Pak Caretaker PM Includes Terrorist Yasin Malik's Wife In Cabinet - Sakshi
Sakshi News home page

పాక్ తాత్కాలిక ప్రభుత్వంలో తీవ్రవాది భార్యకు చోటు 

Aug 18 2023 1:13 PM | Updated on Aug 18 2023 2:38 PM

Pak Caretaker PM Includes Terrorist Yasin Maliks Wife In Cabinet - Sakshi

ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాతకాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్-ఉల్-హాక్ కకర్ తాత్కాలికంగా కేబినెట్ విస్తరించారు. కేబినెట్లో తీవ్రవాది యాసిన్ మాలిక్ సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు కూడా చోటు కల్పించడం పాకిస్తాన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో షెబాజ్ షరీఫ్ తమ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అనంతరం ఆగస్టు 15న అన్వర్-ఉల్-హాక్ కకర్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన నియమించిన కొత్త కేబినెట్ మంత్రుల జాబితాలో మానవ వనరుల శాఖ మంత్రిగా మిశాల్ హుస్సేన్ మాలిక్ ను నియమించినట్లు తెలిపారు. 

మిశాల్ భర్త జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ తీవ్రవాదులకు నిధులను సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నెరసుడిగా నిర్ధారించగా కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. ప్రస్తుతం యాసిన్ మాలిక్ శిక్షను అనుభవిస్తున్నాడు. 

మిశాల్ హుస్సేన్ మాలిక్ తోపాటు ఆర్ధిక మంత్రిగా మాజీ సెంట్రల్ బ్యాంకు చీఫ్ షంషాద్ అఖ్తర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా సర్ఫరాజ్ బుగాటి నియమితులయ్యారు. వీరితోపాటు మొత్తం 16 మంది మంత్రులతో కూడిన పాకిస్తాన్ కేబినెట్ తో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ప్రమాణ స్వీకారం చేయించారు.      

కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో జలీల్ అబ్బాస్ జిలానీ, లెఫ్టినెంట్ జనరల్ (ఆర్) అన్వర్ అలీ హైదర్, ముర్తజా సోలంగి సమీ సయీద్, షాహిద్ అష్రఫ్ తరార్, అహ్మద్ ఇర్ఫాన్ అస్లాం, ముహమ్మద్ అలీ, గోహర్ ఎజాజ్, ఉమర్ సైఫ్, నదీమ్ జాన్, ఖలీల్ జార్జ్, అనీఖ్ అహ్మద్, జమాల్ షా, మదాద్ అలీ సింధీ ఉన్నారు. పాక్ తాత్కాలిక ప్రధానికి ముఖ్య సలహాదారులుగా ఎయిర్ మార్షల్(ఆర్) ఫర్హాట్ హుస్సేన్ ఖాన్, ఆహద్ ఖాన్ చీమా, వకార్ మసూద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. 

పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ మఫ్టీ సోదరి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మఫ్టీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్ 1989, డిసెంబరు 8న కిడ్నాప్ కు గురవ్వగా ఆ కేసులో యాసిన్ మాలిక్ ను నిందితుడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే యాసిన్ మాలిక్ స్థాపించిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను 2019లో అధికారికంగా నిషేధించింది పాకిస్తాన్. 

ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస ​​​​​​​ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement