ఎంబీఏ విద్యార్థిని బలిగొన్న లారీ
జూపూడి (ఇబ్రహీంపట్నం):
బైక్‌పై వెళ్తున్న ఎంబీఏ విద్యార్థిని లారీ రూపంలో మృత్యువు కాటేసింది. నిమ్రా కళాశాల సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన భూబత్తుల రమేష్ (23) జూపూడి నోవా కళాశాలలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతున్నాడు. రమేష్ తండ్రి రైతు. ఇటీవలే అతడు కొత్త బైక్ కొన్నాడు. కళాశాల ముగి శా క ఇబ్రహీంపట్నంలో అద్దెకు తీసుకున్న తన రూముకు బైకు పై వస్తున్నాడు. దారి మధ్యలో నిమ్రా కళాశాల సమీపంలో బూడిద చెరువుకు వెళ్లే లారీ ఇతని బైకును ఢీకొనడంతో కిందపడగగా లారీ ముందు టైర్లు తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇబ్రహీంపట్నం స్టేషన్ ఎస్‌ఐ లు గణేష్, శ్రీనివాస్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని అతని మిత్రులకు తల్లిదండ్రులకు సమాచారం అందించా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.