చంద్రబాబు కేబినెట్లో 19 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు నేటి సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన తన కేబినెట్లోకి 19 మందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ ), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చిన్న రాజప్ప (పెద్దాపురం)లను ఉప ముఖ్యమంత్రులుగా చంద్రబాబు ఎంపిక చేశారు. కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా ముగ్గురిని చంద్రబాబు మంత్రులుగా ఎంపిక చేశారు. అలాగే టీడీపీ మిత్ర పక్షమైన బీజేపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. చంద్రబాబు తన కేబినెట్ లో కమ్మ, కాపు సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశారు.
అనంతపురం జిల్లా :
పరిటాల సునీత - రాప్తాడు
పల్లె రఘునాథ్‌రెడ్డి -పుట్టపర్తి
చిత్తూరు జిల్లా:
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి - శ్రీకాళహస్తి
నెల్లూరు జిల్లా :
నారాయణ (ఏ సభలోను సభ్యుడు కాదు )
ప్రకాశం జిల్లా :
శిద్దా రాఘవరావు - దర్శి
గుంటూరు జిల్లా :
పత్తిపాటి పుల్లారావు -చిలకలూరిపేట
రావెల కిషోర్ బాబు - ప్రతిపాడు
కృష్ణా జిల్లా :
కొల్లు రవీంద్ర - మచిలీపట్నం
దేవినేని ఉమామహేశ్వరరావు -మైలవరం
కామినేని శ్రీనివాసరావు (బీజేపీ) - కైకలూరు
పశ్చిమ గోదావరి జిల్లా:
పీతల సుజాత - చింతలపూడి
మాణిక్యాల రావు (బీజేపీ) - తాడేపల్లిగుడెం
తూర్పు గోదావరి జిల్లా:
యనమల రామకృష్ణుడు - ఎమ్మెల్సీ
విశాఖపట్నం జిల్లా:
గంటా శ్రీనివాసరావు - భీమిలి
చింతకాయల అయ్యన్నపాత్రుడు - నర్సీపట్నం
విజయనగరం జిల్లా:
కిమిడి మృణాళిని -చీపురపల్లి
శ్రీకాకుళం జిల్లా :
అచ్చెన్నాయడు - టెక్కలి