MBA
-
మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్,లక్షల ప్యాకేజిని వదిలి..
ఛావీ రాజావత్ రాజస్థాన్‌లోని సోడా గ్రామంలో పుట్టి పెరిగింది. పట్నంలో ఉన్నత చదువులు చదివి, కళ్లు చెదిరే ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరింది. కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి వెళ్లింది. సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసింది. మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌గా వార్తల్లో నిలిచి, యుఎన్లో ప్రసంగం చేసింది. గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, హోటల్ వ్యాపారం చేస్తోంది. ఆసక్తి గలవారికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తోంది. ‘‘2010లో తొలిసారి సర్పంచ్ అయినప్పుడు గ్రామ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిపొంయింది. సాగునీరు లేదు. 13–14 సంవత్సరాలుగా రుతుపవనాలు లేవు. భూగర్భ జలాలను వాడుకోలేకపొంయేవారు. 3–4 గంటలకు మించి విద్యుత్ సరఫరా లేదు. రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ సవాళ్లతో సోడా పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాను. మొదటి టర్మ్‌లో కొన్ని పనులు పూర్తయ్యాయి. మా ఊరు తనవైపు లాగింది.. మా తాత బ్రిగేడియర్ రఘుబీర్‌సింగ్ 1990 వరకు సర్పంచ్‌గా చేశారు. నాకు మా ఊరు అంటే ఎప్పుడూ ఇష్టమే. బెంగుళూరులోని రిషి వ్యాలీ స్కూల్, జైపూర్‌లోని మాయో కాలేజీ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా మా ఊరిలోనే ఉండేదాన్ని. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాక, పూణెలోని బాలాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడ్రన్ మేనేజ్మెంట్ నుండి ఎంబీయే పూర్తి చేశాను. ఏడేళ్లపాటు కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేశాను. లక్షల రూపాయల జీతం. కానీ, మా ఊరు వైపు నన్ను తన వైపు లాగింది. మహిళకు రిజర్వ్ అని.. 2010లో మా గ్రామ పంచాయితీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. అప్పుడు మా ఊరి పెద్దలు నన్ను ఎన్నికల్లో నిలబడమని అడిగారు. ఆ సమయంలో సర్పంచ్‌ని అవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. గ్రామస్తులు మా అమ్మనాన్నలను అడిగారు. ‘ఏం చేయాలనుకున్నా తన ఇష్టం, మా బలవంతం ఉండదు’ అని చెప్పారు. నాకు అప్పటి వరకు గ్రామ సభలు ఎలా జరుగుతాయి, పంచాయితీలకు నిధులు ఎలా వస్తాయో తెలియదు. ఆ విషయాలను గ్రామస్తులే చెప్పారు. ఆ విధంగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడి, గెలిచాను. మా ఇంట్లో మా తాత తర్వాత నేను సర్పంచ్‌ని అయ్యాను. వర్షపు నీటి సంరక్షణ ముందుగా ఊరి భవితవ్యాన్ని ఒంటరిగా మార్చలేమని, ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అందరికీ స్పష్టంగా చెప్పాను. నేను వ్యూహంతో పనిచేయడం ప్రారంభించాను. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, గ్రామాలను అనుసంధానించడం, కరువును ఎదుర్కోవడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు. గ్రామంలోని నీటివనరులన్నీ పూడికతో నిండిపొంయాయి. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న నీటి వనరుల్లో పూడిక మట్టిని తొలగించేందుకు లక్షల రూపాయలు సేకరించి, ఖర్చు చేశాం. మహిళలు ముందు గ్రామపంచాయితీ నా కుటుంబం లాంటిది. నేను మీటింగులు పెట్టడం మొదలుపెట్టగానే ఏయేప్రాజెక్టుల్లో ఎలా పనిచేస్తున్నానో చెప్పేదాన్ని. ఈప్రాజెక్టుల గురించి వారు ఏమనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తెలుసుకునేదాన్ని. అలాగే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా వివరించేదాన్ని. పనులు సజావుగా అయ్యేలా అధికారులను కలిసి ఆరా తీయమని గ్రామస్తులకు చెప్పేదాన్ని. మహిళల బృందం డిజైనర్ ల్యాంప్‌లు, కొవ్వొత్తులు, మసాలా దినుసులు వంటి ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మంచి ధరకు అమ్ముడు పొంవడం మొదలయ్యింది. దీంతో మహిళల జీవితం మెరుగుపడింది. రెండేళ్లలో 950 ఇళ్లకు గాను 800 మరుగుదొడ్లు నిర్మించాం. 24 గంటలూ కరెంట్ అందుబాటులోకి వచ్చింది. రోడ్లప్రాధాన్యత నా ఎజెండాలో రోడ్లప్రాధాన్యత స్పష్టంగా ఉంచాను. ముందు ప్రైవేట్ బస్సుల సహాయం తీసుకున్నాను. బాలికల కోసం పాఠశాల, మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాను. మూతపడిన బి.ఎడ్ కాలేజీని స్వాధీనం చేసుకొని దానిని బాలికల చదువుకోసం కేటాయించాను. ఓ ప్రైవేట్ కంపెనీ 200 టేబుళ్లు, బెంచీలను అందజేసి మా వెన్ను తట్టింది. అందరికీ బ్యాంకు ఖాతా.. సర్పంచ్ అయిన ఐదేళ్లలోనే రోడ్లు, డ్రైన్లు, అందరికీ బ్యాంకు ఖాతా తెరిపించాను. ఎప్పుడూ ఫీల్డ్ వర్క్‌లోనే ఉండేదాన్ని. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల, చదువుప్రాముఖ్యతను వివరించేదాన్ని.. నా స్వభావం అందరినీ కలుపుకొని ఉంటుంది. ఐక్యరాజ్యసమితి 11వ ఇన్ఫో పావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించినప్పుడు మొదటిసారి భారతదేశం నుండి ఒక మహిళా సర్పంచ్‌గా దేశం తరపునప్రాతినిధ్యం వహించాను. ఇది నాకు గర్వంగా అనిపించింది. అక్కడ వారందరి మదిలో సర్పంచ్ అంటే తలపై ముసుగు వేసుకుని ఉన్న గ్రామస్థురాలు అనుకున్నారు. కానీ, నన్ను కార్పొరేట్ లుక్‌లో చూసి అందరూ ఆశ్చర్యపొంయారు. సోడా విలేజ్ అభివృద్ధికి డబ్బు కంటే వ్యక్తులు, అందరి సమష్టి కృషి అవసరం అని ఫోరమ్‌లో చెప్పాను. రెండుసార్లు సర్పంచ్‌గా నా విధులను నిర్వర్తించాను. తర్వాతి వారికి అవకాశాలు ఇవ్వాలని నేను మళ్లీ పొంటీ చేయలేదు. ఇప్పుడు హోటల్ని నిర్వహిస్తున్నాను. గుర్రపు స్వారీ వచ్చు కాబట్టి, ఆసక్తి గలవారికి శిక్షణ ఇస్తున్నాను’ అని వివరిస్తుంది ఈ యంగ్ లీడర్. -
గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఎంబీఏ విద్యార్థి
హైదరాబాద్: హార్ట్ ఎటాక్ తో ఎంబీఏ విద్యార్థి మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు కొత్తపల్లి కుషాల్ ఎంబీఏ చదువుతూ మైసమ్మగూడలోని సాత్విక్ బాయిస్ హాస్టల్లో ఉంటున్నారు. ఆదివారం తన స్నేహితుడు సత్యగిరీశ్ ఉంటున్న సాయిమణి బాయిస్ హాస్టల్‌కు వెళ్లి రాత్రి అక్కడే నిద్రపోయాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన కుషాల్ హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాబోయే భార్య గురించి ట్వీట్ చేసిన జే కోటక్ - వైరల్ అవుతున్న పోస్ట్
ప్రముఖ బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు 'జే కోటక్' గురించి దాదాపు అందరికి తెలిసిందే. అయితే ఇతడు ఇటీవల తన కాబోయే భార్యకు అభినందనలు తెలుపుతూ ట్విటర్ పోస్ట్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. జే కోటక్ మాజీ మిస్ ఇండియా 'అదితి ఆర్య'ని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అంత కంటే ముందు కాబోయే భార్య యేల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సందర్భములో అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ నా ఫియాన్సీ MBA గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. నేను చాలా గర్వపడుతున్నాను అంటూ మే 24న పోస్ట్ చేసాడు. ఇందులో అదితి గ్రాడ్యుయేషన్ దుస్తులలో ఉండటం కూడా చూడవచ్చు. జే కోటక్ కూడా కొలంబియా యూనివర్సిటీ నుంచి బీఏ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం డిజిటల్ బ్యాంక్ కోటక్811కి కో-హెడ్ పదవిలో ఉన్నారు. 2022 ఆగస్ట్ నెలలో జే కోటక్ అండ్ అదితి ఆర్య నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. నిశ్చితార్థం తర్వాత పారిస్‌లోని ఐఫిల్ టవర్ ముందు పోజులిస్తున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ వారు దీనిని ధ్రువీకరించలేదు. కానీ ఇప్పుడు వీరి జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనట్లు చెప్పకనే చెప్పేసారు. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C — Jay Kotak (@jay_kotakone) May 24, 2023 ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన షహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ పూర్తి చేసిన అదితి ఆర్య 2015లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తరువాత యేల్ యూనివర్శిటీలో చదువుకోవడానికి అమెరికా పయనమైంది. అంతకంటే ముందు ఈమె తెలుగు, హిందీ సినిమాల్లో కూడా కనిపించింది. ఇప్పుడు అమెరికా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ఇక జే కోటక్ & అదితి ఆర్యల వివాహం ఎప్పుడనేది తెలియాల్సిన విషయం. -
ఎంబీఏ విద్యార్థిని శ్రావణి అదృశ్యం...
హైదరాబాద్: బాలాజీనగర్ మోహన్‌రావు కాలనీలో దేవారాయ కుమార్ కుమార్తె దుర్గాలక్ష్మీ అలియాస్ శ్రావణి (22) ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ చదువుతుంది. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
Viral Video: పిలవని పెళ్ళికి వెళ్లినందుకు.. పనిష్మెంట్ ఇచ్చారు ..!
-
ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ తుది దశ సీట్ల కేటాయింపు గురువారం పూర్తయింది. మొత్తం 83 శాతం సీట్లు కేటాయించినట్టు సాంకేతిక విద్యావిభాగం ప్రకటించింది. ఐసెట్‌లో మొత్తం 61, 613మంది అర్హత సాధించారు. 19,666 మంది 3,60,435 ఆప్షన్లు ఇచ్చారు. ఎంబీఏలో 24,278 సీట్లు, ఎంసీఏలో 2865 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏలో 21,983 సీట్లు కేటాయించగా, ఇంకా 2295 సీట్లు మిగిలిపోయాయి. ఎంసీఏలో 2865 (వంద శాతం) సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యావిభాగం సూచించింది. -
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
సాక్షి , హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–2022 ఫలితలు నేడు (ఆగస్టు 27) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కాకతీయ యూనివర్సిటీలో మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాలతో పాటు ఫైనల్ కీ ని కూడా విడుదల చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2022 ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు. ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్ వర్థన్ మొదటి ర్యాంకు కైవసం చేసకోగా.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేష్ చంద్రారెడ్డి రెండవ ర్యాంకు సాధించారు. అలాగే గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కాట్రగడ్డ జితిన్ సాయికి మూడో ర్యాంకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన వెలిశాల కార్తీక్ నాలుగో ర్యాంక్ సాధించారు. కాగా ఐసెట్ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,781 విద్యార్థులు పరీక్ష రశారు. వారిలో 61,613 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 30,409 మంది పురుషులు (89 శాతం), 31,201 మంది మహిళలు (89.34 శాతం) 3 ట్రాన్స్జెండర్లు (75 శాతం) ఉన్నారు. ఫలితాలు https://icet.tsche.ac.in అందుబాటులో ఉన్నాయి. టీఎస్ ఐసెట్-2022 ఫలితాలు కోసం క్లిక్ చేయండి -
కెనడాలో విశాఖ జిల్లా విద్యార్థి మృతి
సాక్షి, పాయకరావుపేట: కెనడాలో ఎంబీఏ చదువుతున్న విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన నిట్టెల మధుకుమార్ (30) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందాడు. పట్టణానికి చెందిన నిట్టెల నూకరాజు మూడో కుమారుడైన మధుకుమార్ నెల రోజుల క్రితమే టోరెంటో నగరంలోని యార్క్ యూనివర్సిటీలో చదివేందుకు కెనడా వెళ్లాడు. ఈవెనింగ్ వాక్ చేస్తూ (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) హఠాత్తుగా కుప్పకూలిపోయాడని, స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని మృతుని స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. -
ఎంబీఏ చదువు, మంచి ఉద్యోగం వదిలి.. పాడితో ఉపాధి!
జగిత్యాల అగ్రికల్చర్: ఉన్నత చదువులు చదివిన యువకులు వ్యవసాయంతోపాటు పాడి వంటి అనుబంధ రంగాల వైపు వెళ్లేందుకు నామోషీగా ఫీలవుతుంటారు. దీంతో, చాలీచా లని జీతంతో పట్టణాల్లో మగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీఏ చదివి, ప్రైవేట్ ఉద్యోగాన్ని వదులుకొని, ఉన్న ఊరిలో జెర్సీ ఆవుల ఫాం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి(99893 54414). ఉరుకుల పరుగుల జీవితం నచ్చక.. సురేశ్‌రెడ్డి ఎంబీఏ పూర్తయ్యాక రెండేళ్లు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాడు. కానీ ఉరుకుల పరుగుల జీవితం అతనికి నచ్చలేదు. దీంతో వ్యవసాయం చేద్దామని ఇంటికి వచ్చాడు. కానీ చదువుకున్నది వ్యవసాయం చేయడానికి కాదు.. ఏదో ఒక ఉద్యోగం చూసుకో అని తల్లితండ్రులు ముఖం మీదే చెప్పేశారు. అయినప్పటికీ తనకున్న పట్టుదల, ధైర్యంతో మొండిగా ఆవుల ఫాం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకొని, తమకున్న వ్యవసాయ భూమిలోనే 5 జెర్సీ ఆవులతో ఫాం ప్రారంభించాడు. ప్రస్తుతం 25 ఆవులున్నాయి.. ఫాంలో ప్రస్తుతం 25 జెర్సీ ఆవులు, 10 దూడలున్నాయి. పాలు పితికేందుకు సురేశ్‌రెడ్డి ఇద్దరు బిహార్ కూలీలను నియమించుకున్నాడు. ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాంలోనే ఉంటూ ఆవులను స్వయంగా పర్యవేక్షిస్తుంటాడు. వాటికి మేత కోసం, ఎకరంలో పచ్చిగడ్డి వేశాడు. ఉదయం, సాయంత్రం ఆవులకు దాణా పెట్టి, పాలు పితుకుతారు. ఆవులు, దూడల పేడ, మూత్రంతో ఈగలు, దోమలు రాకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాడు. లీటర్‌కు రూ.50లకు విక్రయం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం 100 లీటర్ల పాల దిగుబడి సాధిస్తున్నట్లు సురేశ్‌రెడ్డి తెలిపాడు. వీటిలో 30 లీటర్లను స్థానిక వినియోగదారులకు లీటర్‌కు రూ.50 చొప్పున పోస్తున్నాడు. మిగిలిన పాలను పాల డిపోకు తీసుకెళ్తున్నాడు. అక్కడ పాలల్లో వెన్న శాతాన్ని బట్టి లీటర్‌కు రూ.30 నుంచి రూ.33 వరకే ఇవ్వడం వల్ల ఆదాయానికి గండి పడుతోంది. అలా కాకుండా వినియోగదారులు పెరిగితే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నాడు. దాణా రేట్లు ఏడాదిలో రెట్టింపు కావడం వల్ల ఫాం నిర్వహణ ఖర్చులు పెరిగాయి. దీనికితోడు, ప్రభుత్వం ఇస్తామన్న లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ రూ.2 లక్షలు రెండేళ్లుగా అందక కొంత ఇబ్బందిగా ఉందని చెబుతున్నాడు. ఎండుగడ్డి సేకరణ పాడి పశువులకు మేత ప్రధానం. ఓవైపు పచ్చిమేత ఇస్తూనే, మరో వైపు ఎండుగడ్డిని ఓ పూట వేస్తుంటారు. ఇందుకోసం సురేశ్‌రెడ్డి వరి పొలాల సమయంలో వరి గడ్డిని కట్టలు కట్టించి, షెడ్డులో నిల్వ చేస్తున్నాడు. రూ.వేలకు వేలు పెట్టి, కొత్తగా పాడి పశువులను కొనుగోలు చేయకుండా, ఆవులకు పుట్టిన పిల్లలకే సమీకృత దాణా ఇస్తూ త్వరగా ఎదిగేలా చేస్తున్నాడు. జగిత్యాలలో షాప్ పెట్టాలనుకుంటున్న జెర్సీ ఆవుల ఫాం ప్రారంభించాక మొదట్లో ఎన్నో కష్టనష్టాలు చూశా. కానీ ఏనాడూ అధైర్యపడలేదు. ఫాంని మరింత లాభాల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్న. జగిత్యాలలో వినియోగదారుల కోసం షాప్ పెట్టాలనుకుంటున్న. దాణా రేట్లు తగ్గితే ఆదాయం బాగుంటుంది. – తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి, పాడి రైతు, లక్ష్మీపూర్ -
విద్యార్థిని కిడ్నాప్... రూ.20 లక్షలు డిమాండ్ చేసి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ
న్యూఢిల్లీ: కొన్ని నేరాలు చూస్తే ఎవర్ని నమ్మాలి అనే సందేహం కలుగుతుంది. చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు తమ బంధువులు లేదా పరిచయమున్న వ్యక్తుల చేతిలోనే మోసపోవడం లేదా వేధింపులకు గురవడం వంటివి జరుగుతుండటం బాధకరం. అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఢిల్లీలో ఎంబీఏ విద్యార్థి ఫినైల్ సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..."ఆ ఎంబీఏ విద్యార్థితో ఒక నిందితుడు పథకంలో భాగంగా సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ నిందితుడు అతన్ని అక్టోబర్ 23, 2020న కిడ్నాప్ చేసి గదికి తీసుకెళ్లారు. అంతేకాదు తుపాకీ వీడియోతో నగ్న వీడియోల తోపాటు తుపాకీ, గంజాయి, పిస్టల్ని పట్టుకుని ఉన్న వీడియోలను కూడా తీశారు. ఈ మేరకు ఆ నిందుతుడు తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ ఆ విద్యార్థిని బెదిరించి రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబం రూ.5 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఆ నిందితుడి ఆ విద్యార్థి నగ్న వీడియోలను అతని కాలనీలోని వాళ్లకు, బంధువులకు పంపిచాడు. మళ్లీ ఫిబ్రవరి 1న ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఇక ఆ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ధర్మపాల్ అనే కానిస్టేబుల్ కూడా ఆ విద్యార్థిని బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ విద్యార్థి మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు." అని పోలీసులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు ప్రధాన కారకుడైన నిందుతుడిని అరెస్టు చేయడమే కాక ఇతర నిందుతుల ఆచూకి కోసం విచారించడం ప్రారంభించారు. అంతేగాక ఆ విద్యార్థి కుటుంబాన్ని కలిసి నిందుతులు పట్టుకుని అరెస్ట్ చేయడమే కాక సదరు కానిస్టేబుల్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: హెల్మెట్ ధరించమని అన్నందుకే దారుణంగా కొట్టి, జీప్ ఎక్కించి....) -
ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులు.. వివరాలివిగో..
బిజినెస్ స్కూల్స్.. మరో మాటలో చెప్పాలంటే.. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్! పీజీ స్థాయిలో ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్‌ల ద్వారా.. మేనేజ్మెంట్ నైపుణ్యాలు అందించే విద్యాసంస్థలు! ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. టెక్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకోసం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో ప్రత్యేకంగా టెక్నికల్ కోర్సులు బోధిస్తున్నాయి. దేశంలో.. ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఐఐఎంలు మొదలు మరెన్నో ప్రముఖ బీస్కూల్స్.. పీజీ ప్రోగ్రామ్స్ కరిక్యలంలో.. టెక్నికల్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తుండటం నయా ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. బీస్కూల్స్‌లో టెక్ కోర్సుల బోధనకు కారణాలు.. వాటితో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం... సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. సంక్షిప్తంగా స్టెమ్ కోర్సులుగా గుర్తింపు. వీటిని సైన్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు, మూడేళ్లుగా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు సైతం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. డేటా సైన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్న ఇన్స్టిట్యూట్లు ప్రధానంగా.. డేటాసైన్స్, డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. కార్పొరేట్ ప్రపంచంలో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం పెరగడమే! అనలిటిక్స్ ఆధారంగా బిజినెస్ వ్యూహాలు రూపొందించే మేనేజ్మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. అనలిటిక్స్ నైపుణ్యాలకు టెక్ స్కిల్స్ పునాదిగా నిలుస్తున్నాయి. దీంతో మేనేజ్మెంట్ విద్యార్థులకే డేటాసైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్పై అవగాహన కల్పిస్తే.. కార్పొరేట్ వర్గాల నుంచి చక్కటి ఆఫర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఏఐ–ఎంఎల్ కూడా ►మేనేజ్మెంట్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) కూడా బోధిస్తున్నారు. ఇప్పుడు అన్నింటా ముఖ్యంగా వస్తు సేవల్లో.. ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక ఉత్పత్తి లేదా సర్వీస్‌ను ఏఐ ఆధారంగా రూపొందించాలనుకుంటే.. సదరు నిర్వహణ అధికారులకు దీనిపై అవగాహన ఉండాలి. అంతేకాకుండా కంపెనీల రోజువారీ విధుల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అకౌంట్స్, ఫైనాన్స్,ప్రొడక్షన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో.. ఏఐ ఆధారంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ►ఏఐ ఆధారంగా..పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా.. అందుకు అయ్యే వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. అదే విధంగా.. సంస్థకు కీలకమైన హెచ్ఆర్ విభాగంలో సైతం నూతన నియామకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏఐ–ఎంఎల్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, అర్హులను గుర్తించడం సులభం అవుతోంది. దీంతో.. మేనేజ్మెంట్ విభాగాల్లో పని చేసే వారికి సైతం టెక్నికల్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన ఆశ్యకత నెలకొంది. అందుకే ఇప్పుడు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. ఏఐ, ఎంఎల్ వంటి టెక్ స్కిల్స్‌ను బోధిస్తున్నాయి. బిజినెస్ అనలిటిక్స్ మేనేజ్మెంట్ విభాగంలో టెక్నికల్ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. బిజినెస్ అనలిటిక్స్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. సంస్థకు సంబంధించి రా మెటీరియల్ సేకరణ నుంచి ప్రొడక్షన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వరకూ.. అన్ని అంశాలు కంప్యూటరీకరణ జరుగుతోంది. ఒక్కో దశలో ఆయా అంశాల నిర్వహణకు సంబంధించిన విషయాలు(ఖర్చులు, నిర్వహణ వ్యయం, అనుసరించిన విధానం తదితర)ను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి మేనేజ్మెంట్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై స్పష్టతకు రావలసి ఉంటుంది. దీంతో క్షేత్ర స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలు ఆవశ్యకంగా మారుతున్నాయి. దీంతో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ బిజినెస్ అనలిటిక్స్‌ను తమ కరిక్యులంలో భాగంగా చేర్చుతున్నాయి. ప్రత్యేక ప్రోగ్రామ్‌లు సైతం ►మేనేజ్మెంట్ కోర్సుల్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సులను బోధిస్తుండగా.. మరికొన్ని ఇన్స్టిట్యూట్లు పూర్తి స్థాయిలో ప్రత్యేక టెక్ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి. ►ఐఐఎం–అహ్మదాబాద్.. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా 16 నెలల అడ్వాన్స్డ్ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ►ఐఐఎం–బెంగళూరు.. బిజినెస్ అనలిటిక్స్‌లో రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ►ఐఐఎం–కోల్‌కత.. ఏడాది వ్యవధిలో బిజినెస్ అనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా డేటా సైన్సెస్‌లో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్‌లో సైతం ప్రవేశం కల్పిస్తోంది. ►ఐఐఎం–కాశీపూర్ కూడా అనలిటిక్స్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసింది. ఇతర బీ–స్కూల్స్ కూడా ► ఐఐఎంలే కాకుండా.. దేశంలోని ఇతర ప్రముఖ బీ–స్కూల్స్ కూడా మేనేజ్మెంట్ పీజీ లేదా పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయి. ► ఐఎస్బీ–హైదరాబాద్ బిజినెస్ అనలిటిక్స్‌లో హైబ్రీడ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ప్రత్యేక రీసెర్చ్ కేంద్రాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను అందిస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. సంబంధిత విభాగాల్లో ప్రత్యేకంగా రీసెర్చ్ కేంద్రాలను కూడా నెలకొల్పుతున్నాయి. ►ఐఐఎం అహ్మదాబాద్ కొద్ది రోజుల క్రితం సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశోధనలు నిర్వహించి.. వ్యాపారాలకు, పాలనకు, విధాన నిర్ణయాలకు సహకరించడం లక్ష్యంగా చేసుకుంది. ►ఐఐఎం–రాయ్‌పూర్ కూడా సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పేరుతో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, టెక్నాలజీ అడాప్షన్, ఆన్లైన్ సెక్యూరిటీ, డిజిటైజేషన్ స్ట్రాటజీ విభాగాల్లో పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది. కార్పొరేట్ వర్గాలు టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కార్పొరేట్ వర్గాలు సైతం పెద్దపీట వేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే.. టెక్, మేనేజ్మెంట్ రెండు నైపుణ్యాలున్న వారి కోసం సంస్థలు అన్వేషణ సాగిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 70 శాతం వారే టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. టెక్ కంపెనీల నియామకాల్లో సైతం 70 శాతం మేరకు మేనేజ్మెంట్ విద్యార్థులే ఉంటున్నారు. ►జీమ్యాక్ సర్వే ప్రకారం–గత ఏడాది టెక్ ఆధారిత సేవలందిస్తున్న సంస్థల్లో 89 శాతం ఎంబీఏ ఉత్తీర్ణులను నియమించుకున్నాయి. ►మేనేజ్మెంట్ సంస్థల విషయానికొస్తే.. టెక్, మేనేజ్మెంట్ నైపుణ్యాలున్న విద్యార్థులను నియమించుకున్న సంస్థల సంఖ్య 60 శాతంగా నిలిచింది. టెక్.. మేనేజ్మెంట్ ► ఒకవైపు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు టెక్ కోర్సులను అందిస్తుండగా.. మరోవైపు.. టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు సైతం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తుండటం విశేషం. ►ఐఐటీ హైదరాబాద్.. ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇన్ డేటాసైన్స్ కోర్సును అందిస్తోంది. ►ఐఐటీ–ఢిల్లీ,ఐఐటీ–కాన్పూర్,ఐఐటీ–ఖరగ్‌పూర్ వంటి ప్రముఖ ఐఐటీలు, ఇతర ఎన్ఐటీలు ఎంటెక్ (సీఎస్ఈ)లో బిగ్ డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్‌తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ► వీటితోపాటు పలు ఇతర ఐఐటీలు, మరెన్నో ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఎంటెక్ స్థాయిలో డేటా అనలిటిక్స్‌ను అందిస్తున్నాయి. ప్రయోజనం ఇప్పుడు కంపెనీలన్నీ ఏఐ బాట పడుతున్నాయి. దీంతో సంస్థల స్థాయిలో సాంకేతిక విభాగాల నుంచి కార్యాలయంలో పని చేసే మేనేజీరియల్ సిబ్బంది వరకూ.. ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన ఉంటేనే సంస్థ లక్ష్యాలు నెరవేరుతాయి. వీటికి అనుగుణంగా అకడమిక్ స్థాయిలోనే టెక్ నైపుణ్యాలు అందిస్తే కెరీర్ పరంగా రాణించగలుగుతారు. అదేసమయంలో కంపెనీలకు అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా లభిస్తాయి. టెక్ కోర్సులు–ముఖ్యాంశాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో టెక్ కోర్సులను అందిస్తున్న ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీ–స్కూల్స్. ► బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లకు ప్రాధాన్యం. ► కోర్సు కరిక్యులంతో పాటు ప్రత్యేక ప్రోగ్రామ్‌లకు రూపకల్పన. ►ఏఐ–ఎంఎల్, డేటా అనలిటిక్స్‌లో రీసెర్చ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు. ►ఈ నైపుణ్యాలతో సంస్థల్లో విధుల నిర్వహణలో మరింత సమర్థంగా రాణించే అవకాశం. ►టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ విద్యార్థులను నియమించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్న టెక్ కంపెనీలు. ►టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్ వంటి కోర్సులు. ► ఇండస్ట్రీలో.. ఐఓటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహణ పెరగడమే ప్రధాన కారణం. డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం అన్ని రంగాల్లోనూ డేటా విశ్లేషణ.. ఆయా సంస్థల భవిష్యత్తు వ్యూహాలకు, మార్కెట్ ప్రణాళికలకు కీలకంగా మారింది. వీటి ఆధారంగానే ఉత్పత్తుల రూపకల్పన, నిర్వహణ తదితర కార్యకలాపాలు చేపట్టాల్సి వస్తోంది. ఇంత కీలకమైన డేటాను విశ్లేషించాలంటే.. మేనేజ్‌మెంట్‌తోపాటు డేటా మైనింగ్, డేటాసైన్స్ నైపుణ్యాలు కూడా అవసరమే. అందుకే మేనేజ్మెంట్ విద్యలోనే వీటిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరుగుతోంది. –ప్రొ‘‘ యు.దినేశ్ కుమార్, డేటాసెంటర్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్ చైర్మన్, ఐఐఎం–బెంగళూరు -
ఎంబీఏ చదివాడు.. పాత నేరస్తుడితో కలిసి చైన్ స్నాచింగ్
హిందూపురం: సులువుగా డబ్బు సంపాదించాలనుకుని చైన్‌స్నాచర్‌గా మారిన ఎంబీఏ పట్టభద్రుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలను సోమవారం హిందూపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమ్య వెల్లడించారు. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన అభిలాష్ ఎంబీఏ పూర్తి చేసి సులువుగా డబ్బు సంపాదించాలనుకుని గుప్త నిధుల కేసులో పాత నేరస్తుడిగా ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెంకటాపురానికి చెందిన జనత్‌కుమార్‌తో చేతులు కలిపాడు. గుప్తనిధులు వెలికి తీసేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసేందుకు చైన్‌స్నాచింగ్‌లకు తెరతీశారు. ఈ క్రమంలోనే హిందూపురంలోని పాండురంగనగర్, టీచర్స్‌కాలనీ, శ్రీనివాసనగర్, పెనుకొండలోని ఆల్విన్ కాలనీ, అనంతపురంలోని రాంనగర్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తాము అపహరించిన బంగారు చైన్లను సోమవారం హిందూపురంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా హిందూపురం రూరల్ సీఐ హహీద్‌ఖాన్, ఎస్ఐ శ్రీనివాసులు గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వారి నుంచి రూ.1.90 లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, రూ.15 లక్షలు విలువ చేసే 30.50 తులాల బరువున్న 8 బంగారు మాంగళ్యం చైన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. -
బంపర్ఆఫర్: కరోనా బ్యాచ్‌లకు టీసీఎస్‌లో ఉద్యోగాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్రెష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు వరంలాంటి వార్తను ప్రకటించింది. కరోనా కష్టకాలంలో ఉద్యోగార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. కోవిడ్ కష్టాలు గత రెండేళ్లుగా ప్రపంచమంతా కరోనా నామజపంతో ఉలిక్కి పడుతోంది. కోవిడ్ 19 కారణంగా విద్యా సంస్థలు ఎక్కడివక్కడే మూత పడ్డాయి. రెగ్యులర్ క్లాసులు మూతపడి ఆన్లైన్ క్లాసులే వేదికయ్యాయి. జూమ్, గూగుల్ మీట్ తదితర యాప్‌ల ద్వారానే విద్యార్థులు పాఠాలు వినాల్సి వచ్చింది. ప్రాక్టికల్ తరగతులకు అవకాశమే లేకుండా పోయింది. కరోనా బ్యాచ్‌లు కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా చాలా కోర్సులకు సంబంధించి సిలబస్‌లు పూర్తి కాలేదు. సిలబస్ పూర్తి అనిపించుకున్న సబ్జెక్టులు, చాప్టర్లు కూడా అరకొరగానే జరిగాయనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఉంది. మరికొన్ని కోర్సులకు, క్లాసులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే నెక్ట్స్ తరగతిగా ప్రమోట్ అయ్యారు. దీంతో 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్‌లకు కరోనా బ్యాచ్‌లుగా పేరు పడ్డాయి. భవిష్యత్తులో సాధారణ బ్యాచ్‌లతో పోల్చితే కరోనా బ్యాచ్‌ల పరిస్థితి ఏంటనే బెంగ చాల మందిలో నెలకొంది. టీసీఎస్ సంచలన నిర్ణయం కరోనా బ్యాచ్ విద్యార్థుల సామర్థ్యంపై నెలకొన్న అనుమానాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ టీసీఎస్ సంస్థ సంచనల నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్ కింద ఎంబీఏ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అవకాశం ప్రత్యేకించి 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్‌లలో పాసవుట్ అయిన ఎంబీఏ గ్రాడ్యుయేట్స్‌కే కేటాయించింది. నవంబరు 9 వరకు ఉద్యోగార్థులు టీసీఎస్ పోర్టల్ ద్వారా ఎంబీఐ హైరింగ్‌లో భాగం కావచ్చు. నవంబరు 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 18 నుంచి 28 ఏళ్ల వరకు వయస్సు పరిమితిని విధించారు. ఉద్యోగార్థులు రెండేళ్ల ఎంబీఏ కోర్సును పూర్తి చేయడంతో పాటు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది. బీటెక్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు, 35,000ల మందికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వడపోసేందుకు టీసీఎస్ 90 నిమిషాల పరీక్షను నిర్వహించనుంది. వెర్బల్ అప్టిట్యూట్, క్వాంటిటేటివ్ అప్టిట్యూట్, బిజినెస్ అప్టిట్యూట్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ కింద దాదాపు 35,000ల మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్‌ని టీసీఎస్ హైర్ చేసుకోనుంది. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! -
ఎంబీఏ చదవలేకపోయాడు.. టీ కొట్టుతో కోట్లు సంపాదించాడు..
అహ్మదాబాద్: జీవితంలో సక్సెస్ ఎవరికీ అంత ఈజీగా రాదు. కానీ వినూత్న ఆలోచన, పట్టుదల ఉంటే అదే సక్సెస్ వెతుక్కుంటూ మన ఇంటి తలుపు తడుతుందని నిరూపించాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రపుల్ బిల్లోర్. మొదట్లో ఈ పేరు కూడా పలకడం రాని వాళ్లకు, అలాంటి పేరుని ఇప్పుడు పది మంది నోళ్లలో నానేలా చేశాడు. ఓ చిన్న టీ కోట్టుతో మొదలై దేశవ్యాప్తంగా 22 స్టాల్స్‌ను ప్రారంభించే స్థాయికి వెళ్లాడు. అలాంటి ప్రపుల్ విజయగాథ వివరాలను ఓ సారి చూసేద్దాం. మధ్యప్రదేశ్‌లోని లాబ్రవదా గ్రామానికి చెందిన రైతు కుమారుడు ప్రఫుల్ బిల్లోర్. అయితే వ్యాపారవేత్త కావాలని మొదటి నుంచి కలలు కనేవాడు. అందుకు ప్రతిష్ఠాత్మక ఐఐఎం విద్యాసంస్థల్లో ఎంబీఏ చేద్దామనుకున్నాడు కానీ క్యాట్ పరీక్షలో మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకోయాడు. కానీ అదే తన జీవితాన్ని మార్చేయబోతోందని ఆ రోజు అతనికి తెలీదు. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువు పక్కన పెట్టి మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. అలా కొన్ని నెలల తరువాత, అతను ఉద్యోగం చేస్తునే సొంతంగా చిన్న కొట్టు ప్రారంభించాడు. అయితే వ్యాపారానికి డబ్బులు సరిపోయేవి కావు, దీంతో చదువు కోసం రూ.10,000 కావాలని తండ్రి దగ్గర తీసుకుని వాటిని టీ సామాగ్రిని కొనుగోలుకి ఉపయోగించాడు. అలా సెట్ అయిన వ్యాపారంతో ప్రపుల్ డ్రీమ్ కాలేజ్ అయిన, ఐఐఎం అహ్మదాబాద్ వెలుపల తన టీ అమ్మడం మొదలుపెట్టాడు. మొదటగా మిస్టర్ బిల్లోర్ అహ్మదాబాద్ అనే పేరు పెట్టినప్పటికీ, అతని కస్టమర్లకి ఆ పేరు పిలవడం కష్టంగా ఉండడంతో దానిని ‘ఎంబీఏ చాయ్’ వాలాగా మార్చాడు. ఆ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాడు. తన షాపుకి వచ్చే ఎంబీఏ విద్యార్థులు, స్టాఫ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ కస్టమర్ బేస్‌ను క్రమంగా పెంచుకుంటూ పోయాడు. గతేడాది అతని వ్యాపారం టర్నోవర్ 3 కోట్లు చేరినట్లు తెలిపాడు ప్రపుల్. ఇలా కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా 22 టీస్టాల్స్‌ను ప్రారంభించి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. చదవండి: A Man Sends Mail TO Paytm CEO: "నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్" -
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు. 18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్‌లాగ్‌లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు. 26 నుంచి ఎంబీఏ పరీక్షలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్‌ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఐసెట్‌లో 90.09% ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్ఐసెట్ చైర్మన్ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన ఆర్.లోకేష్ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ బి.వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ కావాలనేది లక్ష్యం.. నేను ఐఏఎస్ కావాలనే లక్ష్యంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. టీఎస్ఐసెట్ను సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ ఈసీఈ పూర్తిచేశాను. – ఆర్.లోకేష్, మొదటి ర్యాంకర్. బ్యాంకు మేనేజర్ కావాలనేది లక్ష్యం.. నేను బీటెక్ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్ఐసెట్ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా. – పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో చేరుతా.. నేను గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్‌లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతాను. – నవీనాక్షంత, మూడో ర్యాంకర్. -
చదువుతారా.. ఇంటర్నేషనల్ బిజినెస్!
మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు క్యాట్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రవేశ పరీక్ష.. ఐఐఎఫ్‌టీ ఎంబీఏ. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)లో.. ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇటీవల 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎఫ్‌టీ ప్రత్యేకత, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం... అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు 1963లో స్థాపించిన సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ). ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఐఐఎఫ్‌టీ ప్రస్తుతం ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఫుల్‌టైమ్), ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(వీకెండ్), ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, ఎంఏ ఎకనామిక్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. (బీమా రంగంలో జాబ్ కావాలా.. ఇలా ట్రై చేయండి!) 2002లో ఐఐఎఫ్‌టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా సైతం లభించింది. అంతేకాకుండా న్యాక్.. దీన్ని గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషన్గా గుర్తించింది. ఐఐఎఫ్‌టీకి ఢిల్లీ, కోల్‌కతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. కాకినాడ క్యాంపస్‌లో యూజీసీ /కేంద్ర ప్రభుత్వ అనుమతికి అను గుణంగా ప్రవేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ► గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచీ కనీసం మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ తత్సమాన విద్యను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందినవారు కనీసం 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. ఎంపిక ప్రక్రియ ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ), గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ఈ గురువుల్ని మించిన శిష్యుల కథ తెలుసా?) ఆన్లైన్ పరీక్ష ► ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్‌ను ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) విధానంలో నిర్వస్తారు. ► మొత్తం నాలుగు విభాగాల నుంచి 110 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ► ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ► నాలుగు విభాగాలు: క్వాంటిటేటివ్ ఎబిలిటీ–25 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్–35 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్–30ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్–20 ప్రశ్నలు. ► నెగిటివ్ మార్కులు: మొదటి మూడు సెక్షన్లలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. 4వ సెక్షన్‌కు సంబంధించి ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి మొత్తం 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో పెరా ఫార్ములేషన్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్–ఆంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, అనాలజీ, గ్రామర్,స్పెల్లింగ్, మ్యాచింగ్ వర్డ్ మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి నుంచి 14–16 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు ప్యాసెజ్లలో అడిగిన ప్రశ్నలకు ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. దీనిలో కరెంట్ అఫైర్స్, బిజినెస్ ఎకానమీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాలు–దేశంపై వాటి ప్రభావం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ► ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అర్థమెటిక్, సింపుల్ ఇంట్రెస్ట్, మ్యాన్ డే అండ్ వర్క్, రేషియో–ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఫిలింగ్ ఆఫ్ ఓవర్‌హెడ్ ట్యాంక్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇవే కాకుండా.. జామెట్రీ, అల్జీబ్రా, లాగ్, ట్రయాంగిల్, రెక్టాంగ్లర్స్, ప్రాబబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డేటా ఇంటర్‌ప్రిటిషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ► ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అనాలసిస్ అండ్ కాంపరేటివ్ స్టడీ ఆఫ్ డేటాటేబుల్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ విత్ టేబుల్స్, పై చార్ట్ అండ్ టేబుల్, బార్ డయాగ్రమ్ అండ్ కాంపరేటివ్ టేబుల్ వంటి అంశాలను అడుగుతారు. అలాగే లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి టీమ్ బేస్డ్ కొశ్చన్స్, స్టేట్మెంట్–కంక్లూజన్, కోడింగ్–డీకోడింగ్, ఆర్గు్గమెంట్స్, కంక్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్, కేలండర్, డైరెక్షన్ సెన్స్, సీటింగ్ అరెంజ్మెంట్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ ► ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో మ్యాచింగ్ ది లోగోస్, మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మ్యాచింగ్ స్టాక్ మార్కెట్ ఆఫ్ కంట్రీస్, కరెన్సీ ఆఫ్ ది కంట్రీస్, కరెంట్ అఫైర్స్, వివిధ రంగాలకు బ్రాండ్ అంబాసీడర్లుగా వ్యవహరిస్తున్నవారు, బుక్స్ అండ్ ఆథర్స్, బిజినెస్ అండ్ ఎకానమీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. దరఖాస్తు ఫీజు ► జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. విదేశీ అభ్యర్థులు రూ.15000/200 యూఎస్ డాలర్స్ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2021 ► పరీక్ష తేదీ: 05.12.2021 ► పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు; ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: https://iift.nta.nic.in -
చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ.. ఏది బెటర్
జాబ్ మార్కెట్ వేగంగా మారిపోతోంది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య కోర్సులను ఎంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ల్లో.. ఏది బెటర్ అనే విషయంలో విద్యార్థులు త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ కోర్సులకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. కొందరు చార్టర్డ్ అకౌంటెన్సీలో చేరుతుండగా.. మరికొందరు ఎంబీఏను ఎంచుకుంటున్నారు. సీఏ, ఎంబీఏల ప్రత్యేకతపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు తమకు నప్పే కోర్సులో చేరొచ్చు!! ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ కోర్సులకు జాబ్ మార్కెట్లో అధిక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తిచేసుకుంటే.. అవకాశాలకు కొదవలేదు. మేనేజ్మెంట్, అనాలసిస్, బిజినెస్ స్ట్రాటజీ పరిజ్ఞానంతో ఎంబీఏలు కార్పొరేట్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. మరోవైపు సీఏ కోర్సుతో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో దూసుకుపోవచ్చు. సీఏ చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ కోర్సు. సీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ విభాగాలకు అవసరమైన నిపుణులను అందించడం. మన దేశంలో ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. సీఏ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ప్రొషెషనల్ సీఏగా గుర్తింపు లభిస్తుంది. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత 10+2/ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత.. ‘కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్’(సీపీటీ)కు హాజరు కావాలి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ‘ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు’ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఐఐఎంలు వంటి ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ చేసినవారికి అవకాశాలు విస్తృతం. సైన్స్/హ్యూమానిటీస్/కామర్స్/ఇంజనీరింగ్.. ఇలా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంబీఏలో చేరొచ్చు. డిగ్రీ తర్వాత క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్‌లు; ఐసెట్ వంటి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఎంబీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. కంపెనీలు, వ్యాపారాల నిర్వహణకు అవసరమైన మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మొదలైన విభిన్న నైపుణ్యాలు అందించడం. కోర్సుల వ్యవధి సీఏ కోర్సులో..ఇంటర్మీడియట్ అర్హతతో చేరి.. నాలుగేళ్లలో పూర్తిచేసుకోవచ్చు. ఇందులో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ ఉంటాయి. ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. సీఏతో కెరీర్ సీఏ ఉత్తీర్ణులైన వారికి ఆడిటర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. సీఏ కోర్సు పూర్తి చేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం సైతం ఉంటుంది. ఆడిటింగ్ ఫర్మ్స్, ట్యాక్సేషన్, మేనేజింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, కార్పొరేట్ లా కంపెనీల్లో కొలువుతోపాటు సీఏగా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. ఎంబీఏతో ఉద్యోగాలు ఎంబీఏ చేసిన అభ్యర్థులకు వివిధ కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్స్, టీమ్ లీడర్స్, హెచ్ఆర్ హెడ్ వంటి కొలువులు లభిస్తాయి. పేరున్న బీస్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన వారికి దేశ విదేశాల్లో కార్పొరేట్ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ మేనేజర్/కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్, హెచ్ఆర్ మేనేజర్, ఐటీ/ఆపరేషన్స్ మేనేజర్, అనలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌తోపాటు మరెన్నో విభాగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నైపుణ్యాలు ► చార్టర్డ్ అకౌంటెంట్‌గా రాణించాలంటే.. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్‌పై పట్టు అవసరం. దీంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. ► ఎంబీఏలకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, టైమ్ మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్ తప్పనిసరి. దేనికదే ప్రత్యేకం ► వాస్తవానికి సీఎ, ఎంబీఏ దేనికదే ప్రత్యేకమైనవి. కాని ఎక్కువ మంది ఈ రెండు కోర్సులను పోలుస్తుంటారు. ఏ కోర్సుతో మంచి అవకాశాలు లాభిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సీఏ.. అకౌంటెన్సీకి సంబంధించిన కోర్సు. కాగా, ఎంబీఏ వ్యాపార నిర్వహణ విభాగానికి చెందిన ప్రోగ్రామ్. ఎంబీఏలో.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి పలు స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు. డ్యూయల్ స్పెషలైజేషన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ► ఎంబీఏతో పోలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసుకునేందుకు అయ్యే ఖర్చు తక్కువ. కాని సీఏ కోర్సు కొంత కఠినమైందనే అభిప్రాయం ఉంది. ఒకసారి ఎంబీఏలో చేరితే.. రెండేళ్లు పూర్తయ్యేసరికి పట్టా చేతికొస్తుంది. కాని సీఏ కోర్సులో చేరే విద్యార్థుల్లో మూడు నుంచి ఐదు శాతం మంది మాత్రమే నిర్దిష్ట సమయంలోపు కోర్సు ఉత్తీర్ణులవుతున్నారు. ► ఎంబీఏను.. ఐఐఎంలు, ఐఎస్బీ తదితర టాప్ బీ స్కూల్స్‌లో పూర్తిచేయాలంటే.. చాలా వ్యయం అవుతుంది. రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సులో చేరినవారిలో దాదాపు 80 శాతం మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. టాప్ బీ స్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే ఆకర్షణీయ వేతనాలతో కొలువులు ఖాయం అవుతున్నాయి. -
ఈ ఎంబీఏ కోడిపుంజు రూ.3 లక్షలు
సాక్షి, అమరావతి: ఎంబీఏ చేశాడు... కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. నెలకు రూ.లక్ష జీతం.. వారానికి ఐదు రోజులే ఉద్యోగం.. ఇంతకు మించి ఎవరైనా ఈ రోజుల్లో కోరుకునేది ఏముంటుంది?. కానీ, అతను అలా అనుకోలేదు. వీకెండ్లో నాటుకోళ్ల వ్యాపారం షురూ చేశాడు. తర్వాత ఏకంగా ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం పైనే దృష్టి పెట్టాడు. అది ఇప్పుడు రూ.2 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదగడమే కాదు.. పలువురికి ఉపాధి కల్పిస్తోంది. నాటుకోళ్ల పెంపకంలో గుర్తింపు పొందిన ఈ యువకుడి పేరు ప్రదీప్. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నున్న గ్రామవాసి. ఎంబీఏ చేసిన ప్రదీప్.. ఓ కార్పొరేట్ కంపెనీలో ఏపీ ఏరియా సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం చేసేవాడు. వీకెండ్లో కోళ్ల పెంపకంలో గడిపేవాడు. ఆసక్తి పెరగడంతో ఉద్యోగాన్ని వదిలి గుంటకోడూరులో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మార్కెటింగ్ ఇబ్బందులతో మొదట ఆదాయం తక్కువగా ఉండేది. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు. వ్యాపారం పెరగడంతో నున్నలో ప్రదీప్ ఫామ్స్ అండ్ హేచరీస్‌తో పాటు చికెన్ వరల్డ్ కంపెనీని ప్రారంభించాడు. నాటుకోళ్లు, కడక్‌నాథ్ కోళ్లు, సిల్కీ, బీవీ 380, ఆర్ఐఆర్ జాతులతో పాటు టర్కీ, గిన్నికోళ్లు బాతుల పెంపకాన్ని షురూ చేశాడు. ప్రస్తుతం ఈ ఫామ్‌లో వేయికి పైగా కడక్‌నాథ్ కోళ్లు, 2వేలకు పైగా ఇతర జాతులున్నాయి. కోళ్ల పెంపకం చేస్తున్న ప్రదీప్ కొత్తగా పందెం కోళ్ల ఫ్యాక్టరీ... తాజాగా ప్రదీప్ పందెం కోళ్ల ఫ్యాక్టరీని ప్రారంభించాడు. ఫిలిప్పీన్స్ పెరువియన్ జాతి కోళ్లను దిగుమతి చేసుకోవడమే కాదు.. దేశీయ పందెం కోళ్లతో క్రాసింగ్ చేయించి పెరు కోళ్లను అభివృద్ధి చేస్తున్నాడు. వీటికి బలం, వాయువేగం ఎక్కువ. వీటి గుడ్డును రూ.3 వేలకు విక్రయిస్తుండగా, రసంగి, గేరువా, సీతువా, వైట్నాట్, బ్లాక్‌నైట్ వంటి పెరువియన్ జాతి కోడిపుంజుల ధర అయితే రూ.3 లక్షల పైమాటే. ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 వేలకు పైగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే పందెం కోళ్లున్నాయి. కోళ్ల పెంపకానికి ముందుకొచ్చే యువతకు 30 శాతం సబ్సిడీతో కోళ్లను ఇవ్వనున్నట్లు చెప్పాడు. విదేశాలకు రవాణా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాలకు డెలివరీ చేస్తున్నారు. ఇటీవలే పాకిస్తాన్, నేపాల్ దేశాలకూ 500 కడక్‌నాథ్ కోడి పిల్లలను ఎగుమతి చేశారు. కోళ్లతో పాటు అంతరించిపోతున్న దేశీయ కుక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జర్మన్ షిపర్డ్, లేబర్, ముథోల్, డాబర్‌మెన్ వంటి జాతులతో పాటు అంతరించిపోతున్న జాతులకు చెందిన రాజపాలయం, జోనంగి జాతి కుక్కలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా 50 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ప్రదీప్ ఫామ్స్ పరోక్షంగా మరో వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారి కోసం ప్రతీ మంగళవారం అవగాహన కల్పిస్తున్నారు. ప్రదీప్‌కు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డు కూడా ఇచ్చింది. -
ప్రపంచానికి పాఠాలు చెబుతోంది
చీచదువుకుంటూ ట్యూషన్ చెప్పేవాళ్లు కొత్త కాదు. ఆన్లైన్ ట్యూషన్లు చెప్పడం కూడా కొత్త కాదు. కాని తిరుచ్చికి చెందిన బి.టెక్ విద్యార్థిని భారతీయులకు కాకుండా ప్రపంచ విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. లండన్, న్యూజిలాండ్, సింగపూర్, అమెరికా జాతీయులు ఆమె పాఠాలకు డాలర్లు పే చేస్తున్నారు. లాక్డౌన్లో తన చదువు తాను చదువుకుంటూనే మంచి సంపాదనలో ఉన్న కె.విశ్వతిక మీరూ ఇలా చేయొచ్చని చెబుతోంది. తిరుచ్చిరాపల్లిలోని తన ఇంటిలోని గదిలో సాయంత్రం ఆరు తర్వాత విశ్వతిక ల్యాప్‌టాప్ తెరుస్తుంది. ఆ వెంటనే ఆమె ఆన్లైన్ ట్యూషన్లు మొదలవుతాయి. విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఆమె వారికి పాఠాలు చెబుతుంది. డౌట్లు క్లియర్ చేస్తుంది. వారు భారతీయులు కాదు. వారి ఇంగ్లిష్ ఉచ్చారణ వేరు. అయినప్పటికీ తనకొచ్చిన ఇంగ్లిష్‌తోనే వారిని ఆకట్టుకుంటూ ‘మాకూ పాఠాలు చెప్పు’ అనేంత డిమాండ్ తెచ్చుకుంది విశ్వతిక. మేనకోడలితో మొదలు విశ్వతిక బెంగళూరులోని సి.ఎం.ఆర్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువుతోంది. కరోనా లాక్డౌన్ వల్ల గత సంవత్సరం నుంచి తన స్వస్థలం అయిన తిరుచ్చి (తమిళనాడు)లోనే ఉంటూ చదువుకుంటోంది. అయితే ఆమె మేనకోడలు కాలిఫోర్నియాలో స్కూలు విద్యార్థిని. ‘నాకు ఆన్లైన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠాలు చెప్పవా’ అని అడిగితే సరేనని సరదాగా మొదలెట్టింది. కాని ఆ మేనకోడలు ఎంత ఇంప్రెస్ అయ్యిందంటే తన మేనత్తను విపరీతం గా మెచ్చుకోసాగింది ఆమె టీచింగ్ పద్ధతికి. ‘నాకు చిన్నప్పటి నుంచి టీచింగ్ ఇష్టం. నేను బాగానే పాఠాలు చెబుతున్నానని నా మేనకోడలి వల్ల అర్థమైంది’ అని విశ్వతిక అంది. ఆ ఆత్మవిశ్వాసంతో ఆమె ఒక ఆన్లైన్ పోర్టల్‌లో ట్యూషన్ టీచర్‌గా తన పేరు నమోదు చేసుకుంది. ఆక్కడి నుంచి ఆమె జీవిత పాఠమే మారిపోయింది. బ్రిటిష్ విద్యార్థి ప్రచారం ఆన్లైన్ పోర్టల్ ద్వారా విశ్వతికకు నాలుగో తరగతి చదువుతున్న ఆలియా అనే పదేళ్ల బ్రిటిష్ విద్యార్థిని మొదటిసారిగా ట్యూషన్‌కు వచ్చింది. పైథాన్ అనే కోడింగ్ ప్రోగ్రామ్ గురించి పాఠాలు నేర్చుకుంది. ఆలియాకు విశ్వతిక పద్ధతి నచ్చి లండన్‌లో ఉన్న తన ఫ్రెండ్స్ చాలామందికి విశ్వతిక గురించి చెప్పింది. ‘అందరూ కోడింగ్ ప్రోగ్రామ్స్‌తో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథమేటిక్స్‌లో ట్యూషన్లకు చేరడం మొదలెట్టారు’ అంది విశ్వతిక. నెమ్మదిగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి విశ్వతిక పేరు ప్రచారం కాసాగింది. ప్రస్తుతం ఆమెకు విదేశాలలో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరికొందరు లైన్లో ఉన్నారు. ఆమె పాఠాలకు డాలర్లకు పే చేస్తున్నారు. ‘నేను సందేహాలు తీరుస్తూ పాఠాలు చెబుతాను. అది అందరికీ నచ్చుతోంది’ అంటోంది విశ్వతిక. ఇంగ్లిష్ నేర్చుకుని విశ్వతిక కంప్యూటర్ చదువులో మంచి తెలివున్న విద్యార్థిని. ప్రోగ్రామ్స్ రాస్తుంది. అలాగే ఇంగ్లిష్ కూడా ముఖ్యమని తెలుసు. అందుకే చెన్నై బ్రిటిష్ కౌన్సిల్ నుంచి షార్ట్‌టర్మ్ కోర్సు చేసింది. ‘అయితే వివిధ దేశాలలోని విద్యార్థుల ఉచ్చరణ నా ఉచ్చరణ వేరు. అయితే అది నా పాఠాలకు అడ్డు కాలేదు’ అంటుంది విశ్వతిక. ఆమె గట్టిగా 20 దాటలేదు. ఇప్పటికే రెండు ఫార్మసూటికల్ సంస్థల కోసం సాఫ్ట్వేర్ తయారు చేసి ఇచ్చింది. అంతేనా? ఆరు మంది ఎం.బి.ఏ గ్రాడ్యుయేట్స్‌ను తన ప్రాడక్ట్స్ అమ్మేందుకు ఉద్యోగులుగా కూడా పెట్టుకుంది. ‘ఆన్లైన్ క్లాసులకు చాలా భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో గుర్తింపు పొందిన ఆన్లైన్ స్కూళ్లు వస్తాయి. విద్యార్థులు వాటిలో చదువుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న స్కూళ్లు ఇక మీదట పిల్లలు కేవలం కంప్యూటర్లలోనే చూస్తారు’ అని జోస్యం చెబుతోంది విశ్వతిక. తెలివి ఒకరి సొత్తు కాదు. ఉన్న తెలివిని ఉపయోగించే మార్గాలు కొత్తగా అన్వేషించడమే మన పని అని దారి చూపుతోంది విశ్వతిక. – సాక్షి ఫ్యామిలీ -
‘టికెట్ ఇచ్చినందుకు థ్యాంక్స్.. కానీ పోటీ చేయను’
తిరువనంతపురం: వచ్చే నెల కేరళలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసున్నాయి. బీజేపీ ఆదివారం తన క్యాండెట్స్ లిస్ట్‌ని విడుదల చేసింది. అయితే ఆశ్చర్యంగా ఈ లిస్ట్‌లో ఓ సామన్యుడి పేరు ప్రకటించింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి నియోజకవర్గం నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ మణికుట్టన్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో నిన్న అంతా ఒకటే చర్చ. ఎవరీ మణికుట్టన్.. బీజేపీ తన అభ్యర్థిగా అతడిని ఎందుకు ప్రకటించింది అనే దాని గురించి రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. వీటిపై తాజాగా మణికుట్టన్ స్పందించారు. బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు చూసి ఆశ్చర్యపోయానని.. రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తన పేరు ఎందుకు ప్రకటించారో ఇంకా తనకు అర్థం కావడం లేదని.. కానీ తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా మణికుట్టన్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర బీజేపీ నాయకత్వం తమ అభ్యర్థిగా నా పేరు ప్రకటించింది. నేనొక సాధారణ పౌరుడిని. అలాంటిది టీవీలో బీజేపీ అభ్యర్థుల జాబితాలో నా పేరు రావడం చూసి ఆశ్చర్య పోయాను.. చాలా భయపడ్డాను కూడా. ఆ తర్వాత పనియా సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందకు చాలా సంతోషపడ్డాను. అయితే రాజకీయాల్లోకి రావాలని నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. ఉద్యోగం, కుటుంబం ఇదే నా ప్రపంచం. అందుకే బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని నేను వినమ్రంగా తిరస్కరిస్తున్నాను. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బీజేపీ నాయకులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాను అన్నారు. గత ఎన్నికల్లో కేరళలో బీజేపీ కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. ఈ సారి ఈ సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్ పేరును ప్రకటించింది బీజేపీ. ఆయన క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. ఏప్రిల్ 6న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. మే 2న లెక్కిస్తారు. చదవండి: అత్తింటి వేధింపులు: బీజేపీ ఎంపీ కోడలి ఆత్మహత్యాయత్నం కేరళ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల -
ఉద్యోగ నైపుణ్యాలపై కోవిడ్ దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: విద్యా, ఉద్యోగ అవకాశాలపై కరోనా దెబ్బ తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు, సామర్థ్యాలపై ప్రభావం చూపనుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 2.18 శాతం మేరకు ఉద్యోగ సామర్థ్యాలు తగ్గినట్లు వీబాక్స్ సర్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, టాగ్డ్ సంస్థ రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’లో వెల్లడించింది. కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యా లు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులు, 15 పరిశ్రమలను, 150కి పైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఐఎస్ఆర్–2021ను రూపొందించింది. కరోనా ప్రభావం, ఇతరత్రా కారణాలతో 2020 కంటే 2021లో ఉద్యోగ అర్హత ఉన్నవారు దేశ వ్యాప్తంగా 0.31 శాతం తగ్గనున్నట్లు పేర్కొంది. 2019లో 47.38 శాతం ఉద్యోగ అర్హులున్నట్లు అంచనా వేయగా, 2020లో ఉద్యోగార్హత ఉన్నవారు 46.21 శాతం ఉండగా, 2021లో 45.9 శాతం ఉంటారని పేర్కొంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు దెబ్బ.. కరోనా ప్రభావం ఎంబీఏ గ్రాడ్యుయేట్లపైనా తీవ్రంగా పడింది. ఉద్యోగ సామర్థ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో 2020లో 54 శాతం ఉంటే 2021లో 46.59 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేసింది. ఆ తర్వాత బీకాం గ్రాడ్యుయేట్లపైనా అధిక ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 2.18 శాతం ఉద్యోగ నైపుణ్యాలు తగ్గిపోనున్నట్లు వెల్లడించింది. 2020లో 49 శాతం మంది బీఈ/బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాలు ఉండగా, 2021లో 46.82 శాతం మంది విద్యార్థుల్లోనే ఉద్యోగ సామర్థ్యాలు ఉంటాయని అంచనా వేసింది. ముందు వరుసలో హైదరాబాద్.. అత్యధిక ఉద్యోగ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులున్న పట్టణాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఆ తర్వాత బెంగళూరు, పుణే, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, కోయంబత్తూరు, నెల్లూరు, గుర్గావ్, మంగళూరు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉన్నాయి. తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న పట్టణాల జాబితాలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, కర్ణాటక ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ కల్పన అవకాశాలను పెంచుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగ, ఉపాధి వనరులు ఎక్కువ కలిగిన నగరాల్లో ముంబై ముందు వరుసలో ఉండ గా, 60 శాతానికిపైగా స్కోర్‌తో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అధిక ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులున్న రాష్ట్రాలు రాష్ట్రం ఉద్యోగ నైపుణ్యాలున్న వారి శాతం మహారాష్ట్ర 64.17 తమిళనాడు 60.97 ఉత్తరప్రదేశ్ 56.55 కర్ణాటక 51.21 ఆంధ్రప్రదేశ్ 48.18 ఢిల్లీ 42.57 తెలంగాణ 41.31 గుజరాత్ 36.68 పశ్చిమబెంగాల్ 35.72 రాజస్తాన్ 31.87 కోర్సుల వారీగా ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులు (శాతం) కోర్సు 2019 2020 2021 బీఈ/బీటెక్ 57.09 49 46.82 ఎంబీఏ 36.44 54 46.59 బీఏ 29.3 48 42.72 బీకాం 30.06 47 40.3 బీఎస్సీ 47.37 34 30.34 ఎంసీఏ 43.19 25 22.42 పాలిటెక్నిక్ 18.05 32 25.02 బీఫార్మసీ 36.29 45 37.24 -
చదివింది ఎంబీఏ.. చేసేది పార్ట్‌టైమ్ చోరీలు
సాక్షి, జగ్గంపేట: తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన, జల్సాలకు అలవాటు పడి, చదువుకున్న చదువును కాదని నేర ప్రవృత్తిని ఎంచుకున్న యువకుడు చోరీలకు పాల్పడతూ పోలీసులకు చిక్కాడు. ఇతడి వద్ద నుంచి పోలీసులు రూ.రెండు లక్షల విలువైన 52 గ్రాముల బంగారం, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు జగ్గంపేట పోలీసుస్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. జగ్గంపేటకు చెందిన మేడిశెట్టి మణికంఠ అనే యువకుడు పాత నేరస్తుడు. ఇతను ఎంబీఏ వరకు విశాఖపట్టణంలో చదివి పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ నేరాలు కూడా పార్ట్‌టైమ్‌గా ప్రారంభించాడు. 2016లో విశాఖలోని మువ్వలపాలెం పోలీసుస్టేషన్లో మొదటి కేసు నమోదైంది. 2018లో మరో మూడు కేసుల్లో మణికంఠ ముద్దాయిగా ఉన్నాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్ పారిపోయాడు. గత జూలైలో జగ్గంపేటలో జరిగిన పలు నేరాలు, చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేటలో ఈనెల రెండో తేదీ సోమవారం పాత నేరస్తుడు మణికంఠ కానిస్టేబుళ్ల కంటపడడంతో జగ్గంపేట ఎస్సై రామకృష్ణ బృందం పట్టుకున్నారు. జగ్గంపేటలో జరిగిన రెండు నేరాలతో పాటు మరికొన్ని నేరాలకు సంబంధించిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. పాతనేరస్తుడిని చాకచక్యంగా పట్టుకోవడంలో చొరవ చూపిన జగ్గంపేట హోంగార్డు కొండబాబుకు రూ.రెండు వేల రివార్డు అందించారు. జగ్గంపేట ఎస్సై రామకృష్ణను అభినందించారు. కార్యక్రమంలో జగ్గంపేట ఎస్సై రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నేరానికో సెల్ ఫోన్– కొత్త సిమ్ కార్డు
బంజారాహిల్స్: అతనో ఉన్నత విద్యావంతుడు..ఎంబీఏ పూర్తి చేశాడు.. జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలై వాటిని తీర్చుకునేందుకు మోసాలకు తెరలేపాడు. గత రెండు నెలలుగా పూణే పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న డాలర్ మోసగాడిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ముంబైలోని మలబార్ హిల్స్ 98 నిపినాసియా రోడ్డులోని శాంతినగర్‌లో ఉంటున్న రాహుల్ కిరణ్ ఘాటియా అలియాస్ నిఖిల్(31) ఎంబీఏ చదివాడు. అనంతరం మూడు కంపెనీలు ప్రారంభించాడు. అన్నిట్లోనూ నష్టాలే వచ్చాయి. ఒక వైపు జల్సాలకు అలవాటు పడి మరోవైపు వ్యాపారంలో నష్టాల కారణంగా అప్పులపాలయ్యాడు. దాదాపు రూ. 50 లక్షలు అప్పులు చేశాడు. వీటిని తీర్చుకునేందుకు మోసాలకు తెరలేపాడు. అందులో భాగంగానే డాలర్ ఎక్సైంజ్ పేరుతో మోసాలకు శ్రీకారం చుట్టాడు. గత నెల 26న బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని స్టార్ ఆస్పత్రి సమీపంలోని అట్లాస్ అపార్ట్‌మెంట్స్‌లో ఓ ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు. జస్ట్ డయల్ ద్వారా ఓ మనీ ఎక్సైంజ్ సెంటర్‌కు ఫోన్ చేసిన అతను తనకు 7 వేల డాలర్లు కావాలని కోరాడు. డాలర్లు తీసుకొని వచ్చిన శ్రీధర్‌గౌడ్ నుంచి వాటిని తీసుకొని నగదు తెస్తానంటూ లోపలికి వెళ్లిన నిఖిల్ అటు నుంచి అటే జారుకున్నాడు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ వైపు పోలీసులు అతడికోసం గాలిస్తుండగానే ఈ నెల 3న బంజారాహిల్స్‌లోని శాంతానివాస్లో ప్లాట్ అద్దెకు తీసుకున్న అతను మరో ఎక్సైంజ్ సంస్థకు ఫోన్ చేసి 7 వేల డాలర్లు కావాలని కోరాడు. మహేష్ అనే వ్యక్తి డాలర్లు తీసుకుని అక్కడికి రాగా వాటిని తీసుకొని నగదు ఇస్తానంటూ లోపలికి వెళ్లి జారుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ క్రైం పోలీసులు పక్కా నిఘా వేశారు. ఇందుకుగాను టెక్నాలజీని వినియోగించిన పోలీసులు నగరంలోని అన్ని ఫోరెక్స్ ఎక్సైంజ్ సంస్థలకు ఈ తరహా మోసాలపై సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం మళ్లీ ఇదే తరహాలో ఓ సంస్థకు ఫోన్ రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వలపన్ని నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత నెల 8, 20 తేదీల్లో పూణేలో కూడా ఇదే తరహాలో డాలర్లు కావాలంటూ ఫోన్ చేసి వాటితో ఉడాయించినట్లు విచారణలో వెల్లడైంది. కోల్‌కతాలోనూ అతడిపై చెక్‌బౌన్స్ కేసు ఉన్నట్లు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో పూణే, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల డాలర్ కేసులు నమోదయ్యాయి. కాగా పూణే పోలీసులు గత నెల 3 నుంచి నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే బంజారాహిల్స్ క్రైం పోలీసులు నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.7.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన బంజారాహిల్స్ క్రైం ఎస్ఐ భరత్ భూషణ్‌ను డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ కే.ఎస్.రావు, ఇన్స్పెక్టర్ ఆర్. కళింగరావు తదితరులు పాల్గొన్నారు. నేరానికో సెల్ ఫోన్– కొత్త సిమ్ కార్డు నిందితుడు రాహుల్ కిరణ్ అలియాస్ నిఖిల్ ఓ సారి మోసానికి పాల్పడిన అనంతరం అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డులను వాడడు. డాలర్లతో ఉడాయించిన మరుక్షణమే ఈ సెల్‌ఫోన్‌ను బద్దలు కొట్టి సిమ్‌కార్డును జేబులో వేసుకుంటాడు. ఇలా నెల రోజుల వ్యవధిలోనే నాలుగు సెల్ఫోన్లు, నాలుగు సిమ్‌కార్డులు వినియోగించాడు. పోలీసులకు చిక్కకుండా ఈ తరహా సిమ్‌లు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదిలా ఉండగా తనను ఎవరూ గుర్తు పట్టకుండాముఖానికి సగం వరకు మాస్క్ ధరించే ఇతను నకిలీ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడుతుంటాడని తెలిపారు. -
ఎంబీఏ జాబ్రూటు ఇంజనీరింగ్ వెనకబాటు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏటా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్)లో ఎక్కువగా ఉండగా, ఉద్యోగానికి కావాల్సిన ప్రతిభా వారిలోనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2019లోనూ ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాల విషయంలో వారు వెనుకబడిపోయారు. 2019లో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఎంబీఏ విద్యార్థుల్లో ఎక్కువగా ఉన్నట్లు ఇండియా స్కిల్ రిపోర్టు–2020లో వెల్లడైంది. 2019 జూలై నుంచి నవంబర్ వరకు నేషనల్ ఎంప్లాయిబిలిటీ టెస్టు సర్వేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సహకారంతో ది వీ బాక్స్ నిర్వహించింది. ఇండియా స్కిల్ రిపోర్టు–2020 పేరుతో ఆ నివేదికను విడుదల చేసింది. సంఖ్య పెరిగింది.. నైపుణ్యం తగ్గింది.. దేశంలోని 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3 లక్షల మంది విద్యార్థులను, వివిధ రంగాలకు చెందిన 150 కంపెనీలను కలసి చేసిన సర్వే నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. 2018లో ఉన్నత విద్యను చదివే విద్యార్థుల్లో బీఈ/బీటెక్ వారు 23 శాతం ఉన్నారు. మిగతా వారంతా ఇతర కోర్సుల్లో ఉన్నారు. 2019కి వచ్చే సరికి ఉన్నత విద్యను చదివే విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య 31 శాతానికి పెరిగింది. ఉద్యోగానికి కావాల్సి ప్రతిభ ఇంజనీరింగ్ చదివే వారిలో తక్కువ మందిలో ఉన్నట్లు తేలింది. 2018లో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 57.09% మందిలో ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నట్లు వెల్లడి కాగా, 2019లో మాత్రం ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న విద్యార్థుల సంఖ్య 49 శాతానికి పడిపోయింది. ఇక 2018 సంవత్సరంలో ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎంబీఏ విద్యార్థులు 13 శాతం ఉంటే, 2019లో వారి సంఖ్య 17 శాతానికి పెరిగింది. ఇక నైపుణ్యాల విషయానికి వస్తే 2018లో ఎంబీఏ ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య 36.44%ఉండగా 2019లో ఎంబీఏ విద్యార్థుల్లో ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు ఉన్న వారి సంఖ్య 54 శాతానికి పెరిగినట్లు తేల్చింది.