MCA
-
టీమిండియాలో నో ఛాన్స్.. అక్కడ మాత్రం కెప్టెన్‌గా ఎంపిక! ఎవరంటే?
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు 28 మంది సభ్యులతో కూడిన తమ జట్టును మహారాష్ట్ర క్రికెట్ ఆసోషియేషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా స్టార్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంసీఏ నియమించింది. గత సీజన్లో మహారాష్ట్ర జట్టుకు సారథ్యం వహించిన కేదార్ జాదవ్.. ఈ ఏడాది జూన్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. గత రంజీ సీజన్లో మహారాష్ట్ర జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో ఈ ఏడాది సీజన్లో కొత్త కెప్టెన్, కోచ్‌తో మహారాష్ట్ర బరిలోకి దిగనుంది. మహారాష్ట్ర హెడ్‌కోచ్‌గా సులక్షణ కులకర్ణి వ్యవహరించనున్నాడు.గతంలో తమిళనాడు జట్టుకు సులక్షణ కోచ్‌గా పనిచేశాడు. ఇక రుతురాజ్ కెప్టెన్‌గా అనుభవం ఉంది. అతడు ఇప్పటికే మహారాష్ట్ర జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్లో సారథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కూడా రుతురాజ్ ఉన్నాడు. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే భారత జట్టు ఆసియాక్రీడల్లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. రుతురాజ్ చివరగా భారత తరపున జింబాబ్వే సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటకి.. శ్రీలంక పర్యటనకు అతడికి భారత జట్టులో చోటు దక్కలేదు. అతడిని కాదని రియాన్ పరాగ్, శివమ్ దూబే వంటి వారికి చోటు ఇవ్వడం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. ఇక రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ ఆక్టోబర్ 14 నుంచి ప్రారంభం కానుంది.రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు మహారాష్ట్ర జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సౌరభ్ నవాలే, అంకిత్ బవానే, మందార్ భండారీ, నిఖిల్ నాయక్, హితేష్ వాలుంజ్, సిద్ధేష్ వీర్, విక్కీ ఓస్త్వాల్, సచిన్ దాస్, సత్యజీత్ బచావ్, హర్షల్ కేట్, తరంజిత్‌సింగ్ ధిల్లాన్, యశ్ క్షీర్హన్కర్ సోలంకి, ప్రశాంత్ రాజ్కర్ సోలంకి, రాజ్కర్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, రామకృష్ణ ఘోష్, దిగ్విజయ్ పాటిల్, ముఖేష్ చౌదరి, అజీమ్ కాజీ, ప్రదీప్ దధే, సిద్ధార్థ్ మ్హత్రే, మనోజ్ ఇంగాలే, మెహుల్ పటేల్, రజనీష్ గుర్బానీ, ముర్తాజా ట్రంక్వాలా, వైభవ్ గోసావి. -
ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజింక్య
ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడిగా అజింక్య నాయక్ (37) ఎన్నికయ్యాడు. నిన్న (జులై 23) జరిగిన అధ్యక్ష ఎన్నికలో బీజేపీ బలపరిచిన సంజయ్ నాయక్‌పై 107 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. మొత్తం ఓట్లలో అజింక్యకు 221.. సంజయ్‌కు 114 ఓట్లు పోలయ్యాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా అజింక్య రికార్డు సృష్టించాడు. గత నెలలో మాజీ అధ్యక్షుడు అమోల్ ఖలే మృతి చెందడంతో ఎంసీఏకు ఎన్నిక జరిగింది.అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన అజింక్య, సంజయ్ ప్రస్తుతం ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. అజింక్య కార్యదర్శిగా.. సంజయ్ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఘన చరిత్ర కలిగిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని అజింక్య తెలిపాడు. కాగా, శరద్ పవార్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, మనోహర్ జోషి లాంటి ఉద్దండపిండాలు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించారు. -
దిల్ రాజు నయా ప్లాన్.. నాని ప్లేస్‌లో నితిన్, వర్కౌట్ అయితే కాసుల వర్షమే!
టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసి సక్సెస్ అందుకుంటున్నారు హీరోలు..దర్శకులు. అందుకే ఈ మధ్య దర్శకులు సీక్వెల్ కి లీడ్ ఉండేలా క్లైమాక్స్ ప్లాన్ చేసున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సీక్వెల్ మూవీ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ సినిమాలో నటించింది ఒక హీరో అయితే...సీక్వెల్ లో నటించబోయేది మరో హీరో అని తెలుస్తుంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన సినిమా ఎం.సి.ఎ. మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ సినిమాలో నాని, సాయిపల్లవి జంటగా నటించగా...భూమిక ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. దాదాపు 25 కోట్లతో తెరకెక్కిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర 70 కోట్లు వసూళ్లు చేసింది. నాని కెరీర్ లో ఎం.సి.ఎ బెస్ట్ మూవీగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ దిల్ రాజు బ్యానర్ లో వకీల్ సాబ్ తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా ఫుల్ బిజీ అయిపోతాడనుకుంటే...సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు ఏ హీరో కూడా డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పలేదు. అయితే ఈ గ్యాప్ లో వేణు శ్రీరామ్ స్టోరీస్ తయారు చేసుకుంటూ బిజీగా ఉన్నాడనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ తన దర్శకత్వంలో హిట్ అయిన ఎం.సి.ఎ మూవీకి సీక్వెల్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్ కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కబోతుందని తెలిసింది. అయితే ఈ ఎం.సి.ఎ సీక్వెల్ లో నాని బదులు యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడట. దిల్ రాజు ముందుగా హీరో నానికి ఈ సీక్వెల్ మూవీ ఆఫర్ చేశాడట. అయితే ఇతర సినిమాలతో బిజిగా ఉండటం వల్ల చేయలేనని సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎం.సి.ఎ సీక్వెల్ ఆఫర్ నితిన్ కి చేరింది. ప్రస్తుతంనితిన్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మాస్ హీరోగా ట్రై చేసిన మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా వక్కంతం వంశీ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకి తీసుకువెళ్లాడు నితిన్. అలాగే వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా ఓ మూవీలో నటించనున్నారు. భీష్మ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన నితిన్...దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక దిల్ రాజు ..డైరెక్టర్ వేణుశ్రీరామ్ కి నితిన్ తో మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్...నితిన్ కి ఎం.సి.ఎ మూవీ సీక్వెల్ స్టోరీ చెప్పి ఎస్ అనిపించుకున్నాడట. వక్కంతం వంశీ సినిమా అయిపోయాక.. నితిన్-వేణు శ్రీరామ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందనే మాట టి.టౌన్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ మరో వారం రోజుల్లో అవకాశం ఉంది. -
ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ తుది దశ సీట్ల కేటాయింపు గురువారం పూర్తయింది. మొత్తం 83 శాతం సీట్లు కేటాయించినట్టు సాంకేతిక విద్యావిభాగం ప్రకటించింది. ఐసెట్‌లో మొత్తం 61, 613మంది అర్హత సాధించారు. 19,666 మంది 3,60,435 ఆప్షన్లు ఇచ్చారు. ఎంబీఏలో 24,278 సీట్లు, ఎంసీఏలో 2865 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏలో 21,983 సీట్లు కేటాయించగా, ఇంకా 2295 సీట్లు మిగిలిపోయాయి. ఎంసీఏలో 2865 (వంద శాతం) సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 31లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సాంకేతిక విద్యావిభాగం సూచించింది. -
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
సాక్షి , హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–2022 ఫలితలు నేడు (ఆగస్టు 27) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కాకతీయ యూనివర్సిటీలో మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాలతో పాటు ఫైనల్ కీ ని కూడా విడుదల చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2022 ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు. ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్ వర్థన్ మొదటి ర్యాంకు కైవసం చేసకోగా.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేష్ చంద్రారెడ్డి రెండవ ర్యాంకు సాధించారు. అలాగే గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కాట్రగడ్డ జితిన్ సాయికి మూడో ర్యాంకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన వెలిశాల కార్తీక్ నాలుగో ర్యాంక్ సాధించారు. కాగా ఐసెట్ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,781 విద్యార్థులు పరీక్ష రశారు. వారిలో 61,613 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 30,409 మంది పురుషులు (89 శాతం), 31,201 మంది మహిళలు (89.34 శాతం) 3 ట్రాన్స్జెండర్లు (75 శాతం) ఉన్నారు. ఫలితాలు https://icet.tsche.ac.in అందుబాటులో ఉన్నాయి. టీఎస్ ఐసెట్-2022 ఫలితాలు కోసం క్లిక్ చేయండి -
ఐసెట్‌లో 90.09% ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్ఐసెట్ చైర్మన్ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన ఆర్.లోకేష్ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ బి.వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ కావాలనేది లక్ష్యం.. నేను ఐఏఎస్ కావాలనే లక్ష్యంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. టీఎస్ఐసెట్ను సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ ఈసీఈ పూర్తిచేశాను. – ఆర్.లోకేష్, మొదటి ర్యాంకర్. బ్యాంకు మేనేజర్ కావాలనేది లక్ష్యం.. నేను బీటెక్ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్ఐసెట్ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా. – పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో చేరుతా.. నేను గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్‌లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతాను. – నవీనాక్షంత, మూడో ర్యాంకర్. -
విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
లక్నో : బెనారస్ హిందు యూనివర్సిటీ క్యాంపస్‌లో దారుణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్న గౌరవ్ సింగ్(23) హాస్టల్ ముందు తన స్నేహితులతో మాట్లాడుతుండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయారు. పొట్టలోకి బులెట్లు దూసుకుపోవడంతో తీవ్రగాయాల పాలైన గౌరవ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే దుండగులు కాల్పులు జరిపినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. కాగా కాలేజీలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాడనే కారణంగా గౌరవ్ సింగ్‌ను యూనివర్సిటీ యాజమాన్యం 2017లో అతడిని సస్పెండ్ చేసింది. ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా.. బస్సును దహనం చేసిన ఘటనతో గౌరవ్‌కు సంబంధం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడు హత్యకు గురికావడం కలకలం రేపింది. కాగా మృతుని తండ్రి రాకేష్ సింగ్ యూనివర్సిటీలోనే కార్మికుడిగా పని చేస్తుండటం గమనార్హం. -
తప్పించక ముందే తప్పుకున్నారు..!
ముంబై: ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ రాజీనామా చేశాడు. అగార్కర్‌తో పాటు సెలక్షన్ కమిటీలో ఉన్న మరో ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కమిటీ సమావేశమైన కొద్ది గంటల్లోనే వీరు రాజీనామాలు ప్రకటించడం ప్రాధాన్యత ను సంతరించుకుంది. దేశవాళీ టోర్నీల్లో ముంబయి జట్టు దారుణంగా పరాజయం పాలైంది. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో అంచనాలను అందుకోలేదు. దీంతో సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకునేందుకు ఎంసీఏ తాత్కాలిక కమిటీ సిద్ధమైంది. ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్న సమయంలోనే సెలక్షన్ కమిటీ సభ్యులు మూకుమ్ముడిగా రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామాలు చేసిన వారిలో అగార్కర్‌తో నీలేస్ కులకర్ణి, సునీల్ మోరే మరియు రవి ఠక్కర్‌లు ఉన్నారు. వీరంతా తమ రాజీనామా లేఖలను ఈ-మెయిల్లో ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎంసిఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సి.కె. నాయక్‌కు పంపారు. -
21న టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించబోయే టీఎస్ఐసెట్–2019 షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఐసెట్ షెడ్యూల్ వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 21న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, మార్చి 7 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ రిజిస్ట్రేషన్‌కు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 29 వరకు ఉంటుందని పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో మే 6 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో మే 11 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 15 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 18 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉం దని వివరించారు. మే 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలు మే 23, 24 తేదీల్లో 3 సెషన్లలో నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరో సెషన్ నిర్వహిస్తామని, తక్కువగా వస్తే 3 సెషన్లలోనే జరుపుతామన్నా రు. ప్రిలిమినరీ కీ మే 29న విడుదల చేస్తామన్నారు. ఫలితాలను జూన్ 13న విడుదల చేస్తామని వెల్లడించారు. -
జనవరిలో సెట్స్ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్‌పై కసరత్తు మొదలైంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ జారీ చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. గతంలో దేశం మొత్తం ఒకే రకమైన కోర్సులో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేసింది. అలాగే జేఈఈ మెయిన్ ద్వారానే ఇంజనీరింగ్ ప్రవేశాలను 2019–20 విద్యా సంవత్సరం నుంచి చేపట్టాలని ప్రయత్నించింది. అయితే దీనిపై ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడం, మరోవైపు జేఈఈ మెయిన్ నిర్వహణకు సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్ జారీ అవ్వడంతో ఉన్నత విద్యా మండలి ఈసారి ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో సెట్స్ షెడ్యూల్ జారీ చేయనుంది. ఈలోగా అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో ఓసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎల్ఎల్బీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఎంసెట్‌ను ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేయాలని యోచిస్తోంది. -
ఒడలు బళ్లు.. బళ్లు ఓడలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక విద్యా కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. నాణ్యత ప్రమాణాలు కొరవడటంతో ఆయా కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు సంప్రదాయ డిగ్రీలైన బీకాం, బీఎస్సీలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సైన్సు, కామర్స్ రంగాల్లో అవకాశాలు పెరుగుతుండటంతో వీటిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో 6 వేల వరకు తగ్గిపోగా, సంప్రదాయ డిగ్రీల్లో చేరిన వారి సంఖ్య గత ఏడాదికి, ఇప్పటికి 25 వేలకు పైగా పెరగడం గమనార్హం. ఉన్నత విద్యా శాఖ తాజాగా తేల్చిన లెక్కల్లో ఈ వాస్తవం బయటపడింది. సంప్రదాయ డిగ్రీల్లో భారీ పెరుగుదల.. రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీలైన బీఏ, బీకాం, బీఎస్సీలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాదికి ఇప్పటికి పోల్చితే బీఏలో 8 వేలకు పైగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. అలాగే బీకాంలో 16 వేల వరకు పెరగగా, బీఎస్సీలో 10 వేల వరకు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 2016–17 విద్యా సంవత్సరంలో 71,066 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 54,064 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక 2018–19 విద్యా సంవత్సరంలో 66,079 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 48,662 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక ఎంబీఏ, ఎంసీఏలోనూ 2016–17లో 24,557 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 22,479 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018–19కి వచ్చే సరికి 25,912 సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 21,767 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్‌లోనూ 2016 విద్యా సంవత్సరంలో 50,721 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 36,983 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018 విద్యా సంవత్సరంలో 38,359 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 29,310 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. -
జెట్ ఎయిర్వేస్పై కార్పొరేట్ శాఖ దృష్టి
న్యూఢిల్లీ: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) దృష్టి సారించింది. ఆర్థిక ఫలితాలను వాయిదావేసిన అంశంతో పాటు మరికొన్ని విషయాల గురించి వివరణనివ్వాలంటూ కంపెనీతో పాటు ఆడిటర్లకు కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) సూచించింది. ఎంసీఏలోని సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు తెలిపారు. జూన్ త్రైమాసిక ఫలితాలను ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నా సంక్షోభ పరిస్థితుల కారణంగా జెట్ వాయిదా వేసింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొందరు ఉద్యోగులను తొలగించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ.. సిబ్బంది నిరసనతో ఆ యోచనను తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27న సంస్థ బోర్డు సమావేశం కానుంది. -
‘ఎంసీఏ’ అంటే కొత్త అర్థం చెప్పిన మెగాహీరో!
ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయ్ కాదు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే అంతకంటే కాదు. ఎంసీఏ అంటే అల్లువారబ్బాయి అల్లు శిరీష్ కొత్త అర్థాన్ని చెప్పారు. బుధవారం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సెలబ్రెటీలు చిరుని కలిసేందుకు క్యూ కట్టారు. ఇలానే ఈ యువ హీరో కూడా చిరుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. చిరుతో దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘చివరగా నేను నా సిగ్గును జయించి.. మా మామయ్యను ఓ సెల్ఫీ అడిగాను. నేను కూడా కోట్లలో ఒక్కడినే.. నేనెప్పుడూ గర్వ పడుతుంటా.. ఎంసీఏ (మెగాస్టార్ చిరంజీవి అభిమాని)ని అయినందుకు’ అంటూ పోస్ట్ చేశాడు. Finally overcame my shyness and asked my Uncle for a selfie! Like crores of others I am always a proud MCA (Megastar Chiranjeevi Abhimani). #megaselfie pic.twitter.com/kxmGIDXiYH — Allu Sirish (@AlluSirish) 22 August 2018 -
ఐసీఐసీఐ వివాదంపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు రుణాల వివాదంపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల (ఎంసీఏ) శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వివాదాస్పద న్యూపవర్ రెన్యూవబుల్స్‌తో పాటు సంబంధిత మరో అయిదు కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి పి.పి.చౌదరి తెలిపారు. కంపెనీల చట్టం సెక్షన్ 206 (5) కింద ఐసీఐసీఐ బ్యాంకు రుణ వివాదంతో ముడిపడి ఉన్న ఆరు కంపెనీల తనిఖీలకు ఏప్రిల్ 23న ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఎంసీఏ పరిధిలోని రీజనల్ డైరెక్టర్ (పశ్చిమ రీజియన్) వీటిని నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. సెక్షన్ 206 కింద అకౌంటు పుస్తకాల తనిఖీలు, ఎంక్వైరీలు, కీలక వివరాలు సేకరించేందుకు దర్యాప్తు చేసే ఇన్స్పెక్టర్కు అధికారాలు ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు.. ఆర్బీఐ పరిధిలో ఉంటుంది కనుక తమ శాఖ ఆ బ్యాంకు వ్యవహారాలేమీ పరిశీలించడం లేదంటూ ఎంసీఏ సీనియర్ అధికారి ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన కుటుంబసభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ .. క్విడ్ ప్రో కో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాలిచ్చారని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ లావాదేవీకి ప్రతిగా చందా కొచర్ భర్త దీపక్ కొచర్ సంస్థలో వీడియోకాన్ పెట్టుబడులు పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్, సీబీఐ, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే దీనిపై విచారణ జరుపుతున్నాయి. కొచర్‌తో పాటు బ్యాంకుకు కూడా సెబీ షోకాజ్ నోటీసులు పంపింది. ఐసీఐసీఐ బ్యాంకు .. అమెరికాలో కూడా లిస్టయి ఉన్నందున అక్కడి సెక్యూరిటీస్ ఎక్సే్చంజ్ కమిషన్ కూడా ఈ వివాదంపై దృష్టి సారించింది. -
సోలోగా సాయిపల్లవి?
‘భానుమతి.. ఒక్కటే పీస్ హైబ్రీడ్ పిల్ల... బొక్కలిరగ్గొడతా నకరాలా’ అంటూ ‘ఫిదా’లో సాయిపల్లవి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేశారీ చెన్నె బ్యూటీ. కథానాయికగానే ఓ రేంజ్లో ఆకట్టుకున్న సాయిపల్లవి ఇక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తే ఏ రేంజ్లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకనే విషయానికి వస్తే... సాయిపల్లవి ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. తొలి చిత్రం ‘నీదీ నాదీ ఒకే కథ’తో ఘనవిజయం అందుకున్న వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. వేణు ఊడుగుల చెప్పిన స్టొరీ లైన్ ఈ బ్యూటీకి బాగా నచ్చిందని భోగట్టా. అయితే స్క్రిప్ట్‌ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సి ఉందట. ప్రస్తుతం శర్వానంద్ సరసన సాయి పల్లవి ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె నటించిన ‘కణం’ విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో ‘మారి 2’, ‘ఎన్జీకె’, ఇంకా పేరు ఖరారు చేయని ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారామె. -
వదిన కాస్త...దెయ్యం అవుతోంది!
ఎంసీఏ సినిమాలో వదినగా భూమిక హుందాగా నటించింది. సినిమా మొత్తం భూమిక చుట్టే తిరుగుతుంది. భూమిక తన నటన, హావభావాలతో పాత్రకు న్యాయం చేసింది. రీ ఎంట్రీ తర్వాత భూమికకు చాలా ఆఫర్లు వస్తున్నాయట. ప్రస్తుతం మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కన్నడ సినిమా ‘యూ టర్న్’ రీమేక్‌లో కీలక పాత్రలో భూమిక నటిస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాలో భూమిక దెయ్యం పాత్రలో కనిపించబోతోందట. మరి వదినగా అదరగొట్టిన భూమిక, దెయ్యం పాత్రలోనూ అదే రేంజ్లో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. కన్నడలో డైరెక్ట్ చేసిన పవన్‌కుమార్ తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటింస్తోంది. -
మళ్లీ స్టూడెంట్‌గా
సాధారణంగా స్టూడెంట్ స్థాయి నుంచి టీచర్‌గా ఎదుగుతారు. కానీ కథానాయిక సాయిపల్లవి మాత్రం మలయాళ సినిమా ‘ప్రేమమ్’లో టీచర్‌గా ఎంట్రీ ఇచ్చి కాలేజీ స్టూడెంట్‌గా అలరిస్తున్నారు. ఆల్రెడీ ‘ఫిదా, ఎమ్సీఏ’ సినిమాల్లో ఆమె కాలేజ్ స్టూడెంట్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆమె కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యారని సమాచారం. శర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘‘పడి పడి లేచె మనసు’’లో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ కోల్‌కత్తాలో స్టారై్టంది. ఇందులో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్‌గా నటిస్తున్నారని సమాచారం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. సాయిపల్లవి రియల్ లైఫ్‌లోనూ మెడిసిన్ స్టడీస్‌ను కంప్లీట్ చేశారు. అసలే ఈ మలయాళ బ్యూటీ మంచి నటి. రియల్ లైఫ్‌లో ఎలానూ మెడిసిన్ చేశారు కాబట్టి.. ఆ అనుభవంతో ఈ పాత్రను అలవోకగా చేసేస్తారని చెప్పొచ్చు. -
మిడిల్ క్లాస్ ముచ్చట్లు
-
తెలుగులో ఆ చిన్న మార్పు రావాలి
‘‘మళ్లీ తెలుగులో కనిపించటం సంతోషంగా ఉంది. ‘ఎంసీఏ’లో నాది చాలా స్ట్రాంగ్ రోల్. తక్కువగా మాట్లాడినా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నా దృష్టిలో ఏదైనా యాక్టింగే. వదిన పాత్ర చేయడానికి రిఫరెన్స్ ఏం తీసుకోలేదు. ఫ్రెండ్స్‌ని చూసి ఇన్స్పైర్ అవుతుంటా’’ అన్నారు భూమిక. నాని, సాయి పల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ ఈ నెల 21న విడుదలైంది. ఇందులో నాని వదినగా నటించిన భూమిక విలేకర్ల సమావేశంలో పలు విశేషాలు పంచుకున్నారు. ► నాని చాలా కంఫర్టబుల్ యాక్టర్. ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. కెమెరా ఆన్ అయితే చాలు టక్కున మారిపోతాడు. వరుస హిట్స్ వచ్చినా కూడా వెరీ డౌన్ టూ ఎర్త్. ‘దిల్’ రాజుగారు చాలా కూల్. అన్నింటినీ బాగా చూసుకుంటారు. బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. నన్నో ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. ► హాలీవుడ్, బాలీవుడ్ లాగా తెలుగులో చిన్న మార్పు రావాలి. విద్యాబాలన్ ‘తుమ్హారీ సులూ’ సినిమాలో పెళ్లయి, ఒక కొడుకు ఉన్న పాత్ర చేశారు. ఆ సినిమాలో చీరలే కట్టారు. గ్లామరస్‌గా ఏమీ ఉండరు. ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఆమే మొయిన్ క్యారెక్టర్. అలాంటి చేంజ్ మన దగ్గర కూడా రావాలి. పెళ్లయితే చాలు... ఓన్లీ క్యారెక్టర్ రోల్స్ అని ఇక్కడివాళ్లు ఫిక్స్ అయిపోయారు. ► నా కజిన్ సిస్టర్ నాతో ట్రావెల్ చేస్తుంటారు. ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. అందుకే బాబు (యష్) గురించి నాకు దిగులు లేదు. మళ్లీ సినిమాలు నిర్మించే తీరిక లేదు. మా బాబుతో సరిపోతోంది. యష్ నర్సరీ చదువుతున్నాడు. నాకేదైనా షూటింగ్ ఉందంటే వాడు స్కూల్ ఎగ్గొట్టాలి. వాడు స్కూల్ ఎగ్గొట్టేంత విలువైన పాత్రలే చేయాలనుకుంటున్నాను (నవ్వుతూ). ‘సవ్యసాచి’లో నాగచైతన్య సిస్టర్ రోల్ చేస్తున్నాను. చాలా చిన్న పాత్ర అది. కానీ కథను ముందుకు తీసుకు వెళ్లే పాత్ర. ఎంత సేపు కనిపించాం అన్నది కాకుండా ఎంత మంచి రోల్ చేశాం అన్నది నాకు ముఖ్యం. ► నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉండేది. గ్రామర్ అంటేనే కొంచెం కష్టం. అందుకే ట్రై చేయలేదు. ‘ఎంసీఏ’లో చెప్పుకుందామనుకున్నా. కానీ కుదర్లేదు. ‘సవ్యసాచి’కి కచ్చితంగా ట్రై చేస్తా. ► ప్రస్తుతం హిందీలో ప్రభుదేవా, తమన్నా నటిస్తోన్న ‘కామోషి’లో మంచి రోల్ చేస్తున్నా. ఇది మార్చిలో రిలీజవుతుంది. తమిళంలో ‘కళియుగ కాలం’ అనే సినిమాలో నయనతార, నేను లీడ్ రోల్స్ చేస్తున్నాం. -
ఆ హిట్ ట్రాక్ కంటిన్యూ అవ్వాలనుకున్నా!
‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’ చిత్రానికి కాస్త గ్యాప్ వచ్చింది. ఆ మధ్యలో రెండు సినిమాలు ఫైనలైజ్ అవుతాయనుకున్న తరుణంలో చేజారాయి. వాటి కోసం మూడేళ్లు వృథా అయ్యాయి’’ అని శ్రీరామ్ వేణు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా ఆయన దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ ఇటీవల విడుదలైంది. శ్రీరామ్ వేణు మాట్లాడుతూ– ‘‘కొన్ని విషయాలు ఎన్నిసార్లు చెప్పినా బాగానే ఉంటాయి. మిడిల్ క్లాస్ అలాంటిదే. నేను, మా బ్రదర్ క్లోజ్‌గా ఉండేవాళ్లం. నాకు పెళ్లయిన తర్వాత మా బ్రదర్ కొంచెం ఫీలయ్యాడు. ఆ స్ఫూర్తితోనే ఈ కథ రాశా. కథ అనుకున్నప్పుడే నాని అనుకున్నాం. ‘ఎంసీఏ’ రిలీజ్ అయ్యాక సుకుమార్‌గారు మొదట ఫోన్ చేశారు. కొరటాల శివగారు మెసేజ్ చేశారు. ఓ సినిమా కోసం టైమ్ వెచ్చించాక అది ఓకే కాకపోవడంతో రెండు, మూడు రోజులు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లి, బయటపడ్డాను. మంచి సినిమా చూసిన ప్రతిసారీ నేను స్ఫూర్తి పొందేవాణ్ణి. ఎందుకంటే.. మాది మధ్యతరగతి కుటుంబం. ఓ పెద్దాయన సలహా మేరకు వేణు శ్రీరామ్‌గా ఉన్న నా పేరుని శ్రీరామ్ వేణుగా మార్చుకున్నా. న్యూమరాలజీ కోసం కాదు. రవితేజగారికి కథ చెబుతా. ఆయనకు నచ్చితే చేస్తా. రాజుగారికి ఆరో హిట్ ఇవ్వాలనే టెన్షన్ ఉండేది. నేను హిట్ ఇవ్వకపోతే ఆయన ట్రాక్ దెబ్బతింటుందని జాగ్రత్తగా పనిచేశా’’ అన్నారు. -
ఏప్రిల్ 12 నుంచి ‘కృష్ణార్జున యుద్ధం’
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేసేస్తున్నాడు. ఇటీవల ఎంసీఏ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న ఈ నేచురల్ స్టార్ ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎంసీఏ ప్రమోషన్ లో పాల్గొన్న నాని కృష్ణార్జున యుద్ధం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు. తన తదుపరి చిత్రం ఏప్రిల్ 12న రిలీజ్ అవుతుందని వెల్లడించాడు నాని. -
దుమ్మురేపుతున్న కలెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: తాజాగా విడుదలైన రెండు తెలుగు సినిమాలు ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి), హలో.. అమెరికాలో దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలు యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నాయి. మొదటి ఐదు రోజుల్లో ఎంసీఏ సినిమా రూ. 4.63 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని సినిమా విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. హలో చిత్రం తొలి నాలుగు రోజుల్లో రూ.3.93 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. సోమవారం కలెక్షన్లు కూడా కలుపుకుంటే రూ. 5 కోట్లు దాటే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రెండు సినిమాలు భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. క్రిస్మస్ సెలవుల్లో ఈ సినిమాలను విడుదల చేయడంతో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. మిడిల్ క్లాస్ అబ్బాయి మొదటి ఐదు రోజుల్లో మొత్తం రూ. 21.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. తొలి వారంలో కలెక్షన్లు రూ. 25 కోట్లు దాటతాయని భావిస్తున్నారు. హలో మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.05 కోట్ల గ్రాస్ సాధించినట్టు వెల్లడించారు. ఈ రెండు సినిమాలకు పాజిటవ్ టాక్ రావడంతో మున్ముందు కలెక్షన్లు పెరిగే అవకాశముంది. -
'ఎంసీఏ'కు నాని సరికొత్త నిర్వచనం.. వైరల్!
సాక్షి, హైదరాబాద్: నాని హీరోగా తెరకెక్కి ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న మూవీ ‘ఎంసీఏ’. ఇప్పటివరకూ ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ మధ్య తరగతి ప్రేక్షకులను, మాస్ క్లాస్ ఆల్ అంటూ అన్ని వర్గాల ఆడియన్స్‌కు చేరువైంది ఎంసీఏ మూవీ. అయితే నేడు పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా హీరో నాని ఎంసీఏకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ఎంసీఏ-- 'మెర్రీ క్రిస్మస్ అందరికీ' అంటూ వినూత్నంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నాని ట్వీట్ చేశారు. నాని ట్వీట్ చేసిన గంటలోనే వేల కొద్ది లైక్స్, రీట్వీట్స్తో ఆ పోస్ట్ వైరల్ అయింది. సినిమాను ప్రమోట్ చేసుకున్నప్పటికీ మంచి ఉద్దేశంతో క్రిస్టియన్ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపాడంటూ నాని ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి నటించగా, భూమిక, రాజీవ్ కనకాల, ఆమని, నరేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలకు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతున్నారు. ‘M’erry ‘C’hristmas ‘A’ndhariki :)) — Nani (@NameisNani) 25 December 2017 -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఎమ్సీఏ
-
బ్యాంగ్ బ్యాంగ్
భూమిక చివరిసారిగా తెలుగు స్క్రీన్‌పై కనిపించింది ఎప్పుడు? ఓ మూడేళ్లు అయ్యుంటుంది. ఈ ఏడాది ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి)తో తెలుగుకి మళ్లీ వచ్చారు. ఈ చిత్రంలో ఆమె హీరో నానికి వదినగా నటించి, మంచి మార్కులే కొట్టేశారు. కమ్‌బ్యాక్ అంటే.. ఇలా బ్యాంగ్ బ్యాంగ్‌గా ఉండాలన్నట్టు ఈ చిత్రంలో భూమిక మెప్పించారు. నెక్ట్స్ ఏంటి? మళ్లీ కనిపిస్తారా? గ్యాప్ తీసుకుంటారా? అంటే.. చాన్సే లేదు. ఇక వరుసగా సినిమాలు చేసేలా ఉన్నారు. ఎందుకంటే, ‘ఎంసీఏ’ ఇలా రిలీజైందో లేదో భూమిక మరో సినిమాతో బిజీ అయ్యారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు భూమిక. దీన్నిబట్టి చూస్తుంటే ఈ బ్యూటీ తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారనిపిస్తోంది. సో.. భూమిక యూత్ హీరోలందరికీ అక్క, వదినగా, అవి కాకపోతే కథ డిమాండ్‌ని బట్టి కథానాయికగా కూడా కనిపించే అవకాశం ఉంది. -
ఫేస్బుక్లో ‘ఎంసీఏ’ సినిమా
నానీ హీరోగా నటించిన ఎంసీఏ సినిమా ఫేస్బుక్లో దర్శనమిస్తోంది. ఈ గురువారం టాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సాయి చరణ్ అనే వ్యక్తి ఫేస్ బుక్‌లో పెట్టాడు. సినిమాను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో కలెక్షన్లపై భారీ ప్రభావం పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో ఈ సంఘటనపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది. కాగా సినిమా రిలీజ్ కు ముందే పైరసీ జరిగిందంటూ వార్తలు రావటంతో నిర్మాత దిల్ రాజు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. మరోవైపు శాండిల్‌వుడ్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన అంజనీపుత్ర సినిమా రాష్ట్ర వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా నడుస్తున్న సమయంలో శుక్రవారం ఓ అభిమాని ఆ చిత్రాన్ని ఫేస్బుక్లో లైవ్‌లో చూపడంపై చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. ఈ విషయంపై చిత్ర నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. ఏకంగా సినిమాను గంటకుపైగా ఎఫ్బీలో లైవ్‌లో పెట్టాడు. ఈ విషయంపై ఎఫ్బీలో సినిమాను లైవ్‌లో పెట్టిన యలహంకు చెందిన నితీష్ మాట్లాడుతూ... తన స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన మాట వాస్తవేమనని, సినిమా లైవ్‌లో పెట్టింది తాను కాదని, తన పేరుతో ఎఫ్బీ అకౌంట్‌ను వాడుతున్న తన మిత్రుడని అన్నాడు. తనను క్షమించమని ఈ సందర్భంగా నితీష్ కోరాడు. -
అబ్బాయి మిడిల్ క్లాస్.. వసూళ్లు హైక్లాస్
సాక్షి, హైదరాబాద్: మిడిల్ క్లాస్ అబ్బాయి(ఎంసీఏ) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. తొలి రోజే భారీ వసూళ్లతో సత్తా చాటాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని కెరీర్లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 11 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలిపాయి. ఆస్ట్రేలియాలో రూ.15.47 లక్షలు రాబట్టినట్టు బాలీవుడ్ మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ ఓపెనింగ్ కలెక్షన్లు భారీగా ఉండటం విశేషం. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ధియేటర్లు 70 శాతం వరకు నిండాయని సమాచారం. దిల్ రాజు నిర్మాత కావడం, పబ్లిసిటీ బాగా చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. కలెక్షన్ల జోరు ఇదేవిధంగా కొనసాగితే నాని కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఎంసీఏ నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి నటించింది. భూమిక, రాజీవ్ కనకాల, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
'ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)' మూవీ రివ్యూ
టైటిల్ : ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్) జానర్ : రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా తారాగణం : నాని, సాయి పల్లవి, భూమిక, రాజీవ్ కనకాల సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : వేణు శ్రీరామ్ నిర్మాత : దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని, అదే ఫాంలో ఉన్న నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయ్). ఓ మై ఫ్రెండ్ సినిమాతో పరిచయం అయిన దర్శకుడు వేణు శ్రీరామ్ లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఎమ్సీఏ అందుకుందా..? నాని, దిల్ రాజులు తమ విజయ పరంపర కొనసాగించారా..? దర్శకుడిగా వేణు శ్రీరామ్ విజయం సాధించాడా..? కథ : నాని ఎలాంటి బాధ్యత లేకుండా అన్నయ్య (రాజీవ్ కనకాల) మీద ఆధారపడి హ్యాపీగా కాలం గడిపేస్తుంటాడు. తల్లి తండ్రి లేకపోటంతో నానిని గారాబంగా పెంచుతాడు అన్న. అయితే తన అన్నకు పెళ్లి కావటంతో వదిన జ్యోతి (భూమిక) వల్ల తన అన్న తనకు దూరమయ్యాడని ఆమె మీద కోపం పెంచుకుంటాడు నాని. అందుకే దూరంగా వెళ్లి హైదరాబాద్ లో బాబాయ్, పిన్నిలతో కలిసి ఉంటాడు. కానీ ఆర్టీవో గా పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఆమెకు తోడుగా నానిని పంపిస్తాడు. ఇష్టం లేకపోయినా అన్న కోసం వదినకు తోడుగా వెళ్తాడు నాని. అక్కడే హాస్టల్లో ఉండి చదువుకునే పల్లవి (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్)అయితే నాని ప్రేమ విషయం తెలిసిన వదిన జ్యోతి.. పల్లవిని దూరంగా పంపిచేస్తుంది. దీంతో నాని.. వదిన మీద మరింత కోపం పెంచుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో వరంగల్ ను భయపెట్టే శివ (విజయ్) అనే వ్యక్తి కారణంగా నాని కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రమాదం నుంచి నాని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..? శివ.. నాని ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చాడు..? నానికి వదిన మీద కోపం తగ్గిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : పాత్రల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ సూపర్ ఫాంలో దూసుకుపోతున్న నాని, మరోసారి ఆసక్తికరమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ నానిగా తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఇప్పటికే నేచురల్ స్టార్ గా ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఫిదా చేసిన సాయి పల్లవి, మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటిన భూమిక మరోసారి కీలక పాత్రలో మెప్పించింది. తన సీనియారిటీతో వదిన పాత్రకు మరింత హుందాతనం తీసుకొచ్చింది.(సాక్షి రివ్యూస్) విలన్‌గా నటించిన కొత్త కుర్రాడు విజయ్ ఆకట్టుకున్నాడు. కేవలం హావభావాలతోనే విలనిజాన్నిపండించాడు. ఇతర పాత్రలో రాజీవ్ కనకాల, ప్రియదర్శి, నరేష్, ఆమని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : తొలి చిత్రంతో నిరాశపరిచిన దర్శకుడు వేణు శ్రీరామ్ రెండో ప్రయత్నంలో సక్సెస్ సాధించాడు. మిడిల్ క్లాస్ అబ్బాయ్ పాత్రకు నానిని ఎంపిక చేసుకొని సగం సక్సెస్ అయిన వేణు శ్రీరామ్.. కథా కథనాల్లోనూ మంచి పట్టు చూపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలతో సినిమాను ఫుల్ మీల్స్ లా రెడీ చేశాడు. ముఖ్యంగా నాని, భూమికల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హీరో, విలన్ ల మధ్య సాగే ఎత్తుకు పై ఎత్తులు థ్రిల్లింగ్ గా ఉన్నాయి. తొలి భాగాన్ని ఎంటర్ టైనింన్గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను మాత్రం ఒకే మూడ్ లో కొనసాగించాడు. (సాక్షి రివ్యూస్) ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు తన స్థాయికి తగ్గ సంగీతం అందించలేదనిపిస్తుంది. ఆడియో పరవాలేదనిపించినా.. దేవీ మార్క్ ఆశించిన ఆడియన్స్ కు నేపథ్యం సంగీతం నిరాశపరుస్తుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : ప్రధాన పాత్రల నటన ఇంటర్వెల్, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
పవన్ అజ్ఞాతవాసి.. షాకింగ్ న్యూస్!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా పైరసీ బారినపడింది. న్యాచురల్ స్టార్ నానీ ‘ఎంసీఏ’ కూడా పైరసీ అయిన సినిమాల జాబితాలో ఉంది. ఈ విషయమై అజ్ఞాతవాసి, ఎంసీఏ సినిమాల నిర్మాతలు రాధాకృష్ణ, దిల్ రాజులు బుధవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విడుదలకు సిద్ధంగా ఉన్న రెండు పెద్దసినిమాలు పైరసీ బారిన పడటంతో టాలీవుడ్లో కలకలం రేగింది. గతంలోనూ పవన్-త్రివిక్రమ్ కాబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడిన సంగతి తెలిసిందే. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు : ‘ఎంసీఏ’ పైరసీకారులపై ఫిర్యాదు చేసేందుకు సీసీఎస్ కార్యాలయానికి వచ్చిన నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా ఎంసీఏ సినిమాను విడుదలకు ముందే పైరసీ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారు. డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు జవాన్ సినిమా అప్పుడు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని దిల్ రాజు చెప్పారు. పైరసీల వల్ల దాదాపు ఇండస్ట్రీకి ఏటా వెయ్యికోట్ల మేర నష్టం జరుగుతోందని అంచనా. ప్రభుత్వానికి దాదాపు వందకోట్ల ఆదాయానికి గండిపడిందని విశ్లేషకుల అంచనా. -
ఈ ఏడాది ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్..
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దాదాపు విజయాలు తప్ప అపజయం ఎరుగకుండా దూసుకెళుతున్న దిల్ రాజు కొత్త రికార్డును సొంతం చేసుకోనున్నారు. 2017 సంవత్సరానికి గాను 'టాలీవుడ్ ప్రొడ్యుసర్ ఆఫ్ ది ఇయర్'గా నిలవనున్నారు. ఒక్క ఏడాదిలో ఆరు చిత్రాలను నిర్మించి ఈ ఘనత దక్కించుకోనున్నారు. మరే నిర్మాత కూడా చిత్ర నిర్మాణం విషయంలోనూ, విజయాల వరుసలోనూ ఈ ఏడాది దిల్ రాజుకు దగ్గరలో లేరు. రేపు నాని హీరోగా నటించిన ఎంసీఏ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుండగా ఇప్పటికే విడుదలైన ఐదు చిత్రాలు ఘన విజయం సాధించాయి. 2017లో సంక్రాంతి బరిలో దిగిన శతమానం భవతి చిత్రం భారీ విజయం అందుకోవడంతోపాటు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్ చిత్రాలు నిర్మించి విడుదల చేసి విజయం సాధించి రికార్డు సృష్టించారు. -
నేను పేర్ల వెనక పరిగెత్తను
‘‘ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు పేర్లు (ప్రముఖ దర్శకులు) కావాలేమో కానీ, ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు, కుదిరితే ప్రతి సినిమాకి ఓ కొత్త డైరెక్టర్ని పరిచయం చేయాలి. మంచి పొజిషన్లో ఉంటే ఒక కొత్త హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేయగలగాలి. నా లాస్ట్ సినిమా పెద్ద హిట్ అయితే... వెంటనే పెద్ద పేరున్న డైరెక్టర్‌తో సినిమా చేయాలనుకోను. కొత్తవాళ్లతో చేయాలని ఆలోచిస్తాను. తెలుగులో కొత్త హీరోయిన్స్ లేరు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ రావడం లేదు అన్న మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. చాన్స్‌లు ఇస్తే కదా కొత్తవారు వచ్చేది. నేనెప్పుడూ పేర్ల వెనక పరిగెత్తలేదు. పరిగెత్తను కూడా. పేర్ల కోసం నేను సినిమాలు చేయలేదు. చేయను.’’ అన్నారు హీరో నాని. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నాని, సాయి పల్లవి జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ‘ఎంసీఏ’ సినిమా గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని మంగళవారం పాత్రికేయులతో మాట్లాడారు. ఆయన చెప్పిన విశేషాలు.. ► ‘ఎంసీఏ’లో క్యారెక్టర్స్ రియల్‌గా ఉంటాయి. సినిమా స్క్రీన్‌ప్లే యాక్షన్ మూడ్‌లో సాగుతుంది. కానీ యాక్షన్ సినిమా కాదు. రెగ్యులర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలానే నా క్యారెక్టర్ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి హీరో అవ్వాల్సి వచ్చిందన్నది స్క్రీన్‌పై చూస్తే ప్రేక్షకులు థ్రిల్ అవుతారన్న నమ్మకం ఉంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్స్‌కు కమర్షియల్ హంగులు జోడించి బాగా తీశారు. ‘ఎంసీఏ’ షూటింగ్ స్పాట్లో నాకు, సాయి పల్లవికి మధ్య క్లాషెస్ వచ్చాయన్న న్యూస్ విని, ఇద్దరం నవ్వుకున్నాం. ► బ్యాగ్రౌండ్ ఉంటే చాలా ప్రెజర్ ఉంటుందేమో. ఇప్పుడు నాకు నచ్చిన సినిమా చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్లొచ్చు. బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లకు ఈ ఫ్రీడమ్ ఉండకపోవచ్చేమో. ► ‘భలే భలే మగాడివోయ్’ టైమ్‌లో నేచురల్ స్టార్ నాని అనే ట్యాగ్ ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇప్పుడు లేదు. నేచురల్ స్టార్ అన్న పదంలో ప్రేక్షకుల ప్రేమ కనిపిస్తోంది. ► ‘మహానటి, భారతీయుడు’ లాంటి కథలు నాకు చెప్పి ఉంటే... నేను రిజెక్ట్ చేసి ఉంటే.. అదో రకం. నా దగ్గరకు అలాంటి కథలు రావడం లేదు. ప్రతిరోజు కొత్త కథలు వినడానికి టైమ్ కేటాయిస్తా. బట్ ఒక్క కథ కూడా రావడం లేదు. కమల్‌హాసన్‌గారు చూపిన వేరియేషన్స్‌ను మా యంగ్ జనరేషన్ యాక్టర్స్ అసలు చేయగలరా? అనిపిస్తుంది. చేస్తే మా జన్మ ధన్యమైనట్టే. ► మంచి సినిమాలు చేద్దామనే నిర్మాతగా మారాను. ‘అ!’ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అనుకుంటున్నాం. సినిమా కాన్సెప్ట్ విని థ్రిల్ అయ్యాను. మంచి ఐడియా విన్నప్పుడు ఎవరూ ప్రొడ్యూస్ చేయరన్నప్పుడు, ఆ ఐడియా నాకు నచ్చితే నిర్మిస్తా. ► డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ నాగార్జునగారికి, నాకు నచ్చింది. ‘కృష్ణార్జునయుద్ధం’లో డబుల్ రోల్ చేస్తున్నా. అనిల్ రావిపూడితో ఓ సినిమా ఉండొచ్చు. మణిరత్నంగారి మూవీకి డిస్కషన్స్ జరిగాయి. డేట్స్ కుదరలేదు. అవసరాల శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయాలి. మంగళవారం మార్నింగ్ ఓ వెబ్సైట్లో న్యూస్ చదివి, బాధపడ్డాను. సంస్కారహీనంగా ఎంత దిగజారిపోయారంటే... ‘సినిమా బాగోలేదు. అంటే బాగోలేదు’ అని చెప్పండి. లేకపోతే ఇతను రెమ్యూనరేషన్ పెంచాడనో, షూటింగ్లో ఇబ్బంది పెడతాడనో, వీడికి తిక్క అనో.. ఇలాంటి గాసిప్‌లు రాయొచ్చు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి ... అంటే అది ఏ విషయం గురించో కూడా చెప్పలేని పరిస్థితి నాదిప్పుడు. అంత దిగజారిపోయారు. ఇది సందర్భం అవునో కాదో నాకు తెలీదు. కానీ లింక్ చూసిన వెంటనే పదేళ్లు ఇండస్ట్రీలో ఉండి, ఇన్ని సినిమాలు చేసి, నేనేంటో అందరికీ తెలిశాక, ఇంత దారుణమైన మాటలతో, ఇలాంటి ఆర్టికల్ కూడా ఒకటి నా మీద రాయొచ్చా? అన్న ఫీలింగ్ కలిగింది. పెళ్లై ఒక రిలేషన్లో ఉన్నాను. అసలు.. ఎలా? పొద్దునే కూర్చొని అలా రాసేస్తారా? అనిపిస్తుంది. ఒక సినిమా రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది అనగానే.. ఒక దారుణమైన హెడ్డింగ్ పెట్టేసి, నా పేరు చెప్పకుండా రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యే ఒక హీరో అని రాస్తున్నారు. గాసిప్‌లు రాయొచ్చు. కానీ దిగజారిపోయి రాయాల్సిన అవసరంలేదేమో అనిపిస్తుంది. మనం సినిమాల మీద రన్ అవుతున్నాం. గాసిప్‌లు, రివ్యూస్, ఊహలు, నిజాలు ఇలా అన్ని పార్ట్స్ రాసుకోవచ్చు. కానీ ఊహకు కూడా అందని ఓ థాట్‌ని రుద్ది ఓ హెడ్డింగ్‌లా పెట్టి, రిలీజ్‌కి ముందు క్లిక్స్ కోసం ఇలా రాయడం సరికాదని నా ఫీలింగ్. నాకు బాధ కలిగింది కాబట్టి చెప్పాను. -
ఎంసీఏ అంటే... మిడిల్ క్లాస్ ఆడియన్స్
నాని, సాయి పల్లవి జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎంసీఏ’. ఈ నెల 21న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను చిత్రబృందం వరంగల్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ– ‘‘వేణు నాకీ కథ చెప్పగానే మీరంతా గుర్తొచ్చారు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి, అమ్మాయికి తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా మొత్తం వరంగల్‌లోనే చిత్రీకరించాం. ఈ సినిమాతో సాయి పల్లవి నా ఫేవరెట్ కో–స్టార్ అయిపోయింది. ‘దిల్’ రాజుగారు, దేవిశ్రీ ప్రసాద్‌లతో సినిమా చేద్దాం అనుకుంటూ ఉన్నా. ఒకే సంవత్సరంలో రెండు సినిమాలు చేసేశాం’’ అని అన్నారు. ‘‘వేణుగారు చాలా కష్టపడి తెరకెక్కించారు. నాని చాలా హార్డ్ వర్కింగ్. ప్రతి సీన్‌ను ఇంప్రూవ్ చేయటానికి తపిస్తుంటారు. రాజుగారికి, శిరీష్‌గారికి థ్యాంక్స్’’ అని సాయి పల్లవి అన్నారు. మిడిల్ క్లాస్ అంటే అమ్మాయో, అబ్బాయో కాదు మిడిల్ క్లాస్ ఆడియన్స్. మిడిల్ క్లాస్ అంటే ఒక మైండ్ సెట్. మిడిల్ క్లాస్ అందరికీ నచ్చుతుంది. నాని వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వేణు శ్రీరామ్. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్, ఆలూరి రమేష్ పాల్గొన్నారు. -
వరంగల్‌లో ఎంసీఏ ప్రిరిలీజ్ వేడుక
-
నాని రెడీ.. సెన్సార్ కూడా అయిపోయింది
2017కు సక్సెస్ తో గుడ్ బై చెప్పేందుకు యంగ్ హీరో నాని రెడీ అయిపోయాడు. ఈ ఏడాది వరుస విజయాలతో సత్తా చాటిన నాని మరోసారి ఎమ్‌సీఏతో అదే జోరును కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆడియోతో పాటు టీజర్, ట్రైలర్ లకు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ప్రొడక్షన్,పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు. నాని సరసన ఫిదా ఫేం సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. -
'ఎంసీఏ' మూవీ స్టిల్స్
-
పరీక్ష రాశాం.. ఫలితం కోసం నిరీక్షిస్తున్నాం –‘దిల్’ రాజు
‘‘దర్శకుడు వేణు ఓ మధ్య తరగతి కుర్రాడు. తను ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘ఎం.సి.ఎ.’ (మిడిల్ క్లాస్ అబ్బాయి). ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. పరీక్షలు రాసి, ఫలితం కోసం వెయిట్ చేస్తున్నట్లు యూనిట్ అందరం నిరీక్షిస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన చిత్రం ‘ఎం.సి.ఎ.’. ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నాని ప్రతి సినిమాకు ఏదో ఒక ప్రయోగం చేస్తూ సక్సెస్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మా బ్యానర్లో వస్తోన్న 6వ సినిమా ఇది. ఈ చిత్రంతో భూమిక రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ట్రైలర్ విడుదలైన 30 నిమిషాలకే లక్ష వ్యూస్‌ను రాబట్టుకుంది. ఈ సినిమాతో ప్రేక్షకులని సంతృప్తిపరుస్తాం’’ అన్నారు. ‘‘ఐదేళ్లు ఇంట్లో కూర్చున్న నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నానీకి థ్యాంక్స్. మిడిల్ క్లాస్ అనేది అందరిలో ఉండే మైండ్ సెట్. అందుకే, సినిమా అందరికీ రీచ్ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు వేణు శ్రీరామ్. ‘‘క్రిస్మస్ సీజన్లో మా సినిమా కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఈ సీజన్లో వచ్చే సినిమాలన్నీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. అన్నింటినీ సక్సెస్ చేయాలి’’ అన్నారు నాని. నటుడు రాజీవ్ కనకాల పాల్గొన్నారు. -
మంజుల నిర్మాతగా నాని సినిమా
సూపర్ స్టార్ కృష్ణ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన మంజుల.. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దర్శకురాలిగా మారి సందీప్ కిషన్ హీరోగా మనసుకు నచ్చింది పేరుతో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా స్టార్ చేసే ఆలోచనలో ఉంది మంజుల. అయితే ఆ సినిమాకు మంజుల కేవలం నిర్మాతగానే వ్యవహరించనుందట. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఓ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న హలో సినిమా పనుల్లో బిజీగా ఉన్న విక్రమ్, ఆ సినిమా పూర్తయిన వెంటనే తదుపరి చిత్రం పనులు మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ఎమ్సీఏ ట్రైలర్ లాంచ్
-
నాని సినిమాలో సీనియర్ హీరోయిన్
వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న యువ కథానాయకుడు నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఎమ్ సీ ఏ'. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చాలా రోజుల కిందటే సీనియర్ హీరోయిన్ భూమిక రీ ఎంట్రీపై టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. అయితే నాని సినిమాతో భూమిక మరోసారి టాలీవుడ్ లో అధృష్టాన్ని పరీక్షించుకోనుందట. ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భూమిక, పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. పూర్తిగా నటించటం మానేయకపోయినా.. చాలా తక్కువగా సినిమాల్లో నటిస్తోంది. ఖుషి, ఒక్కడు లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు మిస్సమ్మ, అనసూయ లాంటి లేడి ఓరియంటెడ్ చిత్రాల్లోనూ అలరించింది భూమిక. చివరగా టాలీవుడ్లో లడ్డుబాబు సినిమాలో నటించిన ఈ భామ త్వరలో మరో తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది. నాచ్యురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమాలో భూమిక కీలక పాత్రలో కనిపించనుందట. అయితే ఈ సినిమాలో భూమికది వదిన క్యారెక్టర్ అన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా గ్లామర్ రోల్స్‌తో పాటు, లేడి ఓరియంటెండ్ సినిమాల్లోనూ అలరించిన భూమిక, ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆకట్టుకుంటుందోమో చూడాలి. -
డబుల్ హ్యాట్రిక్‌ని టార్గెట్ చేశాం
‘‘ఎం.సి.ఎ.(మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాని ఈ నెల 21న విడుదల చేస్తామని ఆగస్ట్ 19నే ప్రకటించా. అయితే, ఈ నెల 15న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. అందుకే 21న విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని, సాయిపల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఎం.సి.ఎ’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది మా బ్యానర్లో ఐదు సినిమాలు హిట్ సాధించాయి. ఇదే ఏడాది ‘ఎం.సి.ఎ’తో డబుల్ హ్యాట్రిక్ సాధించాలనుకున్నాం. అందుకే, కథ అనుకున్నప్పటి నుంచి డిసెంబర్లో రిలీజ్‌కి ప్లాన్ చేశాం. ఈ సినిమా హిట్ అయితే మా బ్యానర్ డబుల్ హ్యాట్రిక్ సాధిస్తుంది. మధ్య తరగతి కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్షిప్, డ్రామాతో పాటు ఈ సినిమాలో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఉంటుంది. శ్రీరామ్ వేణు మధ్యతరగతి యువకుడు కాబట్టి ప్రేక్షకులకు నచ్చేలా సన్నివేశాలు రాసుకున్నారు. వదిన, మరిది మధ్య అనుబంధం ఈ చిత్రంలో హైలెట్. భూమిక వదినగా కనిపిస్తారు. నాని, సాయిపల్లవిల మధ్య సీన్స్ చూసి ప్రేక్షకులు ఎగ్జయిట్ అవుతారు. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలిచ్చారు. సోమవారం ట్రైలర్ విడుదల చేయబోతున్నాం. ఈ నెల 16న ప్రీ–రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నాం. 21న ప్రేక్షకులు ఏం చెబుతారని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. మ్యాజిక్ వర్కవుట్ అయితే సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది’’ అన్నారు. అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ ఈ 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. రెండు సినిమాలు ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు ‘దిల్’ రాజు. -
నాని 'ఎంసీఏ' మూవీ స్టిల్స్
-
అంతకు మించిన హిట్!
‘శతమానం భవతి’ టు ‘రాజా ది గ్రేట్’... ఈ ఏడాది ‘దిల్’ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి మొత్తం ఐదు చిత్రాలు (మధ్యలో నేను లోకల్, దువ్వాడ జగన్నాథమ్ (డీజే), ఫిదా) వచ్చాయి. ఇప్పుడు నాని ‘ఎంసిఎ’తో సిక్సర్ (ఒకే ఏడాది 6 సినిమాలు రిలీజ్ చేయడం) కొట్టడం గ్యారెంటీ అంటున్నారు ‘దిల్’ రాజు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్‌లతో కలసి ఆయన నిర్మించిన ‘ఎంసిఎ’ను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ రెండు పాటలు మినహా పూర్తయింది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది ‘నేను లోకల్’తో నాని మా సంస్థలో హిట్ అందుకున్నాడు. ‘ఎంసిఎ’ అంతకు మించి హిట్టవుతుంది. మా సంస్థకు డబుల్ హ్యాట్రిక్ అందిస్తుంది. ఇందులో భూమిక కీలక పాత్ర చేశారు. అద్భుతమైన కథతో నానీని సరికొత్త స్టయిల్లో చూపిస్తున్నాడు శ్రీరామ్ వేణు. మిగతా రెండు పాటలను స్పెయిన్‌లో నాలుగు రోజుల్లో చిత్రీకరిస్తాం. దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్రెడీ విడుదలైన టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ‘కొత్తగా..’ పాటను విడుదల చేస్తాం’’ అన్నారు. -
అవన్నీ చేస్తేనే ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’
-
ఎప్పుడు పెళ్లి చేసుకుందాం..
వరుస విజయాలతో జోరుమీదున్న నాచురల్ స్టార్ నాని తాజా సినిమా 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి)'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన 'ఫిదా' స్టార్ సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దీపావళికి విడుదల చేసింది చిత్ర యూనిట్. లుంగీ కట్టుకొని చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని.. పల్లెలో పక్కా మాస్‌లుక్‌తో నాని ఈ ఫస్ట్‌లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్‌ని నెటిజన్లను ఆకట్టుకుంది. తాజాగా టీజర్ విడుదల చేసి నాని అభిమానుల్లో జోష్ పెంచింది చిత్ర యూనిట్. ఇందులో ఎంసీఏకు అసలు సిసలు అర్థం చెప్పాడు నాని. టీజర్లో అసలు ఎంసీఏ అంటే ఏంటి అదేమన్నా క్వాలిఫికేషనా అని అడిగిన ప్రెండ్‌తో నాని చెప్పిన డైలాగ్స్ అలరించాయి. 'ఎంసీఏ అంటే మైండ్‌సెట్. ఎప్పుడైనా షర్ట్ బటన్ వూడిపోతే పిన్నీస్ పెట్టుకుని మ్యానేజ్ చేశావా? మామూలు జీన్స్‌ని బ్లేడ్‌తో కట్ చేసి టోర్న్ జీన్స్‌లా కలర్ ఇచ్చావా? అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్డుపై వెళుతూ బస్‌స్టాప్‌లో ఓ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఓ ఫ్యామిలీ ఫొటోను వూహించుకున్నావా? ఇవన్నీ చేసుంటే తెలిసేది ఎంసీఏ అంటే ‘మిడిల్ క్లాస్ అబ్బాయని’ అంటూ నాని చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. దీంతో పాటు సాయి పల్లవి ‘నువ్వు నాకు బాగా నచ్చావ్. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం’ అని నానిని అడగటం టీజర్లో హైలైట్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
చిత్తూరు యాసలో చించేస్తాడు!
అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను ఏ భాషలో, ఏ యాసలో చెప్పాడంటారు? ఇద్దరూ ఏ భాషలో, ఎలా మాట్లాడుకున్నారంటారు? సంస్కృతంలోనేనా!! తెలుగు సినిమాల్లో మాత్రం పద్యాలను సంస్కృతంలో, మాటలను గ్రాంథికంలో... అదీ తెలుగులో చెప్పాడు. మన ప్రేక్షకులకు అర్థమయ్యేలా! నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కృష్ణార్జున యుద్ధం’లో కృష్ణార్జునులు మోడ్రన్ అండ్ లోకల్ బాయ్స్. అందులో ఒకరు చిత్తూరు యాసలో సిల్వర్ స్క్రీన్‌పై చించేస్తాడట! వెంకట్ బోయినపల్లి సమర్పణలో సాహూ గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పాత్రల్లో ఓ పాత్ర చిత్తూరు యాసలో మాట్లాడుతుంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కొంతవరకూ జరిగింది. అనుపమా పరమేశ్వరన్ ఓ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారట. అంతకంటే ముందు... నాని థియేటర్లలో ఓసారి సందడి చేయనున్నారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న మరో సినిమా ‘ఎంసిఎ’ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రేపు ఉదయం పది గంటలకు ఈ సిన్మా టీజర్ విడుదలవుతోంది. -
మిడిల్ క్లాస్ అబ్బాయి ముందే వస్తున్నాడు..!
వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎమ్సీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ మూడోవారంలో క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘హలో’ రిలీజ్ కూడా ఉండటంతో నాని రేసు నుంచి తప్పుకున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వారం ముందుగానే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ 21న కాకుండా డిసెంబర్ 15నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాని తన విజయపరంపర కొనసాగిస్తాడని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా వారం ముందుగానే థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మిడిల్ క్లాస్ కుర్రాడి సమస్య ఏంటి?
నెక్ట్స్ ఏంటి? అసలు, సిన్మా కథేంటి? ‘నేను లోకల్’తో హిట్ అందుకున్న హీరో నాని, నిర్మాత ‘దిల్’ రాజు మరో సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఆసక్తిని మరింత పెంచుతూ, ‘ఎంసీఏ’ టైటిల్ అనౌన్స్ చేశారు. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే క్యాప్షన్‌తో! దీపావళి సందర్భంగా మిడిల్ క్లాస్ అబ్బాయిని అందరికీ చూపించారు. గళ్ల లుంగీ... చేతిలో రెండు పాల ప్యాకెట్లు... ప్రతి రోజూ పలు ఏరియాల్లో కనిపించే అబ్బాయిలకు ప్రతినిధిలా నాని వచ్చేశారు. అతడి చూపుల్లో సంతోషం కనిపిస్తోంది. మరి, అతనికున్న సమస్య ఏంటి? అది ప్రేమలోనా? పౌరుషంగా బతికే విధానంలోనా? తెలియాలంటే డిసెంబర్ వరకూ వెయిట్ చేయాల్సిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రమిది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇందులో సాయి పల్లవి హీరోయిన్. భూమిక కీ–రోల్ చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ మంచి మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ చిత్రం మా బ్యానర్ వేల్యూను పెంచుతుంది. యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేశాం. డిసెంబర్ 21న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
'మిడిల్ క్లాస్ అబ్బాయ్' వచ్చేశాడు..
సాక్షి, హైదరాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న నాచురల్ స్టార్ నాని తాజా సినిమా 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి)'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన 'ఫిదా' స్టార్ సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. 'అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. మీ మిడిల్ క్లాస్ అబ్బాయి' అంటూ హీరో నాని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లుంగీ కట్టుకొని చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని.. పల్లెలో పక్కా మాస్‌లుక్‌తో నాని ఈ ఫస్ట్‌లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్‌ని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. -
నేను శైలజ దర్శకుడితో నాని
వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని మరో సినిమాకు ఓకె చెప్పాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏతో పాటు మేర్లాపాక గాంధీ తెరకెక్కిస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. నేను శైలజ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ ప్రస్తుతం రామ్ హీరో ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు నాని. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. -
తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైంది : నాని
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తన సినీ కెరీర్ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ' తొమ్మిదేళ్ల క్రితం ఈ రోజు.. నా కుటుంబం పెరగటం ప్రారంభమైంది. అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. నన్ను మీ సొంత వాడిగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు' అంటూ హౌస్ ఫుల్ బోర్డ్ ముందు నిలబడి దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు నాని. సహాయ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాని, ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టా చమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత కెరీర్ లో అటుపోట్లు చూసినా.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ఆకట్టుకున్న నాని ప్రస్తుతం ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటిస్తున్నాడు. 9 years back on this day my family started getting bigger. It just kept growing from then on. Thank you for making me one of your own :) pic.twitter.com/U7vK3YiDDa — Nani (@NameisNani) 5 September 2017 -
కోటలో మిడిల్ క్లాస్
ఒకప్పుడు రాజులున్న చోటది. రాజదర్పానికి ప్రతీకగా నిలిచిన కోట అది. ఇప్పుడు అందులో ఓ కుర్రాడు సందడి చేస్తున్నాడు. అలాగని, అతడి బ్యాగ్రౌండ్ రిచ్ ఏమీ కాదు. మిడిల్ క్లాస్! మరి, ఆ కోటలో ఏం చేస్తున్నాడనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఎంసిఎ’. ఇందులో నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’గా నటిస్తున్నాడు. సినిమా క్యాప్షన్ కూడా అదే... మిడిల్ క్లాస్ అబ్బాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వరంగల్‌లో జరుగుతోంది. శుక్ర, శనివారాలు వరంగల్ కోట (ఫోర్ట్), పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కోటలో మిడిల్ క్లాస్ కుర్రాడు ఏం చేశాడో మరి! సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
సాయిపల్లవితో నాని షికార్లు
సాక్షి, వరంగల్ : వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న న్యాచురల్ స్టార్ నాని తన బైక్ పై ఓ అమ్మాయిని కూర్చొబెట్టుకొని హన్మకొండ రోడ్లపై షికార్లు చేస్తున్నాడు. ఇది నిజంగా నిజం అయితే నాని ఏదో సరదాకి అలా రోడ్ల మీద తిరిగేయటం లేదు.. ప్రస్తుతం నాని, వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంసీఏ(మిడిల్‌క్లాస్ అబ్బాయి) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశం కోసం ఇలా బైక్ పై చక్కర్లు కొడుతున్నారు ఈ స్టార్స్. షూటింగ్లో భాగంగా బుధవారం ఉదయం హన్మకొండ గ్రీన్ స్క్వేర్ ప్లాజా సమీపంలో వీరిద్దరు బైక్ పై వెళ్తుండటంతో స్థానికులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఇటీవల నిన్నుకోరి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని, ఎంసీఏతో పాటు కృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా నటిస్తున్నాడు. -
భానుమతి బన్‌గయా పల్లవి!
భానుమతి క్యారెక్టర్ నుంచి బయటకొచ్చేశారు సాయి పల్లవి. ‘ఫిదా’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ మలయాళీ భామ ఎప్పుడో ఆ క్యారెక్టర్ నుంచి బయటకొచ్చేశారు. మరిప్పుడు ఏం చేస్తున్నారు? అంటే... పల్లవిగా మారారామె. పల్లవి అనేది ఆమె అసలు పేరు మాత్రమే కాదు... ప్రస్తుతం తెలుగులో ఆమె నటిస్తున్న సినిమాలో పేరు కూడా! ఇప్పుడా సిన్మాలోని క్యారెక్టర్లోకి వెళ్లారామె. నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ‘ఎం.సి.ఎ.’లో ప్రేక్షకులకు పల్లవిగా కనిపించనున్నారు సాయి పల్లవి. ‘ఎం.సి.ఎ.’ అంటే హీరో నాని, దర్శకుడు వేణు శ్రీరామ్‌లు ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అని చెబుతుంటే... సాయి పల్లవి మాత్రం వేరే అర్థం చెబుతున్నారు. ‘ఎం.సి.ఎ.’ అంటే ‘మిడిల్ క్లాస్ అమ్మాయి’ అంటున్నారు. అసలు మేటర్ ఏంటంటే... ఇందులో ఆమె సాధారణ మధ్య తరగతి అమ్మాయిగా నటిస్తున్నారు. భానుమతి తరహాలో ఈ పల్లవి పాత్ర కూడా చాలా సహజంగా ఉంటుందట! -
నాని... 20.. 21..!
యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎమ్సీఏ సినిమాలో నటిస్తున్న నాని ఆతరువాత చేయబోయే సినిమాను కూడా ప్రకటించాడు. ఎమ్ సీ ఏ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నిన్ను కోరి సినిమాతో మరోసారి ఘనవిజయం సాధించిన నాని.. ప్రస్తుతం సినిమా మీద ఉన్న సినిమాలలోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. #MCA#Nani20 Shooting in progress pic.twitter.com/AWUaf4m8VV — Nani (@NameisNani) 15 July 2017 #KRISHNARJUNAYUDHAM#KAY#Nani21 pic.twitter.com/tjdNYymxXM — Nani (@NameisNani) 15 July 2017 -
వరంగల్‌లో ఎంసీఏ చదువుతున్నాడు!
యస్... యువ హీరో నాని ఇప్పుడు ఎంసీఏ చదువుతున్నారు. అదీ వరంగల్‌లో! ఊరుకోండి... హిట్లు మీద హిట్లు, హీరోగా మంచి స్థాయిలో ఉన్న నానీకి చదువుకోవలసిన అవసరం ఏముంది? అనుకుంటున్నారా! ఇప్పుడు... స్టూడెంట్స్ అయితే డిగ్రీ వరకో, పీజీ వరకో చదువుతారు. అదే... హీరోలు అయితే ప్రతి ఏడాది చదువుకోవాలి. ఏడాదికి ఎన్ని సినిమాలు చేస్తే... అన్నిసార్లు చదువుకోవాలి. ఏం చదువుకోవాలంటే... సిన్మా స్క్రిప్టులు! ఇప్పుడు నాని చదువుతున్నదీ స్క్రిప్టే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని హీరోగా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘ఎంసీఏ’. మిడిల్ క్లాస్ అబ్బాయి... అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వరంగల్‌లో జరుగుతోంది. మంగళవారం మొదలైన ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు జరుగుతుందట. నానితో పాటు హీరోయిన్ సాయి పల్లవి, ఇతర కీలక పాత్రధారులు చిత్రీకరణలో పాల్గొననున్నారు. హిందీ ‘పింక్’ ఫేమ్ విజయ్‌వర్మ ఇందులో ముఖ్య పాత్ర చేస్తున్నారు. -
నాని సినిమాలో బాలీవుడ్ స్టార్
ప్రస్తుతం నిన్ను కోరి సినిమా రిలీజ్ కోసం రెడీ అవుతున్న యంగ్ హీరో నాని, తన నెక్ట్స్ సినిమాను కూడా పట్టాలెక్కించేశాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి హీరోయిన్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల ఘనవిజయం సాధించిన పింక్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న యువ నటుడు విజయ్ వర్మ, నాని ఎంసీఏలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తన ఫ్రెండ్ ద్వారా దర్శకుడు వేణు శ్రీరామ్ పరిచయమయ్యాడని, ఆయన చెప్పిన కథ నచ్చటంతో తెలుగు సినిమాకు అంగీకరించానని తెలిపాడు. అంతేకాదు ఈ సినిమాలో తెలుగు డైలాగ్ లు ఆయనే స్వయంగా చెప్పుకుంటున్నాడట. అయితే తన పాత్ర ఏంటి అన్న విషయం మాత్రం విజయ్ వర్మ వెల్లడించలేదు. -
నాని సినిమాలో సీనియర్ హీరోయిన్
త్వరలో నిన్ను కోరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో నాని.. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎమ్‌సిఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ఓ సీనియర్ హీరోయిన్ కనిపించనుంది. టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన భూమిక చావ్లా నాని కొత్త సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. స్టార్ హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ఈ బ్యూటి రీ ఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే లాంగ్ గ్యాప్ తీసుకున్న భూమిక, నాని సినిమాతో రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఈ సినిమాలో భూమికతో పాటు మరో సీనియర్ నటి ఆమని కూడా నటిస్తోంది. -
ఇంటివాడైన యంగ్ హీరో..!
వరుస సక్సెస్ లతో మంచి జోరు మీదున్న యంగ్ హీరో నాని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే ఓ బిడ్డకు తండ్రైన నాని ఇప్పుడు ఇంటివాడవ్వటం ఏంటి అనుకుంటున్నారా..? అదేనండి చాలా కాలంగా సొంతింటికి మారిపోవాలన్న ఆలోచనలో ఉన్న నాని ఇటీవలో గచ్చిబౌలిలోని ఓ కాస్ట్లీ ఏరియాలో పెద్ద విల్లాను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్న నాని త్వరలోనే గృహప్రవేశానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ విల్లా ఖరీదు దాదాపు 5 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిన్ను కోరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు నాని. నాని సరసన నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దిల్ రాజ్ బ్యానర్ లో తెరకెక్కనున్న MCA( మిడిల్ క్లాస్ అబ్బాయి) షూటింగ్ లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
నాని 'ఎమ్.సి.ఎ' ఆరంభం!
-
నాని కొత్త సినిమా లాంచింగ్ డేట్
యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలతో సత్తా చాటుతున్న ఈ యువ కథానాయకుడు, ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ప్రారంభిస్తున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో నిన్నుకోరి సినిమా చేస్తున్నాడు నాని. ఎక్కువ భాగం ఫారిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకొస్తున్నాడు నాని. దిల్ రాజు నిర్మాణంలో నాని హీరోగా తెరకెక్కనున్న ఎమ్సిఏ సినిమాను ఈ శనివారం(06-05-2017) లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన మలయాళీ బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే కొత్త రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు
నేచురల్ స్టార్ నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకొని జోరు మీద ఉన్న ఈ యంగ్ హీరో అదే ఊపులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమాను ప్రారంభించిన నాని, మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. తన పుట్టిన రోజు సందర్భంగా నాలుగు సినిమాలకు సంబంధించి అఫిషియల్ ఎనౌన్స్మెంట్స్ ఇచ్చేశారు. మరోసారి దిల్ రాజు నిర్మాణంలో నటించేందుకు అంగీకరించాడు. 'ఎంసీఏ' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకుడు. వీటితో పాటు తనకు కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి బిగ్ హిట్ అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో వరుస సక్సెస్‌లు సాధించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూడో సినిమాలో కూడా నానినే హీరోగా నటించనున్నాడు. జెట్ స్పీడుతో సినిమాలను పూర్తి చేస్తున్న నాని ఈ నాలుగు సినిమాలను రెండేళ్ల లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. -
వెంగసర్కార్ గుడ్ బై
ముంబై:భారత మాజీ దిగ్గజ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. లోధా ప్యానల్ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ ఈనెల రెండో తేదీన సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఎంసీఏ ఉపాధ్యక్ష పదవిని నుంచి వెంగసర్కార్ వైదొలిగారు. ఈ విషయాన్ని తాజాగా ఎంసీఏకు లేఖ రూపంలో వెంగీ తెలియజేశారు. ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ తప్పుకున్న సంగతి తెలిసిందే. 70 ఏళ్లకు పైబడిన వారు క్రికెట్ పరిపాలన వ్యవహారాలు చూసేందుకు దూరంగా ఉండాలంటే లోధా కమిటీ సూచించిన క్రమంలో పవార్ ఆ పదవిని గతేడాది డిసెంబర్ 17వ తేదీన వదులుకున్నారు. గతంలో ముంబై వైస్ ప్రెసిడెంట్‌గా దిలీప్ వెంగసర్కార్ రెండు సార్లు సేవలందించారు. 2002 నుంచి 2010 మధ్యకాలంలో వెంగసర్కార్క్ ఎంసీఏ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. దాంతో ప్రస్తుత ఉపాధ్యక్ష పదవిని వెంగసర్కార్ వదులుకోవాల్సి వచ్చింది. క్రికెట్ సమూల ప్రక్షాళనకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బీసీసీఐలో, దాని అనుబంధ యూనిట్లలోని బాధ్యులు, అధికారులకు వయస్సు పరిమితి, కాలపరిమితి ఉండాలని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారులకు సుప్రీంకోర్టు ఆమోద ముద్రవేయడంతో వెంగసర్కార్ తన పదవికి రాజీనామా చేశారు. -
7,8వ తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్లు
ఎచ్చెర్ల: ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎంబీఏ, ఎంసీఏ మిగులు సీట్లుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు శనివారం తెలిపారు. వర్సిటీలో ఎంసీఏలో 28 సీట్లు, ఎంబీఏలో 12 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంబీఏకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఎంసీఏకు ఎంపీసీ, ఎంపీసీ కంప్యూటర్స్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఫీజు స్ట్రక్చర్ ఎంబీఏకు రూ.10,000, ఎంసీఏకు రూ. 12,500, కౌన్సెలింగ్ రుసుం రూ.300 చెల్లించాలన్నారు. వర్సిటీ ఆడిటోరియంలో 7, 8 తేదీల్లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, టీసీ, ఇతర వర్సిటీ విద్యార్థులు మైగ్రేషన్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. -
బీజేపీ ఎంపీ స్వామి తాజాగా ఏం చేశారో తెలుసా?
న్యూఢిల్లీ: ఎపుడూ ఆరోపణలు, విమర్శలు, వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా మరో అంశంపై స్పందించి ఆసక్తికరంగా మారారు. ఆస్క్ మీ బ్రాండ్ కింద ఇ కామర్స్ వ్యాపారం నిర్వహించే గెట్ ఇట్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వేలమంది ఉద్యోగుల రక్షణ కోసం నడుం కట్టారు. 'ఆస్క్ మీ' మూతపడడంతో రోడ్డున పడ్డ నాలుగువేలమంది ఉద్యోగులకు బాసటగా నిలిచిన స్వామి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) కు లేఖ రాశారు. ఇది భవిష్యత్తులో కోర్టు విచారణకు రానున్నందున ఈ విషయంలో అత్యవసర జోక్యం అవసరమని మంత్రిత్వ శాఖ కార్యదర్శి తపన్ రేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని అత్యవసర కేసుగా పరిగణించాల్సిన అవసరముందని ఆయన హెచ్చరించడం విశేషం ఆగస్టు 31 తరువాత వ్యర్థమవుతుంది కనుక, తక్షణమే స్పందించాలని కోరారు. సంస్థ ను మూసివేయవద్దని కంపెనీ డైరెక్టర్లను కోరాలన్నారు. వేలమంది ఉద్యోగులను వదిలేయడం కాకుండా ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. మలేషియా విదేశీ సంస్థ ఆస్ట్రో లిమిటెడ్ కు చెందిన 95శాతం వాటా కొనుగోలుకు సాయం చేయాలని రాశారు. కాగా అస్క్ మీ లో మేజర్ వాటాను కలిగిన మలేషియా సంస్థ చేతులెత్తేయడంతో ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి. తీవ్రమైన రుణభారం తదితర సమస్యలతో కంపెనీ ప్రమాదంలో పడింది. దీనిపై గెట్ ఇట్ సంస్థ జోక్యంగా చేసుకోవాల్సిందని ఎంసీఏకు లేఖ రాసింది. అప్పులను చెల్లించకుండా ఆస్ట్రోదేశంనుంచి వెళ్లడానికి వీల్లేదని కోరిన సంగతి తెలిసిందే. -
రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ఎంవీ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 26వ తేదీ నుంచే ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈనెల 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన విద్యార్థులు ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని, ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి 3వ తేదీన రాత్రి 8 గంటల తర్వాత సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 243 ఎంబీఏ కాలేజీల్లో 28,174 సీట్లు, 36 ఎంసీఏ కాలేజీల్లో 2,336 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంబీఏలో గతేడాది దాదాపు 40 వేల సీట్లు అందుబాటులో ఉండగా ఈసారి 28,174 సీట్లలో ప్రవేశాలకే యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చాయి. అంటే 11 వేలకు పైగా సీట్లు తగ్గిపోయాయి. ఎంబీఏ, ఎంసీఏల్లో చేరేందుకు నిర్వహించిన ఐసెట్‌లో అర్హత సాధించిన 63,549 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కానున్నారు. రాత పరీక్షకు 72,474 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, మే 19వ తేదీన జరిగిన పరీక్షకు 66,510 మంది హాజరయ్యారు. అందులో 63,549 మంది అర్హత సాధించారు. వివరాలు..ఎంబీఏలో.. ప్రభుత్వ కాలేజీలు: 23 సీట్లు: 1,330 ప్రైవేటు కాలేజీలు: 220 సీట్లు: 26,844 ఎంసీఏలో.. ప్రభుత్వ కాలేజీలు: 14 ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు: 700 ప్రైవేటు కాలేజీలు: 22 ప్రైవేటు కాలేజీల్లో సీట్లు: 1,636 -
సంతోషంగా వైదొలుగుతా: శరద్ పవార్
న్యూఢిల్లీ:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లోనూ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో డబ్బై ఏళ్లకు పైబడిన వారు సభ్యులుగా ఉండకూడదనే జస్టిస్ లోథా కమిటీ సిఫారుసులను ఇటీవల సుప్రీంకోర్టు సమర్ధించడంతో ముంబై క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ) చీఫ్ శరద్ పవార్ తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. గతంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అధ్యక్షుడిగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్‌గా పని చేసిన శరద్ పవార్..ప్రస్తుతం ఎంసీఏ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో, రాష్ట్ర సంఘాల్లోనూ సభ్యులు కాకూడదని జస్టిస్ లోథా కమిటీ సిఫారుసులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో శరద్ పవార్ తన పదవికి దూరం కావాల్సి వస్తుంది. ఈ మేరకు శరద్ పవార్ అధ్యక్షతన ఎంసీఏ మేనేజింగ్ కమిటీ ఆదివారం ముంబైలో సమావేశంమైంది. 'మేము సుప్రీంకోర్టు ఆదేశాలపై, లోథా కమిటీ సిఫారుసులపై చర్చించాం. వాటిని అమలు చేయడానికి ఎంసీఏ కట్టుబడి ఉంది. తాజా సుప్రీం రూలింగ్ తో నేను పదవికి దూరం కావాలి. నేను సంతోషంగా వైదులుగుతా. న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం ఉంది. కాకపోతే ఒక రాష్ట్రానికి ఒక ఓటుపై ఇంకా కొంత స్పష్టత రాలేదు. మహారాష్ట్రలో మూడు క్రికెట్ అసోసియేషన్‌లో ఉన్నాయి. ఇక్కడ రొటేషన్ పాలసీ అమలు చేయాలంటే, ముందుగా మేనేజింగ్ కమిటీ ఆమోదంతో ఎంసీఏను పునర్ వ్యవస్థీకరించాలి. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది' అని సమావేశం అనంతరం శరద్ పవార్ స్పష్టం చేశారు. -
నేడు ఐసెట్
14 కేంద్రాల్లో నిర్వహణ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఐసెట్ గురువారం జరుగనుంది. జిల్లా కేంద్రంలో పద్నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని వరంగల్ రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సాయిలు తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు జరిగే పరీక్షకు వరంగల్ రీజినల్ పరిధిలో 7,870 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు 9గంటల వరకే కేంద్రాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయం కంటే ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తొలుత అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటామని.. దీని కోసం ప్రత్యేకంగా బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించామని వెల్లడించారు. కాగా, అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పారుుంట్ పెన్ తప్ప సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సారుులు సూచించారు. -
నేడే టీఎస్ ఐసెట్
హాజరుకానున్న 2,963 మంది విద్యార్థులు జిల్లా కేంద్రంలో 5, కోదాడలో ఒక సెంటర్ బయోమెట్రిక్ అమలు.. నల్లగొండ రూరల్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్ష గురువారం జరుగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అర్హత పరీక్షను బయోమెట్రిక్ విధానం ద్వారా అమలు చేస్తున్నారు. ఈ పరీక్షకు మొత్తం 2,963 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఐసెట్ రీజినల్ కోఆర్డినేటర్ అల్వాల రవి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్‌రెడ్డి, కోదాడ రీజియన్ కోఆర్డినేటర్ ఎ.శంకర్ బుధవారం కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పూర్తి చేయించారు. ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. జిల్లా కేంద్రంలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా కోదాడలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నల్లగొండలో అన్నెపర్తిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మూడు కేంద్రాలను, ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2,397 మంది విద్యార్థులు, కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్లో 566 మంది పరీక్ష రాయనున్నారు. 250 మందికి ఒక బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు ఆరుగురు చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆన్లైన్ దరఖాస్తు ఫారంపై ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. -
'మ్యాచ్ ల తరలింపు'పై సుప్రీంకు..
ముంబై:మహారాష్ట్రలో నీటి కరువు కారణంగా ఆ రాష్ట్రంలో నిర్వహించే మ్యాచ్‌లను వేరే చోటకి తరలించాలన్న బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఎంసీఏ శుక్రవారం సుప్రీంలో అప్పీల్ చేసింది. 'మహారాష్ట్రలో ప్రజలకు మేము వ్యతిరేకం కాదు. వారి పట్ల మాకు సానుభూతి ఉంది. అయితే క్రికెట్ మ్యాచ్‌లను తరలించాలనడం సరికాదు'అని ఎంసీఏ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయితే ఎంసీఏ దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. మహారాష్ట్రలో నీటి ఎద్దడితో రాష్ట్రంలో జరగాల్సిన 12 మ్యాచ్ లను వేరే చోటకి తరలించాల్సి వచ్చింది. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లన్నీ తరలించాలని బాంబే హైకోర్టు పేర్కొనడంతో ముంబై ఇండియన్స్, పుణె సూపర్ జెయింట్స్, కింగ్స్ పంజాబ్ జట్ల హోం గ్రౌండ్ లను మార్చాల్సి వచ్చింది. దీంతో పుణె సూపర్ జెయింట్స్ తన హోం గ్రౌండ్ గా విశాఖను ఎంచుకోగా, ముంబై ఇండియన్స్ తన హోం పిచ్ గా జైపూర్ ను, కింగ్స్ పంజాబ్ ధర్మశాలను హోం గ్రౌండ్ గా ఎంచుకున్నాయి. -
ఇంజనీరింగ్‌లో ఏడాది గరిష్ట ఫీజు 1.58 లక్షలు
* జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ఆమోదముద్ర * ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజుల నిర్ధారణ * ఇక దేశవ్యాప్తంగా ఒకే ఫీజుల విధానం అమలు * నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఏఐసీటీఈ * ఏపీలో ఇంజనీరింగ్ గరిష్ట ఫీజు 1.05 లక్షలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకు ఏడాది గరిష్ట ఫీజు రూ.1.44 లక్షల నుంచి రూ.1.58 లక్షల మధ్య నిర్ధారిస్తూ అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు ఏడాదికి గరిష్ట ఫీజును రూ.1.57 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు నిర్ణయించింది. ఈ గరిష్ట ఫీజు ఏటా బీ ఆర్క్ (ఆర్కిటెక్చర్)లో 2.05 లక్షల నుంచి 2.25లక్షలు, బీ ఫార్మా కోర్సులకు రూ.1.41 లక్షల నుంచి రూ.1.55 లక్షల వరకు ఎంసీఏ కోర్సులకు రూ.1.57 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉండొచ్చని నిర్ధారించింది. ఎంటెక్ కోర్సుల్లో ఏడాది గరిష్ట ఫీజు రూ.2.31 లక్షల నుంచి 2.51 లక్షలుగా నిర్ణయించింది. ఆయా విద్యాసంస్థలు నెలకొన్న ప్రాంతాలు, నిర్వహణ ఖర్చులను అనుసరించి ఫీజులను ఆయా రాష్ట్రాల ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండళ్లు (ఏఎఫ్ఆర్సీ)లు నిర్ణయించాలని ఏఐసీటీఈ పేర్కొంది. స్వయం ప్రతిపత్తి (అటానమస్) విద్యాసంస్థలు ఈ గరిష్ట ఫీజుల మొత్తంలో 10శాతం, అక్రిడేటెడ్ విద్యాసంస్థలు 20 శాతం చొప్పున పెంచుకోవచ్చు. జాతీయస్థాయిలో ఉన్నత సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ‘నేషనల్ ఫీజుల కమిటీ’ గరిష్ట ఫీజులను నిర్ణయిస్తూ గతేడాది ఆగస్టులో ఇచ్చిన నివేదికను కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేసింది. నిర్ధారిత గరిష్ట ఫీజులకు మించి విద్యాసంస్థలు వసూలు చేయడానికి వీల్లేదని, భిన్నంగా వ్యవహరిస్తే ఆయా సంస్థల గుర్తింపును రద్దుచేయడంతో పాటు కాలేజీలను మూసివేస్తామని హెచ్చరించింది. జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో పది మంది సభ్యులతో 2014లో ఏర్పాటైన కమిటీ ఈ గరిష్ట ఫీజులను నిర్ణయించి ఇచ్చిన నివేదిక సిఫార్సులను 2016-17 నుంచి అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీచేసింది. అయిదేళ్లవరకూ ఇదే ఫీజుల విధానం ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ఏఎఫ్ఆర్సీలు మూడేళ్లకోసారి ఫీజులను నిర్ధారిస్తున్నాయి. ఈ గరిష్ట ఫీజులు అయిదేళ్లవరకు అమల్లో ఉండాలని కమిటీ సూచించింది. * ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం భూమి, భవనాలు, ఇతర సదుపాయాలు, లాబొరేటరీలు, ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది, ఆయాకాలేజీలకు మంజూరైన సీట్ల సంఖ్య, చేరిన విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజులను కమిటీ నిర్ధారించింది. ఆయా సంస్థలు జీతభత్యాలు, సంస్థల నిర్వహణకు చేస్తున్న ఖర్చులను అనుసరించి వీటిని నిర్ణయించారు. * సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆయా రాష్ట్రాలు, కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అనుసరించి మాత్రమే ఫీజులు వసూలుచేయాలని కమిటీ స్పష్టం చేసింది. విదేశీ, ప్రవాస భారతీయ విద్యార్థులకు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించాల్సి వచ్చినప్పుడు గరిష్ట ఫీజులకు మూడురెట్లు వసూలుచేసి ప్రవేశాలు కల్పించవచ్చు. * ఆయా కాలేజీల్లో మేనేజ్మెంటు, కన్వీనర్ కోటాలతో పాటు ఇతర ఏ రకమైన ప్రవేశాలకైనా ఇవే గరిష్ట ఫీజులకు మించి వసూలు చేయరాదని కమిటీ స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి బీమా రుసుము వసూలు చేయవచ్చు. * అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, పీజీ కోర్సులు, డిప్లొమో, పోస్టు డిప్లొమో, పార్టు టైమ్, డ్యూయెల్ డిగ్రీ, సమీకృత ప్రోగ్రాముల ప్రకారం గరిష్ట ఫీజులను నిర్ణయించారు. ఏపీలో గరిష్ట ఫీజు 1.05 లక్షలు ఏఐసీటీఈ నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కాలేజీలకు నిర్వహణ వ్యయాలను అనుసరించి ఈ గరిష్ట ఫీజులను నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ సిఫార్సులను అనుసరిస్తూనే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గరిష్ట ఫీజులను నిర్ణయించనున్నారు. ఈదిశగా రాష్ట్ర ప్రవేశాలు, పీజుల నియంత్రణ మండలి కసరత్తు చేస్తోంది. ఏపీలో ఇంజనీరింగ్ కోర్సులకు కనిష్టం రూ.30వేలనుంచి గరిష్ట ఫీజు రూ.1.05 లక్షల వరకు ఉంటుందని మండలి వర్గాలు వివరించాయి. అంతకు ముందు సంవత్సరాల్లో కాలేజీల నిర్వహణకు అయిన వ్యయాలను అనుసరించి ఫీజులుండాలని కోర్టు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి. రూ.లక్షకు మించి ఫీజులుండే కాలేజీలు నాలుగైదుకు లోపే ఉండనున్నాయి. తక్కినవన్నీ రూ.30వేల నుంచి 80వేల లోపే ఉండ వచ్చంటున్నారు. ఫీజులపై ఏఎఫ్ఆర్సీ ఈనెల 12 నుంచి 28వరకు ఆయా కాలేజీల వాదనలు విననుంది. మే రెండో వారంలో ఫీజులను నిర్థారించనుంది. జాతీయ ఫీజుల కమిటీ నిర్ధారించిన ఆయా కోర్సుల గరిష్ట ఫీజులు కోర్సు టైప్-ఎక్స్ నగరం టైప్-వై నగరం టైప్-జెడ్ నగరం (ఫీజు/రూపాయల్లో) (ఫీజు/రూపాయల్లో) par (ఫీజు/రూపాయల్లో) 4 ఏళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ 1,58,317 1,50,473 1,44,882 5 ఏళ్ల ఆర్కిటెక్చర్ డిగ్రీ 2,25,283 2,13,469 2,05,034 4ఏళ్ల టౌన్‌ప్లానింగ్ 2,25,582 2,13,768 2,05,333 5ఏళ్ల అప్లయిడ్ ఆర్ట్స్,క్రాఫ్ట్స్ 2,25,582 2,13,768 2,05,333 4 ఏళ్ల ఫార్మాస్యుటికల్ డిగ్రీ 1,55,125 1,47,250 1,41,628 పీజీ కోర్సులు.. ఎంఈ, ఎంటెక్ 2,51,361 2,39,953 2,31,361 ఎం ఆర్క్ 2,69,714 2,56,107 2,45,877 2ఏళ్ల టౌన్‌ప్లానింగ్ 2,69,714 2,56,107 2,45,877 2 ఏళ్ల అప్లయిడ్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ 2,69,714 2,56,107 2,45,877 ఎం ఫార్మ్ 2,27,519 2,16,111 2,07,518 హోటల్మేనేజ్మెంటు, కేటరింగ్ 2,27,519 2,16,111 2,07,518 3ఏళ్ల ఎంసీఏ 1,71,137 2,16,111 2,07,518 2 ఏళ్ల ఎంబీఏ 1,71,286 1,63,410 1,57,787 ఈ ఫీజులకు సంబంధించి కమిటీ నివేదికలు, మార్గదర్శకాలను ఏపీలోనూ అమలు చేయడానికి వీలుగా తమకు వాటి కాపీలను అందించాలని ఏపీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం ఏఐసీటీఈని కోరింది. ఈమేరకు సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.శాంతిరాముడు ఏఐసీటీఈ చైర్మన్‌కు లేఖ రాశారు. -
ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
♦ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. మే 16న పరీక్ష ♦ తెలంగాణలోని విద్యార్థులకూ ఏపీలోనే పరీక్ష ఏయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్)-2016 నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఐసెట్ చైర్మన్, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు విలేకరులకు వెల్లడించారు. రూ. 350 రిజిస్ట్రేషన్ రుసుముతో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. పరీక్షను మే 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పరీక్ష కేంద్రాల సంఖ్యను నిర్ణయిస్తామన్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 17 రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, తెలంగాణ పరిధిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయట్లేదని తెలిపారు. అక్కడి విద్యార్థులు కూడా ఏపీకి వచ్చి పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఠీఠీఠీ. ్చఞజీఛ్ఛ్టి.్ఛ్ట.జీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. -
మావగారే మార్చారు!
ముంబై:నగరంలోని వాంఖేడి క్రికెట్ మైదానంలో ప్రవేశానికి సంబంధించి తనపై గత మూడేళ్లుగా కొనసాగిన నిషేధం తొలగిపోవడంపై కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు. తొలుత నిషేధాన్నిఎత్తివేసిన ముంబై క్రికెట్ సంఘం(ఎంసీఏ)కు షారుఖ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆనందాన్ని వ్యక్తం చేసిన షారుఖ్.. తాను చేసిన తప్పుల నుంచి కానీ, ఒప్పుల నుంచి కానీ గుణపాఠాలు నేర్చుకోవడానికి తన మావయ్యే ప్రధాన కారణమని షారుఖ్ తెలిపాడు. 'ఎంసీఏ తీసుకున్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను కొన్ని సందర్భాల్లో చేసిన తప్పు-ఒప్పులను బేరీజు వేసుకోవడానికి మావయ్య సలహాలు తీసుకుంటాను. ఆయన సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి' అని షారుఖ్ ట్వీట్ చేశాడు. వాంఖడే క్రికెట్ మైదానంలో ప్రవేశంపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌పై మూడేళ్ల నిషేధాన్ని ఆదివారం ఎంసీఏ తొలగించింది. 2012 ఐపీఎల్లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుఖ్... స్టేడియం భద్రతా అధికారితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన ఎంసీఏ అతడిని స్టేడియంలోకి అనుమతించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
షారుఖ్ ఖాన్‌పై నిషేధం ఎత్తివేత
- చవాన్‌కు మద్దతు నిరాకరణ - ఎంసీఏ ప్రకటన ముంబై: వాంఖడే క్రికెట్ మైదానంలో ప్రవేశంపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌పై మూడేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎత్తివేసింది. 2012 ఐపీఎల్లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుఖ్... స్టేడియం భద్రతా అధికారితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన ఎంసీఏ అతడిని స్టేడియంలోకి అనుమతించకుండా నిషేధం విధించింది. ఇక స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ చేత జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న ముంబై క్రికెటర్ అంకిత్ చవాన్‌కు తాము ఎలాంటి మద్దతు ఇవ్వదలుచుకోలేదని షెలార్ చెప్పారు. -
పవార్‌కే ‘పవర్’
ఎంసీఏ అధ్యక్షుడిగా విజయం ముంబై: ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. బుధవారం ఆసక్తికరంగా సాగిన ఎంసీఏ ఎన్నికల్లో పవార్ 27 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి విజయ్ పాటిల్‌పై విజయం సాధించారు. పవార్‌కు మొత్తం 172 ఓట్లు రాగా, పాటిల్‌కు 145 ఓట్లు పడ్డాయి. పవార్ వర్గానికే చెందిన మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఆశిష్ షెలార్ ఉపాధ్యక్షులుగా, నితిన్ దలాల్ కోశాధికారిగా, పీవీ శెట్టి సంయుక్త కార్యదర్శులుగా గెలిచారు. -
ఎంసీఏ ఎన్నికల్లో నేతల మధ్య పోటీ
- మరోసారి పోటీ చేసే యోచనలో ఎన్సీపీ చీఫ్ పవార్ - బీజేపీ నుంచి ఉపాధ్యక్ష పదవికి పోటీచేయనున్న ఆశీశ్ - 1991లో ప్రారంభమైన రాజకీయ నేతల పోటీ - ప్రముఖ నేతలందరికీ చెరో క్లబ్బు సాక్షి, ముంబై: ‘ముంబై క్రికెట్ అసోసియేషన్’ (ఎంసీఏ) ఎన్నికల్లో ప్రధాన పోటీ ప్రముఖ రాజకీయ నాయకుల మధ్య మరోసారి జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 17న జరగనున్న ఎన్నికల బరిలో ఎవరి ఉండనున్నారనేది ప్రస్తుతం అధికారికంగా స్పష్టం కాకపోయినా ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. గతంలోనూ ఎన్నికలు రాజకీయ నీడలో జరిగిన విషయం తెలిసిందే.ప్రస్తుత ఎంసీఏ అధ్యక్షుడిగా ఎన్సీపీ అధినేత మాజీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఉన్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లోనే ఆయన దూరంగా ఉంటారని భావించినప్పటికీ .. మళ్లీ బరిలోకి దిగి విజయం సాధించారు. ఈ సారి కూడా పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశీశ్ శెలార్ కూడా ఉపాధ్యక్ష పదవికి పోటీ చే యనున్నట్టు సమాచారం. దీంతో రాజకీయం గా కనపడని పొత్తు ఎంసీఏ ఎన్నికల్లో కన్పించే అవకాశాలున్నాయి. ఎన్సీపీ, బీజేపీ ఒక్కటిగా పోటీ చేసి చెరో స్థానాన్ని కైవసం చేసుకోవాలని యోచిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ భాగ స్వామి, బీజేపీ మిత్రపక్షం శివసేన మాత్రం ఈ విషయంలో పూర్తి వ్యతిరేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. విజయ్ పాటిల్‌కి చెందిన ‘క్రికెట్ ఫస్ట్ గ్రూప్’కు ఆ పార్టీ మద్దతు పలుకుతున్నట్టు తెలిసింది. అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్, ఎంపీ రాహుల్ శెవాలే క్రికెట్ ఫస్ట్ గ్రూప్ నుంచి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారం రోజుల వరకు ముంబై రారు. ఈ నేపథ్యంలో ఆయన వస్తేనే ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడుతుంది. 91 నుంచి రాజకీయ నేతల అరంగేట్రం ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నాయకులు ఎంసీఏ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చేపట్టారు. మొట్టమొదటిసారిగా 1991లో క్రికెట్ అభిమాని అయిన శేషారావ్ వాంఖడే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన పేరునే ముంబై స్టేడియానికి పెట్టారు. తర్వాత 1992లో మాధవ్ మంత్రి, శివసేన నేత మనోహర్ జోషీల మధ్య అధ్యక్ష పదవి కోసం పోటీ జరిగింది. అందులో మనోహర్ జోషీ విజయం సాధించారు. వరుసగా ఎనిమిదేళ్ల పాటు అధ్యక్షునిగా కొనసాగారు. 2000 నుంచి 2012 వరకు శరద్ పవార్ కంట్రోల్లోకి ఎంసీఏ వచ్చింది. అదే సమయంలో బీసీసీఐ, ఐసీసీ అధ్యక్ష పదవులను కూడా పవార్ అలంకరించారు. 2012లో మాత్రం ముంబై ఓటర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో చివరి క్షణంలో తప్పుకున్నారు. అధ్యక్ష పదవిలో లేకపోయినా వెనుకనుంచి కింగ్‌మేకర్ పాత్రను పోషిస్తూ వచ్చారు. ఆ సమయంలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు మద్దతు తెలిపారు. ముంబైలో 330 క్రికెట్ క్లబ్‌లు.. ముంబైలో ఒకటి రెండు కాదు ఏకంగా 330 క్రికెట్ క్లబ్బులున్నాయి. వీటిలో అనేక క్లబ్‌లకు రాజకీయ నాయకులే అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కొన్నింటిని రూ. కోట్లు వెచ్చించి కొందరు రాజకీయ నాయకులు కొనుగోలు చే శారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, యువ సేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే, బీజేపీ నాయకు లు ఆశీష్ శెలార్, ఎన్సీపీ నేతలు సచిన్ ఆహిర్, జితేంద్ర అవాడ్, శివసేన నాయకులు రాహుల్ శెవాలే ఎంసీఏ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రముఖ నేతలకు చెందిన క్లబ్బుల వివరాలు శివసేన: ఉద్ధవ్ ఠాక్రే: మేరీ క్రికెటర్స్. ఆదిత్య ఠాక్రే: యంగ్ ఫ్రెండ్స్. సుభాష్ దేశాయ్: ప్రభోదన్. మిలింద్ నార్వేకర్: న్యూ హింద్. రాహుల్ శెవాలే: దాదర్ క్రికెట్ క్లబ్ బీజేపీ: అశీష్ శెలార్: రాజస్థాన్ స్పోర్ట్స్ క్లబ్. కాంగ్రెస్: పథ్వీరాజ్ చవాన్: మాజ్‌గావ్ క్రికెట్ క్లబ్. నారాయణ్ రాణే: ఎలెవన్ సెవంటీ క్లబ్. ఎన్సీపీ: శరద్ పవార్: పారసీ పయనీర్. జితేంద్ర అవాడ్: మాండవీ ముస్లిం ఎమ్మెన్నెస్: నితిన్సర్దేశాయ్: దాదర్ పారసీ జోరస్ట్రీయన్ -
వైద్య విద్య.. మిథ్యే!
మెడికల్ కాలేజీల్లో భారీగా పోస్టులు ఖాళీ టీచింగ్‌కు తప్పని ఇబ్బందులు ఉస్మానియాలో 458 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 110 ఖాళీ గాంధీలో 187 పోస్టులకు 30పైగా ఖాళీలు ‘ఎనిమల్హౌస్’ లేకుండానే ఉస్మానియాలో పరిశోధనలు ఎంసీఐ హెచ్చరించినా మెరుగుపడని సౌకర్యాలు సిటీబ్యూరో: సర్కార్ వైద్య విద్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, నిజామాబాద్, ఆదిలాబాద్‌లోని రిమ్స్ వైద్యకళాశాలల్లో 910 అసిసె ్టంట్ ప్రొఫెసర్ పోస్టులకుగాను 224 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ఉస్మానియా వైద్యకళాశాలల్లోనే 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన ఫిజియాలజీలో 9, ఎస్ఎంపీలో 7, జనరల్ మెడిసిన్‌లో 7, సైక్రియాటిక్లో 8, కార్డియాలజీలో 5, గ్యాస్ట్రోఎంటరాలజీలో 3, న్యూరాలజీలో 3, నెఫ్రాలజీలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా సిటీసర్జరీలో 8కి 3, ప్లాస్టిక్ సర్జరీలో 3, పీడియాట్రిక్ సర్జరీలో ఆరు, నియోనాటాలజీలో మూడుకు మూడు పోస్టులు ఖాళీనే. దంత విభాగంలో 43 పోస్టులకు 25, పీడియాట్రిక్ విభాగంలో 31కి తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్లతరబడి నియామకాలు చేపట్టకపోవడం, ఉన్నవారు కూడా రాజీనామా చేసి వెళ్లిపోవడ మే ఇందుకు కారణం. ఎప్పటికప్పుడు ఈ ఖాళీలను భర్తీ చేయాలని ఎంసీఐ ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఉదయం అనుబంధ ఆస్పత్రిలో రోగులను చూసి, మధ్యాహ్నం మెడికల్ కళాశాలలో థీయరీ చెప్పాల్సి వస్తోందని, ఇది తమకు తీవ్ర భారంగా మారుతోందని నీలోఫర్ ఆస్పత్రికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసీఐ హెచ్చరించినా... ఉస్మానియా వైద్యకళాశాలలో 35 వైద్య కోర్సులు అందిస్తుండగా, 250 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, ఫీవర్ ఆస్పత్రి, నీలోఫర్ చిల్డ్రన్స్ ఆస్పత్రి, ఛాతి, మానసిక ఆస్పత్రులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, సుల్తాన్ బజార్, పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రులతో పాటు సరోజినిదేవి కంటి ఆస్పత్రి దీనికి అనుబంధంగా కొనసాగుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ఎంబీబీఎస్ చేసి దేశవిదేశాల్లో గుర్తింపు పొందిన వైద్యులెంతో మంది ఉన్నారు. ఇది గతం. ప్రస్తుతం ఎంసెట్‌లో టాప్‌టెన్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సైతం ఉస్మానియాకు బదులు గాంధీ వైద్యకళాశాలను ఎంచుకుంటున్నారు. చదువుతున్న కాలేజీకి ప్రాక్టీస్ చేయాల్సిన అనుబంధ ఆస్పత్రులకు మధ్య ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం ఉండటానికి తోడు ఆయా ఆస్పతి భవనాలు, వైద్య పరికరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. విద్యార్థుల నిష్పత్తికి తగిన సెమినార్ హాల్లే కాదు, కాలర్ మైక్‌లు, మరుగుదొడ్లు, గ్రంథాలయం, కీలకమైన జర్నల్స్, ఎగ్జామినేషన్ హాల్, పేపర్ వాల్యూయేషన్ హాల్ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇచ్చే మందులు ఎలా పని చేస్తున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి తదితర అంశాలను పరీక్షించేందుకు అవసరమైన ఎనిమల్హౌస్ ఏ వైద్య కళాశాల లో కూడా లేకపోవడం విచారకరం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల తనిఖీలు నిర్వహించి ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఖాళీలు భర్తీ చేయాలి.. ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న క్వాలిఫైడ్ వైద్యులను టీచింగ్ ఆస్పత్రులకు తీసుకొచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరతను అధి గమించవచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు. ప్రస్తుతం టీచింగ్ ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదం. కమల్‌నాథన్ కమిటీతో సంబంధం లేకుండా అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి తెలంగాణ వైద్యులతో ఖాళీలను భర్తీ చేయాలి. - డాక్టర్ బొంగు రమేష్, గౌరవ అధ్యక్షుడు, టీజీడీఏ -
ఐ-సెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల తాకిడి
గుంటూరు ఎడ్యుకేషన్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఐ-సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. గుంటూరులోని రెండు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో చేపట్టిన సర్టిఫికెట్ల పరిశీలనకు 763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐ-సెట్ కౌన్సెలింగ్ కోసం ఇన్నాళ్లూ ఆత్రుతగా ఎదురుచూసిన విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి పెద్ధ సంఖ్యలో తరలివచ్చారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రం రాత్రి 10 గంటల వరకూ కొనసాగటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఈ కేంద్రానికి 400 మంది హాజరయ్యారు. విద్యార్థులకు తిప్పలు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవటంతో విద్యార్థులు ఇక్కట్ల పాలయ్యూరు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 9 గంటలకే వచ్చినవారు తమ వంతు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తాగేందుకు నీరు, కూర్చునేందుకు తగినన్ని కుర్చీలు లేక చెట్ల కిందే గడిపారు. నేడు 25,001 నుంచి 50 వేల ర్యాంకు వరకు పరిశీలన ఐ-సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా గురువారం జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో 25,001 నుంచి 37,500 వరకూ, నల్లపాడు హెల్ప్‌లైన్ కేంద్రంలో 37,501 నుంచి 50 వేల ర్యాంకు వరకూ విద్యార్థులు హాజరుకావాలి. -
ఇంటర్నెట్కు బానిసలవుతున్న యువత
ఇంటర్నెట్.. అదో మాయాజాలం.. మనసు కన్నా వేగంగా ఆలోచించేది.. మనిషికన్నా ఎక్కువ విజ్ఞానాన్ని నింపుకున్నది ఇంటర్నెట్. ఇదో విజ్ఞాన సర్వస్వం. క్లిక్ చేస్తే చాలు.. ప్రపంచంలోని వింతలు విశేషాలు కళ్ల ముందుంటాయి. క్లిక్ చే స్తే చాలు.. ప్రపంచంలోని దేని గురించిన సమాచారం అయినా ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు యువతకు ఇంటర్నెట్ ఆరోప్రాణంగా మారింది. నిత్యావసరమై పోయింది. ఇంటర్నెట్ యువతకు ఏ మేరకు ఉపయోగపడుతోందో, ఎంత చెడుపు చేస్తోందో తెలిపే కథనమే ఇది.. న్యూఢిల్లీ: మారుతున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాల్లోకి దూసుకొస్తోంది. ఇంటర్నెట్ వాడకం నిత్యావ సరంగా మారిపోయింది. పిల్లలను ఎల్కేజీలో చేర్పించేందుకు దరఖాస్తు చేయడంతో మొదలయ్యే ఇంటర్నెట్ వాడకం ఉద్యోగాలు పొందే ప్రవేశ పరీక్షల వరకూ, ప్రతి సందర్భంలోనూ తప్పనిసరి అయింది. అందులో యువత మరీ ముఖ్యంగా ఇంటర్నెట్ను అధికంగా వాడుతున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ సామాజిక వెబ్సైట్లను ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఉపయోగపడుతోంది.. ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎంబీఏ, ఎంసీఏ, వైద్య విద్యార్థులతో పాటు ఆయా డిగ్రీ, పీజీ, విద్యార్థులు ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగించుకుని వారికి కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. ఆంగ్ల వ్యాకరణం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల మొదలు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఉద్యోగ వివరాలను తెలియజేసే వెబ్సైట్లూ ఇందులో కోకొల్లలు. ఇవీ నష్టాలు ప్రతి వస్తువులోనూ మంచీచెడూ రెండూ ఉంటాయి. మనం ఉపయోగించే విధానంతో అవి వెలుగులోకి వస్తాయి. ఇంటర్నెట్ యువతకు ఎంత ఉపయోగపడుతోందో అంతే స్థాయిలో చెడు కూడా చేస్తోంది. యువతలో దాదాపు 70 శాతం మంది ఇంటర్నెట్కు బానిసలవుతున్నారు. వీరిలో చాలా మంది అర్ధరాత్రి వరకు కంప్యూటర్ ముందు కూర్చుని ఉంటున్నారు. కొందరు అశ్లీల చిత్రాలను చూసేందుకు, వాటిని బయటివారితో షేర్ చేసుకునేందుకు కూడా వెనుకాడ్డం లేదు. ఇటీవల జిల్లాలో ఫేస్‌బుక్‌ల ద్వారా కొందరు అశ్లీల మెసేజ్‌లు పోస్ట్ చేయడంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరిలో ఇంట ర్నెట్ చూడ్డం కూడా వ్యసనంలా మారుతోంది. మంచి కూడా మితంగా ఉన్నంత వరకే బాగుంటుంది. పరిమితి దాటితే చెడుగా మారుతుంది. ఇటీవల సర్వేలో వెలుగు చూసిన నిజాలు ఇంటర్నెట్ వాడకంపై ఇంజనీరింగ్, డిగ్రీ, బీఈడీ విద్యార్థుల్లో ఇటీవల ఓ సంస్థ సర్వే నిర్వహించింది. తమకు విషయ సేకరణకు, దరఖాస్తులు పంపడానికి ఇంటర్నెట్ ఉపయోగపడుతోందని 95 శాతం మంది తెలిపారు. యువత పెడతోవ పట్టేందుకు ఇంటర్నెట్ ప్రధాన కారణమని 60 శాతం మంది తెలిపారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనుషులను సోమరులుగా మారుస్తోందని 65 శాతం మంది తెలిపారు. జ్ఞాపక శక్తిని తగ్గిస్తోందని 35 శాతం మంది అన్నారు. -
కాంతులీనే కెరీర్‌కు ‘కొలువంత’ అండగా...
‘‘నేను బ్యాంకు పరీక్షలకు ప్రిపేరవుతున్నాను?.. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అధిక శాతం ఉద్యోగార్థుల నోటి నుంచి వస్తున్న మాట ఇది! గ్రూప్స్ సహా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర నోటిఫికేషన్లు కరువైన వేళ.. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా వస్తున్న బ్యాంకు ఉద్యోగాల ప్రకటనలు నిరుద్యోగులకు అడగా నిలుస్తున్నాయి.. కాస్త్త శ్రమిస్తే చాలు.. కాంతులీనే కొలువును చేజిక్కించుకోవచ్చనే ధీమానిస్తున్నాయి.. తాజాగా ఇలాంటి వారి ముందుకు ఐబీపీఎస్ నుంచి పీవో నోటిఫికేషన్ రూపంలో మరో అవకాశం తలుపుతట్టింది.. ఈ నేపథ్యంలో పీవో నోటిఫికేషన్ వివరాలతో పాటు పరీక్షలో గెలుపు గమ్యానికి చేర్చే సుస్థిర సోపానాలపై ఫోకస్.. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చేసిన కోర్సు ఏదైనా ఇప్పుడు చాలా మంది బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. పోటీ తీవ్రంగానే ఉన్నప్పటికీ, ప్రకటనలు కూడా ఎప్పటికప్పుడు వస్తుండటంతో కష్టపడితే తప్పకుండా ఉద్యోగం వస్తుందన్న ధీమాతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగం-కుటుంబ జీవితానికి మధ్య సమన్వయం సాధించగలిగే చక్కటి పని వాతావరణం, కెరీర్లో ఎదగడానికి అవకాశాలు విస్తృతంగా ఉండటం.. ఇలా వివిధ కారణాల వల్ల నేటి యువత బ్యాంకులో కొలువుదీరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే శరవేగంగా విస్తరిస్తున్న బ్యాంకింగ్ రంగానికి మరింత ఊపునిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతోంది. దేశంలో ఆర్థిక అనుసంధానానికి ఊతమిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 15 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవాలని, వీటిలో అత్యధికంగా 12 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే తెరవాలనే ఆలోచన ఉంది. ఈ తరుణంలో బ్యాంకింగ్ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో యువతకు ఉద్యోగావకాశాలు పలకరించనున్నాయి. ఐబీపీఎస్.. పీవో: తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. ప్రొబేషనరీ ఆఫీసర్స్/మేనేజ్మెంట్ ట్రెయినీస్ లేదా తత్సమాన ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా, పోస్టులు ఎక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగుల పదవీ విరమణతోపాటు కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తుండటంతో ఖాళీలు పెరుగుతున్నాయి. భాగస్వామ్య బ్యాంకులు: ఐబీపీఎస్ ఆధారంగా ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకుంటున్న బ్యాంకులు.. అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, భారతీయ మహిళా బ్యాంకు, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఈసీజీసీ, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకు, ఏదైనా ఇతర బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ. అర్హత: భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులు. అయితే ఫలితాలు 2014, ఆగస్టు 11 లేదా అంతకంటే ముందు వెల్లడై ఉండాలి.వయో పరిమితి: కనిష్ట వయసు 20 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు. జూలై 2, 1984; జూలై 1, 1994 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.ఎంపిక విధానం: తొలుత ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఖాళీలనుబట్టి నిర్దేశిత కటాఫ్ ఆధారంగా కామన్ ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే తాజా నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష స్కోర్ కార్డు మార్చి 31, 2016 వరకు చెల్లుబాటవుతుంది. ప్రశ్నపత్రం: ఆన్లైన్లో జరిగే పరీక్ష ప్రశ్నపత్రంలో ఐదు విభాగాలుంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. విభాగం గరిష్ట మార్కులు రీజనింగ్ 50 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి) 40 కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ (ఇంగ్లిష్ లాంగ్వేజ్ తప్ప) మాధ్యమంలో ఉంటుంది. ఆర్బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. 506 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత సరిపోతుంది. వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ జనరల్ అభ్యర్థులకు పదేళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రెండు గంటల వ్యవధిలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష- విభాగాలు: విభాగం {పశ్నలు మార్కులు రీజనింగ్ 40 40 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 న్యూమరికల్ ఎబిలిటీ 40 40 జనరల్ అవేర్నెస్ 40 40 కంప్యూటర్ నాలెడ్జ్ 40 40 ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు: జూలై 16-ఆగస్టు 6, 2014. ఫీజు చెల్లింపు (ఆన్లైన్): జూలై 16-ఆగస్టు 6, 2014. ఫీజు చెల్లింపు (బ్యాంకు శాఖల్లో): జూలై 18-ఆగస్టు 11, 2014. ఆన్లైన్ పరీక్ష: సెప్టెంబర్, 2014. వెబ్సైట్: rbi.org.in ఇండియన్ బ్యాంక్ ముఖ్య తేదీలు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జూలై 16-జూలై 30, 2014. దరఖాస్తు సవరణకు చివరి తేదీ: జూలై 30, 2014. ఫీజు చెల్లింపు: జూలై 16-జూలై 30, 2014. పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు (ఒక్కో పోస్టుకు) రూ.50. ఇతర అభ్యర్థులకు రూ.550 వెబ్సైట్: www.indianbank.in సన్నద్ధతకు సిద్ధం.. (ఐబీపీఎస్ పీవో పాటు ఇతర బ్యాంకు ఉద్యోగాలకూ ఉపయోగపడే ప్రిపరేషన్ ప్రణాళిక..) రీజనింగ్: అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని, తార్కిక విశ్లేషణను అంచనా వేసేందుకు బ్యాంకు పరీక్షలో రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ విభాగం విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. దాదాపు 50 మార్కులు దీనికి కేటాయిస్తారు. స్టేట్మెంట్-కన్‌క్లూజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్; ర్యాంకింగ్స్, సిరీస్, ఆల్ఫాబెట్ టెస్ట్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. కాన్సెప్టులపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి అధిక మార్కులు సాధించవచ్చు. ఇంగ్లిష్ లాంగ్వేజ్: కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్ వర్డ్స్‌పై దృష్టిసారించాలి. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఒక ప్యాసేజ్లో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ను గుర్తించగలగాలి. ఈ పరిజ్ఞానాన్ని బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ప్రీవియస్ పేపర్ల్లోని ప్రశ్నలకు అన్వయిస్తూ ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి. వేగంగా చదవడం, తప్పులను గుర్తించే నైపుణ్యం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ విభాగం నుంచి 40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థులు డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ విభాగంలో పైచార్టు, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పారాగ్రాఫ్/కేస్‌లెట్స్; టేబుల్స్ రూపంలోని సమస్యలను సాధించాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన సమస్యలకు వేగంగా సమాధానాలు గుర్తించేందుకు కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారాలు, వర్గ మూలాలు, ఘన మూలాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. మొత్తంమీద ఆైఈకఅ సమస్యల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పెర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ; యావరేజ్; ప్రాఫిట్-లాస్; సింపుల్-కాంపౌండ్ ఇంట్రస్ట్; రేషియో-ప్రొపోర్షన్-వేరియేషన్; నంబర్ థియరీ (రిమైండర్స్); టైమ్-స్పీడ్-వర్క్; జియోమెట్రీ (ఏరియా, వాల్యూమ్, పెరీమీటర్) తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలో సాధారణంగా 75 శాతం ప్రశ్నలు బ్యాంకింగ్ రంగానికి, మిగిలిన 25 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్‌పై వస్తున్నాయి. క్రీడలు; పుస్తకాలు-రచయితలు; వార్తల్లో వ్యక్తులు; అవార్డులు; జనాభా లెక్కలు; సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర అంశాలపై దృష్టిసారించాలి. బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానానికి సంబంధించి ప్రామాణిక బ్యాంకింగ్ అవేర్నెస్ పుస్తకాలను ఎంచుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు (ఉదా: వడ్డీ రేట్లు, బ్యాంకుల ఉన్నతాధికారుల పేర్లు, లోగోలు, బైలైన్స్..) తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌లో వాడే పదాలు, వాటి అర్థాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్బీఐకి సంబంధించిన అంశాలను కరెంట్ అఫైర్స్ కోణంలో అధ్యయనం చేయాలి. ప్రైవేటు బ్యాంకులకు లెసైన్సులు, మాట్లాడే ఏటీఎంల ఏర్పాటు, కార్డ్ లెస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ తదితర వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దినపత్రికలు, ప్రామాణికమైన పోటీ పరీక్షల మ్యాగజైన్లను చదవడం ద్వారా జనరల్ అవేర్నెస్పై పట్టు సాధించవచ్చు. న్యూస్ బులెటన్లు చూస్తుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం: కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎంఎస్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్/సాఫ్ట్వేర్ బేసిక్స్, ఇంటర్నెట్/నెట్వర్క్, వైరస్/సెక్యూరిటీ, డేటాబేస్ తదితర అంశాలకు సంబంధించిన బేసిక్స్‌ను నేర్చుకోవాలి. షార్ట్‌కట్ కమాండ్స్‌ను తెలుసుకోవాలి. ప్రిపరేషన్‌కు ఎన్సీఈఆర్టీ బేసిక్ కంప్యూటర్ పుస్తకాలు అక్కరకొస్తాయి. బ్యాంక్ పీవో కెరీర్ ప్రస్థానం ప్రభుత్వ/ప్రైవేటురంగ బ్యాంకుల్లో జూనియర్, మిడిల్, సీనియర్, టాప్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగాలుంటాయి. అధిక బ్యాంకుల్లో జూనియర్ స్థాయిలో అసిస్టెంట్ మేనేజర్; మిడిల్ మేనేజ్మెంట్లో డిప్యూటీ మేనేజర్, మేనేజర్; సీనియర్ మేనేజ్మెంట్లో చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్; టాప్ మేనేజ్మెంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలుంటాయి. వీటిని స్కేల్-1, స్కేల్-2.. ఇలా స్కేల్-7 వరకు పోస్టులుగా వ్యవహరిస్తారు. ఇవి కాకుండా స్పెషల్ స్కేలుగా చీఫ్ జనరల్ మేనేజర్, మేనేజింగ్ డెరైక్టర్ ఉద్యోగాలుంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఎండీ స్థాయికి చేరిన వారంతా ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రస్థానాన్ని ప్రారంభించినవారే.. అంటే సుమారు 25 ఏళ్లకు కెరీర్‌ను ప్రారంభించిన వారు 35 ఏళ్లకు ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశముంది. జీతభత్యాలు: పీవోల జీతం వారు పనిచేసే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. అన్ని చోట్లా మూల వేతనం, కరువు భత్యం వంటివి సమానంగా ఉన్నా.. హెచ్ఆర్ఏ, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ వంటివి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఒకరకంగా; జైపూర్, చండీగఢ్, విజయవాడ, విశాఖపట్నం, కోయంబత్తూరు వంటి ప్రాంతాల్లో మరో విధంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి తక్కువగా ఉంటాయి. నెలకు రూ.25 వేల కనీస వేతనం నుంచి కెరీర్ ప్రారంభమవుతుంది. చాలా బ్యాంకుల్లో ఆఫీసర్ ఇల్లు వెతుక్కుంటే దాన్ని బ్యాంకే లీజుకు తీసుకొని, అందులో ఫర్నిచర్ సమకూరుస్తుంది. ఆ ఫర్నిచర్ నిర్వహణకు అదనపు అలవెన్సు అందిస్తుంది.రెండు/నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. వాహనాల కోసం ఆఫీసర్ స్థాయికి అనుగుణంగా పెట్రోలు ఇస్తారు. ఇల్లు కొనుగోలుకు/నిర్మాణానికి తక్కువ వడ్డీకి, సాధారణ వడ్డీపై రుణాలిస్తారు (సాధారణంగా బ్యాంకుల్లో అన్ని రుణాలపైనా నెలవారీ చక్రవడ్డీ వసూలు చేస్తారు). బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంచుకునేందుకు రెండు/మూడు దినపత్రికలు, మ్యాగజైన్లు సమకూర్చుకునేందుకు అవకాశమిస్తారు. నాలుగేళ్లకోసారి ఉద్యోగం చేసే చోటు నుంచి, స్వస్థలానికి వెళ్లేందుకు కుటుంబం మొత్తానికి డబ్బులిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలోనైనా కుటుంబంతో కలిసి పర్యటించేందుకు అవకాశమిస్తారు. కొన్ని బ్యాంకులు సీనియర్ స్థాయి అధికారులకు విదేశీ పర్యటనకు అవకాశమిస్తున్నాయి. మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి క్రాస్ సెల్లింగ్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీటివల్ల రాజమార్గంలో అదనపు ఆదాయం సమకూరుతుంది. క్రాస్ సెల్లింగ్ బాగా చేసిన వారికి ధన రూపంలోనే కాకుండా, విదేశీ పర్యటన అవకాశాం కూడా కల్పిస్తున్నారు. విధుల నిర్వహణ: ఉద్యోగంలో బాధ్యతల విషయానికొస్తే ఎప్పుడైనా కనీసం మూడేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేయాలి. ప్రతి మూడేళ్లకు ఒకసారి బదిలీ ఉంటుంది. దీనివల్ల పిల్లల చదువుకు ఇబ్బంది కలిగితే ప్రత్యేక అలవెన్సు ఇస్తారు. ప్రొబేషన్ పూర్తికాగానే ఫీల్డ్ ఆఫీసర్‌గా, ఐదారు ఏళ్ల తర్వాత స్వతంత్రంగా బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ప్రతిభ కనబరిస్తే, పెద్ద బ్రాంచ్‌లో మేనేజర్ అవకాశమిస్తారు. ఆపైన పదోన్నతలు ద్వారా 30-45 బ్రాంచ్‌ల సమాహారమైన ప్రాంతీయ కార్యాలయం; 100-150 బ్రాంచ్‌ల సమాహారమైన జోనల్ కార్యాలయాల్లో వివిధ సాయిల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. క్రెడిట్, కంప్యూటర్, ఫారెన్ ఎక్స్ఛ్ంజ్, రికవరీ, ట్రెజరీ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధచూపి, ప్రావీణ్యం సంపాదించిన వారికి ప్రధాన కార్యాలయంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ తదితర బ్యాంకులకు విదేశాల్లో శాఖలున్నాయి. ఆయా దేశాల్లో క్లరికల్ ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారుగానీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులను ఇక్కడి నుంచి డిప్యుటేషన్‌పై పంపిస్తారు. వీరికి ప్రత్యేక అలవెన్సులు ఉంటాయి. విభిన్న నేపథ్యాల నుంచి బ్యాంకుల్లో చేరిన వారికి బ్యాంకింగ్ దైనందిన జీవితంలో అవసరమైన విద్యను అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ముంబై).. జేఏఐఐబీ/సీఏఐఐబీ కోర్సులు అందిస్తోంది. వీటిని పూర్తిచేసిన వారికి ఒక్కో పరీక్షకు ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇస్తారు. వీటి ప్రభావం పదోన్నతులపైనా ఉంటుంది. ఈ కోర్సులకు అదనంగా మరికొన్ని డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రాక్టీస్ కొద్దీ ఫలితం రోజువారీ పరీక్షలు: రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ముఖ్యం. రోజూ కోచింగ్ తీసుకునే సమయాన్ని మినహాయించి, ఇంటి దగ్గర ప్రిపరేషన్‌కు మూడు, నాలుగు గంటలు కేటాయించాలి. శిక్షణ కేంద్రంలో నిర్వహించే రోజువారీ, వారంతపు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, ‘బ్యాంకింగ్ అండ్ యూ’ మ్యాగజైన్లు ఉపయోగపడతాయి. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేశామన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్లో దానికే ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యమైన అంశాలు: రీజనింగ్‌లో ఎరేంజ్మెంట్, పజిల్ సాల్వింగ్ విభాగాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు బ్లడ్ రిలేషన్స్ సమస్యల సాధన కీలకం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ ముఖ్యమైంది. 8, 9 పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేస్తే క్వాంటిటేటివ్ విభాగంలో అధిక స్కోర్ సాధనకు వీలవుతుంది. నమూనా పరీక్షలు: ప్రతి రోజూ తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలి. బ్యాంకింగ్ పరీక్షలకు సంబంధించి పేరున్న పబ్లికేషన్ల మ్యాగజైన్లలో మోడల్ టెస్ట్‌లు ఇస్తున్నారు. వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కొన్ని ప్రచురణ సంస్థలు ఆన్లైన్ మాక్ టెస్ట్‌ల ప్యాకేజీలను అందిస్తున్నాయి. కొంత మొత్తం చెల్లించి వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలాంటి మాక్ టెస్ట్‌ల వల్ల విజయంలో కీలకపాత్ర పోషించే టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. అసలు పరీక్ష రోజున ఒత్తిడికి చోటు లేకుండా చేయొచ్చు. వ్యూహం: పరీక్షలో తొలుత ఒక్కో విభాగానికి 20 నిమిషాలు చొప్పున కేటాయిస్తూ వీలైనన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఆ తర్వాత ప్రతి విభాగంలో మిగిలిన ప్రశ్నలను సాధించేందుకు ప్రయత్నించాలి. తొలుత న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలను సాధిస్తే మంచిది. -
ఉపాధి కల్పనే
సాక్షి, అనంతపురం : అనంతపురం నగరానికి చెందిన నవీన్ 2003లో ఎంసీఏ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో దరఖాస్తులు చేశాడు. అయినా ఉద్యోగం రాలేదు. 1996లోనే జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ కార్యాలయం నుంచి ఇంత వరకు ఒక్క లేఖ కూడా అందలేదు. చేసేది లేక నగరంలోనే ఓ కంప్యూటర్ సెంటర్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఒక్క నవీన్ మాత్రమే కాదు.. జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక చాలా మంది యువతీ యువకులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం ముక్కలు కావడం, ఉద్యోగాల కొరత వంటి సమస్యలు వారిని నిరుత్సాహంలోకి నెడుతున్నాయి. జిల్లాలో 18 లక్షల మంది యువతీ యువకులు ఉన్నట్లు అధికారుల అంచనా. ప్రతియేటా వివిధ కోర్సులు పూర్తి చేసి బయటకు వస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 2008 నుంచి 2014 ఏప్రిల్ వరకు 54,412 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ ఆరేళ్లలో ఆ కార్యాలయం నుంచి 310 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన లేఖలు అందాయి. వాస్తవానికి ప్రభుత్వమే జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తోంది. ఈ విధానంలోనూ ఉపాధి కల్పన కార్యాలయం సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. ఆ కార్యాలయం ద్వారా ఇప్పటి వరకు 810 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించడం ఇందుకు నిదర్శనం. వివిధ కోర్సులు పూర్తి చేసిన వారి పేర్ల నమోదు, కార్డుల అందజేత, రెన్యూవల్స్కే ఉపాధి కల్పన కార్యాలయం పరిమితమైంది. నమోదు చేసుకున్న వారికి సీనియారిటీ ప్రకారం ఎలాంటి ఉద్యోగావకాశాలూ చూపలేకపోతోంది. కార్యాలయంలోనే అటెండర్, వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వోద్యోగాలు ఎటూ కల్పించలేకపోతున్నా.. కనీసం ఫలానా చోట ఉద్యోగాలున్నాయని తెలియజేయడంలోనూ విఫలమవుతోంది. దీంతో నిరుద్యోగ యువతీ యువకులు కనీసం రాజీవ్ యువ కిరణాల పథకం కిందైనా ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశతో అటువైపు క్యూ కడుతున్నారు. జిల్లాలో ఈ పథకం కింద 78,320 మంది పేర్లు నమోదు చేసుకోవడమే ఇందుకు తార్కాణం. రూ.వేలకు వేలు డబ్బులు పోసి ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్యాకోర్సులు పూర్తి చేసిన వారికి సైతం ఉద్యోగాలు దొరకడం లేదు. ఒకప్పుడు డిగ్రీ, పీజీలతో పాటు పదోతరగతి పాసైన వారికి కూడా హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభించేవి. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానిక కంపెనీలలో ఉద్యోగాలు స్థానికులకే అంటూ అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల కరువు జిల్లా అయిన అనంతపురం నుంచి నిరుద్యోగ యువత అక్కడికి వెళ్లడానికి సాహసించడం లేదు. జిల్లాలోని తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం, రాయదుర్గం, అనంతపురం ప్రాం తాల్లో బండల పరిశ్రమలు, సిమెంటు ఫ్యాక్టరీలు, మిల్లులు వంటి భారీ, చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 20 వేల మంది తాత్కాలికంగా ఉపాధి పొందుతున్నారు. మిగిలిన వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. జిల్లాకు విమానాశ్రయం, ఐటీ పార్కులు, భారీ పరిశ్రమలు వస్తాయని యువత ఆశిస్తున్నా, అది సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వమైనా చొరవ తీసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని యువత కోరుతున్నారు.