బోర్డుల్లో మహిళలకు ప్రాతినిధ్యం!
40 సవరణలకు కేబినెట్ ఆమోదం
వచ్చే వారం పార్లమెంటులో బిల్లు
సహించబోం: పర్సనల్ లా బోర్డు
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టాన్ని సమూలంగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేస్తూ వక్ఫ్ చట్టానికి సవరణలకు కసరత్తు పూర్తి చేసింది. మొత్తం 40 సవరణలకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ప్రాపరీ్టగా గుర్తించే వక్ఫ్ బోర్డు అధికారాన్ని పరిమితం చేయడమే సవరణల లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డు క్లెయిం చేసే ఆస్తులకు వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరి.
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యం కలి్పంచడం కూడా సవరణల్లో ఒకటి. బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఈ చర్యలను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా ఖండించింది. వక్ఫ్ బోర్డుల అధికారాలు తదితరాల్లో ఎలాంటి జోక్యాన్నీ సహించేది లేదని ప్రకటించింది. అవసరమైతే కోర్టుకు వెళ్లయినా వీటిని అడ్డుకుంటామని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డులు సుమారు 9,40,000 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 8,70,000 ఆస్తులను పర్యవేక్షిస్తున్నాయి.
వక్ఫ్ చట్టం 1995కు యూపీఏ ప్రభుత్వం 2013లో కొన్ని సవరణలు చేసి బోర్డుల అధికారాన్ని పెంచింది. పుణ్య, మతపరమైన లేదా ధారి్మక ప్రయోజనాల కోసం ఆస్తిని ఇవ్వడాన్ని వక్ఫ్ అంటారు. ఈ ఆస్తులను నియంత్రించడానికి చట్టం స్థాపించబడింది.ఈ భూములపై వచ్చే ఆదాయం పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు, ధారి్మక కార్యక్రమాల నిర్వహణ కొరకు వాడాలి.
దాతలు యిచి్చన ఈ భూముల్ని అమ్మే అధికారం వక్ఫ్ బోర్డుకు సైతం లేదు. అయితే రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు విస్తృతమైన హక్కులున్నాయి. ఇలాంటి ఆస్తులను సర్వే చేయడానికి ఆలస్యమవుతోందని ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఆస్తుల దురి్వనియోగాన్ని నివారించడానికి, వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించడంలో జిల్లా మేజి్రస్టేట్లను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పలు మార్పులు చేయాలని నిర్ణయించింది.
మత స్వేచ్ఛకు వ్యతిరేకం: ఒవైసీ
వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసే ప్రతిపాదనను ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ‘‘దీని వెనుక బీజేపీ హిందూత్వ ఎజెండా ఉంది. మత స్వేచ్ఛను దెబ్బతీయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. వక్ఫ్ ఆస్తులను లాక్కునేందుకే ఈ సవరణలు. ఇది మతస్వేచ్ఛకు విరుద్ధం’’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment