సాక్షి, ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి కేంద్రమంత్రులకు శాఖలను కేటాయించారు. ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణాల్లో 3కోట్ల గృహాలు నిర్మించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇక కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి
అమిత్ షా : కేంద్ర హోం శాఖ
నిర్మల సీతారామన్ : ఆర్థిక శాఖ
జయశంకర్ - విదేశాంగ శాఖ
రాజ్ నాథ్ సింగ్ :రక్షణ శాఖ
మనోహర్ లాల్ కట్టర్ : పట్టణ అభివృద్ధి శాఖ
శివరాజ్ సింగ్ చౌహన్ : వ్యవసాయ శాఖ మంత్రి , పంచాయతీరాజ్ శాఖ
సీఆర్ పాటిల్ : జలశక్తి
పీయూష్ గోయల్ : వాణిజ్య శాఖ మంత్రి
అశ్విని వైష్ణవ్ : సమాచార శాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ : మానవ వనరులు అభివృద్ది శాఖ
గజేంద్ర సింగ్ శేకావత్ : టూరిజం, సాంస్కృతిక శాఖ
జేపీ నడ్డా : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
జితిన్ రాం మాంజీ : సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రి
అన్నపూర్ణ దేవి : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
భూపేంద్ర యాదవ్ : అటవీ, పర్యావరణ శాఖ
కిరణ్ రిజిజు : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
చిరాగ్ పాశ్వాన్: క్రీడా శాఖ మంత్రి
కుమారస్వామి : భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి
సర్బానంద్ సోనోవాల్ : షిప్పింగ్ శాఖ మంత్రి
జ్యోతి ఆదిత్య సింధియా: టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖ
ప్రహ్లాద జోషి : రెన్యూవబుల్ ఎనర్జీ
రవణీత్ సింగ్ బిట్టు : మైనార్టీ శాఖ సహాయ మంత్రి
హర్ష మల్హోత్ర - రోడ్లు జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి
సురేష్ గోపి : టూరిజం సహాయ శాఖ మంత్రి
తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే
కిషన్ రెడ్డి : కేంద్ర గనుల శాఖ మంత్రి
బండి సంజయ్ : హోంశాఖ సహాయ మంత్రి
రామ్మోహన్ నాయుడు : కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి
శ్రీనివాస్ వర్మ : ఉక్కు, భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రి
పెమ్మసాని చంద్రశేఖర్ : గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రి
కేంద్ర మంత్రులు వీరే.. ఇక్కడ క్లిక్ చేయండి
మరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ మంత్రి వర్గం సమావేశం లోపే నేతలకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు ఎవరికి ఏయే శాఖ కేటాయిస్తారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతుండగా..సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆదివారం కొలువుదీరిన మోదీ 3.0 కేబినెట్‌లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు చేరారు. వారికి కీలక శాఖలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. హోం,రక్షణ శాఖ, ఆర్ధిక శాఖ వంటి కీలక పదవులు బీజేపీ నేతలకేననే ప్రచారమూ కొనసాగుతుంది.
ప్రాధన్యాత కలిగిన శాఖపై కిషన్ రెడ్డి పట్టు
మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతున్నాయనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ, తెలంగాణలకు రెండు కేబినెట్, మూడు సహాయమంత్రి పదవులు దక్కనున్నాయి. అయితే తెలంగాణ నుంచి గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖ అప్పగించాగా.. ఈ సారి మాత్రం ఈసారి ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్ రెడ్డి ఆశిస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాలపైనా
ఇక క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈనెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం కానుందని, 15 నుంచి మూడు రోజులపాటు ఎంపీల ప్రమాణస్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అనంతరం ఈనెల 22న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment