్రతిపాదన * కేంద్ర కేబినెట్ మంత్రులు, వివిధ రంగాల నిపుణులకూ చోటు.. ‘టీమ్ ఇండియా’గా నామకరణం * కొత్త వ్యవస్థ ఏర్పాటుకు మద్దతు పలికిన ఎన్డీఏ పక్షాలు, ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల సీఎంలు * ప్రణాళికాసంఘం రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు * ప్రస్తుత ప్రణాళికాసంఘాన్ని పునర్వ్యవస్థీకరించే విషయంలో మాత్రం సీఎంల ఏకాభిప్రాయం * రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ చర్చలు * దేశం భారీ ముందడుగు వేయాలంటే ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త వ్యవస్థ అవసరమని వెల్లడి * అధికారం, ప్రణాళికారచన వికేంద్రీకరణపై విస్తృత ఏకాభిప్రాయం లభించింది: ఆర్థికమంత్రి జైట్లీ * ప్రణాళికాసంఘం స్థానే కొత్త వ్యవస్థ స్వరూపం, విధివిధానాలు జనవరి 26 నాటికి ఖరారు? కొత్త వ్యవస్థలో రాష్ట్రాలకు కీలక పాత్ర ఉండాలి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఏ వేదికా లేదని రాష్ట్రాలు కొన్నిసార్లు భావిస్తుంటాయి. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలి. - నరేంద్ర మోదీ సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం నుంచి కొనసాగుతున్న కేంద్ర ప్రణాళికాసంఘం స్థానంలో.. ప్రధానమంత్రి సారథ్యంలో పనిచేసే ముఖ్యమంత్రుల మండలి వ్యవస్థను నెలకొల్పే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ‘టీం ఇండియా’ అనే పేరుతో నెలకొల్పే ఈ వ్యవస్థలో పలువురు కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు, వివిధ రంగాల నిపుణులకూ చోటు కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తన ఆలోచనను వివరించారు. ఇది సహకార సమాఖ్యను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అయితే.. ప్రణాళికాసంఘాన్ని పునర్వ్యవస్థీకరించే విషయంలో ముఖ్యమంత్రులందరి నుంచీ ఏకాభిప్రాయం లభించింది. కానీ.. సోవియట్ కాలం నాటి ప్రస్తుత ప్రణాళికాసంఘాన్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో కొత్త వ్యవస్థను నెలకొల్పాలన్న ప్రతిపాదనకు ఎన్డీఏ పక్షాల పాలనలోని రాష్ట్రాలు, ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ తదితర పార్టీల పాలనలోని రాష్ట్రాలు మద్దతు పలకగా.. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ప్రణాళికాసంఘాన్ని తొలగించి, దాని స్థానంలో సమకాలీన ఆర్థిక ప్రపంచానికి అనుగుణంగా కొత్త వ్యవస్థను నెలకొల్పుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కూలంకషంగా చర్చించేందుకు ప్రధాని ఆదివారం నాడు ఢిల్లీలోని తన నివాసంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ప్రణాళికాసంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయదలచుకున్న సంస్థ లక్ష్యాలు, విధివిధానాల గురించి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ప్రణాళికాసంఘం కార్యదర్శి సింధుశ్రీ వివరించారు. ఆ తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కొక్కరు 15 నిమిషాల నుంచి 30 నిమిషాల సేపు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. మధ్యాహ్న భోజనానంతరం అధికారులు లేకుండా కేవలం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులే సమావేశమై ఈ అంశంపై మరింత లోతుగా చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న పథకాల సమాచారాన్ని పరస్పరం పంచుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న జమ్మూకశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు.. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, మిజోరం సీఎం లాల్ తన్హావాలాలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగతా అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు కూడా భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రాలు అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి చెందదని ఉద్ఘాటించారు. విధాన ప్రణాళికారచన ప్రక్రియను పై నుంచి కింది వరకూ సమూలంగా మార్చాలని పేర్కొన్నారు. ‘‘కొత్త వ్యవస్థలో రాష్ట్రాలకు కీలక పాత్ర ఉండాలి. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఏ వేదికా లేదని రాష్ట్రాలు కొన్నిసార్లు భావిస్తుంటాయి. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలి. భారత బలాలకు అనుగుణంగా, రాష్ట్రాలను సాధికారం చేసే, ప్రభుత్వానికి వెలుపల జరిగే వాటితో సహా ఆర్థిక కార్యకలాపాలన్నిటికీ చోటు కల్పిస్తూ ఒక కొత్త వ్యవస్థను మనం అభివృద్ధి చేయగలమా?’’ అంటూ చర్చను ప్రారంభించారు. ప్రణాళికాసంఘంతో సుదీర్ఘ కాలం పనిచేసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కూడా.. సంస్కరణల అనంతర కాలంలో ప్రణాళికాసంఘానికి భవిష్యత్ దృష్టి లేదని పేర్కొన్నారని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు ప్రణాళికాసంఘం పునరుజ్జీవనం కావాలని పేర్కొన్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. భారతదేశం భారీ ముందడుగు వేసేందుకు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అవకాశాన్ని అందిస్తున్నాయన్నారు. దేశ శక్తిసామర్థ్యాలను తగినవిధంగా వినియోగించుకునే దృష్టితో ప్రస్తుత ప్రణాళికాసంఘం స్థానంలో వేరొక వ్యవస్థను నెలకొల్పటం ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విస్తృత ఏకాభిప్రాయం: జైట్లీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయని కాబట్టి అధికారాన్ని, ప్రణాళికారచనను వికేంద్రీకరించాలనే అంశంపై విస్తృత ఏకాభిప్రాయం లభించిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమావేశానంతరం మీడియాకు తెలిపారు. కొత్త వ్యవస్థలో సాంకేతిక ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులకు కూడా చోటు కల్పించాలని మోదీ కాంక్షిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవస్థలో విజ్ఞాన సంస్థలు, మేధావుల పాత్రపై కూడా కూలంకషంగా చర్చించటం జరిగిందని చెప్పారు. ‘‘ఇది ప్రణాళికారచనలో, విధాన రూపకల్పనలో ప్రయివేటు రంగానికి చోటు కల్పించనున్నందున.. ఈ అంశంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. మార్పులకు దాదాపు అందరూ అనుకూలంగా ఉన్నారు. అయితే.. ప్రస్తుత వ్యవస్థనే మెరుగుపరచాలా? లేక కొత్త వ్యవస్థను నెలకొల్పాలా? అనే ప్రశ్న తలెత్తింది’’ అని జైట్లీ వివరించారు. ప్రస్తుత వ్యవస్థనే మెరుగుపరచాలని ముగ్గురు, నలుగురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. ‘వారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వారా?’ అని ప్రశ్నించగా.. అవునని ఆయన బదులిచ్చారు. ఇప్పటికే పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-17) అమలులో ఉన్నందున.. ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తే ఆ ప్రణాళిక కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రశ్నలు వచ్చాయని చెప్పారు. కొత్త ప్రణాళికా వ్యవస్థ రూపకల్పనపై ఎలాంటి కాలవ్యవధినీ నిర్ణయించలేదని.. సంప్రదింపులు పూర్తయిన తర్వాత అన్ని అభిప్రాయాలనూ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే.. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ నాటికి కొత్త వ్యవస్థ రూపురేఖలను ఖరారు చేయవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం. నాలుగు అంశాలపై సుదీర్ఘ చర్చ... భేటీలో పంచవర్ష ప్రణాళికావ్యవస్థ భవిష్యత్తు, వార్షిక ప్రణాళికలు, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల ప్రవాహం అనే నాలుగు కోణాలపై చర్చలు జరిపారు. ప్రస్తు త ప్రణాళికాసంఘాన్ని పూర్తిగా రద్దుచేసి.. సహకార సమాఖ్యను బలోపేతం చేసేలా ప్రధాని, కొందరు కేంద్ర మంత్రులు, సీఎంలతో పాటు పలువురు సాంకేతిక ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులతో ‘టీమ్ ఇండియా’ వ్యవస్థను నెలకొల్పే ఆలోచనను మోదీ ప్రతిపాదించారు. సీఎంలకు రొటేషన్ ప్రాతిపదికన ఈ వ్యవస్థలో చోటు కల్పించటంతో పాటు.. రాష్ట్రాల తమ అవసరాలకు అనుగుణంగా నిధులు వినియోగించుకునే స్వేచ్ఛ ఇచ్చే ప్రతిపాదనలు చేశారు. అయితే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ప్రణాళికాసంఘాన్ని పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచనకు మద్దతుపలికారు. కానీ.. ప్రణాళికాసంఘాన్ని పూర్తిగా రద్దుచేయాలన్న ఆలోచనను వ్యతిరేకించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాలు, ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ వంటి పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు మాత్రం.. ప్రణాళికాసంఘాన్ని తక్షణమే రద్దుచేయటానికి మొగ్గుచూపారు. -
దేశాన్ని కాదు... మీ కేబినెట్‌ను క్లీన్ చేయాలి: వీహెచ్
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీసిపారేశారు. స్వచ్ఛ భారత్ స్లోగన్ కొత్తదేమీ కాదని, గాంధీ నుంచి నెహ్రు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు చేసిన కార్యక్రమమేనని ఆయన చెప్పుకొచ్చారు. మోదీ ముందుగా తన కేబినెట్‌ను క్లీన్ చేసుకోవాలని, దేశాన్ని దోచుకున్నవారంతా మోదీ కేబినెట్లోనే ఉన్నారన్నారు. స్వచ్ఛ్ భారత్ పేరుతో కొద్దిసేపు సెలబ్రిటీలు ఫోటోలకు ఫోజులిచ్చిన తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదన్నారు. నిరంతరం శ్రమించే కార్మికులను ఆదుకోవాలని వీహెచ్ అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో క్రిమినల్స్, అవినీతిపరులకు అవకాశం ఎలా కల్పించారని వీహెచ్ ప్రశ్నించారు. దేశంలోనే కాదని, ఇతర దేశాల్లోనూ బ్యాంకులకు వందలకోట్లు ఎగవేసిన సుజనా చౌదరికి చంద్రబాబు ఏవిధంగా రికమెండ్ చేశారని ...అందుకు మోదీ ఎలా ఆమోదించారన్నారు. వెనకబడిన వర్గాలకు చెందిన దేవేందర్ గౌడ్, గుండు సుధారాణికి అవకాశం ఇస్తే బాగుండేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. సెటిలర్లు కూడా తెలంగాణలో టీడీపీ ఉండదని డిసైడయ్యారని ఆయన అన్నారు. -
కేబినెట్ మంత్రులకు మోడి అల్పాహార విందు
-
కేబినేట్ కొత్త మంత్రులు ఖరారు
-
దేవేంద్రుడు నెగ్గుకొచ్చేనా..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. పూర్తిమెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం అంగరంగవైభవంగా సీఎంతో పాటు మరికొంత మంది మంత్రులతో ప్రమాణస్వీకారాలు పూర్తిచేసింది. అయితే 15 రోజుల్లోగా ఫడ్నవీస్ సర్కారు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో శివసేన మద్దతు తీసుకుంటుందా..లేక ఎన్సీపీ మద్దతు తీసుకుంటుందా.. అనే విషయంపై ఎలాంటి స్పష్టతలేదు. ఇదిలా ఉండగా, బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అరుణ్ జైట్లీ, దేవేంద్ర ఫడ్నవీస్ ఫోన్ చేయడంతో ప్రమాణస్వీకారోత్సవానికి చివరి క్షణంలో హాజరయ్యారు. అయితే బీజేపీకి ఆ పార్టీ మద్దతుపై మాత్రం ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, శివసేనతో చర్చలు జరిపి వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన తర్వాతే పూర్తిస్థాయి మంత్రివర్గ ఏర్పాటు జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మైనార్టీ ప్రభుత్వ ఏర్పాటుకూ యోచన...? శివసేనతో చర్చలు విఫలమైతే మైనార్టీ ప్రభుత్వంతో ముందుకు వెళ్లేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వానికి మరో 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో శివసేన లేదా ఎన్సీపీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్సీపీ బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అదే విధంగా అవసరమైతే బలనిరూపణ రోజున తమ ఎమ్మెల్యేలు గైర్హాజర వుతారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే బీజేపీ సర్కారు మైనార్టీలో ఉన్నప్పటికీ బలనిరూపణలో నెగ్గుతుంది. అయితే ఎన్సీపీ మద్దతు తీసుకోవడంపై అనేక మంది బీజేపీ నాయకులు సుముఖంగా లేరు. ముఖ్యంగా ప్రచారసమయంలో అవసరమైతే అధికారాన్ని వదులుకుంటాం కాని ఎన్సీపీ మద్దతు తీసుకునే ప్రసక్తేలేదని స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ చాలాసార్లు పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్సీపీ మద్దతు తీసుకున్నట్టయితే ప్రజల్లో తప్పుడు సందేశం వెళుతుందని పలువురు బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. దీంతో శివసేన మద్దతు తీసుకునేందుకు మొదటిప్రాధాన్యం ఇవ్వాలని, అది కుదరకపోతే ఇండిపెండెంట్లు, ఇతర ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాలని బీజేపీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపింది. ఇలాంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలనిరూపణపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. -
మంత్రుల వివరాలివే..
సాక్షి, ముంబై: ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎంతోపాటు ఎనిమిది మంత్రి కేబినెట్ మంత్రులు, ఇద్దరు సహాయ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వారి వివరాలిలా ఉన్నాయి... ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ : మహారాష్ట్రంలో బీజేపీ మొదటి ముఖ్యమంత్రి. విదర్భ రీజియన్ నుంచి నాలుగో ముఖ్యమంత్రి. నాగపూర్ నియోజకవర్గంలో వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. 2013లో బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా నియామకం. క్యాబినెట్ మంత్రులు ఏక్నాథ్ ఖడ్సే: ముక్తాయినగర్ నియోజకవర్గంలో వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. కాషాయ కూటమి ప్రభుత్వంలో ఆర్థిక, ఉన్నత విద్యాశాఖల మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. సుధీర్ మునగంటివార్ : వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడి గా పనిచేశారు. కాషాయ కూటమి సర్కారులో పర్యటన, వినియోగదారుల సంరక్షణ మంత్రిగా పనిచేశారు. వినోద్ తావ్డే : విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నాయకుడు. ముంబై బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. పంకజా ముండే: పర్లీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. బీజేపీ కోర్ కమిటిలో సభ్యురాలు. దివంగత గోపినాథ్ ముండేకు రాజకీయ వారసురాలు. ప్రకాశ్ మెహతా: ఘాట్కోపర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముంబై బీజేపీ మాజీ అధ్యక్షుడిగా, కాషాయ కూటమి సర్కారులో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. విష్ణు సావరా : విక్రంగఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆరు పర్యాయాలు విధాన్సభకు ఎన్నికయ్యారు. ఆదివాసుల నాయకుడిగా గుర్తింపు. కాషాయ కూటమి సర్కారులో గిరిజిన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రకాంత్ పాటిల్: కొల్హాపూర్ ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీ మహారాష్ట్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సహాయ మంత్రులు విద్యా ఠాకూర్ : గోరేగావ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ తరఫున ఉత్తర భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. ముంబై డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. బీఎంసీనుంచి నాలుగు పర్యాయాలు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. దిలీప్ కాంబ్లే : పుణే కంటోన్మెంట్ నుంచి రెండోసారి గెలిచారు. కాషాయ కూటమి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. బీజేపీలో దళిత నాయకుడిగా గుర్తింపు ఉంది. -
మంత్రులకు చంద్రబాబు గ్రేడ్లు
-
మంత్రులకు చంద్రబాబు గ్రేడ్లు
శాఖలపై పట్టు, అసెంబ్లీలో వారి వ్యవహార శైలీ పరిగణనలోకి తొలి స్థానంలో దేవినేని, తదుపరి స్థానాల్లో కామినేని, అచ్చెన్నాయుడు యనమల, కేఈలకు దక్కని గ్రేడ్లు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మంత్రులకు గ్రేడింగ్ ఇచ్చారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినే ని ఉమామహేశ్వరరావు తొలిస్థానంలో నిలిచారు. బీజేపీకి చెందిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు తదితరులకు వరుసగా ఆ తదుపరి స్థానాలు దక్కాయి. శాఖలపై మంత్రుల సమీక్షలు, సాధించిన పట్టు, అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, జిల్లాల్లో పర్యటనలు, ప్రజలు..పార్టీ కార్యకర్తలతో సంబంధాలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని స్థానాలను నిర్ణయించి నట్టు చెబుతున్నారు. వంద రోజుల పాలన పూర్తయిన తర్వాత మంత్రులకు గ్రేడింగ్‌లు ఇస్తానని చెప్పిన మేరకు వారి పనితీరుపై ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పార్టీ పరంగా ఆయన కుమారుడు లోకేష్ సమాచారం రాబట్టారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత, రోడ్లు, భవనాల మంత్రి రాఘవరావు, పౌరసంబంధాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, పురపాలక మంత్రి పి.నారాయణలు వరుసగా దేవినేని, కామినేని, కింజరాపుల తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ గ్రేడింగ్ల్లో సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తిలకు చోటు దక్కకపోవడం గమనార్హం. -
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు
రాష్ట్రానికి చెందిన 11మంది మంత్రులకు ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఛాంబర్లు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం కేఈ ప్రభాకర్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, పీతల సుజాత, కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలకు సచివాలయంలోని జే బ్లాక్ కేటాయించింది. అలాగే డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్ రెడ్డిలకు సౌత్ హెచ్ బ్లాక్‌లో ఛాంబర్లు కేటాయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. దాంతో సచివాలయంలో పలు భవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మరి కొన్ని భవనాలు తెలంగాణకు కేటాయించిన సంగతి తెలిసిందే. -
ప్రధానికి ఆస్తులు, అప్పుల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ కేబినెట్లోని మంత్రులందరూ రెండు నెలల్లోగా తమ ఆస్తులు, అప్పులు, వ్యాపారాల వివరాలను ప్రధానమంత్రికి సమర్పించాలి. తమతో పాటు కుటుంబసభ్యుల పేరిట ఉన్న స్థిరాస్తులు, షేర్లు.. డిబెంచర్ల పూర్తి విలువ సుమారుగా ఎంత, నగదు, ఆభరణాల నిల్వకు సంబంధించిన వివరాలన్నిటినీ వెల్లడించాలి. అంతేకాదు మంత్రులుగా నియూమకం కాకముందు ఏవైనా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంటే వాటితో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలి. వ్యాపార సంస్థల యూజమాన్యం, నిర్వహణ నుంచి వైదొలగాలి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మంత్రుల కోసం హోం మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన నియమావళిలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఈ నియమావళి అమలును స్వయంగా ప్రధానమంత్రి పర్యవేక్షిస్తారు. పౌర సేవల విషయంలో రాజకీయ నిష్పాక్షికతను కాపాడాల్సిందిగా ఇందులో మంత్రులకు సూచించారు. ఉన్నతాధికారుల విధులు, బాధ్యతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు వారిపై ఒత్తిడి తేరాదని ఆదేశించారు. మంత్రుల కుటుంబసభ్యులు ప్రభుత్వానికి సేవలందించడం లేదా వస్తువులు సరఫరా చేయడానికి సంబంధించిన ఎలాంటి వ్యాపారాన్నైనా ప్రారంభించడం కానీ లేదా ఆ వ్యాపారంలో పాల్గొనడం కానీ చేసేందుకు వీల్లేదు. కేంద్ర మంత్రులతో పాటు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ / కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు.. తమ భర్త లేదా భార్య, తమపై ఆధారపడినవారు దేశంలో లేదా విదేశంలో ఏ విదేశీ ప్రభుత్వ ఉద్యోగంలోనైనా చేరేందుకు అనుమతించకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం సేకరించినప్పుడు మినహా సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి స్థిరాస్తులను కొనడం కానీ లేదా ప్రభుత్వానికి అమ్మడం కానీ చేయరాదు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ పదవిలో కొనసాగే వరకు ప్రతి ఏటా ఆగస్టు 31లోగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రధానికి సమర్పించాలని నియమావళి స్పష్టం చేస్తోంది. -
అగ్రకులాలకే అగ్రపీఠం
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అగ్రకులస్తులకే ఉన్నత పదవులు లభించాయి. మంత్రివర్గ కూర్పులో ముఖ్యంగా ఉత్తరాదిలో ఉన్నతకులాలైన బ్రాహ్మణ, రాజ్పుట్, కాయస్త, వైశ్య సామాజికవర్గానికి చెందిన వారికే మోడీ పెద్దపీట వేశారు. అలాగే, సామాజికంగా బలమైన వర్గాలుగా పేరున్న లింగాయత్, వక్కలిగా, మరాఠాలకు కూడా తగు ప్రాధాన్యం కల్పించారు. 46 మంది మంత్రుల్లో వీరే 20మంది ఉన్నారు. ఇక 13 మంది ఓబీసీలు, ఆరుగురు గిరిజనులు, ముగ్గురు దళితులకు మోడీ టీంలో చోటు దక్కింది. హిందూయేతర వ్యక్తులు కేవలం ముగ్గురే ఉన్నారు. వీరిలో హర్సిమ్రత్ కౌర్ బాదల్ సిక్కు, నజ్మాహెప్తుల్లా ముస్లిం, ఇక స్మృతి ఇరానీ, మేనకాగాంధీలది ఫలానా సామాజికవర్గం అనిచెప్పడం కష్టం. 24 మంది కేబినెట్ మంత్రుల్లో... అగ్రకులస్తులు-12, ఓబీసీలు-5, దళితులు-2, గిరిజనులు-1 10 మంది స్వతంత్ర హోదా గల మంత్రుల్లో అగ్రకులస్తులు-5, ఓబీసీలు4, గిరిజనులు-1, దళితులు లేరు 12 మంది సహాయమంత్రుల్లో గిరిజనులు -4, ఓబీసీలు -4, అగ్రకులస్తులు-3 -
కేంద్ర మంత్రులు-కేటాయించిన శాఖలు
న్యూఢిల్లీ : కొత్తగా కొలువు తీరిన కేబినెట్ సభ్యులకు శాఖల కేటాయింపు జరిగింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు: పేరు శాఖ 1) నరేంద్రమోడీ - ప్రధానమంత్రి 2) రాజ్‌నాథ్ సింగ్ - హోం శాఖ 3) సుష్మా స్వరాజ్ - విదేశీ వ్యవహారాలు 4) అరుణ్ జైట్లీ - ఆర్థిక(అదనంగా రక్షణ శాఖ) కార్పొరేట్ వ్యవహారాలు 5) ఎం. వెంకయ్యనాయుడు - పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు 6) నితిన్ గడ్కారీ - ఉపరితల రవాణా, షిప్పింగ్ 7) డీవీ సదానంద గౌడ - రైల్వే శాఖ 8) నజ్మా హెప్తుల్లా - మైనారిటీ వ్యవహారాలు 9) ఉమాభారతి - జల వనరులు, గంగా ప్రక్షాళన 10) గోపీనాథ్ ముండే - గ్రామీణాభివృద్ధి 11) రామ్‌విలాస్ పాశ్వాన్ - ఆహార, పౌర సరఫరాలు 12) కల్రాజ్ మిశ్రా - సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 13) మేనకా గాంధీ - మహిళ, శిశు సంక్షేమం 14) అనంత్‌కుమార్ - ఎరువులు, రసాయన శాఖ 15) అశోక్ గజపతి రాజు - పౌర విమానయానం 16) అనంత్ గీతె- భారీ పరిశ్రమలు 17) హర్సిమ్రత్సింగ్ కౌర్ బాదల్- ఫుడ్ ప్రొసెసింగ్ 18) రవిశంకర్ ప్రసాద్ - న్యాయ, టెలికం 19) నరేంద్ర సింగ్ తోమర్ - గనులు, ఉక్కు, కార్మిక ఉపాధి కల్పన 20) జువల్ ఓరామ్ - గిరిజన వ్యవహారాలు 21) రాధామోహన్ సింగ్ - వ్యవసాయం 22) తావర్ చంద్ గెహ్లాట్ - సామాజిక న్యాయం, 23) స్మృతి జుబిన్ ఇరానీ - మానవ వనరులు 24) హర్షవర్ధన్ - ఆరోగ్యం సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1) జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ - విదేశాంగ సహాయ మంత్రి 2) ఇందర్‌జిత్‌సింగ్ రావు - గణాంకాలు, కార్యక్రమాల అమలు, రక్షణ ప్రణాళిక 3) సంతోష్‌కుమార్ గంగ్వార్ - టెక్స్టైల్స్ 4) శ్రీపద్ యశోనాయక్ - సంస్కృతి, పర్యాటకం 5) ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజ వనరులు 6) సర్బానంద సోనోవాల్ - నైపుణ్యత, యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్, 7) ప్రకాశ్ జవదేకర్ - అటవీ వ్యవహారాలు, పర్యావరణ శాఖ 8) పియూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు గనులు 9) జితేంద్ర సింగ్ - సైన్స్ అండ్ టెక్నాలజీ 10) నిర్మల సీతారామన్ - వాణిజ్యం, పరిశ్రమలు సహాయ మంత్రులు 1) జీఎం సిద్ధేశ్వర - పౌర విమానయానం 2) మనోజ్ సిన్హా - రైల్వే శాఖ 3) నిహాల్చంద్ - కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 4) ఉపేంద్ర కుష్వాహ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ 5) పీ రాధాకృష్ణన్ - భారీ పరిశ్రమలు, 6) కిరణ్ రాజు - హోం ఎఫైర్స్ 7) కృష్ణన్ పాల్ - రోడ్డు ట్రాన్స్పోర్ట్,రహదారులు,షిప్పింగ్ 8) సంజీవ్ కుమార్ బాల్యన్ - ఫుడ్ ప్రోసెసింగ్ 9) మన్సుఖ్భాయి ధన్జీభాయి వాసవ - గిరిజనాభివృద్ధి 10) రావు సాహెబ్ దాదారావు దాన్వే - కన్య్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 11) విష్ణుదేవ్ సాయి - మైన్స్, స్టీల్, లేబర్ 12) సుదర్శన్ భగత్ - సామాజిక న్యాయం, -
45మందితో మోడీ టీం
* 23 కేబినెట్, 22 సహాయ మంత్రులు * సహాయమంత్రుల్లో 10 మందికి స్వతంత్ర హోదా * ఏడుగురు మహిళలకు అవకాశం * 8 పదవులతో యూపీకే అత్యధిక ప్రాతినిధ్యం * తెలంగాణను కరుణించని మోడీ * ప్రాతినిధ్యమే లేని పశ్చిమబెంగాల్ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో 45 మంది సభ్యుల మంత్రివర్గం కొలువుతీరనుంది. వారిలో 23 మంది కేబినెట్ మంత్రులు కాగా, 10 మంది స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మొత్తంమీద మోడీ తాను కోరుకున్నట్లుగా చిన్న కేబినెట్‌నే ఏర్పరుచుకున్నారు. ఊహించినట్లే బీజేపీ సీనియర్ నేతలకు కేబినెట్ బెర్త్‌లు లభించాయి. వారిలో రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కారీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతి, రవిశంకర్ ప్రసాద్ తదితరులున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా ప్రాతినిధ్యం లభించింది. వాటిలో శివసేన, టీడీపీ, ఎల్జేపీ, శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), రాష్ట్రీయ లోక్తాంత్రిక్ సమతా పార్టీ ఒక్కో మంత్రిపదవిని దక్కించుకున్నాయి. వారిలో టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు, ఎల్జేపీ నుంచి రామ్‌విలాస్ పాశ్వాన్, ఎస్ఏడీ నుంచి హర్సిమ్రత్ కౌర్ బాదల్.. తదితరులున్నారు. మోడీ మంత్రివర్గంలో మహిళలకు సముచిత ప్రాధాన్యత లభించింది. ఏడుగురు మహిళలకు మోడీ అవకాశం కల్పించారు. సుష్మాస్వరాజ్, నజ్మా హెప్తుల్లా, ఉమాభారతి, మనేకా గాంధీ, హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్, స్మృతి ఇరానీలకు కేబినెట్ హోదా లభించగా.. నిర్మల సీతారామన్‌ను సహాయమంత్రిగా నియమించారు. జల వనరుల శాఖతో పాటు ప్రత్యేకంగా గంగానది ప్రక్షాళన బాధ్యతను ఉమాభారతికి అప్పగించారు. మోడీ మంత్రివర్గంలోని అత్యంత చిన్న, అత్యంత వృద్ధ మంత్రులు కూడా మహిళలే కావడం విశేషం. 38 ఏళ్ల సృ్మతి ఇరానీ అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి కాగా.. 74 ఏళ్ల నజ్మా హెప్తుల్లా అత్యధిక వయసు కలిగిన మంత్రిగా ఉన్నారు. వీరిద్దరూ రాజ్యసభ సభ్యులే కావడం విశేషం. నజ్మా హెప్తుల్లా మోడీ మంత్రివర్గంలోని ఏకైక ముస్లిం కావడం గమనార్హం. పురుషుల్లో వృద్ధ మంత్రిగా 74 ఏళ్ల కల్రాజ్ మిశ్రా నిలిచారు. యూపీనే టాప్ రాష్ట్రాలవారీగా బీజేపీకి అత్యధిక స్థానాలిచ్చిన ఉత్తరప్రదేశ్‌కు అదే స్థాయిలో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. ప్రధానమంత్రి కాకుండా ఉత్తరప్రదేశ్‌కు కేబినెట్, ఇండిపెండెంట్, సహాయక మంత్రిపదవులు కలిపి మొత్తంగా 8 దక్కాయి. ఆ తరువాత మహారాష్ట్రకు 6, బీహార్‌కు 5, మధ్యప్రదేశ్‌కు 4 పదవులు దక్కాయి. మధ్యప్రదేశ్‌కు మొత్తం 4 కేబినెట్ పదవులు దక్కాయి. ఆ తరువాత కర్ణాటకకు 4, గుజరాత్‌కు 3, హర్యానాకు 2 మంత్రిపదవులు లభించాయి. అరుణాచల్ ప్రదేశ్, అసోంలకు మినహా ఈశాన్య రాష్ట్రాలకు మోడీ టీంలో ప్రాతినిధ్యం లభించలేదు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, జమ్మూకాశ్మీర్, జార్ఘండ్, గోవా, ఢిల్లీ రాష్ట్రాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు లభించాయి. కొత్త రాష్ట్రం తెలంగాణకు ప్రాతినిధ్యం లభించలేదు. విద్యుత్తు, ఉపాధి రంగాల్లో కేంద్రం నుంచి భారీ సహాయాన్ని ఆశిస్తున్న తెలంగాణ ప్రజలకు తాజా మంత్రివర్గ కూర్పు నిరాశ కలిగించింది. తెలంగాణ నుంచి కేబినెట్ పదవి ఆశించిన బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు అవకాశం లభించలేదు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్‌గజపతి రాజుకు కేబినెట్ పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యనాయుడుకు కర్నాటక కోటాలో కేబినెట్ మంత్రి పదవిని కేటాయించారు. కాగా పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలకు కూడా మోడీ మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. మొత్తం 25 లోక్‌సభ స్థానాలను బీజేపీకే కట్టబెట్టిన రాజస్థాన్‌కు ఒకే ఒక మంత్రి పదవి లభించడం గమనార్హం. వీరికి చోటు లేదు బీజేపీ అగ్రనేత, వాజ్‌పేయి ప్రభుత్వంలో ఉపప్రధానిగా, హోమంత్రిగా వ్యవహరించిన ఎల్కే అద్వానీకి మోడీ టీంలో చోటు దక్కలేదు. మోడీ పెట్టిన 75 ఏళ్ల కటాఫ్ కారణంగానే ఆయనకు అవకాశం లభించలేదని సమాచారం. అలాగే, గత ఎన్డీఏ ప్రభుత్వాల్లో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ, బీసీ ఖండూరి, శాంతకుమార్లకు కూడా అదే కారణంతో అవకాశం లభించలేదని తెలుస్తోంది. గుజరాత్ భవన్లో సోమవారం ఉదయం మోడీ ఇచ్చిన తేనీటి విందుకు కూడా జోషీకి పిలుపు లేదు. కేవలం కాబోయే మంత్రులనే ఆయన ఆహ్వానించారు. అయితే, అరుణ్ శౌరీకి అవకాశం లభించకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. మోడీ టీంలో అవకాశం దక్కని వారిలో సుబ్రమణ్యస్వామి, రాజీవ్ ప్రతాప్ రూడీలు కూడా ఉన్నారు. పార్లమెంటు సభ్యులు కాకుండానే..: ఇక తాజా మంత్రివర్గంలో బీజేపీ నేతలు నిర్మలా సీతారామన్, ప్రకాశ్ జవదేకర్, రాధామోహన్లు అటు లోక్‌సభకు గానీ, ఇటు రాజ్యసభకు కానీ సభ్యులుగా లేకుండానే మంత్రిపదవులు దక్కాయి. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన రాజ్యసభ సభ్యులు అరుణ్‌జైట్లీ, స్మృతి ఇరానీలకు కేబినెట్ పదవులు దక్కడం విశేషం. ఇంకా పలువురు రాజ్యసభ సభ్యులకు మంత్రిపదవులు దక్కాయి. మంత్రిపదవులు దక్కిన రాజ్యసభ సభ్యుల్లో వెంకయ్యనాయుడు, నజ్మాహెప్తుల్లా, స్మృతిఇరానీ, అరుణ్‌జైట్లీ, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్‌గోయల్, రవిశంకర్‌ప్రసాద్ తదితరులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ మంత్రులుగా సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన 45 మందిలో అత్యధికులు జాతీయ భాష హిందీలోనే ప్రమాణం చేశారు. కేవలం 10 మంది మాత్రమే ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మేనకా గాంధీ, నిర్మలా సీతారామన్, నజ్మా హెప్తుల్లా, వెంకయ్య నాయుడు, అశోక గజపతి రాజు(టీడీపీ), హర్సింరాత్ కౌర్ బాదల్(అకాలీదళ్) ఉన్నారు. కొత్త మంత్రులు వీరే... న్యూఢిల్లీ: అధికారికంగా ప్రకటించనప్పటికీ.. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఈ శాఖలను కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. పేరు శాఖ 1) నరేంద్రమోడీ ప్రధానమంత్రి 2) రాజ్‌నాథ్ సింగ్ హోం 3) సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాలు 4) అరుణ్ జైట్లీ ఆర్థిక(అదనంగా రక్షణ శాఖ) 5) ఎం. వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు 6) నితిన్ గడ్కారీ ఉపరితల రవాణా, షిప్పింగ్ 7) డీవీ సదానంద గౌడ రైల్వే 8) నజ్మా హెప్తుల్లా మైనారిటీ వ్యవహారాలు 9) ఉమాభారతి జల వనరులు 10) గోపీనాథ్ ముండే గ్రామీణాభివృద్ధి 11) రామ్‌విలాస్ పాశ్వాన్ ఆహార, పౌర సరఫరాలు 12) కల్రాజ్ మిశ్రా - 13) మేనకా గాంధీ మహిళ, శిశు సంక్షేమం 14) అనంత్‌కుమార్ - 15) అశోక్ గజపతి రాజు పౌర విమానయానం 16) అనంత్ గీతె భారీపరిశ్రమలు 17) హర్సిమ్రత్సింగ్ కౌర్ బాదల్ ఫుడ్ ప్రొసెసింగ్ 18) రవిశంకర్ ప్రసాద్ న్యాయ, టెలికం 19) నరేంద్ర సింగ్ తోమర్ - 20) జువల్ ఓరామ్ గిరిజన వ్యవహారాలు 21) రాధామోహన్ సింగ్ వ్యవసాయం 22) తావర్ చంద్ గెహ్లాట్ - 23) స్మృతి జుబిన్ ఇరానీ మానవ వనరులు 24) హర్షవర్ధన్ ఆరోగ్యం సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1) జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ - 2) ఇందర్‌జిత్‌సింగ్ రావు - 3) సంతోష్‌కుమార్ గంగ్వార్ - 4) శ్రీపద్ యశోనాయక్ - 5) ధర్మేంద్ర ప్రధాన్ - 6) సర్బానంద సోనోవాల్ - 7) ప్రకాశ్ జవదేకర్ సమాచార ప్రసార శాఖ 8) పియూష్ గోయల్ విద్యుత్ 9) జితేంద్ర సింగ్ - 10) నిర్మల సీతారామన్ వాణిజ్యం సహాయ మంత్రులు 1) జీఎం సిద్ధేశ్వర - 2) మనోజ్ సిన్హా - 3) నిహాల్చంద్ - 4) ఉపేంద్ర కుష్వాహ - 5) పీ రాధాకృష్ణన్ - 6) కిరణ్ రాజు - 7) కృష్ణన్ పాల్ - 8) సంజీవ్ కుమార్ బాల్యన్ - 9) మన్సుఖ్భాయి ధన్జీభాయి వాసవ - 10) రావు సాహెబ్ దాదారావు దాన్వే - 11) విష్ణుదేవ్ సాయి - 12) సుదర్శన్ భగత్ - -
మనకు 6 బెర్తులు
సాక్షి ముంబైః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టీమ్‌లో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి చోటుదక్కింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి కొనసాగిన ఉత్కంఠతకు సోమవారం తెరదింపుతూ రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో శివసేనకు చెందిన ఒకే ఎంపీ ఉండగా బీజేపీ సభ్యులు ఐదుగురు ఉన్నారు. కేబినేట్ హోదా దక్కించుకున్నవారిలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే ఉన్నారు. మరోవైపు స్వతంత్రహోదాలో మంత్రి పదవి దక్కించుకున్న వారిలో బీజేపీ ఎంపీలు ప్రకాష్ జావ్డేకర్, పీయుష్ గోయల్ ఉన్నారు. శివసేన సీనియర్ నాయకుడు అనంత్ గీతేకు కేబినేట్ హాదా కల్పించారు. జాల్నా బీజేపీ ఎంపీ రావుసాహెచ్ దాన్వే కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో బీజేపీ, శివసేన కార్యకర్తలు ముంబైలో సోమవారం భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఎవరికి ఏ శాఖలు...? రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీలకు మంత్రులుగా అవకాశం వచ్చినా, ఎవరికి ఏయే శాఖలు కేటాయించనున్నారనే విషయంపై సస్పెన్స్ వీడలేదు. సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. లేదంటే గ్రామీణాభివృద్ధిశాఖ ఇచ్చేఅవకాశం ఉంది. ముండేకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి లభించే అవకాశాలే అధికమని బీజేపీ నాయకులు అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రైతుల సమస్యలు పరిష్కరించేందుకుగా ముండేకు వ్యవసాయశాఖ మంత్రి పదవిని కట్టబెడతామన్నారు. ఈ విషయంపై ముండే మాత్రం ఏమీ చెప్పడంలేదు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని అంటున్నారు. ఇది ఉండగా మరోవైపు బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లేదా రైల్వేశాఖ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మౌలిక సదుపాయాల రంగంపై ఆయనకు ఆసక్తి అధికమని చెబుతారు. గతంలోనూ ఆయన రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇక పీయుష్ గోయల్, ప్రకాష్ జావ్డేకర్కు ఏయే శాఖలు దక్కుతానేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు శివసేన నాయకుడు ఆనంత్ గీతేకు కూడా ఏ శాఖను కేటాయించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. మిత్రపక్షాల్లో అసంతృప్తి...? పదవుల కేటాయింపుపై బీజేపీ మిత్రపక్షాలు శివసేన, ఆర్పీఐ, స్వాభిమానీ శేత్కారి పార్టీల్లో కొంత అసంతృప్తి నెలకొందని తెలుస్తోంది. శివసేన కనీసం ఒక కేబినేట్, రెండు సహాయమంత్రి పదవులు లభిస్తాయని ఆశలు పెట్టుకుంది. ఈ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ జోషికి లోక్‌సభ స్పీకర్ పదవి దక్కుతోందని వార్తలు వచ్చాయి. అయితే చివరికి రాయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఎంపీ ఆనంత్ గీతేకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. ఆయనకు కేబినేట్ హోదా ఇవ్వడంతో పార్టీకి కొంత ఊరట దక్కింది. మరోవైపు రామ్‌దాస్ ఆఠవలే, రాజు శెట్టి కూడా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. దీంతో రామ్‌దాస్ ఆఠవలే ప్రమాణ స్వీకార వేడుకలకు కూడా వెళ్లలేదని తెలిసింది. మలివిడత మంత్రి మండలి విస్తరణలో తమకు అవకాశం కల్పిస్తారన్న నమ్మకం శివసేన, ఆర్పీఐ, స్వాభిమానీ శేత్కారి పార్టీల్లో కనిపిస్తోంది. -
మోడీ టీంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు
న్యూఢిల్లీ: భారతదేశ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ కేబినెట్ లో 46 మందికి చోటు దక్కింది. చిన్న కేబినెట్ అయితే నాణ్యమైన పాలన ఉంటుందని భావించిన మోడీ.. అందుకు అనుగుణంగానే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. మోడీ మంత్రివర్గంలో 24 మందికి కేబినెట్ హోదా, 10 మందికి సహాయ మంత్రులు, 12 మందికి స్వతంత్ర హోదా దక్కింది. ఇక రక్షణ శాఖను మోడీ తన ఆధ్వర్యంలోనే ఉంచుకోవాలని భావించినా.. ఆ స్థానాన్ని అరుణ్ జైట్లీకి కేటాయించనున్నారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్‌కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, సుష్మా స్వరాజ్ కు విదేశాంగమంత్రిగా , అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖ , హర్షవర్థన్‌కు ఆరోగ్య శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు.. 1.రాజ్ నాథ్- (ఉత్తరప్రదేశ్) 2. సుష్మా స్వరాజ్-(హర్యానా) 3.అరుణ్ జైట్లీ (ఢిల్లీ) 4.ఎం.వెంకయ్య నాయుడు(కర్ణాటక) 5.నితిన్ జైరాం గడ్కరీ(మహారాష్ట్ర) 6.సదానంద గౌడ(కర్నాటక) 7.ఉమాభారతి(ఉత్తరప్రదేశ్) 8.నజ్మా హెప్తుల్లా(ఉత్తరప్రదేశ్) 9.గోపీనాథ్ ముండే(మహారాష్ట్ర) 10.రాం విలాస్ పాశ్వాన్ (బీహార్) 11.కల్ రాజ్ మిశ్రా(ఉత్తరప్రదేశ్) 12.మేనకా గాంధీ(ఉత్తరప్రదేశ్) 13.అనంత కుమార్(కర్నాటక) 14.రవిశంకర్ ప్రసాద్ (బీహార్) 15.అశోక్ గజపతిరాజు(ఆంధ్రప్రదేశ్) 16.అనంత్ గీతె(మహారాష్ట్ర) 17.హర్ సిమ్రత్ కౌర్ బాదల్(పంజాబ్) 18.నరేంద్ర సింగ్ తోమార్(మధ్యప్రదేశ్) 19.జ్యూల్ ఓరమ్(సుందర్ ఘడ్) 20.రాధామోహన్ సింగ్( బీహార్) 21.తవర్ చంద్ గెహ్లాట్(రాజస్థాన్) 22.స్మృతీ ఇరానీ(గుజరాత్) 23.డాక్టర్ హర్ష వర్ధన్(ఢిల్లీ) 24.జనరల్ వీకే సింగ్(ఉత్తరప్రదేశ్) 25ఇంద్రజిత్ సింగ్( ఢిల్లీ) 26.సంతోష్ గ్యాంగ్వర్ (బరేలి) 27.శ్రీపాద్ నాయక్ (గోవా) 28.ధర్మేంద్ర ప్రధాన్ (రాజ్యసభ) 29.శర్వానంద్ సొనోవాల్(అసోం) 30.ప్రకాష్ జవదేకర్ (రాజ్యసభ) 31.మనోజ్ సిన్హా(గాజీపూర్) 32.ఉపేంద్ర కుష్వాహ్(కరకట్) 33.సిపి రాధాకృష్ణన్(తమిళనాడు) 34.కిరెణ్ రిజిజు(అరుణాచల్ ప్రదేశ్) 35.కిషన్ పాల్ గుజ్జర్(రాజస్థాన్) 36.సంజీవ్ కుమార్(ఉత్తరప్రదేశ్) 37.వాసవ మన్ఫుక్ భాయ్ ధనాజీభాయ్(గుజరాత్) 38.పీయూష్ జయప్రకాష్ గోయల్(రాజ్యసభ) 39.డాక్టర్ జితేంద్ర సింగ్(ఉదంపూర్) 40.నిర్మలా సీతారామన్(తమిళనాడు) 41.దాదారావ్ పటేల్ 42.విష్ణుదేవ్ సాయి 43.సుదర్శన్ భగత్ 44. నిహాల్ చంద్ 45.గౌడర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర(కర్నాటక) -
వామ్మో కాంగ్రెస్ టికెట్టా!
చెన్నై, సాక్షి ప్రతినిధి :కాంగ్రెస్ టికెట్‌పై పోటీనా వద్దు బాబోయ్ అంటున్నారు కేంద్ర మంత్రులు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా. కాంగ్రెస్ సైతం ప్రాంతీయ పార్టీల గొడుగు కిందే కొనసాగుతోంది. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది. బలహీనంగా ఉన్న బీజేపీ బలమైన కూటమిని ఏర్పరుకుంది. డీఎంకేతో పొత్తుపెట్టుకుని యూపీఏ 1, 2 కాలంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. జాతీయ స్థాయిలో అనేక అప్రతిష్టలు మూటగట్టుకున్న ఫలితంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఇక తప్పని సరై కాంగ్రెస్ ఒంటరిపోరుకు సిద్ధమైంది. అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడిన బీజేపీ, డీఎంకే, అధికార అన్నాడీఎంకేలు ఢీ అంటే ఢీ అంటూ ముందుకు సాగుతున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీల నడుమ నలిగిపోయే కంటే పోటీకీ దూరంగా ఉంటేనే మేలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ బడా నేతలు ముఖం చాటేయడం మొదలుపెట్టారు. అధిష్టానం వద్ద తనకున్న పరపతిని ఉపయోగించిన కేంద్ర మంత్రి చిదంబరం సైతం చల్లగా పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు కార్తీని బరిలో నిలిపారు. సీనియర్ నేతలు పోటీ చేయాల్సిందేనని అధిష్టానం హుకుం జారీచేయడంతోపాటు ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురికి టికెట్ ఖరారుచేసి జాబితాలో చేర్చింది. వద్దు వద్దంటున్నా వినిపించుకోని అధిష్టానం వైఖరితో మింగుడు పడని సిట్టింగ్ ఎంపీలు బలవంతంగానే బరిలోకి దిగుతున్నారు. జీకే వాసన్‌కు తప్పని పోరు రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్న ధృవాలైన కేంద్ర మంత్రులు చిదంబరం, జీకే వాసన్ ఇద్దరూ పోటీకి దూరంగా ఉంటామని ముందుగానే ప్రకటించారు. పోటీ విషయంలో సిట్టింగ్ ఎంపీల పట్ల నిఖార్సుగా వ్యవహరించిన అధిష్టానం చిదంబరం పట్ల మెతకవైఖరిని అవలంబించింది.ప్రచారానికే పరిమితం కానున్నట్లు జీకే వాసన్ ప్రకటించుకున్నారు. అధిష్టానం అందుకు ఒప్పుకోనట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుని హోదాలో నౌకాయానశాఖా మంత్రిగా పదవిని అనుభవించిన వాసన్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయక తప్పదని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. రాష్టంలో 39 లోక్‌సభ స్థానాలకు గాను 37 చోట్ల అభ్యర్థుల జాబితా వెల్లడైంది. దక్షిణ చెన్నై, విల్లుపురం స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దక్షిణ చెన్నై నుంచి జీకే వాసన్‌ను బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్న ట్టు సమాచారం. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు వాసన్ అంగీకరించని పక్షంలో జాబితాలో మార్పు చేసైనా అతన్ని పోటీలో నిలపాని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అధిష్టానం ఆదేశాలకు వాసన్ తలొగ్గుతారా, పార్టీలోని తన ప్రత్యర్థి చిదంబరంను మినహాయించి తనను మాత్రం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని వాదించి తప్పించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. మూడో జాబితాలో నలుగురు రాష్ట్రంలోని 39 స్థానాల్లో అభ్యర్థులను భర్తీ చేసేందుకు తంటాలు పడుతున్న కాంగ్రెస్ ఇప్పటికి రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి విడతలో 30 మంది, మలి విడతలో ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. తాజాగా బుధవారం విడుదల చేసిన మూడో జాబితాలో నలుగురి పేర్లను వెల్లడించింది.ఉత్తర చెన్నై నుంచి బీజూ సాక్కో, కృష్ణగిరి నుంచి డాక్టర్ సెల్వకుమార్, కరూరు నుంచి జ్యోతిమణి, కన్యాకుమారి నుంచి వసంతకుమార్ పోటీ చేయనున్నారు. మూడో జాబితాతో 37 సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తవగా, మరో రెండు స్థానాలు పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ పుస్తకాలు సీజ్ యూపీఏ పాలనలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ముద్రించిన పుస్తకాలను ఫ్లరుుంగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. కేరళ రాష్ట్రం కొట్టాయం లోక్‌సభ స్థానం నుంచి జోస్ కే మానిక్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ విజయాలను వివరిస్తూ తమిళనాడులోని శివకాశిలో ప్రింటింగ్ ప్రెస్ ద్వారా 17 లక్షల పుస్తకాలను ముద్రించారు. కాంగ్రెస్ పుస్తకాలను వేసుకుని కేరళకు వెళుతున్న కారును నెల్లై జిల్లా శివగిరి తాలూకా పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీచేశారు. పుస్తకాలకు సంబంధించి ఆర్డరు, ముద్రణకు చెల్లించిన బిల్లు మరే ఆధారమూ లేకపోవడంతో కారు సహా పుస్తకాలను సీజ్ చేశారు. విరుదునగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మోము చాటున....!
రాష్ట్ర విభజనలో సీమాంధులను దగా చేసిన కేంద మంత్రులు కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఉత్తరాంధ నుంచి బస్సు యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా నిన్న ఏలూరులో నిర్వహించిన సభలో సీమాంధ్రకు జరిగిన అన్యాయంపై పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎక్కడ నిలదీస్తారోనని నేతలు మోము చాటేశారు. కొందరు అటుఇటు చూస్తూ... మరికొందరు ఆవలింతలతో దర్శనమిచ్చారు. సీమాంధ్రలో పార్టీ మనుగడ కోసం నిద్రకు దూరమై ఊరువాడా బస్సుల్లో తిరుగుతున్న వీరి కష్టం ఫలిస్తుందో లేదో...పాపం...!