పుదుచ్చేరి : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సీనీ పలువురు సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, వ్యవసాయ శాఖ కైలాష్ చౌదరితో సహా పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకింది. తాజాగా పుదుచ్ఛేరి మంత్రివర్గంలోనూ కరోనా కలకలం రేగింది. తన క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులు కందసామి, కమలకన్నన్ లకు కరోనా సోకిందని ముఖ్యమంత్రి వీ నారాయణ సామి తెలిపారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. కరోనా భారిన పడిన మంత్రులతో సన్నిహితంగా మెలిగిన వారందరూ క్వారంటైన్‌కి వెళ్లాల్సిందిగా సీఎం కోరారు. మంత్రులిద్దరూ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 53,601 పాజిటివ్ కేసులు నమోదుకాగా 871 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. (దేశంలో మరో 53,601 కరోనా కేసులు)
Two of my ministers in the Cabinet, Kandasamy and Kamalakannan tested positive for COVID-19. I appeal to people moved with them to go for testing: Puducherry Chief Minister, V Narayanasamy pic.twitter.com/25G8YFJUt6
— ANI (@ANI) August 11, 2020
Comments
Please login to add a commentAdd a comment