cabinet ministers list
-
ఏపీ గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిశాక నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నకున్నట్లు గవర్నర్ నజీర్‌కు లేఖ ఇచ్చారు. గవర్నర్‌ను కలిసిన వాళ్లలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురందేశ్వరి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉందని, చంద్రబాబును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు. ఆ ఎమ్మెల్యేల సంతకాల లేఖను పరిశీలించిన గవర్నర్ నజీర్.. ప్రభుత్వ ఏర్పాటునకు సాయంత్రంలోగా ఆహ్వానిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి నేతగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఎన్డీయే కూటమి నేతగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆమోదం తెలిపారు. ఆవెంటనే మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమ్మతి తెలపడంతో సభా నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కూటమి అద్భుత విజయం ఏపీ రాష్ట్రం సాధించిన విజయం. సమిష్టిగా పోరాడి అద్భుత విజయం సాధించాం. ఎన్డీయే కూటమి విజయం దేశవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. అద్భుతమైన మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కక్ష సాధింపులు.. వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. ఏపీ ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబుకి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రబాబు అనుభవజ్ఞుడే కాదు.. ధైర్యశాలి కూడా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం. ప్రజలకు ఎన్నో హామీలిచ్చాం. వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.:: పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించాం. ఇంతటి ఘన విజయం సాధిస్తామని ఎవరూ ఊహించలేదు. ::బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిఎన్డీయే శాసనసభా పక్ష నేతగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు ఏకం అయ్యాయి. అధిక స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించాం. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు. ఇది అన్‌స్టాపబుల్ విజయం. ఏపీలో ఘన విజయంతో ఢిల్లీలో గౌరవం పెరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ::చంద్రబాబు నాయుడు శాసనసభ పక్ష నేతల ఎంపికకూటమి మీటింగ్ కంటే ముందే.. మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పవన్‌ను జనసేన శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఈ పేరును ప్రతిపాదించగా.. అందుకు ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం అయ్యారు. కానీ, శాసన సభా పక్ష నేత ఎంపిక నిర్ణయం అధిష్టానానికే వదిలేసినట్లు సమాచారం. దీంతో బీజేఎల్పీపై సస్పెన్స్ కొనసాగుతోంది.రేపే ప్రమాణం.. స్టేట్ గెస్ట్‌గా చిరుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణం చేయనున్నారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. మరోవైపు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా నటుడు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రబాబు. దీంతో ఈ సాయంత్రమే చిరు విజయవాడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు రాం చరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. మంత్రి వర్గంపై ఉత్కంఠమరోవైపు.. రేపు(బుధవారం) ఉదయం ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం. టీడీపీ కోటాతోపాటు జనసేన, బీజేపీ నుంచి పేర్లతో కేబినెట్ కూర్పు ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పు కోసం మూడు పార్టీల నేతలు సుదీర్ఘ కసరత్తులే చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ ఆయా పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
కేంద్ర కేబినెట్: మోదీ 3.0 మంత్రులు వీరే..
సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలకు మరోసారి కేబినెట్ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్, జైశంకర్, పాత కేబినెట్లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లకు కేబినెట్లో చోటు దక్కింది.రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్ కేబినెట్లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్ పవార్ ఎన్సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్‌దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్‌నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్ -
కాంగ్రెస్ ప్రభుత్వం.. కేబినెట్లో వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. సోమవారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశంలో కొనసాగుతోంది. ఈ మీటింగ్‌లో గెలుపొందిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎన్నిక, సీఎం అభ్యర్థిని ఎంపికపై నిర్ణయం తీసుకొనున్నుట్లు తెలుస్తోంది. అదే విధంగా కేబినెట్ స్థానాల గురించి కూడా సీఎల్సీ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కేబినెట్లో స్థానం దక్కే అవకాశం ఉన్నవారు.. అదిలాబాద్ జిల్లా : ► వివేక్ వెంకట్ స్వామీ (చెన్నూర్) ►ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల) ►వెడ్మ బోజ్జు ( ఖానాపూర్) కరీంనగర్ : ►పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్) ►శ్రీధర్ బాబు (మంథని) ►అది శ్రీనివాస్ (వేములవాడ) మహబూబ్ నగర్ : ►రేవంత్ రెడ్డి..(కొడంగల్ ) ►జూపల్లి కృష్ణ రావు (కొల్లాపూర్) ►వంశీ కృష్ణ (అచ్చంపేట) ►వీర్లపల్లి శంకర్ (షాద్ నగర్ ) వరంగల్: ►సీతక్క (ములుగు) ►కొండ సురేఖ (వరంగల్ ఈస్ట్) ఖమ్మం: ►భట్టి విక్రమార్క (మధిర) ►తుమ్మల నాగేశ్వర రావు (ఖమ్మం) ►పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( పాలేరు) ► కునమనేని సాంబశివ రావు (కొత్తగూడెం) - పొత్తులో భాగంగా క్యాబినెట్ లోకి తీసుకుంటే నల్గొండ: ►ఉత్తమ్ లేదా పద్మావతి ►కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ) మెదక్ : ►దామోదర్ రాజనర్సింహ (అందోల్ ) నిజామాబాద్ : ►సుదర్శన్ రెడ్డి ( బోధన్) ►షబ్బీర్ అలీ (ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి) రంగారెడ్డి : ►మల్ రెడ్డి రంగారెడ్డి ( ఇబ్రహీంపట్నం ) ►గడ్డం ప్రసాద్ (వికారాబాద్) ►రామ్ మోహన్ రెడ్డి (పరిగి) వారితో పాటు అవసరం అయితే కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
భార్య పాకిస్తాన్ కేంద్ర మంత్రి.. భర్త తీవ్రవాది
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాతకాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్-ఉల్-హాక్ కకర్ తాత్కాలికంగా కేబినెట్ విస్తరించారు. కేబినెట్లో తీవ్రవాది యాసిన్ మాలిక్ సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు కూడా చోటు కల్పించడం పాకిస్తాన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో షెబాజ్ షరీఫ్ తమ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అనంతరం ఆగస్టు 15న అన్వర్-ఉల్-హాక్ కకర్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన నియమించిన కొత్త కేబినెట్ మంత్రుల జాబితాలో మానవ వనరుల శాఖ మంత్రిగా మిశాల్ హుస్సేన్ మాలిక్ ను నియమించినట్లు తెలిపారు. మిశాల్ భర్త జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ తీవ్రవాదులకు నిధులను సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నెరసుడిగా నిర్ధారించగా కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. ప్రస్తుతం యాసిన్ మాలిక్ శిక్షను అనుభవిస్తున్నాడు. మిశాల్ హుస్సేన్ మాలిక్ తోపాటు ఆర్ధిక మంత్రిగా మాజీ సెంట్రల్ బ్యాంకు చీఫ్ షంషాద్ అఖ్తర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా సర్ఫరాజ్ బుగాటి నియమితులయ్యారు. వీరితోపాటు మొత్తం 16 మంది మంత్రులతో కూడిన పాకిస్తాన్ కేబినెట్ తో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో జలీల్ అబ్బాస్ జిలానీ, లెఫ్టినెంట్ జనరల్ (ఆర్) అన్వర్ అలీ హైదర్, ముర్తజా సోలంగి సమీ సయీద్, షాహిద్ అష్రఫ్ తరార్, అహ్మద్ ఇర్ఫాన్ అస్లాం, ముహమ్మద్ అలీ, గోహర్ ఎజాజ్, ఉమర్ సైఫ్, నదీమ్ జాన్, ఖలీల్ జార్జ్, అనీఖ్ అహ్మద్, జమాల్ షా, మదాద్ అలీ సింధీ ఉన్నారు. పాక్ తాత్కాలిక ప్రధానికి ముఖ్య సలహాదారులుగా ఎయిర్ మార్షల్(ఆర్) ఫర్హాట్ హుస్సేన్ ఖాన్, ఆహద్ ఖాన్ చీమా, వకార్ మసూద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ మఫ్టీ సోదరి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మఫ్టీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్ 1989, డిసెంబరు 8న కిడ్నాప్ కు గురవ్వగా ఆ కేసులో యాసిన్ మాలిక్ ను నిందితుడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే యాసిన్ మాలిక్ స్థాపించిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను 2019లో అధికారికంగా నిషేధించింది పాకిస్తాన్. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస -
రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు బొత్స
-
చిత్తూరు జిల్లాలో బలమైన రాజకీయ నేత పెద్దిరెడ్డి
-
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా సుచరిత పేరు
-
సబ్జెక్ట్‌ను ఉదాహరణలతో ప్రజెంట్ చేయడంలో బుగ్గన దిట్ట
-
చంద్రబాబు కేబినెట్లో 19 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు నేటి సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తన కేబినెట్లోకి 19 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ ), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చిన్న రాజప్ప (పెద్దాపురం)లను ఉప ముఖ్యమంత్రులుగా చంద్రబాబు ఎంపిక చేశారు. కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా ముగ్గురిని చంద్రబాబు మంత్రులుగా ఎంపిక చేశారు. అలాగే టీడీపీ మిత్ర పక్షమైన బీజేపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. చంద్రబాబు తన కేబినెట్ లో కమ్మ, కాపు సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశారు. అనంతపురం జిల్లా : పరిటాల సునీత - రాప్తాడు పల్లె రఘునాథ్‌రెడ్డి -పుట్టపర్తి చిత్తూరు జిల్లా: బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి - శ్రీకాళహస్తి నెల్లూరు జిల్లా : నారాయణ (ఏ సభలోను సభ్యుడు కాదు ) ప్రకాశం జిల్లా : శిద్దా రాఘవరావు - దర్శి గుంటూరు జిల్లా : పత్తిపాటి పుల్లారావు -చిలకలూరిపేట రావెల కిషోర్ బాబు - ప్రతిపాడు కృష్ణా జిల్లా : కొల్లు రవీంద్ర - మచిలీపట్నం దేవినేని ఉమామహేశ్వరరావు -మైలవరం కామినేని శ్రీనివాసరావు (బీజేపీ) - కైకలూరు పశ్చిమ గోదావరి జిల్లా: పీతల సుజాత - చింతలపూడి మాణిక్యాల రావు (బీజేపీ) - తాడేపల్లిగుడెం తూర్పు గోదావరి జిల్లా: యనమల రామకృష్ణుడు - ఎమ్మెల్సీ విశాఖపట్నం జిల్లా: గంటా శ్రీనివాసరావు - భీమిలి చింతకాయల అయ్యన్నపాత్రుడు - నర్సీపట్నం విజయనగరం జిల్లా: కిమిడి మృణాళిని -చీపురపల్లి శ్రీకాకుళం జిల్లా : అచ్చెన్నాయడు - టెక్కలి