రాష్ట్ర విభజనను జరగనివ్వమంటూ గతంలో ప్రగల్భాలు పలికిన కేంద్రమంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విభజనపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం కేంద్రమంత్రులకు లేదా అని ఆమె గురువారమిక్కడ సూటిగా ప్రశ్నించారు. జీవోఎంకు సవరణలు ఇవ్వటం అవమానకరమని వాసిరెడ్డి మండిపడ్డారు.