ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు.
ఎంసీఏ అధ్యక్షుడిగా విజయం
ముంబై: ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. బుధవారం ఆసక్తికరంగా సాగిన ఎంసీఏ ఎన్నికల్లో పవార్ 27 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి విజయ్ పాటిల్‌పై విజయం సాధించారు. పవార్‌కు మొత్తం 172 ఓట్లు రాగా, పాటిల్‌కు 145 ఓట్లు పడ్డాయి. పవార్ వర్గానికే చెందిన మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఆశిష్ షెలార్ ఉపాధ్యక్షులుగా, నితిన్ దలాల్ కోశాధికారిగా, పీవీ శెట్టి సంయుక్త కార్యదర్శులుగా గెలిచారు.