నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అగ్రకులస్తులకే ఉన్నత పదవులు లభించాయి. మంత్రివర్గ కూర్పులో ముఖ్యంగా ఉత్తరాదిలో ఉన్నతకులాలైన బ్రాహ్మణ, రాజ్‌పుట్, కాయస్త, వైశ్య సామాజికవర్గానికి చెందిన వారికే మోడీ పెద్దపీట వేశారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అగ్రకులస్తులకే ఉన్నత పదవులు లభించాయి. మంత్రివర్గ కూర్పులో ముఖ్యంగా ఉత్తరాదిలో ఉన్నతకులాలైన బ్రాహ్మణ, రాజ్‌పుట్, కాయస్త, వైశ్య సామాజికవర్గానికి చెందిన వారికే మోడీ పెద్దపీట వేశారు. అలాగే, సామాజికంగా బలమైన వర్గాలుగా పేరున్న లింగాయత్, వక్కలిగా, మరాఠాలకు కూడా తగు ప్రాధాన్యం కల్పించారు. 46 మంది మంత్రుల్లో వీరే 20మంది ఉన్నారు. ఇక 13 మంది ఓబీసీలు, ఆరుగురు గిరిజనులు, ముగ్గురు దళితులకు మోడీ టీంలో చోటు దక్కింది. హిందూయేతర వ్యక్తులు కేవలం ముగ్గురే ఉన్నారు. వీరిలో హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సిక్కు, నజ్మాహెప్తుల్లా ముస్లిం, ఇక స్మృతి ఇరానీ, మేనకాగాంధీలది ఫలానా సామాజికవర్గం అనిచెప్పడం కష్టం.
24 మంది కేబినెట్ మంత్రుల్లో... అగ్రకులస్తులు-12, ఓబీసీలు-5, దళితులు-2, గిరిజనులు-1
10 మంది స్వతంత్ర హోదా గల మంత్రుల్లో అగ్రకులస్తులు-5, ఓబీసీలు4, గిరిజనులు-1, దళితులు లేరు
12 మంది సహాయమంత్రుల్లో గిరిజనులు -4, ఓబీసీలు -4, అగ్రకులస్తులు-3