కేంద్ర కేబినెట్‌: మోదీ 3.0 మంత్రులు వీరే.. | Full List Of Cabinet Ministers In Narendra Modi Government 3.0, More Details Inside | Sakshi
Sakshi News home page

Modi Cabinet 2024: మోదీ 3.0 మంత్రులు వీరే..

Published Sun, Jun 9 2024 11:39 AM

Full list of Cabinet Ministers in Narendra Modi Government

సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. 

బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలకు మరోసారి కేబినెట్‌ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌, పాత కేబినెట్‌లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లకు కేబినెట్‌లో చోటు దక్కింది.

రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. 

బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్‌ కేబినెట్‌లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.

కేబినెట్‌లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్‌లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. 

 

రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్‌), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్‌ఎల్‌డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్‌ పవార్‌ ఎన్‌సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.

నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)

అమిత్ షా
రాజ్‌నాథ్ సింగ్
నితిన్ గడ్కరీ
ఎస్ జైశంకర్
పీయూష్ గోయల్
ప్రహ్లాద్ జోషి
జయంత్ చౌదరి
జితన్ రామ్ మాంఝీ
రామ్‌నాథ్ ఠాకూర్
చిరాగ్ పాశ్వాన్
హెచ్‌డీ కుమారస్వామి
జ్యోతిరాదిత్య సింధియా
అర్జున్ రామ్ మేఘవాల్
ప్రతాప్ రావ్ జాదవ్
రక్షా ఖడ్సే
జితేంద్ర సింగ్
రాందాస్ అథవాలే
కిరణ్ రిజుజు
రావ్ ఇంద్రజీత్ సింగ్
శంతను ఠాకూర్
మన్సుఖ్ మాండవియా
అశ్విని వైష్ణవ్
బండి సంజయ్
జి కిషన్ రెడ్డి
హర్దీప్ సింగ్ పూరి
బి ఎల్ వర్మ
శివరాజ్ సింగ్ చౌహాన్
శోభా కరంద్లాజే
రవ్‌నీత్ సింగ్ బిట్టు
సర్బానంద సోనోవాల్
అన్నపూర్ణా దేవి
జితిన్ ప్రసాద్
మనోహర్ లాల్ ఖట్టర్
హర్ష్ మల్హోత్రా
నిత్యానంద రాయ్
అనుప్రియా పటేల్
అజయ్ తమ్తా
ధర్మేంద్ర ప్రధాన్
నిర్మలా సీతారామన్
సావిత్రి ఠాకూర్
రామ్ మోహన్ నాయుడు కింజరాపు
చంద్రశేఖర్ పెమ్మసాని
మురళీధర్ మొహల్
కృష్ణపాల్ గుర్జర్
గిరిరాజ్ సింగ్
గజేంద్ర సింగ్ షెకావత్
శ్రీపాద్ నాయక్
సి.ఆర్.పాటిల్

Advertisement
 
Advertisement
 
Advertisement