
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించబోయే టీఎస్‌ఐసెట్–2019 షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఐసెట్ షెడ్యూల్ వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 21న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, మార్చి 7 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ రిజిస్ట్రేషన్‌కు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 29 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
రూ.500 అపరాధ రుసుముతో మే 6 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే 11 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 15 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 18 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉం దని వివరించారు. మే 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలు మే 23, 24 తేదీల్లో 3 సెషన్లలో నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరో సెషన్ నిర్వహిస్తామని, తక్కువగా వస్తే 3 సెషన్లలోనే జరుపుతామన్నా రు. ప్రిలిమినరీ కీ మే 29న విడుదల చేస్తామన్నారు. ఫలితాలను జూన్ 13న విడుదల చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment