
న్యూఢిల్లీ: బీజేపీ మహిళా నేత, ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) ఈరోజు(ఫిబ్రవరి 20) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో నేడు ఆరుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సీఎం రేఖ గుప్తా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారి విద్యార్హతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ
ప్రవేశ్ ఎంబీఏ పూర్తి చేశారు. ఈయన ఢిల్లీకి చెందినవారు. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రవేశ్ వర్మ(Pravesh Verma) తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని ఆర్కే పురంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బి.కామ్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఫర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎంబీఏ పట్టా పొందారు.
ఎమ్మెల్యే ఆశిష్ సూద్
ఆశిష్ సూద్ బి.కామ్ పూర్తి చేశారు. జనక్‌పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్ కూడా క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. ఆశిష్ సూద్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాల నుండి బి.కామ్ పూర్తి చేశారు. ఈ సమయంలో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా
సిర్సా 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయనను అత్యంత ధనిక ఎమ్మెల్యే అని చెబుతుంటారు. మజీందర్ సింగ్(Majinder Singh) హర్యానాలోని సిర్సా నివాసి. ఆయనకు సిర్సాలో రూ.248 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
ఎమ్మెల్యే రవీందర్ సింగ్
రవీందర్ సింగ్ బిఎ పాసయ్యారు. పట్పర్‌గంజ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధ్యాపకుడు అవధ్ ఓజాను ఓడించారు. రవీందర్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందారు. రవీందర్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది.
కపిల్ మిశ్రా
కపిల్ మిశ్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సోషల్ వర్క్‌లో ఎంఏ చేశారు. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు.
పంకజ్ కుమార్ సింగ్
పంకజ్ కుమార్ వృత్తిరీత్యా దంతవైద్యుడు. బీహార్‌లోని బుద్ధగయలోని మగధ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) పూర్తిచేశారు. వికాస్‌పురి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రభుత్వంలో మంత్రి కాబోతున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు రూ. 501.. ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment