సాక్షి, ముంబై: ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఎన్నికల్లో ప్రముఖ పోటీ రాజకీయ నాయకుల మధ్య జరగనుంది. ఇప్పటివరకు ఎంసీఏ ఎన్నికల బరిలో ఎవరెవరు ఉండనున్నారనేది అధికారికంగా స్పష్టం కాకున్నా అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. ఈసారి ఎంసీఏ పోటీలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని భావించిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మళ్లీ పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆయన గతంలోనే తన చిరునామాను కూడా ముంబైకి మార్చుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఈసారి పోటీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని వార్త లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వీరిద్దరు బరిలోకి దిగి తే ఈసారి ఎంసీఏ ఎన్నికల పోరు రసవత్తరంగా జరిగే అవకాశాలు కనబడుతున్నా యి. వీరితో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే, పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యే నితిన్ సర్‌దేశాయి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, శివసేన నేత సుభాష్ దేశాయి తదితర ప్రముఖ నాయకులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రముఖ పోటీ మాత్రం శరద్ పవా ర్, సీఎం పృథ్వీరాజ్ చవాన్ మధ్య ఉండే అవకాశాలున్నాయి. అయితే శరద్ పవార్‌కు డీవై పాటిల్ అకాడమీ అధ్యక్షుడు విజయ్ పాటిల్ మద్దతు ప్రకటించారు.
అయినప్పటికీ శరద్‌పవార్ నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాలేదు. ముంబైలో నివసించే వ్యక్తికాకపోవడంతో రెండేళ్ల క్రితం శరద్ పవార్ ఎంసీఏ ఎన్నికల నుంచి చివరి నిమిషంలో తప్పుకొని దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌కు మద్దతు పలికా రు. దీంతో దేశ్‌ముఖ్ సులభంగానే అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన మరణానంతరం రవీ సావంత్ అధ్యక్షునిగా పనిచేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎవరు పోటీ చేయనున్నారనేది ఇప్పటివరకు స్పష్టత రాకున్నా ప్రముఖ రాజకీయ నాయకులు మాత్రం బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 18న ఎంసీఏ ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానానికి ప్రముఖ రాజకీయ నాయకులు పోటీపడే అవకాశం మాత్రం ఉందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఎంసీఏ ఎన్నికల బరిలో పవార్!
Published Sun, Oct 6 2013 2:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement