
ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడిగా అజింక్య నాయక్ (37) ఎన్నికయ్యాడు. నిన్న (జులై 23) జరిగిన అధ్యక్ష ఎన్నికలో బీజేపీ బలపరిచిన సంజయ్ నాయక్‌పై 107 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. మొత్తం ఓట్లలో అజింక్యకు 221.. సంజయ్‌కు 114 ఓట్లు పోలయ్యాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా అజింక్య రికార్డు సృష్టించాడు. గత నెలలో మాజీ అధ్యక్షుడు అమోల్ ఖలే మృతి చెందడంతో ఎంసీఏకు ఎన్నిక జరిగింది.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన అజింక్య, సంజయ్ ప్రస్తుతం ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. అజింక్య కార్యదర్శిగా.. సంజయ్ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఘన చరిత్ర కలిగిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని అజింక్య తెలిపాడు. కాగా, శరద్ పవార్, విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, మనోహర్ జోషి లాంటి ఉద్దండపిండాలు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment