క్రికెట్ ను రాజకీయం చేయకండి : ఉద్దవ్ థాకరే
Published Thu, Nov 28 2013 2:16 PM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
క్రీడల్లో జోక్యం చేసుకోవద్దని రాజకీయ నాయకులకు శివసేన అధినేత ఉద్దవ్ థాకరేకు విజ్క్షప్తి చేశారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడి స్థానానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీజేపీ నేత గోపినాధ్ ముండేల మధ్య పోటిపై నెలకొన్న తాజా వివాద నేపథ్యంలో ఉద్దవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో ముండే నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరించి.. పవార్ ను ఏకగ్రీవంగా ఎంసీఏ ఎన్నుకోవడం వివాదంగా మారింది.
దాంతో ఎంసీఏ అధ్యక్షుడి ఎన్నికను సవాల్ చేస్తూ ముంబై కోర్టులో ముండే పిటిషన్ దాఖలు చేశారు. ముండే పిటిషన్ విచారించిన కోర్టు..పవార్ నియామకంపై వారం రోజుల స్టే విధించింది. రాజకీయ నాయకుల కారణంగా క్రికెట్ లో నెలకొంటున్న వివాదాలపై శివసేన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయంలో కథనాన్ని వెల్లడించింది.
క్రికెట్ ఆడుతున్న 11 దేశాల్లో రాజకీయ నాయకుల జోక్యం లేదని, కేవలం భారత దేశంలోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది అని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. బ్రిటన్ లో ప్రిన్స్ చార్లెస్ ఎన్నడూ క్రికెట్ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని.. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా క్రీడల్లో రాజకీయ నేతల జోక్యం లేదని ఉద్దవ్ అన్నారు.
ప్రధాని పదవి రేసులో పవార్, ముంబై ముఖ్యమంత్రి పదవి కోసం ముండే పోటి పడుతున్న ముండేలు ఎంసీఏ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారని ఉద్దవ్ సంపాదకీయంలో రాశారు. క్రికెట్ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడాన్ని ఆపివేయాలని ఉద్దవ్ విజ్క్షప్తి చేశారు.
Advertisement
Advertisement