చీపురు పట్టిన కేంద్ర మంత్రులు | Ministers took a broom | Sakshi
Sakshi News home page

చీపురు పట్టిన కేంద్ర మంత్రులు

Published Fri, Dec 26 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

చీపురు పట్టిన కేంద్ర మంత్రులు

చీపురు పట్టిన కేంద్ర మంత్రులు

బెంగళూరు: ఎప్పుడూ ఫైళ్లు, అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపే కేంద్ర మంత్రులు చీపురుపట్టారు. నగరంలోని రోడ్డును స్వయంగా శుభ్రం చేసి ‘స్వచ్ఛభారత్’ పిలుపునిచ్చారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారమిక్కడ నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ పాల్గొన్నారు.

 ‘స్వచ్ఛతా’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని అవెన్యూ రోడ్‌ను కేంద్ర మంత్రులు శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ...స్వచ్ఛభారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. చాలా మంది ప్రముఖులు, స్వామీజీలు, క్రీడాకారులు, యువత ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏదో ఫొటోలకు ఫోజులిచ్చేందుకు జరుగుతున్నదని కాదని, ప్రజలే ఓ మార్పు కోసం స్వచ్ఛందంగా ముందుకొస్తున్న కార్యక్రమమని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు పీసీ మోహన్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్  అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement