Gopinath Munde
-
‘ఎన్నికల’ విస్తరణ
చాన్నాళ్లుగా ఊహాగానాలకే పరిమితమైన కేంద్ర కేబినెట్ విస్తరణ పని పూర్త యింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మరో 19మంది చేరారు. అయిదుగురు మంత్రులను కేబినెట్‌నుంచి తొలగించారు. కొందరి శాఖలు మార్చారు. 2014 మే లో తొలిసారిగా ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో 45మంది ఉండగా, ఆ ఏడాది నవంబర్‌లో మరో 21మందికి చోటు కల్పించారు. అయితే గోపీనాథ్ ముండే కన్నుమూత, సర్వానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా, రావుసాహెబ్ దన్వే మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌గా వెళ్లడంవంటి పరిణామాలతో ప్రస్తుతం కేబినెట్లో 63మంది మంత్రులున్నారు. తాజా కూడికలు, తీసివేతలతో ఆ సంఖ్య 78కి చేరుకుంది. సహాయమంత్రి హోదాలో ఉంటున్న ప్రకాష్ జావదేకర్కు పదోన్నతి లభించి ఆయన కేబినెట్ మంత్రి అయ్యారు. అంతేకాదు... కీలకమైన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కూడా అప్పగించారు. ఇంతవరకూ ఆ శాఖను చూస్తున్న స్మృతి ఇరానీ చేనేత, జౌళి శాఖకు మారాల్సివచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయాలపైనా, పనితీరుపైనా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ మార్పు జరిగిందనుకోవాలి. పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలను చూస్తున్న వెంకయ్యనాయుడు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు మారారు. ఇంతవరకూ సమాచార శాఖ ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అధీనంలో ఉంది. సీనియర్ పాత్రికేయుడు,ఎంపీ ఎంజే అక్బర్ విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అయ్యారు. వాస్తవానికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అందరూ భావిం చారు. కానీ ప్రమాణస్వీకారానికి ముందురోజే అందుకు సంబంధించిన ఊహా గానాలకు మోదీ తెరదించారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని మూడో ఏట అడుగు పెట్టింది. అందువల్ల ఇది సమీక్షకు సముచితమైన సమయంగా భావిస్తున్నానని, కనుకనే ఈ విస్తరణ అవసరమవుతున్నదని ఒక ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు. అయితే సమీక్షకు మించి వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల దృష్టే ఇందులో ప్రధానంగా ఉన్నదని విస్తరణ జరిగిన తీరును చూసి అంచనా వేయొచ్చు. రాజకీయ పక్షాలన్నీ ప్రధాన ఎన్నికల రణక్షేత్రంగా భావించే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ రాష్ట్రంనుంచి ఇప్పుడు కొత్తగా తీసుకున్న ముగ్గురు కొత్త మంత్రులతో కలుపుకుంటే అక్కడినుంచి మొత్తంగా 16మందికి స్థానం కల్పించినట్టయింది. కేంద్ర మంత్రివర్గంలో ఇంతటి ప్రాతినిధ్యం మరే రాష్ట్రానికీ లేదు. ఆ ముగ్గురిలో కృష్ణరాజ్ దళిత మహిళకాగా, అనుప్రియ పటేల్ ఓబీసీల్లోని కుర్మీ కులస్తురాలు. మరేంద్రనాథ్ పాండే బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. ఈ ముగ్గురిలో అనుప్రియ గత ఎన్నికల్లో బీజేపీ మిత్ర పక్షంగా పోటీచేసిన అప్నా దళ్ పార్టీ అధినేత. అదే కులానికి చెందిన బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీష్‌కుమార్ ఈమధ్య యూపీలో పలు సభల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో గణనీయంగా ఉన్న కుర్మీ కులానికి చెందినవారు అటువైపు ఆకర్షితులు కాకుండా చూడటమే అనుప్రియను తీసుకోవడంలోని ఆంతర్యమని సులభంగానే చెప్పొచ్చు. రెండు దశాబ్దాలుగా యూపీ దళితులు మాయావతి వెన్నంటే ఉంటున్నారు. దళిత వర్గానికి చెందిన కృష్ణరాజ్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించడానికి బీజేపీ ప్రయత్నించింది. రాష్ట్ర జనాభాలో 12 శాతంగా ఉన్న బ్రాహ్మణ కులస్తులను ఆకట్టుకోవడానికి పాండేకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న 75 ఏళ్ల కల్రాజ్ మిశ్రాను తప్పిస్తారని ఊహా గానాలొచ్చినా ఈ కారణంవల్లనే ఆయన జోలికి వెళ్లలేదనుకోవచ్చు. యూపీలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)పై ఎటూ ప్రజల్లో వ్యతిరేకత వస్తు న్నది గనుక రాగల అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మాయావతి నుంచే ప్రధానంగా పోటీ ఉంటుందని బీజేపీ అగ్ర నాయకత్వం అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు కనీసం ఓట్లు చీల్చగల సత్తా కూడా లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీ 73 ఎంపీ స్థానాలను గెల్చుకుంది. రాగల అసెంబ్లీ ఎన్నికల్లో అందుకు దీటుగా గెలిస్తే తప్ప అధికారాన్ని చేజిక్కించుకోవడం సాధ్యం కాదు. ఈ లక్ష్య సాధనే ఇప్పుడు ప్రధానంగా పనిచేసింది. అయితే వారణాసి నుంచి గెలిచిన మోదీ, లక్నో నుంచి ఎన్నికైన రాజ్‌నాథ్‌లు మినహాయిస్తే ఇప్పుడు కొత్తగా మంత్రులైనవారితో సహా అందరూ సహాయమంత్రులే. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మరో రాష్ట్రం ఉత్తరాఖండ్. సీనియర్ నేతలు భగత్‌సింగ్ కోషియారి, రమేష్ పోఖ్రియాల్ వంటి మాజీ సీఎంలను కూడా కాదని పెద్దగా ఎవరికీ తెలియని దళిత ఎంపీ అజయ్తాంతాకు అక్కడినుంచి అవకాశం ఇవ్వడం ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కావొచ్చు. ఇక గుజరాత్ కూడా ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతోంది. పటేల్ కులస్తులు సాగించిన ఉద్యమం వల్ల బీజేపీ అక్కడ ఒడిదుడుకుల్లో ఉంది. అందువల్లే ఆ రాష్ట్రానికి కూడా సముచిత ప్రాతినిధ్యం లభించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో సైతం బీజేపీ పరిస్థితి ఏమంత సవ్యంగా లేదు. ఈమధ్య అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగుపడిన దాఖలాలు కనిపించాయి. విస్తరణలో దీన్ని పరిగణనలోకి తీసుకున్నారు. తొలగించిన అయిదుగురిలో ఒకరైన నిహాల్చంద్ మేఘ్వాల్పై మాత్రమే అత్యాచారం వంటి తీవ్ర ఆరోపణలున్నాయి. మిగిలినవారి తొలగింపు కారణాలేమిటో తెలియాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో తానే పలుమార్లు ప్రస్తావించిన ‘కనిష్ట ప్రభుత్వం-గరిష్ట పాలన’ సిద్ధాంతాన్ని ఈ విస్తరణలో నరేంద్ర మోదీ వదులుకోవాల్సి వచ్చింది. 78మంది మంత్రులుండటం ఉన్న పరిమితితో పోలిస్తే తక్కువే. అయితే జంబో కేబినెట్‌గా పేరుబడ్డ మన్మోహన్ సింగ్ కేబినెట్లో సైతం ఇంతమంది లేరన్నది నిజం. మొత్తానికి రాజకీయ సమీ కరణాలు, అవసరాల్లో కొన్ని రాజీలు తప్పవని ఈ కేబినెట్ విస్తరణ ద్వారా మోదీ రుజువు చేశారు. -
స్కాములేవీ చేయలేదు.. విచారణకు రెడీ
స్కూలు పిల్లల కోసం రూ. 206 కోట్ల విలువైన సామగ్రి సరఫరా కాంట్రాక్టులలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే ఎట్టకేలకు నోరు విప్పారు. ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన స్కాం అని, కేవలం రాజకీయ కక్షతోనే తనపై పస లేని ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కూతురైన పంకజ... మహారాష్ట్ర ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం రూ. 408 కోట్లతో ఈ తరహా సామగ్రి కొనుగోలు చేసిందని ఆమె అన్నారు. పిల్లలకు వేరుశనగ అచ్చులు, చాపలు, నోట్ పుస్తకాలు, వాటర్ ఫిల్టర్ల కొనుగోలు కాంట్రాక్టులను తమ పార్టీ కార్యకర్తలు, వాళ్ల కుటుంబ సభ్యులకే ఇచ్చారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వమే ఎక్కువ ధర పెట్టి కొందని, తాము ఇంకా తక్కువకు కొన్నా అది తప్పేనంటే ఎలాగని ప్రశ్నించారు. ఒక్క రూపాయి మేర కూడా అక్రమాలు జరగలేదని, తన శాఖతో పాటు తాను కూడా ఈ అంశంలో ఏసీబీ విచారణకు సిద్ధంగా ఉన్నామని పంకజా ముండే చెప్పారు. కాగా, మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే కూడా ఓ నకిలీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశారని, ప్రభుత్వ పాఠశాలలకు అగ్నిమాపక పరికరాల కొనుగోలు కోసం రూ.191 కోట్ల కాంట్రాక్టు ఇవ్వడంలో అక్రమాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. -
మహిళా ఎమ్మెల్యేలు 16 మందే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహిళలకు సరైన వాటా దక్కలేదు. మొత్తం 16 మంది మహిళలు మాత్రమే గెలిచారు. వీరిలో బీజేపీ నుంచి 10 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, ఎన్సీపీ నుంచి ఒకరు ఉన్నారు. శివసేన, ఎమ్మెన్నెస్‌లకు మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేదు. బీజేపీకి చెందిన ఆ పార్టీ దివంగత నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ, మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుశ్రీ మిసాల్లు తమ సీట్లలో తిరిగి గెలిచారు. కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం అశోక్ చవాన్ భార్య అమీతా చవాన్ ఉన్నారు. -
696,321 ఓట్ల తేడాతో ప్రీతమ్ ముండే విజయం
ముంబై: బీద్ లోకసభ నియోజకవర్గంలో దివంగత బీజేపీ సీనియర్ నేత గోపినాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. గోపినాధ్ ముండే ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఖాళీతో బీద్ లోకసభకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఎస్. పాటిల్ పై 696,321 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రీతమ్ ముండేకు 922,416 ఓట్లు పోలయ్యాయి. శివసేన, ఎన్సీపీలు ఈ స్థానంలో అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. -
అవసరమైతే శివసేనతో చర్చిస్తా..
పంకజా ముండే సాక్షి, ముంబై: అధికారంలోకి వచ్చేందుకు సహకారం తీసుకోవాల్సి వస్తే శివసేనతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు దివంగత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో శివసేన, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లభించనట్లయితే శివసేన మద్దతు అవసరం కానుంది. అలాంటి సమయంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు జరిపేందుకు పంకజా ముండే సరైన నాయకురాలిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా ఆమెను ప్రకటించినట్టయితే ఉద్దవ్ ఠాక్రేకూడా బీజేపీకి మద్దతు పలికేందుకు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పంకజా ముండే తన సోదరిలాంటివారని పేర్కొంటూ బీడ్ జిల్లాలో ఆమెకు వ్యతిరేకంగా శివసేన ఎవరిని బరిలోకి దింపలేదు. అలాగే భావి ముఖ్యమంత్రిగా ఆమెకు మద్దతు ఇచ్చేందుకు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
'నాన్న మద్దతుదారులు సీఎం కావాలని కోరుకుంటున్నారు'
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి పదవి రేసులో ఉంటానని దివంగత నేత గోపినాథ్ కూతురు పంకజ ముండే సిగ్నల్ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని తన తండ్రి మద్దతు దారులు, యువత కోరుకుంటున్నారని పంకజ ముండే తెలిపారు. వారసత్వం తనకు అడ్డంకి కాదు. నా తండ్రి మరణం తర్వాత కేంద్రమంత్రి పదవి చేపట్టాలని పార్టీలో చర్చించారు. అయితే నేను కేంద్రమంత్రి పదవిని తీసుకోలేదు అని అన్నారు. వారసత్వ రాజకీయాలకు ప్రధాని నరేంద్రమోడీ వ్యతిరేకమనే ప్రశ్నకు వారసత్వం అనేది ప్రధానాంశం కాదు, నా అర్హతకే మోడీ ప్రాధాన్యత ఇస్తారని ఆమె అన్నారు. -
ప్రజలు నేను సీఎం కావాలనుకుంటున్నారు
గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ నాగ్‌పూర్/పార్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ప్రీ-పోల్ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి ఆశావహులు మనసులో మాట బయటపెడుతున్నారు. సీఎం పోస్టును తాను చేపట్టాలని ప్రజలు అనుకుంటున్నారని దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె, ఎమ్మెల్యే పంకజ చెప్పారు. ‘నా పనే నన్ను ఆ పీఠం దగ్గరికి చేరుస్తుందని ఇదివరకు చెప్పా. మా నాన్న సీఎం కావాలని జనం అనుకున్నారు. నాకు ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే నేను సీఎంగా ఉంటానని ఎప్పుడూ చెప్పలేదు’ అని ఆమె తన నియోజకవర్గమైన పార్లీలో ఓటేసిన అనంతరం చెప్పారు. -
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
ముంబై: మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ వెలువడింది. 288 మంది సభ్యులుండే అసెంబ్లీకి అక్టోబర్ 15వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను ఒకే దశలో నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. వీటితోపాటు బీడ్ ఎంపీ సీటుకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయుని ఆయున చెప్పారు. బీజేపీ నేత గోపీనాథ్ ముండే వురణంతో ఈ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. శనివారం నుంచే ఎన్నికల ప్రక్రియు ప్రారంభమైందని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ► ఈనెల 27వతేదీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ► అక్టోబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. ► అక్టోబర్ 15వ తేదీన పోలింగ్ ► అక్టోబర్ 19వ తేదీన ఓట్ల లెక్కింపు కాగా వచ్చే నెల 15న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం జారీచేసింది. -
బీడ్ ఉప ఎన్నిక
ముంబై: బీడ్ లోక్‌సభ నియోజకవర్గానికి నిర్వహించే ఉప ఎన్నికపై దివంగత నాయకుడు గోపీనాథ్ కుమార్తె పంకజా పాల్వేముండే ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి ఎవరు దిగుతారనే విషయం అస్పష్టంగా ఉంది. ప్రస్తుతం పంకజా ‘సంఘర్ష్ యాత్ర’ పేరిట రాష్ర్టవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర రాజ కీయాలపై తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తున్నారు. అయితే పంకజ సోదరి ప్రీతమ్ ముండే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ సీటును మళ్లీ బీజేపీకి దక్కించుకోవడం అంత కష్టం కాకపోవచ్చు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ముండే కుటుంబ సభ్యులెవరైనా ముందుకొస్తే వారికి పోటీగా ఈ నియోజకవర్గంనుంచి తమ పార్టీ తరఫున ఎవరినీ బరిలోకి దించబోమని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇక్కడ బీజేపీ గెలుపు నల్లేరుపై నడకే కావచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. ఇదిలాఉంచితే ప్రీతమ్ ముండే బీడ్ నియోజవర్గం పరిధిలోని పర్లి, బీడ్, నాసిక్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన రమేష్ అడస్కర్ ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇది కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమే. -
ముండే మరణాన్ని రాజకీయం చేయొద్దు
ముంబై: తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి గోపినాథ్ ముండే ఆకస్మిక మృతిని రాజకీయం చేయొద్దని అతని కుమార్తె పంకజ ముండే విజ్ఞప్తి చేశారు. ఆమె గురువారం సింధ్‌ఖేడ్ రాజాలో ‘సంఘర్ష్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ యాత్ర రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 79 నియోజకవర్గాల మీదుగా సుమారు 3,000 కి.మీ. మేర సాగుతుంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి గత జూన్ మూడో తేదీన ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారని చెప్పారు. అయితే కొందరు తన తండ్రి మరణాన్ని రాజకీయంగా వాడుకునేందుకు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, వారి మాటలను ఎవరూ పట్టించుకోవద్దని పరోక్షంగా తన సవతి సోదరుడైన ధనుంజయ్ ముండేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎన్సీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ధనుంజయ్ ముండే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, తన తండ్రి బతికున్నప్పుడు ఏమాత్రం సంబంధాలు లేని వ్యక్తులు, ఇప్పుడు ఆయన ఆకస్మిక మృతితో లబ్ధిపొందాలని చూస్తున్నారని పంకజ విమర్శించారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ముండే సాబ్ వారసురాలిగా ప్రజలందరూ పంకజను ఆదరిస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- శివసేన కూటమి అధికారంలోకి రానుందని, అప్పుడు రైతుల ఆత్మహత్యలకు కారణమైన వారినందరినీ జైళ్లకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ యాత్రను వాస్తవానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రారంభించాల్సి ఉండగా, ఆమెకు తన రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో తన సందేశాన్ని పంపారు. అలాగే ఈ యాత్రలో పలువురు బీజేపీ అగ్రనాయకులు పాల్గొనాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని పంపజ తెలిపారు. యాత్ర ప్రారంభ కార్యక్రమంలో వేలాదిమంది బీజేపీ కార్యకర్తలు, ముండే అభిమానులు పాల్గొన్నారు. -
సంఘర్ష్ యాత్రకు సన్నద్ధం
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సంఘర్ష్ యాత్ర’ రాష్ట్రవ్యాప్త పర్యటనకు దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ సిద్ధమవుతున్నారు. నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డేతోపాటు పంకజా ముండే మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 14 రోజులపాటు నిర్వహించే యాత్రలో భాగంగా పంకజ 21 జిల్లాల్లోని 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్లు పర్యటిస్తారు. బుల్డాణాలోని సింధ్‌ఖేడ్ జిల్లాలో యాత్ర ప్రారంభమవుతుందని పంకజ తెలిపారు. ఈ ప్రాంతం మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి రాజమాత జీజావు జన్మస్థలం. తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన స్థానంలో పోటీకి పంకజ సిద్ధంగా లేరని ఇటీవల వార్తలు వచ్చాయి. ముండే కుటుంబం నుంచి ఎవరు బరిలోకి దిగినా వారికి వ్యతిరేకంగా తాము అభ్యర్థిని బరిలోకి దింపబోమని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే ముండే ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తెలిసిందే. -
ముండేకు అఖిలపక్ష నివాళి
సాక్షి, ముంబై : ప్రజానాయకుడైన గోపినాథ్ ముండే లేని లోటుపూడ్చలేనిదని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. దివంగత కేంద్ర మంత్రి గోపినాథ్ ముండేకు నారిమాన్‌పాయింట్‌లోని ఎన్సీపీఏలో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఆర్పిఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే, దేవేంద్ర ఫడ్నవీస్, ముండే కుమార్తె పంకజ ముండే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోపీనాథ్ ముండేతో ఉన్న అనుబంధాలను వారు నెమరువేసుకున్నారు. అనంతరం ఆయనకు నివాళులర్పించారు. -
సీబీఐ చేతికి ముండే మృతి కేసు
దివంగత కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే మరణానికి కారణం నిజంగా ప్రమాదమేనా? ఈ విషయాన్ని తేల్చడానికి సీబీఐ విచారణ త్వరలోనే మొదలుకానుంది. ఇప్పటికే ఆ కేసు విచారణను సీబీఐ తన చేతుల్లోకి తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 3వ తేదీన సిగ్నల్ జంప్ చేసి వచ్చిన కారు ముండే కారును ఢీకొనడంతో ఆయన తలుపు లోంచి బయట రోడ్డుమీద పడిపోయారని, మెడకు, కాలేయానికి గాయాలు కావడం, దానివల్ల షాక్, హెమరేజి సంభవించడంతో గోపీనాథ్ ముండే మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే.. ఆ తర్వాత బీజేపీ నాయకులలో కొందరు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురు కావడంతో ముండే బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని భావించినట్లు మహారాష్ట్రకు చెందిన పార్టీ నాయకుడు పాండురంగ్ ఫండ్కర్ ఆరోపించారు. ఆ తర్వాత మరికొందరు నాయకులు కూడా అనుమానాలు వ్యక్తం చేయడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు సిఫార్సు చేసింది. ఆ విచారణ త్వరలోనే మొదలవుతోంది. -
ముండే సంతాపసభలో రివాల్వర్ మిస్‌ఫైర్
సాక్షి, ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు నివాళులర్పించేందుకు ఏర్పాటుచేసిన సంతాపసభలో ఓ రివాల్వర్ మిస్‌ఫైర్‌అయింది. అదృష్టవశాత్తు అం దులోంచి వెలువడిన బుల్లెట్ ఎవరికీ తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళ్తే.. అహ్మద్‌నగర్ పట్టణంలోని ఓ సభాగృహంలో ఆదివారం వివిధ పార్టీల నాయకులు సంతాపసభ ఎర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్నేర్ తాలూకా నుంచి స్థానిక నాయకుడు సంభాజీ రోహోకలే వచ్చారు. నివాళులర్పిం చిన తరువాత తిరిగి బయటకు వెళుతుండగా ఆయన నడుం ఉన్న రివాల్వర్ కిందపడింది. దీంతో అది ఒక్కసారిగా పేలింది. అక్కడున్న పోలీసు వెంటనే రివాల్వర్‌తోసహా అయనను అదుపులోకి తీసుకున్నారు. -
ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు
రెండుమూడు రోజుల్లో అధికారిక ఆదేశాలు ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరుపనుంది. ముండే ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగుందా? అనే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ముండే మృతి కేసును త్వరలో సీబీఐకి అప్పగించనున్నారని అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే మంగళవారం తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... ‘ఇవాళ ఉదయం(మంగళవారం) హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేశారు. ముండే బలిగొన్న ప్రమాదం గురించి మాట్లాడారు. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెప్పారు. రెండుమూడు రోజుల్లో అధికారిక ఆదేశాలు వెలువడతాయని చెప్పారు. ముండే మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన వెంట భద్రతా సిబ్బంది ఎందుకు లేరు? చిన్నపాటి గాయానికే ఆయన ఎలా మరణిస్తారు? తదితర కోణాల్లో కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరముందని రాజ్‌నాథ్‌కు సూచించారు. సంయమనం పాటించండి: పంకజ తండ్రి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టమేనని, ఆయన అభిమానులు కూడా సంయమనం పాటించాలని ముండే కూతురు పంకజ రాష్ట్ర ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్ర మోడీపై తనకు పూర్తిగా విశ్వాసముందని, మరణం వెనుక ఏవైనా కుట్రలు దాగి ఉంటే అవి సీబీఐ విచారణలో బయటపడతాయన్నారు. -
బీజేపీని వీడాలనుకున్న ముండే!
ముంబై: ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండే గురించి ఆసక్తికర విషయం ఒకటికి బయటికి వచ్చింది. బీజేపీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదని భావించిన ముండే అప్పట్లో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అలాంటి పని చేయవద్దని, డిమాండ్లన్నీ త్వరలోనే నెరవేరుతాయంటూ ఎన్సీపీ అధిపతి, ముండే స్నేహితుడు కూడా అయిన శరద్ పవార్ ఆయనకు నచ్చజెప్పారు. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావుత్ ఈ సంగతి వెల్లడించారు. సేన అధికార పత్రిక సామ్నాలో రావుత్ రాసిన చిన్నవ్యాసంలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. సామ్నా కథనం ప్రకారం.. ముండే అప్పట్లో బీజేపీపై అసంతృప్తితో ఉండేవారు. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరాలా వద్దా చెప్పాలని కోరుతూ పవార్‌ను సంప్రదించారు. అంతేకాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయినప్పుడు కూడా ముండే రాజీనామా అంశం ప్రస్తావనకు వచ్చింది. శరద్ పవార్, గోపీనాథ్ ముండే రాష్ట్రంలో సీనియర్ నాయకులేగాక, ఎంతో జనాదరణ పొందారు. ఇద్దరి మధ్య ఎంతోకాలంగా సాన్నిహిత్యం ఉంది. పవార్ మాదిరిగానే ముండేకు కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల్లో స్నేహితులు ఉండేవారు. ముండేకు శాసనసభలో నివాళులు అర్పించిన సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ పాండురంగ్ ఫుండ్కర్ కూడా ఆసక్తికర విషయం చెప్పారు. తన బావ ప్రమోద్ మహాజన్ 2006లో మరణించిన తరువాత పార్టీలో ముండేకు స్థానం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. అందుకే ఆయన కాంగ్రెస్‌లో చేరాలని భావించారని చెప్పారు. కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా సిద్ధపడిందని పాండురంగ్ వివరించారు. -
ముండేను పవార్ వారించారు!
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన దివంగత కేంద్రమంత్రి గోపినాథ్ ముండేను మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ వారించారని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ మీడియాకు వెల్లడించారు. బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందనే భావనలో ఉన్న ముండే.. తన డిమాండ్లను బీజేపీ అంగీకరించకపోతే.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఓ దశలో నిర్ణయించుకున్నారని రావత్ అన్నారు. బీజేపీలో తనకు ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తితో పవార్ ను ముండే కలిశారని..అయితే బీజేపీని వీడవద్దని పవార్ హెచ్చరించారని శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ఉత్సవ్ అనే అనుబంధంలో కథనాన్ని ప్రచురించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్న నేతగా బీజేపీ నేతగా ముండేకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయాలకు అతీతంగా నేతలతో ముండేకు సన్నిహిత సంబంధాలుండేవి. ఆ చోరవతోనే పవార్ ను ముండే కలిసినట్టు కథనంలో పేర్కొన్నారు. కారు ప్రమాదంలో మరణించిన ముండేకు శాసన మండలిలో నివాళులర్పిస్తూ బీజేపీ ఎమ్మెల్సీ పాండురంగ పుంద్కర్ .. ముండే జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనల్ని నెమరు వేసుకున్నారు. -
ముండే మృతిపై అనుమానాలు?
కేంద్ర మాజీ మంత్రి, దివంగత నాయకుడు గోపీనాథ్ ముండే ప్రమాదంలోనే మరణించారా.. లేక ఆ ప్రమాదాన్ని ఎవరైనా సృష్టించారా? ఇలాంటి అనుమానాలు ఎవరికి మొదలయ్యాయో గానీ, ముండే మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి, ముండే మరణంపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేసిన తర్వాత ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 3వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు నుంచి కింద పడి మెడకు, కాలేయానికి గాయాలు కావడం, దానివల్ల షాక్, హెమరేజి సంభవించడంతో గోపీనాథ్ ముండే మరణించిన విషయం తెలిసిందే. పార్టీలో తీవ్ర అవమానాల పాలు కావడంతో ఒకానొక సమయంలో గోపీనాథ్ ముండే బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని భావించినట్లు మహారాష్ట్రకు చెందిన పార్టీ నాయకుడు పాండురంగ్ ఫండ్కర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పలువురు నాయకులకు అనుమానాలు రావడంతో ఇప్పుడు ముండే మరణంపై సీబీఐ విచారణ కోరుతున్నారు. -
రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వెళ్లను: గడ్కారీ
నాగ్‌పూర్: తాను తిరిగి మహారాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉందని వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ కొట్టిపడేశారు. తొలుత తాను ఢిల్లీ రాజకీయాల పట్ల మక్కువ చూపేవాడిని కాదని, ప్రస్తుతం తనకు ఢిల్లీ వదిలి వెళ్లే ఉద్దేశం లేదని ఇక్కడ ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్‌లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నేతృత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మరో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే ఆకస్మికంగా మృతి చెందడంతో నితిన్ గడ్కారీ మహారాష్ట్రలో పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారని వార్తలు వచ్చాయి. ప్రత్యేక విదర్భ డిమాండ్‌పై మాట్లాడిన గడ్కరీ.. తమ ఆకాంక్ష నెరవేరాలంటే పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలని, అందునా అన్ని రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం రావాలని అన్నారు. ఇక లక్ష కోట్ల రూపాయలు ఖర్చయ్యే గంగానది శుద్ధి కార్యక్రమాన్ని మరో నాలుగునెలల్లో ప్రారంభిస్తామన్నారు. అలహాబాద్ నుంచి హూగ్లీ వరకూ గంగానదిలో రవాణాను అభివృద్ధిపరిచే ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. -
ముండేకు ఘనంగా నివాళి
భివండీ, న్యూస్‌లైన్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ జన తా పార్టీ (బీజేపీ) నేత, కేంద్ర గ్రామీణా అభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే సంస్మరణార్థం భివండీ పట్టణ బీజేపీ శాఖ ఆదివారం సంతాపసభ నిర్వహిం చింది. గోపాల్‌నగర్ పాటిదార్ హాల్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మహేష్ చౌగులే నేతృతృంలో చేపట్టిన ఈ సభకు బీజేపీ స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతోపాటు కాంగ్రెస్, రాష్ట్రవాదీ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఆర్పీఐ నాయకులు, సర్పంచులు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సం తాప సభలో మొదట ముండే చిత్రపటానికి పూల మాలలు వేసి, ఆయన ఆత్మశాంతి కోసం రెండు నిముషాలు మౌనం పాటించారు. తదనంతరం మాట్లాడిన నాయకులు ముండేతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముండే పేదల నాయకుడని, చిన్నాపెద్దా భేదాలు లేకుండా అందరినీ ఆత్మీయంగా పలకరించేవారని బీజేపీ నేతలు అన్నారు. ఈ సభకు బీజేపీ ఎంపీ కపిల్ పాటిల్, కాం గ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సురేష్ టావురే, విలాస్ పాటిల్, నిలేష్ చౌదరి, శ్యామ్ అగ్రవాల్, సుధాకర్ కముటం, భైరి నిష్కం, కుందెన్ పురుషోత్తం, సాయినాథ్ పవార్, మోహన్ వల్లాల్‌తోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజ రయ్యారు. -
నక్సలిజాన్ని ఉపేక్షించం
హోంమంత్రి రాజ్‌నాథ్ వెల్లడి {పజల ఆశలను మోడీ ప్రభుత్వం నెరవేర్చుతుంది యూపీఏ హయాంలో ప్రభుత్వ వ్యవస్థ స్తంభించిపోయింది సరిదిద్దేందుకు సమయం పడుతుంది లక్నో: నక్సలిజం, వేర్పాటువాదం, ఉగ్రవాదం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని, ఇందుకోసం తమ మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం రాజ్‌నాథ్ తొలిసారిగా తన నియోజకవర్గమైన లక్నోలో శనివారం పర్యటించారు. ఆయనకు స్థానిక చౌధురి చరణ్‌సింగ్ విమానాశ్రయంలో పార్టీశ్రేణులనుంచి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశం ముందున్న అనేక భారీ సమస్యలను పరిష్కరించేందుకు గతంలో ఎటువంటి ప్రయత్నం జరగలేదని, ఇందుకోసం ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక చేపట్టలేదని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఇందుకోసం తాము కసరత్తు చేపట్టామని, ఇందులో విజయం సాధించగలమని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించడం స్వాతంత్య్రానంతరం ఇదే ప్రథమమన్నారు. తద్వారా ఆయా దేశాలతో సుహృద్భావ సంబంధాలను కోరుకుంటున్నామన్న విషయమై ఒక స్పష్టమైన సందేశాన్ని పంపామని ఆయన చెప్పారు. యూపీలో శాంతిభద్రతల పరిస్థితిపై రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను ఏ రాష్ట్రం గురించి కూడా వ్యాఖ్యానించబోనని బదులిచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 1. {పజలు బీజేపీకి తిరుగులేని విజయం అందించారు. అదేసమయంలో ఈ ప్రభుత్వంపై వారిలో ఎన్నో ఆశలున్నాయి. మోడీ డైనమిక్ నేత. ఆయన నేతృత్వంలోని సర్కారు రాబోయే ఐదేళ్లలో ప్రజల ఆశలను నిజం చేస్తుంది. ఇది తథ్యం. 2. {పస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దేశాన్ని బయటపడేసేందుకు కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీనిని ఒకటి, రెండు సంవత్సరాల్లోనే మార్చడం సాధ్యం కాదు. దీనిని సరిదిద్దేందుకు మరింత సమయం అవసరం. 3. గోపీనాథ్ ముండే హఠాన్మరణం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రజాదరణ కలిగిన నేత. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముండేను సీఎం అభ్యర్థిగా నిలపాలని భావించాం. 4. నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన లక్నో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సర్వదా కృతజ్ఞుడిని -
'ముండే బిజెపి వదలాలనుకున్నారా?'
ఇటీవలే ప్రమాదంలో మరణించిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే బిజెపిని వదలాలని అనుకున్నారని ఆయనకు సన్నిహితుడైన ఎం ఎల్ సీ ఒకరు బాంబుపేల్చారు. ముండే మరణం కూడా అనుమానాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించడం బిజెపిని ఇరకాటంలో పారేసింది. మహారాష్ట్ర శానస మండలిలో గోపీనాథ్ ముండేకి శ్రద్ధాంజలి అర్పించే తీర్మానంపై జరిగిన చర్చలో ముండే వీరాభిమాని, ఎంఎల్ సీ పాండురంగ్ ఫుండ్ కర్ మాట్లాడుతూ పార్టీలో ముండే ఎన్నో ఇబ్బందులను ఎన్నుకున్నారని, ఆయన పార్టీని కూడా వదలాలనుకున్నారని అన్నారు. ఆయనకు కాంగ్రెస్ మంత్రిపదవులను ఇస్తామని చెప్పింది కూడా. అయితే ఆయన పార్టీనే నమ్ముకుని పనిచేశారని అన్నారు. ఆయన మరణం కూడా అనుమానాస్పదంగా ఉందని, దీనిపై సీబీఐ విచారణ చేయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఫుండ్ కర్ వ్యాఖ్యలపై పార్టీలో ఎవరూ స్పందించలేదు. -
ముండేకు బదులు చౌహాన్‌కు నివాళులు
చెన్నై : బతికుండగానే ఆ నేతకు కార్యకర్తలు ఫోటో పెట్టి నివాళులు అర్పించేశారు. ఈ సంఘటన శనివారం చెన్నైలో చోటుచేసుకుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే సంస్మరణ సభలో ఆపార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పొరపాటున ముండే ఫోటోకు బదులుగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ ఫోటో పెట్టి నివాళులు అర్పించారు. దాంతో కార్యకర్తల అత్యుత్సాహంపై బీజేపీ అధిష్టానం మండిపడింది. తొందరపాటు చర్యలు తగవని కార్యకర్తలకు సూచించింది. -
సిసలైన గ్రామీణ నాయకుడు..!
ముండేను కొనియాడిన అసెంబ్లీ నివాళులర్పించిన అధికార, ప్రతిపక్షాలు ముంబై: బీజేపీ దివంగత నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండేకు మహారాష్ట్ర అసెంబ్లీ ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన రోజే సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నివాళి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ... ‘ప్రజలకు సేవ చేయాలనే తపన కలిగిన నేత గోపీనాథ్ ముండే. పట్టణ పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఆయన గ్రామీణ నేత. ఎన్నికలను ఎప్పుడూ ఆయన తేలికగా తీసుకునేవారు కాదు. తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లేవారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల విషయమై ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించేది. రాజకీయ ప్రస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఆయన మరణించడం విచారకరం. ఆయన కల(ముఖ్యమంత్రి కావాలన్న) నెరవేరకుండానే మన మధ్య నుంచి వెళ్లిపోయారు. చివరిసారిగా ఆయన నాతో ఫోన్లో మాట్లాడారు. తన మంత్రిత్వశాఖ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఇదే సరైన సమయమన్నారు. బడ్జెట్ కేటాయింపుల గురించి తాను చర్చించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన స్నేహం చేసేవారు. ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పింకోవాలని చూడలేదు. మరో పదిహేను రోజుల తర్వాత కలుద్దామని చెప్పాను. తనకు చాలా సమయముందని, ఎప్పుడైనా కలుసుకుందామని చెప్పి అందరాని లోకాలకు వెళ్లిపోయార’ని గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ... బీజేపీ శివసేనలు కూటమిగా ఏర్పడ్డాక ముండే రాజకీయ ప్రస్థానం మొగ్గతొడగడం మొదలైంది. బాల్‌ఠాక్రేతో ముండేకు చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉండేది. రైతుల సంక్షేమం కోసం కృష్ణావ్యాలీని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ముండేదే. అందరిపట్ల అభిమానం చూపే వ్యక్తి ఆయన. కిందిస్థాయి కార్యకర్తలు ఎదుగుతున్నారని ఎంతో సంబరపడిపోయేవారు. వారి ఎదుగుదలను చూసి ఎప్పుడూ ఆయన భయపడలేదు. పార్టీ పటిష్టానికి ఇది శుభపరిణామం అనేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనమధ్య లేకపోవడం తీరని లోటు’ అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. నారాయణ్ రాణే మాట్లాడుతూ... ‘గ్రామీణ అంశాలపై ముండేకు గట్టి పట్టు ఉందన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు ముండే చేసిన సేవలు మరువలేనివని ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ కొనియాడారు. తమ ఓబీసీ డిమాండ్‌కు మద్దతు పలికిన మొట్టమొదటి బీజేపీ నేత ముండే అని గుర్తుచేసుకున్నారు. సుభాష్ దేశాయ్, పతంగ్‌రావ్ కదమ్ తదితరులు కూడా ముండే సేవలను కొనియాడారు. -
గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు!
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఆయన మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్లు అధికం కావడంతో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తు అంశంపై మోడీ త్వరలో తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనిపై ప్రజలకు ఏమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజానేతగా గుర్తింపు ఉన్న ముండే మృతి మాత్రం పార్టీకి తీరని లోటేనన్నారు. తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు ముండే మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముంబై వెళ్లడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ముండే తన కారులో (మారుతి సుజుకి ఎస్ఎక్స్4) వెళ్తుండగా పృథ్వీరాజ్ రోడ్డు-తుగ్లక్ రోడ్డు సర్కిల్ వద్ద 6:20 గంటలకు మరో కారు (టాటా ఇండికా) పక్క వైపు నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. -
ముండేకు కన్నీటి వీడ్కోలు
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు తండ్రి చితికి నిప్పంటించిన పెద్ద కుమార్తె పంకజ పోటెత్తిన అభిమానులు; అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి పర్లీ: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు వేలాది మంది ప్రజలు, కుటుంబ సభ్యులు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. ‘‘గోపీనాథ్ ముండే అమర్ రహే, ముండే సాబ్ పరత్ యా..(తిరిగి రండి)’’ నినాదాల మధ్య మహారాష్ట్రలోని ఆయన స్వస్థలం పర్లీలో మధ్యాహ్నం 2 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. హిందూ సంప్రదాయానికి భిన్నంగా ఆయన పెద్ద కుమార్తె, పర్లీ ఎమ్మెల్యే పంకజ...తండ్రి చితికి నిప్పంటించారు. అంతకుముందు తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు, మద్దతుదారులు ముండే అంత్యక్రియలకు వేదికైన బైద్యనాథ్ చక్కెర ఫ్యాక్టరీ కాంపౌండ్ వద్దకు పోటెత్తారు. ఎండ తీవ్రంగా ఉండటం, ముండే పార్థివదేహాన్ని దగ్గరి నుంచి చూసేందుకు వీలుకాకపోవడంతో వారిలో కొందరు అసహనానికి లోనై అక్కడ భారీగా మోహరించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సమయంలో ముండే పార్థివదేహం పక్కన నిలబడిన ఆయన కుమార్తె పంకజ వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మద్దతుదారులంతా సంయమనం పాటించాలని అక్కడున్న మైకులో పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో కాసేపు శాంతించిన పలువురు మద్దతుదారులు అంత్యక్రియల అనంతరం మళ్లీ చెలరేగిపోయారు. ముండే మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ కారుకు నిప్పుపెట్టడంతోపాటు సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఇతర మంత్రుల కార్లను అడ్డగించారు. చవాన్ కారును చుట్టుముట్టి బానెట్‌ను బాదారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. కాగా, ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపిం చాలన్న బీజేపీ కార్యకర్తల డిమాండ్‌కు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మద్దతు పలికారు. ముండే సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే బతికి ఉండేవారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. కారు వెనక సీట్లో కూర్చుంటే సీటు బెల్టు పెట్టుకోనక్కర్లేదన్న అపోహ వల్లే తన స్నేహితుడైన ముండే ప్రాణాలు కోల్పోయారన్నారు. గడ్కారీకి అదనపు బాధ్యతలు: ముండే మరణంతో ఆయన చేపట్టిన మంత్రిత్వశాఖలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి అదనపు బాధ్యతలుగా అప్పగించారు. ముండే చేపట్టిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం మంత్రిత్వ శాఖలను గడ్కారీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. -
ముండే అమర్ రహే..!
సాక్షి, ముంబై: ‘మహా’నేత గోపీనాథ్ ముండే మరణంతో శోకసంద్రమైన రాష్ట్రం బుధవారం జరిగిన ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీడ్ జిల్లా, పర్లీ గ్రామానికి తరలివచ్చింది. ‘ముండే అమర్ రహే’ అంటూ ఆయన మద్దతుదారులు చేసిన నినాదాలతో పర్లీ గ్రామం మార్మోగింది. రాష్ట్రంలోని విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్ తదితర అన్ని ప్రాంతాలనుంచి వేలాదిగా ముండే అభిమానులు తరలిరావడంతో పర్లీ గ్రామం జనసంద్రమైంది. కేవలం పర్లి గ్రామంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, తాలూకాల్లోని బీజేపీ కార్యాలయాల్లో పార్టీ కార్యకర్తలు ముండే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ మౌనం పాటించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు... వేలాదిమంది అభిమానుల సమక్షంలో గోపీనాథ్ ముండే అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పర్లీ గ్రామంలో అధికార లాంఛనాలతో జరిగాయి. ఆయన పెద్దకూతురు పంకజ, ముండే చితికి నిప్పంటించారు. ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు, ప్రమోద్ మహాజన్ కుటుంబ సభ్యులు ముండే కుటుంబ సభ్యులతోపాటే ఉన్నారు. పూర్ణా బంగ్లాలో ప్రముఖుల నివాళులు... వర్లీలోని సీ-ఫేస్ ప్రాంతంలోగల పూర్లా బంగ్లాకు మంగళవారం రాత్రంతా ప్రముఖులు తరలి వచ్చారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి 7.30 గంటల ప్రాంతంలో ముంబైకి చేరుకున్న ముండే మృతదేహాన్ని నారిమన్ పాయింట్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో నగరవాసులతోపాటు సమీప ప్రాంతాల ప్రజలు కూడా పెద్దఎత్తున తరలివచ్చి ముండే భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. అర్ధరాత్రి వరకు ప్రముఖుల రాక కొనసాగింది. ఆ తర్వాత బుధవారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో ముండే భౌతికకాయాన్ని లాతూర్కు తరలించారు. పర్లీ బయలుదేరిన ముండే భౌతికకాయం... సుమారు 7.30 గంటలకు లాతూర్ విమానాశ్రయానికి ముండే భౌతికకాయం చేరుకుంది. అక్కడి నుంచి హెలికాప్టర్లో బీడ్ జిల్లా పర్లీ గ్రామానికి తరలించారు. అప్పటికే వేలాది మంది గ్రామస్తులు, సన్నిహితులు, అభిమానులు తమ ప్రియతమ నాయకుని కడసారి చూసేందుకు బారులు తీరారు. దుఃఖంతో మంగళవారం రోజంతా భోజనం లేకుండా, రాత్రంతా జాగారం చేసిన గ్రామస్తులు ఉదయం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. హెలికాప్టర్ రాగానే ఒక్కసారిగా పర్లి గ్రామం ‘ముండే అమర్ రహే’ అంటూ నినాదాలతో మార్మోగింది. శవ పేటిక గ్రామానికి చేరుకోగానే వారి రోదనలు మిన్నంటాయి. తమ నాయకున్ని కడసారి తనివితీరా చూసుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. భారీగా జనం రావడంతో అక్కడ తోపులాట జరిగింది. వారిని అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. పక్కకు తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గ్రామంలో ర్యాలీగా బయలుదేరిన అంతిమయాత్ర ఎంతసేపటికీ ముందుకు కదలలేదు. ముండే భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు అంబులెన్స్ ముందు జనం అడ్డుపడడంతో చివరకు దివంగత ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ జోక్యం చేసుకొని పక్కకు తప్పుకోవాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. సంయమనం పాటించాలని పోలీసులకు కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. దీంతో అంతిమ యాత్ర మెల్లమెల్లగా ముందుకు కదిలింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ముండే అంత్యక్రియలు పర్లీ గ్రామంలోని వైద్యనాథ్ సహకార చక్కెర కర్మాగార మైదానంలో జరిగాయి. అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు తెలియగానే మంగళవారం ఉదయం నుంచి అక్కడ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. ప్రముఖుల కోసం, సామాన్య జనం కోసం వేర్వేరుగా స్థలం కేటాయించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. చితిని పేర్చేందుకు ప్రత్యేకంగా గద్దె నిర్మించారు. మధ్యాహ్నం రెండు గంటలకు బ్రాహ్మణుల వేదమంత్రాల మధ్య ముండే బౌతికకాయానికి కూతురు పంకక నిప్పంటించారు. అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు... బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావ్దేకర్, రావ్‌సాహెబ్ దనవే, కిరీట్ సోమయ్య, రాజీవ్ ప్రతాప్ రుడి, ఉదయన్ రాజే బోంస్లే, దేవేంద్ర ఫడ్నవీస్, వినోద్ తావ్డే, ఉద్ధవ్‌ఠాక్రే, రాజ్‌ఠాక్రే, జితేంద్ర అవ్హాడ్, రాందాస్ ఆఠవలే, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరికార్, రాష్ట్రానికి చెందిన 127 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రుల ఘెరావ్.. అంత్యక్రియలకు హాజరైన హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్, మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వాహనాలను ప్రజలు అడ్డుకున్నారు. వారి వాహనాలు ముందుకు కదలకుండా చుట్టుముట్టారు. పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ పక్కకు తప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో అంత్యక్రియలకు వచ్చిన జనం ఉరుకులు పరుగులు తీశారు. బారికేడ్లు చెల్లాచెదురయ్యాయి. ఆగ్రహానికి గురైన జనం అక్కడున్న ఓ నాయకుని వాహనాన్ని బోల్తాపడేసి నిప్పంటించారు. దీంతో కొద్ది సేపు ఆ ప్రాంతమంత రణరణంగా మారింది. ముండే ప్రమాదం కేసు దర్యాప్తును సీబీఐ ద్వారా జరిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హర్షవర్ధన్ పాటిల్, మరికొందరు మంత్రులు కలుగజేసుకుని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలు, ఆయన అభిమానులు శాంతించారు. ప్రమాదంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలంటే అందుకు సీబీఐ ద్వారా ఈ కేసు దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఉద్ధవ్ ఠాక్రే కూడా అభిప్రాయపడ్డారు. నివాళులర్పించిన డబ్బావాలు.. నగరంతోపాటు శివారు ప్రాంతాల నుంచి ఉద్యోగుల కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లను చేరవేస్తున్న డబ్బావాలాలు బుధవారం ఉదయం 11.30 గంటలకు లోయర్‌పరేల్ స్టేషన్లో రెండు నిమిషాలు మౌనం పాటించి ముండేకు శ్రద్ధాంజలి ఘటించారు. -
ముండేకు ఆదిలాబాద్ వాసుల నివాళి
గుడిహత్నూర్ (ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : మహా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాల మరణం మండల వాసులను దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయనకు వేర్వేరు చోట్ల శ్రద్ధాంజలి ఘటించారు. మండలంలో ఆయన బంధువులు చాలా మంది ఉండడంతో వారంతా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు. గతంలో ఇదే సాన్నిహిత్యంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడిహత్నూర్‌ను ఆయన సందర్శించారు. దీంతో ఇక్కడి నాయకులకు సుపరిచితుడిగా ఉండిపోయారు. మంగళవారం ఆయన అకాల మృతి చెందడంతో మండలవాసులు తీవ్ర దిగ్భాంత్రికి లోనయ్యారు. స్థానిక బంధువులు, నాయకులు జాతీయ రహదారి 44లోని చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహారాష్ట్ర ప్రజల ప్రియనేత తమ సన్నిహితుడు గోపీనాథ్ ముండే లేని లోటును ఎవరూ తీర్చలేరని జెడ్పీటీసీ కేశవ్ గిత్తే, గణేశ్ ముండే అన్నారు. లియాఖత్ అలీఖాన్, రాజారాం, బీజేపీ జిల్లా నాయకుడు డా.లక్ష్మణ్ కేంద్రే, టీఆర్ఎస్ నాయకులు వామన్ గిత్తే, వైజునాథ్ కేంద్రే, గిత్తే మదన్ సేట్, ఎంపీటీసీ సత్యరాజ్, సర్పంచ్ ప్రతాప్, ఇద్రిస్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు బేర దేవన్న. రవూఫ్‌ఖాన్‌లతో పాటు డా.నారాయణ్ ఫడ్ తదితరులు పాల్గొన్నారు. మహానేతను కోల్పోయాం గోపీనాథ్ ముండే మృతికి నివాళిగా గుడిహత్నూర్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో స్థానిక శివాలయం నుంచి, బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంజీవ్ ముండే, రావణ్ ముండే, మాధవ్ కేంద్రే, నీలకంఠ్ అప్పా, గణేష్ ముండే, త్రియంబక్ ముండే, రవింద్రనాథ్ ముండే, రాహుల్ ముండే, దీపక్ ముండే, వెంకటీ ముండే, జ్ఞానేశ్వర్, దిలీప్ ముండే పాల్గొన్నారు. గోపీనాథ్ స్వగ్రామానికి పయనం కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే అంత్యక్రియల్లో పాల్గొనడానికి మండలంలోని ఆయన బంధువులు ఆయన స్వగ్రామమైన మహారాష్ట్రలోని భీడ్ జిల్లా పరళీ తాలుకాలోని నాత్రా గ్రామానికి బయల్దేరారు. కడసారి చూపుకైనా నోచుకోవాలని మండల వంజరి కులస్తులు, నాయకులు మంగళవారం రాత్రి నాత్రాకు వెళ్లారు. -
సీటు బెల్టు ధరిస్తే ముండేకి ప్రాణాపాయం తప్పేది
సాక్షి, న్యూఢిల్లీ: సీటు బెల్టు ధరిస్తే గోపీనాథ్ ముండేకి ప్రాణాపాయం తప్పేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. వాహన ప్రయాణం చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ మంత్రిత్వశాఖ త్వరలో ప్రచార ఉద్యమం చేపట్టనుందన్నారు. ముండే అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం బుధవారం మహారాష్ట్రలోని బీడ్‌కు బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. సీటు బెల్టు ధరించి ఉన్నట్టయితే ముండే ప్రాణాలు దక్కేవని, సీటు బెల్టు అలంకారప్రాయమేనన్న అపోహ కారణంగా తాను మంచి స్నేహితుడిని కోల్పోయానన్నా రు. వెనుక సీట్లలో ఉండేవారు బెల్టులు కేవలం అలంకారప్రాయమేనని చాలామంది అనుకుంటారని, అయితే నిజానికి ముందు సీట్లలో ఉన్న సీటు బెల్టు ధరించడం ఎంత ముఖ్యమో వెనుక సీట్లలో ప్రయాణించేవారు కూడా ధరించడం అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. ఇందుకోసం స్వయంసేవా సంస్థల సహకారంతో ప్రచారం చేసే అంశాన్ని పరిశీ లిస్తున్నట్లు ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో చిన్నారుల మరణాలు, తల్లిదండ్రుల మరణం వల్ల అనాథలుగా మారే చిన్నారుల గురించి ప్రధానంగా ప్రచారం చేస్తామన్నారు. పిల్లలు సరైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోరని, అయితే వాహనాలను నిర్లక్ష్యంగా నడిపేవారిని ఆరాధించేలా చూడడానికి బదులు సరైన జీవన శైలిని గురించి వారికి తెలియజెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముండేవిషాద, అకాల మర ణం వాహన చోదకులకు మేల్కొలుపు కావాలని ఆయన చెప్పారు. సీటు బెల్టు ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడంవల్ల జరిగే ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల ఆప్తులు అనుభవించే బాధ ఎలాంటిదనే విషయం తనకు ముండే మరణంతో తెలిసొచ్చిం దని ఆయన చెప్పారు. సీటు బెల్టు ధరించినట్లయితే డయానా, సాహెబ్ సింగ్ వర్మ ప్రాణాలకు ముప్పు వాటిల్లేదికాదని ఆయన గుర్తుచేసుకున్నారు. -
గుండెపోటుతో కాదు గాయాల వల్లే ముండే మృతి
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతికి గల కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముండే తీవ్రంగా గాయపడటంతో పాటు గుండెపోటు రావడంతో చనిపోయారని ఎయిమ్స్ వైద్యులు తొలుత ప్రకటించారు. అయితే ముండేకు గుండెపోటు రాలేదని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. పోస్ట్‌మార్టం నివేదికను బుధవారం విడుదల చేశారు. ముండే శరీరంలోపలి భాగాలకు గాయాలయినట్టు తేలింది. కీలకమైన భాగాలు దెబ్బతిన్నట్టు వెల్లడైంది. ఢిల్లీలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే మరణించిన సంగతి తెలిసిందే. బుదవారం ముండే స్వరాష్ట్రం మహారాష్ట్రలో అంత్యక్రియలు నిర్వహించారు. -
'సీటు బెల్ట్ పెట్టుకుంటే బతికేవారు'
న్యూఢిల్లీ: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టుకునివుంటే గోపీనాథ్ ముండే బతికేవారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ అభిప్రాయపడ్డారు. సీటు బెల్ట్ ప్రాణాలను కాపాడుతుందా అనే నిర్లక్ష్య భావన వల్లే తన స్నేహితుడు ముండేను కోల్పోయానని చెప్పారు. కారు వెనుక సీటుకు ఉండే బెల్టులు అలంకారప్రాయయని చాలా మంది భావిస్తుండడం దురదృష్టకరమని అన్నారు. కారులో ప్రయాణించే వారందరూ సీటు బెల్ట్ పెట్టుకోవడం అవసరమని గట్టిగా చెప్పారు. సీటు బెల్ట్ పెట్టుకోవడం ద్వారా కొన్ని ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడొచ్చని పేర్కొన్నారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలో చైతన్య కార్యక్రమాలు చేపడతామని హర్షవర్థన్ తెలిపారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి, టీడీపీ నేత లాల్ జాన్ భాషా మృతి చెందిన సంగతి తెలిసిందే. -
ముండే తరువాత ఎవరు?
'మేం గోపీనాథ్ ముండేని మూడంటే మూడు నెలలు మాత్రం ఢిల్లీకి అప్పుగా ఇస్తున్నాం. ఆయన మళ్లీ మహారాష్ట్రకు రావలసిందే. మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కావలసిందే' అన్నారు మహారాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షులు దేవేంద్ర ఫడ్నిస్. ఈ ఒక్క మాట చాలు ముండే బిజెపి మహారాష్ట్ర వ్యూహంలో ఎంత ముఖ్యమైన వ్యక్తో చెప్పడానికి. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి మటుమాయమైపోతే మహారాష్ట్ర బిజెపి పరిస్థితి ఏమిటి? ముండే తరువాత ఎవరు - ఇప్పుడు మహారాష్ట్రలో బిజెపి ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. కొద్ది నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముండే చేసి వెళ్లిన ఖాళీని పూరించడం బిజెపి ముందున్న అతిపెద్ద సవాలు. ముండే చాలా విలక్షణమైన రాజకీయ నేత. ఆయనకు చాలా కోపం. రెండు సార్లు బిజెపి వదిలేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటారు. మోడీ, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ ల లాగా ఆయన బిజెపికి బిసి ఫేస్ ఇచ్చిన నేత. మామూలుగానైతే మహారాష్ట్ర రాజకీయాలను చెరుకు తోటల్ని, చక్కెర ఫాక్టరీలను గుప్పెట్లో పెట్టుకున్న మరాఠాలే శాసిస్తారు. శరద్ పవార్, వసంత్ దాదా పాటిల్, యశ్వతరావ్ చవాన్, శంకర్ రావ్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, నారాయణ్ రాణే, విలాస్ రావ్ దేశ్ ముఖ్ ల వంటి వారందరూ మరాఠాలే. అలాంటిది బిజెపిలోకి బిసిలను తెచ్చి, లెక్కలన్నీ మార్చింది గోపీనాథ్ ముండే. ఆయన వంజారా తెగకు చెందిన వారు. ఆయన వెంట వంజారాలతో పాటు ఇతర బిసిలు నిలిచారు. రాష్టంలోని ప్రతి జిల్లాలో ఆయనకు బలం ఉంది. ఆయన ప్రభావం ఎంత ఉందంటే మామూలుగా ఎవరి మాటా వినని మోడీలాంటి సీతయ్యే ముండే చెప్పినందుకు రావూ సాహెబ్ దన్వే అనే బీసీ నేతకు కేంద్ర మంతి పదవి ఇచ్చేశారు. అసలు ఆయన బిసి, ఆయన బావ ప్రమోద్ మహాజన్ బ్రాహ్మణుడు. ఈ కృష్ణార్జునుల కాంబినేషన్ మహారాష్ట్ర బిజెపిని ఒక దశలో ఏలింది. మహాజన్ మరణం తరువాత ముండేకి కష్టాలు వచ్చాయి. ఆయన రెండు సార్లు బిజెపిని వదిలేస్తానని బెదిరించారు. ఉమాభారతి, కళ్యాణసింగ్ లు కూడా ఒకానొక దశలో పార్టీని వదిలి బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు బిజెపి ముందున్న ప్రశ్న ముండే తరువాత ఎవరు? అంత ప్రజాదరణ ఉన్న నాయకులెవరు? బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ప్రస్తుతం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నిస్ లు ఇద్దరూ బ్రాహ్మణులు, పైగా చిన్న ప్రాంతమైన విదర్భకు చెందిన వారు. మహారాష్ట్ర రాజకీయాలు మరాఠ్వాడా చుట్టూ తిరుగుతాయి. ఈ నేపథ్యంలో ముండే తరువాత ఆయన కుమార్తె పంకజ మరాఠ్వాడా నేతగా, మహారాష్ట్ర విధాతగా ఎదుగుతుందా? ఆమె ఇప్పటికే ఎమ్మెల్యే. ఈ సారి బీడ్ నియోజకవర్గంలో తండ్రి ఎన్నికల ప్రచారాన్ని ఆమే నడిపించింది. ముండే అంతిమయాత్రలో దర్శనం దక్కక చెలరేగిన అభిమానులు పంకజ చేతులు జోడించగానే చల్లబడిపోయారు. వంజారా, బీసీలతో సహా బిజెపి కింది స్థాయి కార్యకర్తలపై ఆమె పట్టు ఎంతుందో ఈ సంఘటన తెలియచేస్తుంది. అయితే కుటుంబవాదాన్ని ప్రోత్సహించని మోడీ పంకజకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? పంకజ నాయకత్వాన్ని గడ్కరీ, ఫడ్నిస్ లు ఒప్పుకుంటారా? ఎన్నికల వేళ ఒక వైపు బాల్ ఠాక్రే కుటుంబానికి చెందిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. బాల్ ఠాక్రే ఏ నాడూ ఎన్నికల్లో పోటీచేయలేదు. ఆయన చంద్రసేనీయ కాయస్థ ప్రభు సామాజిక వర్గానికి చెందిన వారు. అది మహారాష్ట్రలో చాలా తక్కువ సంఖ్యాబలం ఉన్న కులం. అందుకే ఆయన కింగ్ మేకర్ గా ఉన్నారే తప్ప కింగ్ కాలేదు. ఇప్పుడు ఉద్ధవ్, రాజ్ లు కింగ్ లు కావాలనుకుంటున్న సమయంలో ముండే వంటి అనుభవజ్ఞుడైన ముండే ఉండి ఉంటే బిజెపి పని సానుకూలమయ్యేది. అందుకే 'ముండే తరువాత ఎవరు' అన్నదే బిజెపి ముందున్న ప్రశ్న! -
ముండే అభిమానులపై పోలీసుల లాఠీచార్జీ
-
ముండే అభిమానుల ఆగ్రహం, రాళ్లదాడి
పర్లీ : కేంద్రమంత్రి ముండే గోపీనాథ్ ముండే అంతిమయాత్రలో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దాంతో తిరగబడ్డ ముండే అభిమానులు పోలీసులపై రాళ్లు విసిరారు. తమ అభిమాన నేత భౌతికకాయాన్ని కడసారి సందర్శించేందుకు వేలాదిగా జనం తరలి రావడంతో ఈ ఘటన జరిగింది. గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
గోపీనాథ్ ముండేకి లోక్ సభ సంతాపం
న్యూఢిల్లీ : 16వ లోక్‌సభ కొలువుదీరింది. ఉదయం 11గంటలకు ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ కొత్త సభ్యుల జాబితా స్పీకర్‌కు సమర్పించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకు లోక్‌సభ నివాళులర్పించింది. ముండే మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ ముండే అందించిన సేవలను స్పీకర్ సభ్యులకు గుర్తుచేశారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు ప్రోటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. -
ముండే మృతిపై సర్వత్రా దిగ్భ్రాంతి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాల మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర శాసన సభకు ఐదు సార్లు ఎన్నికైన ముండే, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టారని గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికై, ఇటీవలే నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖను చేపట్టారని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్, మాజీ ప్రధాని హెచ్డీ. దేవెగౌడ, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు ముండే మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బీజేఎల్పీ సమావేశం వాయిదా ముండే అకాల మరణంతో మంగళవారం జరగాల్సిన బీజేఎల్పీ సమావేశం ఈ నెల 23కు వాయిదా పడింది. బీజేపీ కార్యాలయంలో ముండే శ్రద్ధాంజలి సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, జగదీశ్ శెట్టర్లు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ముండే గుణ గణాలను కొనియాడారు. బీజేపీ గొప్ప నాయకుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా శాసన సభ నుంచి శాసన మండలికి ఈ నెల 19న జరుగనున్న ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థిగా కేఎస్. ఈశ్వరప్ప మంగళవారం నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ముండే మృతితో నామినేషన్ సమర్పణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. -
పార్లమెంటు షెడ్యూలులో మార్పులు
* నేడు గోపీనాథ్ ముండేకు నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా * 5, 6న కొత్త సభ్యుల ప్రమాణం సాక్షి, న్యూఢిల్లీ: 16వ లోక్‌సభ తొలి సమావేశాల షెడ్యూలులో మార్పులు చోటు చేసుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతి చెందిన నేపథ్యంలో ఈ మార్పులు జరిగాయి. ఆ మేర కు బుధవారం లోక్‌సభ సమావేశాలు ఆరంభం కావడానికి ముందుగా సీనియర్ కాంగ్రెస్ ఎంపీ కమల్‌నాథ్‌తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తారు. అనంతరం సభ సమావేశమవగానే 16వ లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్ చదివి వినిపిస్తారు. ఆ తరువాత ముండేకు సంతాపం తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. సభ్యులు నివాళి అర్పిస్తారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం(5న) చేపడతారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కొత్త సభ్యులు 4, 5 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూలు ప్రకారం.. కొత్త సభ్యులు 5, 6 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. సభ్యుల ప్రమాణ స్వీకారం ఆరో తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. తిరిగి 9వ తేదీన ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. 10, 11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ఉంటుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసి ఆమోదం పొందిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. ఈ విషయాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ కాంగ్రెస్ ఎంపీ కమల్‌నాథ్ వ్యవహరిస్తారని, ఆయన ఆధ్వర్యంలోనే కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని తెలిపారు. -
ఐదుగురు అగ్ర నేతలను వెంటాడిన ప్రమాదాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో అసలైన ప్రజా నాయకులుగా కీర్తిప్రతిష్టలు అందుకున్న ఐదుగురు అగ్ర నేతలను రోడ్డు ప్రమాదాలు కబళించాయి. ప్రజలకు మరింత కాలం సేవ చేయాలనున్న వారిని వెంటాడి మృత్యు ముఖంలోకి లాక్కెళ్లాయి. గోపీనాథ్ ముండే: మహారాష్ట్రలో బీసీ నాయకుడిగా, ప్రజా నేతగా రాజకీయాల్లో రాణిస్తూ వచ్చిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ముంబై వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా దారిలో ఓ కారు పక్క నుంచి ఢీకొట్టడంతో తీవ్ర షాక్‌కు గురైన ముండే గుండెపోటు, అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృతిచెందారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని 2004, 2009లో ఒంటి చేత్తో గెలిపించిన జన నేత, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సాహిబ్‌సింగ్ వర్మ: ఢిల్లీ సీఎంగా (1996-1998), కేంద్ర మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత సాహిబ్‌సింగ్ వర్మ 2007 జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రాజేశ్ పైలట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజేశ్ పైలట్ రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో 2000 సంవత్సరం జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మాధవరావు సింధియా: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా వరుసగా గెలిచిన మాధవరావు సింధియా 2001లో యూపీలో జరిగిన ప్రైవేటు విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. -
మండేకు నేతల ఘన నివాళి
* ప్రజానాయకుడిని కోల్పోయాం: రాష్ట్రపతి * నిజమైన మాస్ లీడర్: ప్రధాని * బీజేపీ ఆఫీసుకెళ్లి నివాళులర్పించిన రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండేకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా వివిధ పార్టీల నేతలు ఘన నివాళి అర్పించారు. ఆయన్ను గొప్ప ప్రజా నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కొనియాడారు. నిరంతరం సామాన్యుల కోసం పనిచేసిన నాయకుడిని పోగొట్టుకోవడం బాధాకరమని రాష్ట్రపతి ప్రణబ్ తన సంతాప సందేశంలో పేర్కొనగా ముండే మరణం అందరికీ తీరని లోటని ఉప రాష్ట్రపతి అన్సారీ పేర్కొన్నారు. ముండే మరణం తనను షాక్‌కు గురిచేసిందని, ఆయన మరణంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నానని ప్రధాని మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన్ను నిజమైన మాస్ లీడర్‌గా అభివర్ణించారు. ముండే మరణం దేశానికి తీరని లోటని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ముండే ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానంటూ సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కంటతడిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ముండే కుటుంబానికి సంతాపం తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు ముండే మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచిన ముండే పార్థివదేహాన్ని అన్సారీ, మోడీ, రాహుల్ గాంధీ, ఎల్.కె. అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, అనంత్ కుమార్, హర్షవర్ధన్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, వీహెచ్‌పీ చీఫ్ అశోక్ సింఘాల్ తదితరులు కూడా ముండే పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని బీజేపీ ఆఫీసు నుంచి పూలతో అలంకరించిన సైనిక వాహనంలో ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి ముంబై తరలించారు. వై.ఎస్. జగన్ సంతాపం... గోపీనాథ్ ముండే ఆకస్మిక మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ముండే మృతికి సంతాపం తెలియజేశారు. ముండే కు నివాళులర్పించిన కిషన్‌రెడ్డి,నాగం సాక్షి, హైదరాబాద్: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాలమృతి పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లారు. ముండే భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్‌లు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, అరుణజ్యోతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముండే చిత్రపటం ముందు నివాళులర్పించారు. ముండే కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆలస్యంగా వస్తానంటూ.. బుధవారం ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు కాస్త ఆలస్యంగా వస్తానంటూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకు చెప్పిన గోపీనాథ్ ముండే అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం అందరినీ కలచి వేసింది. సొంత నియోజకవర్గానికి వెళ్తున్నందున లోక్‌సభ సభ్యుడిగా తన ప్రమాణస్వీకారానికి ఆలస్యంగా వచ్చేందుకు అనుమతించాలంటూ ముం డే సోమవారం రాత్రే తనను కోరారని...అందుకు తాను అంగీకరించానని, ఈలోగా ఈ ఘోరం జరిగిపోయిందని చెబుతూ వెంకయ్య నాయుడు ఉద్వేగానికి గురయ్యారు. -
గోపీనాథ్ ముండేకు నివాళి
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాల మరణం మండల వాసులను దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయనకు వేర్వేరు చోట్ల శ్రద్ధాంజలి ఘటించారు. మండలంలో ఆయన బంధువులు చాలా మంది ఉండడంతో వారంతా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు. గతంలో ఇదే సాన్నిహిత్యంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడిహత్నూర్‌ను ఆయన సందర్శించారు. దీంతో ఇక్కడి నాయకులకు సుపరిచితుడిగా ఉండిపోయారు. మంగళవారం ఆయన అకాల మృతి చెందడంతో మండలవాసులు తీవ్ర దిగ్భాంత్రికి లోనయ్యారు. స్థానిక బంధువులు, నాయకులు జాతీయ రహదారి 44లోని చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహారాష్ట్ర ప్రజల ప్రియనేత తమ సన్నిహితుడు గోపీనాథ్ ముండే లేని లోటును ఎవరూ తీర్చలేరని జెడ్పీటీసీ కేశవ్ గిత్తే, గణేశ్ ముండే అన్నారు. లియాఖత్ అలీఖాన్, రాజారాం, బీజేపీ జిల్లా నాయకుడు డా.లక్ష్మణ్ కేంద్రే, టీఆర్ఎస్ నాయకులు వామన్ గిత్తే, వైజునాథ్ కేంద్రే, గిత్తే మదన్ సేట్, ఎంపీటీసీ సత్యరాజ్, సర్పంచ్ ప్రతాప్, ఇద్రిస్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు బేర దేవన్న. రవూఫ్‌ఖాన్‌లతో పాటు డా.నారాయణ్ ఫడ్ తదితరులు పాల్గొన్నారు. గోపీనాథ్ స్వగ్రామానికి పయనం కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే అంత్యక్రియల్లో పాల్గొనడానికి మండలంలోని ఆయన బంధువులు ఆయన స్వగ్రామమైన మహారాష్ట్రలోని భీడ్ జిల్లా పరళీ తాలుకాలోని నాత్రా గ్రామానికి బయల్దేరారు. కడసారి చూపుకైనా నోచుకోవాలని మండల వంజరి కులస్తులు, నాయకులు మంగళవారం రాత్రి నాత్రాకు వెళ్లారు. మహానేతను కోల్పోయాం గోపీనాథ్ ముండే మృతికి నివాళిగా గుడిహత్నూర్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో స్థానిక శివాలయం నుంచి, బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంజీవ్ ముండే, రావణ్ ముండే, మాధవ్ కేంద్రే, నీలకంఠ్ అప్పా, గణేష్ ముండే, త్రియంబక్ ముండే, రవింద్రనాథ్ ముండే, రాహుల్ ముండే, దీపక్ ముండే, వెంకటీ ముండే, జ్ఞానేశ్వర్, దిలీప్ ముండే పాల్గొన్నారు. -
గోపీనాథ్ ముండే దుర్మరణం...
ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రి కన్నుమూత ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఘటన ఆయన కారును ఢీకొట్టిన మరో కారు షాక్‌కు గురవడంతో తీవ్ర గుండెపోటు అంతర్గత అవయవాలకూ గాయాలు హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించినా దక్కని ప్రాణం నేడు అధికార లాంఛనాలతో మహారాష్ట్రలోని పర్లీలో అంత్యక్రియలు న్యూఢిల్లీ: వారం కిందటే తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు గోపీనాథ్ ముండే (64) మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. గ్రామీణాభివృద్ధిశాఖ సహా మూడు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న ముండే మరణంతో కొత్త కేబినెట్ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన స్వరాష్ట్రంతోపాటు దేశమంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ముంబై వెళ్లడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ముండే తన కారులో (మారుతి సుజుకి ఎస్ఎక్స్4) వెళ్తుండగా పృథ్వీరాజ్ రోడ్డు-తుగ్లక్ రోడ్డు సర్కిల్ వద్ద 6:20 గంటలకు మరో కారు (టాటా ఇండికా) పక్క వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ముండే కూర్చున్న వైపు (వెనక సీటు) నుంచి కారు ఢీకొనడంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలవడంతోపాటు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోనే ఉన్న ఆయన పీఏ ఎస్. నాయర్, కారు డ్రైవర్లు హుటాహుటిన ముండేను సమీపంలోని ఎయిమ్స్ అత్యవసర చికిత్సా విభాగానికి 6.30 గంటల సమయంలో తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆయనలో చలనం లేదు. శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఆగిపోయాయి. బీపీ, పల్స్‌రేటు కూడా కనిపించలేదు. అయినా వైద్యులు ఆయన్ను బ్రతికించేందుకు విశ్వప్రయత్నం చేశారు. గుండె తిరిగికొట్టుకునేలా 15 నిమిషాలపాటు ప్రయత్నించినా లాభంలేకపోయింది. దీంతో ఆయన మృతిచెందినట్లు ఉదయం 7.20 గంటలకు ఎయిమ్స్ అత్యవసర చికిత్సా విభాగం చీఫ్ డాక్టర్ అమిత్ గుప్తా ప్రకటించారు. డ్రైవర్ అరెస్ట్...బెయిల్‌పై విడుదల ముండే కారును ఢీకొట్టే క్రమంలో ఇండికా కారు అరబిందో చౌక్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌ను ఉల్లంఘించిందని పోలీసులు తెలిపారు. ఆ కారు డ్రైవర్ గుర్విందర్సింగ్ను అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి రూ. 30 వేల చొప్పున రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసిందన్నారు. ప్రమాద ఘటనపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో ఇంటలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దర్యాప్తు చేపట్టనున్నాయన్నారు. ఈ ప్రమాదంలో ముండే ముక్కుకు స్వల్ప గాయమైందని, ఆ సమయంలో ఆయన మంచినీరు కావాలని అడిగారని...తనను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పినట్లు వివరించారు. చిట్లిన కాలేయం...: పోస్టుమార్టం నివేదికలో వెల్లడి ప్రమాదం తీవ్రతకు ముండే కాలయం చిట్లిపోయి అంతర్గత రక్తస్రావమైనట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. అదే సమయంలో షాక్‌కు గురికావడం వల్ల తీవ్రమైన గుండెపోటు రావడం కూడా ఆయన మృతికి కారణమైందని పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ వైద్య బృందం పేర్కొంది. కాగా, మెడ వెనకాల ఆయన వెన్నెముక రెండు చోట్ల విరిగిందని...అందువల్ల మెదడు, ఊపిరితిత్తులకు రక్తసరఫరా నిలిచిపోవడం కూడా ఆయన మరణానికి దారితీసిందని స్వయంగా ఈఎన్టీ సర్జన్ అయిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆ తర్వాత విలేకరులకు తెలిపారు. ముండే కాలేయంలో రెండు, మూడు చోట్ల పగుళ్లు కనిపించాయని, గాయం కారణంగా ఉదరంలో 1.5 లీటర్ల రక్తం చేరిందన్నారు. కేంద్ర కేబినెట్ సంతాపం ముండే హఠాన్మరణం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమై ముండే ఆకస్మిక మరణంపట్ల సంతాప తీర్మానం చేసింది. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడింది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మాస్ నాయకుడిగా పేరుతెచ్చుకున్న ముండే మరణంతో దేశం ఓ దార్శనికుడిని కోల్పోయిందని పేర్కొంది. యావత్ దేశం తరఫున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. మంగళవారం జాతీయ సంతాప దినంగా పాటించింది. నేడు అంత్యక్రియలు గోపీనాథ్ ముండే అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న పార్లీలో బుధవారం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. కాగా, అంతకుముందు ముండే మృతికి గౌరవసూచికంగా దేశ రాజధాని ఢిల్లీ సహా, అన్ని రాష్ట్రాల రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను మంగళవారం అవనతం చేశారు. -
ఐదుగురు అగ్ర నేతలను వెంటాడిన ప్రమాదాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో అసలైన ప్రజా నాయకులుగా కీర్తిప్రతిష్టలు అందుకున్న ఐదుగురు అగ్ర నేతలను రోడ్డు ప్రమాదాలు కబళించాయి. ప్రజలకు మరింత కాలం సేవ చేయాలనున్న వారిని వెంటాడి మృత్యు ముఖంలోకి లాక్కెళ్లాయి. గోపీనాథ్ ముండే: మహారాష్ట్రలో బీసీ నాయకుడిగా, ప్రజా నేతగా రాజకీయాల్లో రాణిస్తూ వచ్చిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ముంబై వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా దారిలో ఓ కారు పక్క నుంచి ఢీకొట్టడంతో తీవ్ర షాక్‌కు గురైన ముండే గుండెపోటు, అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృతిచెందారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని 2004, 2009లో ఒంటి చేత్తో గెలిపించిన జన నేత, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సాహిబ్‌సింగ్ వర్మ: ఢిల్లీ సీఎంగా (1996-1998), కేంద్ర మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత సాహిబ్‌సింగ్ వర్మ 2007 జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రాజేశ్ పైలట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజేశ్ పైలట్ రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో 2000 సంవత్సరం జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మాధవరావు సింధియా: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా వరుసగా గెలిచిన మాధవరావు సింధియా 2001లో యూపీలో జరిగిన ప్రైవేటు విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. -
ముండే-మహాజన్‌లకు ‘3’తో ముప్పు?
న్యూఢిల్లీ: గోపీనాథ్ ముండే, మహాజన్ కుటుంబాలకు 3వ అంకె చేటు తెచ్చిందా? ఎందుకంటే...కాకతాళీయమే అయినా ఆ రెండు కుటుంబాల్లో చోటుచేసుకున్న ముగ్గురి మరణాల్లో (ప్రమోద్ మహాజన్, ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్, గోపీనాథ్ ముండే) ఈ అంకె కనిపించడం ఈ భావనకు తావిస్తోంది. ప్రమోద్ మహాజన్: బీజేపీ సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రమోద్ మహాజన్ తన సోదరుడు ప్రవీణ్ మహాజన్ జరిపిన కాల్పుల్లో 2006 మే 3న మృతిచెందారు. .32 లెసైన్డ్ తుపాకీతో ప్రమోద్‌పై ప్రవీణ్ నాలుగుసార్లు కాల్పులు జరపగా అందులో మూడు తూటాలు ప్రమోద్ శరీరంలోకి దూసుకెళ్లాయి. 13 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రమోద్ చివరకు తుదిశ్వాస విడిచారు. ప్రమోద్ పీఏ: ప్రమోద్ మహాజన్ మృతి చెందిన నెలకు ఆయన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన వివేక్ మోయిత్రా ఢిల్లీలోని అధికార బంగ్లాలో 2006 జూన్ 3న అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ప్రవీణ్ మహాజన్: సోదరుడిని కాల్చి చంపిన కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ప్రవీణ్ మహాజన్ 2010 మార్చి 3న బ్రెయిన్ హేమరేజ్‌కు చికిత్స పొందుతూ థానే ఆస్పత్రిలో కన్నుమూశారు. గోపీనాథ్ ముండే: ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం (2014 జూన్ 3న) మృతిచెందారు. -
రహదార్ల రక్తచరిత్ర!
మహారాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఢిల్లీలో దుర్మరణం చెందిన తీరు మన రహదారుల రక్త చరిత్రను మరోసారి గుర్తుచేసింది. పౌరుల యోగక్షే మాలు అసలే పట్టని ప్రభుత్వాల సాక్షిగా రహదారులు నిత్యమూ నెత్తురోడుతూనే ఉన్నాయి. ఈమధ్యే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిం చిన వివరాల ప్రకారం ప్రపంచంలోనే మన దేశం రోడ్డు ప్రమాదాల్లో అగ్రస్థానంలో ఉన్నది. 2012లో ఈ రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 461మంది మరణించగా, 1,301మంది గాయపడ్డారు. అంటే ఆ ఏడాదిలో దాదాపు లక్షా 66వేలమంది దుర్మరణంపాలయ్యారు. నాలు గున్నర లక్షలమంది గాయపడ్డారు. సగటున ప్రతి గంటకూ 19 మర ణాలు సంభవిస్తున్నాయి. అంటే ప్రతి మూడు నిమిషాలకూ ఒకరు చనిపోతున్నారన్నమాట! ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ‘పుట్టిన వారు గిట్టక తప్పద’న్న వేదాంత ధోరణిలో మందకొడిగా ఉండిపోతు న్నాయి. తమ వంతుగా ఏమి చేయవచ్చునో, ఏమి చేయాల్సివున్నదో ఆలోచించక రోజులు వెళ్లదీస్తున్నాయి. గోపీనాథ్ ముండేను బలిగొన్న ప్రమాదాన్నే గమనిస్తే దేశ రాజధాని నగరంలో సైతం ఎంతటి అస్తవ్యస్థ పరిస్థితులున్నాయో అర్ధమవుతుంది. తెలతెలవారుతున్న తరుణంలో, ట్రాఫిక్ మరీ పద్మవ్యూహంలా మారని ఘడియల్లో కూడా సిగ్నల్‌ను సైతం పట్టించుకోకుండా వేగంగా వచ్చిన కారొకటి కాన్వాయ్‌లో వెళుతున్న కేంద్రమంత్రి కారును ఢీకొన్నదంటే ఆశ్చర్యం కలుగుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను సూచించడానికి రెండు నెలలక్రితం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ విషయంలో ప్రభుత్వాలపై ఎంత ఒత్తిడి తెచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాక సర్వోన్నత న్యాయస్థానం ఈ చర్య తీసుకుంది. మనకు మోటారు వాహనాల చట్టం ఒకటుంది. 1939 నాటి చట్టాన్ని సవరించి 1989లో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. అందులో డ్రైవింగ్ లెసైన్స్ మంజూరు చేయడం దగ్గరనుంచి పర్మిట్లు, ఇన్సూరెన్స్, నేరంగా పరిగణించే చర్యలు, విధించే పెనాల్టీలు వగైరా వివరాలన్నీ ఉంటాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానా రూ. 100కాగా, ప్రమాదంలో మనిషి ప్రాణం పోయిన సందర్భాల్లో కూడా దాన్ని బెయిల్‌కు వీలైన నేరంగానే పరిగణిస్తున్నారు. శిక్ష కూడా రెండేళ్లు మించడంలేదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాల్లో డ్రైవింగ్ లెసైన్స్‌ను రద్దుచేయడంతోసహా కఠిన చర్యలు తీసుకోవాలని ఎందరు మొత్తు కుంటున్నా ఫలితం లేదు. మన మోటారు వాహనాల చట్టం ద్విచక్ర వాహనం మొదలుకొని అన్ని రకాల వాహనాల గురించి మాట్లాడు తుంది. వేగ పరిమితుల గురించి చెబుతుంది. ఇవన్నీ ఎంతసేపూ వాహనచోదకుల చుట్టూ తిరుగుతాయి తప్ప మొత్తంగా రహదారుల భద్రత కోణాన్ని స్పృశించవు. పాదచారుల దగ్గరనుంచి మొదలుపెట్టి ఎవరెవరు ఎలాంటి నిబంధనలను పాటించాలో, పాటించకపోతే తీసు కోవాల్సిన చర్యలేమిటో తెలియజేసే సమగ్రమైన చట్టం ఉంటే... అందులోని నిబంధనల అమలు తీరును తెలుసుకునేందుకు అవసర మైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే ప్రమాదాలను చాలా వరకూ నివారించవచ్చు. ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా పాటించే సంస్కృతిని పెంపొందించవచ్చు. వాహనాల్లో వెళ్లేవారు సీటు బెల్టులు ధరించాలన్న నిబంధన ఉన్నా దాన్ని పట్టించుకునేవారు తక్కువ. ముందు సీట్లో కూర్చునేవారిలో కొందరైనా ఈ బెల్టులు పెట్టుకుంటా రుగానీ వెనక సీట్లో ఉండేవారు అసలు పట్టించుకోరు. గోపీనాథ్ ముండే కూడా వెనక వరసలో కూర్చున్నా సీటు బెల్టు ధరించలేదు. రహదారుల తీరుతెన్నులు ఎలా ఉండాలో...అలా లేనప్పుడు జవాబు దారీతనాన్ని నిర్దేశించడమెలాగో, బాధ్యులపై చర్యలెలా ఉండాలో చట్టం చెప్పాలి. మన దేశంలో 97 శాతం రహదారులకు అసలు ఫుట్‌పాత్‌లే ఉండవని గణాంకాలు అంటున్నాయి. రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తున్నా, భారీ వర్షాలకు రోడ్లు అధ్వాన్న స్థితికి చేరినా పట్టించుకు నేవారుండరు. రహదారుల బాగోగులను ఎప్పటికప్పుడు చూస్తూ వెనువెంటనే చక్కదిద్దే వ్యవస్థ లేదు. రోజులు, నెలలు గడిచాక ఏదో మొక్కుబడిగా చేయడం, సరిచేసిన కొన్నాళ్లకే అవి యథాస్థితికి చేరడం మనకు నిత్యానుభవం. రహదారుల భద్రత గురించిన సమగ్ర చట్టం లేకపోవడంవల్లనే మన దేశంలో నానాటికీ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రపంచం లోని మొత్తం వాహనాల్లో మన దేశంలో ఉన్నవి ఒక్క శాతమే. కానీ ప్రపంచ దేశాల్లో జరిగే ప్రమాదాల్లో మన వాటా 11 శాతం ఉంటు న్నది. ఉగాండా, వియత్నాంవంటి దేశాలు సైతం రహదారి భద్రతపై దృష్టిసారించి పటిష్టమైన చర్యలు తీసుకుంటుండగా మన పాలనా యంత్రాంగానికి ఏమొచ్చిందో తెలియదు. రహదారులు సక్రమంగా లేనికారణంగా వాహనాలు దెబ్బతిని ఏటా కొన్ని వేల కోట్ల రూపా యల నష్టం సంభవిస్తున్నదని మోటారు వాహనాల యాజమాన్యాలు మొత్తుకున్నా వారిది అరణ్యరోదనే అవుతున్నది. పెట్రోల్, డీజిల్ వగై రాలపై వసూలు చేసే సుంకాల్లో కనీసం కొంత మొత్తాన్నయినా రహ దారులను మెరుగుపరచడానికి ఖర్చుచేస్తే కాస్తయినా ప్రయోజనం ఉండేది. వాహనాల తయారీలో ఉండే లోపభూయిష్టత కూడా ప్రమా దాలకు కారణమవుతున్నదని, డిజైన్ సక్రమంగా లేని కారణంగా కొన్నివాహనాలు నిర్దిష్ట వేగం మించిన తర్వాత ప్రమాదాల బారినప డుతున్నాయని నిపుణులు చెబుతున్నా పట్టించుకున్న దాఖ లాలు లేవు. కనీసం ఇప్పటికైనా కేంద్రం మేల్కొని ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలి. అది సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలి. -
గోపీనాథ్ ముండే మృతిపై పలువురి దిగ్భ్రాంతి
సాక్షి, ముంబై: బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై ప్రభుత్వం, పార్టీలు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. ముండే స్వగ్రామానికి చెందిన కొందరు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నారు. గవర్నర్, సీఎం సహా పలువురు నాయకులు ముండే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముండే లోకనాయకుడు-గవర్నర్ కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే లోకనాయకుడు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించేవారు. కేంద్రమంత్రిగా చేరిన వారం రోజులకే దుర్మరణం పాలుకావడం రాష్ట్రవాసులందరినీ దుఖంలో ముంచివేసింది. పేదలు, అణగారిన వర్గాల కోసం ఎంతో శ్రమించి ఉన్నతస్థాయికి ఎదిగారు. చేపట్టిన ప్రతి పదవిలోనూ తనదైన ముద్ర వేశారు. పేదల పక్షపాతి: సీఎం పృథ్వీరాజ్ చవాన్ పేదల కోసం పోరాడుతూ అనతికాలంలోనే ప్రజలకు దగ్గరైన నాయకుల్లో ముండే ఒకరు. ఎలాంటి విపత్తులు వచ్చినా రాజకీయాలను పక్కన బెట్టి బాధితులకు సాయం చేసేవారు. ఇలాంటి నాయకుడు మనమధ్య లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర ప్రజల తరఫున ముండేకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. నాకు సన్నిహితుడు: ఎన్సీపీ అధిపతి పవార్ రాజకీయాలు పక్కనే బెడితే మా ఇద్దరి మధ్య చాలా కాలంగా అనుబంధం ఉంది. ఎక్కడ కనిపించినా ఒకరినొకరం అప్యాయంగా పలుకరించుకునేవాళ్లం. పేదలను ప్రేమించి సహృదయుడు కారు ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. ఈ దుఖాన్ని తట్టుకునే శక్తి ఆయన కుటుంబానికి ఇవ్వాలని భగవంతుడ్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పోరాట యోధుడు: మాణిక్‌రావ్ ఠాక్రే పేదలు, వెనకబడిన తరగతుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు ఇక లేరు. చాలా కాలం తరువాత ఆయనకు మంత్రిగా సేవ చేసేందుకు అవకాశం లభించింది. ఇలాంటి సమయంలో ఆకస్మికంగా ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరం. ఎన్నో ఆశలుపెట్టుకుని ప్రజలు ఆయనను గెలిపించారు. సేవ చేసేందుకు దేవుడు అవకాశమివ్వలేదు. ప్రజలకు ఆప్తుడు : శివసేన ముండే మృతి మహారాష్ట్ర వాసులకు తీరనిలోటు. కార్యకర్తలు, ప్రజలతో ఆయన ఎపుడూ మమేకమయ్యేవారు. ఏ సమయంలోనైనా ప్రశాంతగా, సంయమనంగా వ్యవహరించేవారు. మా పార్టీతో ఎప్పుడూ సత్సంబంధాలు కోరుకునేవారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి తీవ్రంగా శ్రమించారు. ముండే లేని లోటు పూడ్చలేనిది : రాజ్ ఠాక్రే కేంద్ర మంత్రిగా సేవలు అందించేందుకు ప్రజల్లోకి వస్తున్న తరుణంలో ముండే మృతి చెందడం దురదృష్టకరం. ఆయన లేరనే బాధ, లోటు కేవలం బీజేపీకే పరిమితం కాదు. యావత్ రాష్ట్రానికీ అన్యాయం జరిగింది. ముండే మృతిచెందారనే విషయం నమ్మశక్యంగా లేదు. సీబీఐ దర్యాప్తు జరిపించాలి: ఆఠవలే ఈ ఘటనపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేస్తే బాగుంటుంది. ఉదయం వాహనాల రద్దీ లేదు. సిగ్నల్ జంప్ చేశారా..? ఢీ కొట్టిన కారు ముండే కాన్వాయ్‌లోకి ఎలా వచ్చింది.. ఇందులో ఏదైనా కుట్ర దాగుందా? అనే విషయం తేలాలంటే సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన లేరనే వార్తను ఉదయం ఎవరో ఫోన్ చేసి చెప్పారు. కొద్దిసేపు నమ్మబుద్ధి కాలేదు. తరువాత నిజమని తేలడంతో జీర్ణించుకోలేకపోయాను. ఆయన మరణం బీజేపీకే కాదు.. యావత్ రాష్ట్ర ప్రజలకు తీరనిలోటు. -
శోకసంద్రం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేసిన బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే (64) ఆకస్మిక మరణం రాష్ట్రాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయాన్ని పురస్కరించుకొని ఆయన స్వస్థలం బీడ్‌జిల్లాలో మంగళవారం నిర్వహించాల్సిన విజయోత్సవం ర్యాలీ కోసం ఢిల్లీ నుంచి బయల్దేరగా, మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆయనను బలితీసుకుంది. 1949లో జన్మించిన ముండే కాలేజీ రోజుల నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాలొన్నారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఉత్థానపతనాలను చవిచూశారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియాతో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించిన ఈ సీనియర్ నాయకుడు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉప-ముఖ్యమంత్రి సహా ఎన్నో పదవులను అలంకరించారు. కేంద్రమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించినా, ఆయన మనసంతా రాష్ట్ర రాజకీయాలపైనే ఉండేది. ఈ ఏడాది చివరన జరగాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మహాకూటమికి సారథ్యం వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కావాలన్న తన కల సాకారమయయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆయన ఆకస్మికంగా మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా విషాదం నింపింది. అంచలంచెలుగా అత్యున్నతస్థాయికి సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గోపీనాథ్ ముండే అంచెలంచెలుగా ఎదుగుతూ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ ఎంపికయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆయన మరణించారు. ముండే బీడ్ జిల్లా పర్లీ గ్రామంలో జన్మించారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారన్న వార్తను బీడ్వాసులు జీర్ణించుకోలేకపోయారు. మంగళవారం ఉదయం ఆయన బీడ్‌కు రావాల్సి ఉంది. ముండే మరణవార్తను మొదట చాలా మంది నమ్మలేదు. నిజమేనని తెలుసుకుని ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మార్కెట్లు, దుకాణాలు, ఇతర సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ముండే కుటుంబం.. 1949 డిసెంబరు 12న బీడ్ జిల్లా నత్రా గ్రామంలో పాండురంగ్, లింబాబాయి ముండే దంపతులకు గోపీనాథ్ జన్మించారు. తరువాత పర్లీ గ్రామంలో స్థిరపడ్డారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన బీజీపీ సీనియర్ నాయకుడు, దివంగత ప్రమోద్ మహాజన్ సోదరి ప్రజ్ఞను 1978లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు పంకజ, ప్రతిమా, యశశ్రీ సంతానం. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా నత్రా గ్రామంలోనే జరిగింది. కళాశాలలో చదువుతుండగానే మిత్రులతో కలిసి స్థానిక రాజకీయాలు, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. మరఠ్వాడా యూనివర్సిటీ, పుణే యూనివర్సిటీలో బీకాం, బీజీఎల్ చదివారు. కూతుళ్లలో పంకజ ఎమ్మెల్యేగా, ప్రతిమ డాక్టర్‌గా కొనసాగుతున్నారు. యశశ్రీ లా చదువుతోంది. రాజకీయ అరంగేట్రం..: కాలేజీలో చదువుతుండగానే ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో ప్రవేశించారు. 1978లో మొదటిసారి శాసన సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1980లో భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1980లో రేణాపూర్ నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీకి వెళ్లారు. 1985లో కాంగ్రెస్‌కు చెందిన పండిత్రావ్ దౌండ్ చేతిలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. 1990లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషి ప్రతిపక్ష పదవి కోల్పోవడంతో ముండేకు అసెంబ్లీ విపక్ష నాయకుడి బాధ్యతలు అప్పగించారు. 1990-95 మధ్య కాలంలో అండర్‌వరల్డ్ డాన్లకు వ్యతిరేకంగా ఉద్యమం లేవనెత్తారు. 1995-99 మధ్య కాలంలో శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయ కూటమి ప్రభుత్వంలో ఉప-ముఖ్యమంత్రిగా ముండే పదవీ బాధ్యతలు చేపట్టారు. హోం, విద్యుత్‌శాఖలను ఎంతో సమర్థంగా నిర్వర్తించారు. ముండే హయాంలో అత్యధికంగా ఎన్కౌంటర్లు జరిగాయి. రాష్ట్రంలో నేరసామ్రాజ్యాన్ని కుప్పకూల్చారు. 2009లో బీడ్ జిల్లా నియోజకవర్గం మొదటిసారి లోక్‌సభ ఎన్నిక ల్లో పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభలో ప్రతిపక్షం ఉప-నాయకుడిగా పనిచేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ ధస్ను ఓడించి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలి ముండే ఆకస్మిక మృతి పలు అనుమానాలకు తావిస్తున్నందున, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అందులో కూర్చున్న వ్యక్తి ప్రాణాలు పోయేంతగా దెబ్బతినలేదు. వాహనం నిజంగా ప్రమాదానికి గురైందా...? లేక ఎవరైనా పథకం ప్రకారం కుట్ర పన్నారా...? అనేది తేల్చేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మృతి చెందడం సామాన్య విషయం కాదని మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధి అవ ధూత్ వాఘ్ అన్నారు. సీబీఐ ద్వారా కేసును దర్యాప్తు చేయించాలని ట్విటర్లో డిమాండ్ చేశారు. -
ముండేకు పలువురి నివాళి
సాక్షి, ముంబై: ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే భౌతికకాయానికి ముంబైలో మంగళవారం పలువురు నివాళులు అర్పించారు. ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సతీమణి రష్మీ ఠాక్రే, కుమారుడు ఆదిత్య, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్, ఎమ్మెన్నెస్ అధిపతి రాజ్ ఠాక్రే, శివసేన నాయకుడు సుభాష్ దేశాయి, ఆర్.ఆర్.పాటిల్, సచిన్ అహిర్, రాందాస్ ఆఠవలే, ఛగన్ భుజబల్, హేమమాలిని, దగ్గరి బంధువులు పూనం మహాజన్, రాహుల్ మహాజన్, వర్షా గైక్వాడ్, ప్రకాశ్ జావ్డేకర్, రితేశ్ దేశ్‌ముఖ్, కర్ణాటక బీజేపీ నాయకుడు యడ్యూరప్ప, రాజ్ పురోహిత్, మనోహర్ జోషి, వినోద్ తావ్డే, కిరీట్ సోమయ్య, మాణిక్‌రావ్ ఠాక్రే తదితర రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు,కొందరు తెలుగు ప్రజలు ముంబైలోని ఆయన నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. తెలుగువారితో ఉన్న అనుబంధం.. గత అనేక సంవత్సరాలుగా ముండేకు తెలుగు ప్రజలతో సత్సంబంధాలున్నాయి. అత్యవసర సమయంలో ఆయన దగ్గరికి వెళితే చేతనైన సాయం చేసేవారు. కొన్ని నెలల కిందట హైదరాబాద్ నుంచి రైలులో ముంబై వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ హత్య కేసులో సాయం చేయాలని తెలుగు సంఘాలు స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశాయి. వెంటనే స్పందించిన ముండే ముంబై పోలీసు కమిషనర్‌తో మాట్లాడారు. హంతకులను వెంటనే పట్టుకోవాలని కోరారు. ఇదే కేసులో మాదిరెడ్డి కొండారెడ్డి కూడా ఆయనను ప్రత్యేకంగా కలుసుకుని వినతి పత్రం అందజేశారు. పూర్తిగా కొనసాగని నాయకులు.. మరఠ్వాడా రీజియన్ నుంచి అనేక మంది దిగ్గజాలు రాజకీయాల్లో రాణిస్తున్నప్పటికీ పూర్తికాలం కొనసాగలేకపోయారు. ఈ ప్రాంతానికి చెందిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ప్రమోద్ మహాజన్, గోపినాథ్ ముండే ఆకస్మికంగా మృతి చెందారు. ప్రమోద్ మహాజన్ చెల్లెలినే ముండే పెళ్లి చేసుకున్నారు. పూర్ణ బంగ్లాలో ఇప్పుడూ అదే వాతావరణం.. దాదాపు పదేళ్ల కిందట బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ చనిపోయినప్పుడు పూర్ణ బంగ్లా పరిసరాలు ప్రముఖులతో, రాజకీయ నాయకులు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పుడే ముండే చనిపోవడంతో మంగళవారం సాయంత్రం మళ్లీ అదే వాతావరణ కనిపించింది. మహాజన్, ముండే కుటుంబాలు పూర్ణ బంగ్లాలోనే ఉంటున్నాయి. మొన్నటి వరకు మహాజన్ కుటుంబం బాగోగులు ముండే చూసుకునేవారు. ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్ద దిక్కులు మరణించారు. -
ముండే కేసు డ్రైవర్‌కు బెయిల్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే వాహనాన్ని ఢీకొట్టిన ఇండికా కారు డ్రైవర్ గుర్వీందర్సింగ్కు స్థానిక న్యాయస్థానం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఘటనాస్థలి వద్ద 32 ఏళ్ల గుర్వీందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు గుర్వీందర్కు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయమై సంయుక్త పోలీస్ కమిషనర్ ఎం.కె.మీనా వెల్లడించారు. కోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగ్నల్ ఉండగానే గుర్వీందర్ తన కారును ముందుకు పోనిచ్చాడా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. నిందితుడు దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంత నివాసి అని చెప్పారు. ఇదిలాఉంచితే ప్రమాదం విషయమై నిందితుడు గుర్వీందర్సింగ్ స్నేహితుడు అశోక్ గుజ్జార్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రమాదం జరిగిన సమయంలో తాను జన్‌పథ్ ప్రాంతంలో ఉన్నా. సమాచారం అందగానే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వె ళ్లా. కారు నడపడం అతనికి బాగానే వచ్చు. అంతేకాకుండా అతనికి సిగ్నల్ ఉండగానే ముందుకుపోయే అలవాటు లేనేలేదు’ అని అన్నాడు. ఎటువంటి కార్లనైనా నడుపుతాడని, మెర్సిడెజ్, ఫోర్డ్ ఎండీవర్ వంటి కార్లను సైతం నడుపుతాడన్నారు. కేంద్రమంత్రి గోపీనాథ్ మృతికి కారకుడైన గుర్వీందర్పై పోలీసులు నిర్లక్ష్యం అభియోగం కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తొలుత ఇంటెలిజెన్స్వర్గాలు సైతం గుర్వీందర్‌సింగ్‌ను విచారించినట్టు తెలియవచ్చింది. ఆ తర్వాత పోలీసులు మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి పునీత్ ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఇది జామీను ఇవ్వదగిన నేరమేనని పేర్కొంటూ 14 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించేందుకు నిరాకరించారు. కాగా ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు (ఐబీ) విచారణ జరుపుతున్నాయని, అందువల్ల తమ కస్టడీకి అప్పగించాలని అంతకుముందు న్యాయమూర్తిని కోరారు. కుట్ర ఉందని తేలితే అప్పుడు పోలీసులు తమ కస్టడీకి నిందితుడి అప్పగింత కోసం అభ్యర్థించొచ్చన్నారు. కాగాగుర్వీందర్సింగ్ను నగరంలోని ఇంపీరియల్ హోటల్ కారు డ్రైవర్ అని తొలుత భావించారు. అయితే సింగ్ తమ హోటల్ ఉద్యోగి కాదని, సిల్వర్ సర్వీస్ ఉద్యోగి అని, ప్రమాదం జరిగిన సమయంలో అతను విధుల్లో లేడని పేర్కొంటూ ఇంపీరియల్ హోటల్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. కేజ్రీవాల్ సంతాపం న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ దివంగత కేంద్రమంత్రికి హృదయపూర్వక నివాళులర్పించారు. ‘ఈ వార్త వినాల్సి రావడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి హృదయపూర్వక నివాళులు’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు. -
ఆలస్యంగా వస్తానని ముండే అనుమతి అడిగారు..
న్యూఢిల్లీ: అంత సవ్యంగా జరిగితే బుధవారం పార్లమెంట్ లో గోపినాథ్ ముండే ప్రమాణ స్వీకారం జరిగాల్సి ఉండేది. కాని విధి వక్రీకరించి.. మరోలా జరిగింది. పార్లమెంట్ లో జరిగే లోకసభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆలస్యంగా వస్తానని అనుమతి తీసుకున్నారని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. నియోజకవర్గ జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున్న కాస్తా ఆలస్యం అవుతుందని తనతో అన్నారని వెంకయ్య మీడియాకు వెల్లడించారు. నా అనుమతి కోరారు. నేను ఓకే అన్నాను. కాని ఆయన ఇప్పడు మనతో లేరు.. అని వెంకయ్య ఉద్వేగానికి లోనయ్యారు. గతరాత్రి తనతో మాట్లాడిన ముండే.. మంగళవారం ఉదయమే ప్రమాదంలో కన్నుమూయడం వెంకయ్యను దిగ్భాంతికి గురి చేసింది. -
గోపీనాథ్ ముండేకు ప్రముఖుల నివాళీ
-
ముండే భార్యకు సంతాపం తెలిపిన సోనియా
న్యూఢిల్లీ:ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం రోడ్డు ప్రమాదంలో మరణించిన గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే భార్య ప్రదణ్యకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆమె.. ముండే కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. ఆయన ప్రమాదంలో మరణించడం కుటుంబానికి తీర్చలేని మనోవేదనను మిగిల్చిందన్నారు. ఆయన ఆకస్మిక మరణం వెనుకబడిన వర్గాలకు కూడా తీరని లోటేనని సోనియా పేర్కొన్నారు. ప్రజా జీవితంతో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించిన ముండే మరణం చాలా దురదృష్టకరమని తెలిపారు. దేశ ప్రజలకు ముండే జీవితం ఒక ఆదర్శప్రాయంగా నిలిచిపోతుందని సోనియా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతకుముందు బీజేపీ కార్యాలయంలో ముండే భౌతికకాయాన్నిరాహుల్ గాంధీ సందర్శించి నివాళులు అర్పించారు. -
ముండేకు వైఎస్ఆర్ సీపీ ఎంపీల నివాళి
-
బీజేపీ ఆఫీసులో ముండేకు ప్రముఖుల నివాళి
-
'మంచినీళ్లివ్వు.. ఆస్పత్రికి తీసుకెళ్లు'
'కాసిన్ని మంచినీళ్లివ్వు.. నన్ను త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లు'... ఇవీ కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మాట్లాడిన చిట్టచివరి మాటలు. ప్రమాదం తర్వాత ఆయన ముక్కు కొద్దిగా అదిరిందని, అంతేతప్ప శరీరం మీద పెద్దగా గాయాలు కూడా ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి దగ్గరలోనే ఉన్న పోలీసులు ఈ విషయం చెప్పారు. ప్రమాదం తర్వాత కేంద్ర మంత్రి బాగా షాకయ్యారని, అందువల్లే బహుశా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చి ఉంటుందని ముండే కార్యదర్శి ఎస్. నాయర్ తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగాల్సిన భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబై వెళ్లడానికి బయల్దేరిన ఆయన.. ఇంకా విమానాశ్రయానికి కూడా వెళ్లకుండానే ప్రాణాలు కోల్పోయారు. కాగా, గోపీనాథ్ ముండే అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాలతో ఆయన స్వగ్రామంలో జరుగుతాయి. ముంబైలోని వర్లి ప్రాంతంలో గల ముండే స్వగృహంలో సాయంత్రం వరకు ఉంచుతారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ముంబై నుంచి లాతూరు వరకు విమానంలో తీసుకెళ్లి, అక్కడినుంచి బీద్ జిల్లాకు రోడ్డుమార్గంలో తీసుకెళ్తారు. ముండే స్వగ్రామమైన పర్లి-వైద్యనాథ్ గ్రామంలో కొన్ని గంటలపాటు ఉంచి, అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వర్తిస్తారు. -
పోలవరం నిర్మాణానికి ఆటంకాలున్నాయి: జైరాం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే మృతి దేశానికి తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ... ముండే మృతి చెందారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ముండే మంచి నాయకుడని ఆయన అభివర్ణించారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తామిచ్చిన హామీను పార్లమెంట్ గతంలో ఆమోదించిందని జైరాం ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ హామీలన్నింటిని ఎన్డీయే ప్రభుత్వం అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలున్నాయని... అయితే వాటిని అధిగమించి ముందుకెళ్లాలని ఆయన ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ వల్ల 50 వేల కుటుంబాలు నిరాశ్రయులవుతారని ఆయన గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు. -
ముండేను ఢీకొన్న కారుడ్రైవర్ అరెస్టు
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే మృతి కేసులో.. ఆయన కారును ఢీకొన్న టాటా ఇండికా కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున ముండే మారుతి ఎస్ఎక్స్ 4 కారులో ప్రయాణిస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నారు. అయితే, పృథ్వీరాజ్ రోడ్డు - తుగ్లక్ రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న ఎర్ర సిగ్నల్‌ను దాటిన ఇండికా కారు వచ్చి, ముండే ప్రయాణిస్తున్న మారుతి కారును ఢీకొంది. దాంతో కారు వెనకసీట్లో ఉన్న ముండే.. కిందకు పడిపోయారు. అదేసమయంలో ఆయనకు తీవ్రంగా గుండెపోటు వచ్చింది. ఎయిమ్స్‌కు తీసుకొచ్చేసరికే ముండేకు ఊపిరి అందట్లేదని, నాడి ఆడట్లేదని, గుండె కొట్టుకోవట్లేదని వైద్యులు తెలిపారు. కార్డియో పల్మనరీ రీససికేషన్ ప్రక్రియ చేసినా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. దీంతో.. ఇండికా కారు డ్రైవర్ గుర్జీందర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇంపీరియల్ హోటల్లో పనిచేస్తుంటాడు. అతడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ముఖ్యమంత్రి కావాల్సిన ముండే..!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసిన రెండు పేర్లలో గోపీనాథ్ ముండే ఒకటి. ఆయన చాలా చురుకైన నాయకుడు కావడం, బీసీ వర్గాల్లో గట్టి పట్టుండటం, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మహారాష్ట్ర వ్యవహారాలపై తిరుగులేని సాధికారత సాధించడంతో ముండే పేరును బీజేపీ సీఎం అభ్యర్థిత్వానికి ముందుకు తెచ్చింది. శివసేన, బీజేపీల మధ్య ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లుగా ఆ రాష్ట్రంలో శివసేన ఆధిక్యం ఉండటంతో ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చారు. కానీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా, శివసేన 18 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో శివసేన కలవరపడింది. ఇంతకాలం కింగ్మేకర్లుగా మాత్రమే ఉంటూ.. పదవులకు దూరంగా ఉన్న ఠాక్రే కుటుంబం.. తొలిసారి తాము సైతం బరిలోకి దిగుతామని ప్రత్యక్షంగా చెప్పింది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన ముందుకు తెచ్చింది. అయితే.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ గట్టిగా వాదిస్తోంది. అందుకే గోపీనాథ్ ముండే పేరును ముందుకు తెచ్చింది. అయితే ఇంతలోనే విధి వక్రించడంతో గోపీనాథ్ ముండే అకాలమరణం పాలయ్యారు. దీంతో మహారాష్ట్ర లాంటి బలమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. -
ప్రజల కోసం ముండే పరితపించే వాడు: ప్రణబ్
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మంగళవారం మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. వారం రోజుల క్రితం ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముండే ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలోతుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గోపీనాథ్ ముండే మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తో పాటు తదితర ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై ప్రణబ్ మాట్లాడుతూ.. మనం ఒక గొప్ప సీనియర్ నాయకుడ్ని కోల్పోయాం. సామాన్య ప్రజానికానికి సేవ చేయాలనే తపన ముండేలో ఎక్కువగా ఉండేది. అతన్ని కోల్పోవటం చాలా బాధాకరం' అంటూ రాష్ట్రపతి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 'మహరాష్ట్రలోని ప్రముఖ నేతల్లో ముండే ఒకరు. అతని మృతి నిజంగా పూడ్చలేనిది. ముండే ఎప్పుడూ ప్రజా జీవితంలోనే ఎక్కువగా ఉండేవాడు' అని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నివాళులు అర్పించారు. -
సాయంత్రం కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం మంగళవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానుంది. కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే మృతి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సాయంత్రం నాలుగు గంటలకు సౌత్‌బ్లాక్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా గోపీనాథ్ ముండే మృతికి మంత్రివర్గం సంతాపం తెలియచేయనుంది. కాగా ముండే మృతితో బుధవారం జరగాల్సిన ఎంపీల ప్రమాణ స్వీకారం వాయిదాపడే అవకాశం ఉంది. -
ముండే మృతికి వైఎస్ జగన్ సంతాపం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ప్రజాభిమానాన్ని చూరగొని జాతీయ స్థాయి నేతగా ఎదిగిన ముండే అకాలమరణం పాలు కావడం మహారాష్ట్రకే కాక యావద్దేశానికి తీరని లోటని ఆయన అభివర్ణించారు. గోపీనాథ్ ముండే కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ముండే, గడ్కరీల శత్రుబంధం
గోపీనాథ్ ముండేకి నితిన్ గడ్కరీ కి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ. కానీ చివరికి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డప్పుడు అందరికన్నా ముందు ఆయన వద్దకు చేరుకున్నది నితిన్ గడ్కరీయే. అంతే కాదు. ఆయన తరఫున ఆస్పత్రిలో పెద్ద దిక్కుగా నిలుచున్నది, కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియచేసి ఓదార్చింది, ఆ తరువాత ఆయన అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది నితిన్ గడ్కరీయే. దీన్నే శత్రు బంధం అంటారేమో మరి! గడ్కరీ, ముండేల వైరం ఈ నాటిది కాదు. గడ్కరీ పార్టీ సంస్థాగతంగా ఎదుగుతూ వస్తే, ముండే ప్రజాదరణలో ఎప్పుడూ పైచేయిగా ఉండేవారు. గడ్కరీ నాగపూర్ కి చెందినవారు కాగా ముండే బీడ్ జిల్లాకు చెందిన వారు. కనీసం రెండు సందర్భాల్లో గడ్కరీపై కోపంతో ముండే బిజెపికి రాజీనామా చేసేంత వరకూ వెళ్లారు. ఒక సారి రాజీనామా పత్రం కూడా ఇచ్చారు. ఈ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర టికెట్ల పంపిణీ విషయంలోనూ గడ్కరీకి, ముండేకి తీవ్ర విభేదాలు వచ్చాయి. ఒక సందర్భంలో తాను కాంగ్రెస్ లో చేరతానని ముండే బెదిరించారు కూడా. ముండే శరద్ పవార్ ను శత్రువుగా భావిస్తే, గడ్కరీ ఆయనను చేరదీసేందుకు ప్రయత్నించారు. రాజ్ ఠాక్రే ఎందుకూ పనికిరాని వాడని, ఆయన ఛాప్టర్ క్లోజ్ అని ముండే అంటే రాజ్ ను నరేంద్ర మోడీ దగ్గరకు తీసుకువెళ్లి, బిజెపిపై పోటీ చేయబోమని చెప్పించారు గడ్కరీ. అయితే విధానాల విషయంలోనే వివాదాలు, విభేదాలు తప్ప, సిద్ధాంతపరంగా ఇద్దరిదీ ఒకే దారి కావడం వల్లే తీవ్ర వైరం ఉన్నా ఇద్దరూ కలిసి పనిచేశారు. వారిద్దరి మధ్య శత్రుబంధం అలాగే కొనసాగింది. -
పర్లీ నుంచి హస్తిన వరకూ.....
-
పర్లీ నుంచి హస్తిన వరకూ.....
న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందిన గోపీనాథ్ ముండే మధ్య తరగతి కుటుంబం నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. బీజేపీలో కీలక నేతగానే కాకుండా, మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని పర్లీలో జన్మించిన ఆయన 1980లో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. గిరిజన నాయకుడైన గోపీనాథ్ ముండే.. ఇటీవలి ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల మెజారిటీతో బీద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. 1980-85, 1990-2009 మధ్య ఎమ్మెల్యేగా ముండే సేవలు అందించారు. 1995- 1999 మధ్య మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. లోక్‌సభలో బీజేపీ ఉపనేతగా ముండే వ్యవహరించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ముండే ఇటీవలే కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ సోదరిని ముండే వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ముంబైలో విజయోత్సవ ర్యాలీకి వెళుతూ ముండే మృత్యువాత పడటంతో బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. -
సన్నిహితుడిని కొల్పోయాను: మోడీ
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే మృతి దేశానికి, ప్రభుత్వానికి, పార్టీకి తీరని లోటని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గోపీనాథ్ ముండే నిజమైన ప్రజానాయకుడని ఆయన అభివర్ణించారు. వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా ఆయన సేవలు మరువరానివని ముండే సేవలను మోడీ కొనియాడారు. ముండే మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ముండే తనకు అత్యంత ఆప్తుడు, సహచరుడుని కొల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్లో చేరి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకే ఇలా జరగడం తీవ్ర విషాదమని పేర్కొన్నారు. ముండే కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుందని నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి గోపినాథ్ ముండే మృతి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపాన్ని తెలిపారు. న్యూఢిల్లీలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి గోపీనాథ్ ముండే (64)ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు మృతి చెందినట్లు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఈరోజు ఉదయం 6.30 గంటలకు గోపీనాథ్ ముండే ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో గోపీనాథ్ ముండే మరణించారు. -
'ముండే కారులోంచి కిందకు పడిపోయారు'
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే ప్రమాదం జరిగినప్పుడు కారు వెనుక సీట్లో కూర్చున్నారని బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే గడ్కరీ, మరో మంత్రి హర్షవర్థన్ హుటాహుటీన ఎయిమ్స్‌కు తరలి వెళ్లారు. ముండే మృతిపై గడ్కరీ మాట్లాడుతూ ఈరోజు ఉదయం 6.30గంటలకు ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో కారులోంచి ఆయన కిందకు పడిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయనతో పాటు సహాయకుడు, డ్రైవర్ ఉన్నట్లు తెలిపారు. ముండేను రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు గడ్కరీ చెప్పారు. ఉదయం ఎనిమిది గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ముండే మరణవార్తను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమాచారం ఇచ్చినట్లు గడ్కరీ తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ముండే భౌతికకాయాన్ని ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు పార్టీ కార్యాలయానికి తరలించనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో ముండే స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ముంబయిలోని బీజేపీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతూ ముండే రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డారు. -
కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే మృతి
-
కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి గోపినాథ్ ముండే (64) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈరోజు ఉదయం 6.30 గంటలకు గోపీనాథ్ ముండే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు ఆయనను తీసుకొచ్చేసరికి ఆయనకు ఊపిరి అందట్లేదని, రక్తపోటు ఏమాత్రం లేదని, నాడి కూడా కొట్టుకోవట్లేదని, గుండె ఆడట్లేదని, అందువల్ల తాము వెంటనే పావుగంట పాటు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససికేషన్) చేశామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. తాము ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఆయన శరీరం స్పందించలేదని అందువల్ల ఉదయం 7.20 నిమిషాలకు మరణించినట్లు ధ్రువీకరించామని చెప్పారు. ప్రమాదం జరిగిన పది నిమిషాలలోనే ముండేను ఆయన పీఏ ఆస్పత్రికి తీసుకొచ్చారని అన్నారు. దక్షిణ ఢిల్లీలోని అరబిందో మార్గ్ సమీపంలో ప్రమాదం జరిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గోపీనాథ్ ముండే భౌతికకాయాన్ని బీజేపీ కార్యాలయానికి తీసుకు వెళ్లనున్నట్లు బీజేపీ నేత నితీన్ గడ్కరీ తెలిపారు. ఆయన మృతి పట్ల బీజేపీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వారం రోజుల క్రిందట కేంద్రమంత్రిగా గోపీనాథ్ ముండే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ముండే స్వస్థలం మహారాష్ట్ర పరాలీ. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. బుధవారం ముండే భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. 1980లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ముండే అయిదుసార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1995-99 మధ్యకాలంలో ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గోపీనాథ్ ముండే రెండు లక్షల మెజార్టీతో గెలుపొందారు. కేంద్రమంత్రిగా ఆయన వారం రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
కేంద్రమంత్రి గోపినాథ్ ముండేకి తీవ్ర గాయాలు
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. గోపినాథ్ ప్రయాణిస్తున్న వాహనం కాన్వాయి అదుపు తప్పడంతో ఆ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ ప్రమాద ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో గోపినాథ్ ముండే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా 16వ లోక్‌సభకు గోపినాథ్ ముండే ఎన్నికయ్యారు. -
‘ఉపాధి హామీ’ని పునర్వ్యవస్థీకరిస్తాం!
గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే పలువురు మంత్రుల బాధ్యతల స్వీకారం న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లోని పలువురు మంత్రులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారి ప్రాధామ్యాలను వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ‘యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునర్వ్యవస్థీకరిస్తాం. గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా ఈ పథకాన్ని రూపొందిస్తాం. ఇటీవల ఆమోదించిన భూసేకరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబానికి పారి శుద్ధ్య వసతులు, తాగునీటి సదుపాయాన్ని కల్పించాలన్న వాగ్దానాన్ని నెరవేర్చేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తాం’ - గోపీనాథ్ ముండే, గ్రామీణాభివృద్ధి శాఖ ‘సాయుధ విభాగాల కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థను అందిపుచ్చుకునే ప్రక్రియను వేగవంతం చేస్తాం. అది వివాద రహితంగా ఉండేలా జాగ్రత్తపడతాం. సాయుధ బలగాలకు అవసరమైన ఆధునిక ఆయుధ సామగ్రిని త్వరితగతిన అందించడం మోడీ ప్రభుత్వ ప్రధాన ప్రాధమ్యం. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26% నుంచి పెంచే విషయంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రభుత్వ మార్పు ఆర్మీ చీఫ్‌గా లెఫ్ట్‌నెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకంపై ఎలాంటి ప్రభావం చూపదు’ - అరుణ్ జైట్లీ, ఆర్థిక, రక్షణ శాఖ ‘రైళ్లలో ప్రయాణికుల భద్రతపై ప్రధానంగా దృష్టి సారిస్తాం. రైల్వేల్లో భద్రత, రక్షణ, వేగం.. ఈ మూడు మా ప్రాధమ్యాలు. రైల్వేల అభివృద్ధిపై ప్రధాని నరేంద్రమోడీకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వాటికి అనుగుణంగా రోడ్‌మ్యాప్ రూపొందిస్తాం. బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టే విషయంపై ప్రధానితో చర్చిస్తా’ - సదానంద గౌడ, రైల్వే శాఖ ‘ఆహార ధాన్యాల ధరలకు కళ్లెం వేయటం తొలి ప్రాధాన్యం. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఆహార ధాన్యాల నిల్వకు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెడతాం’ - రామ్‌విలాస్ పాశ్వాన్, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ ‘జీడీపీలో 6% విద్యారంగానికి కేటాయించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటివరకు విద్యారంగానికి జీడీపీలో 3.8% మాత్రమే కేటాయిస్తున్నారు. ఉన్నతవిద్యపై రూపొందించిన చట్టాలను పునస్సమీక్షిస్తాం. ఎన్నికల హామీలైన జాతీయ ఈ లైబ్రరీ, హిమాలయన్ సాంకేతికతపై సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు.. మొదలైన వాటి అమలుకు కృషి చేస్తాను’ - స్మృతి ఇరానీ, మానవ వనరుల శాఖ ‘ఆరోగ్య రంగంలో విధాన రూపకల్పనకు, వాటి అమలుకు దేశీయ, విదేశీ నిపుణుల సలహాలు తీసుకుంటాం. పారదర్శకత, ఈ గవర్నెన్స్ మా లక్ష్యాలు’ - హర్షవర్ధన్, ఆరోగ్య శాఖ ‘సీబీఐ విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు, దానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు కృషి చేస్తాను. సీబీఐ సహా అన్ని రకాల సంస్థలు స్వతంత్రంగా పనిచేసి అందరికి న్యాయం చేకూర్చేలా ఉండాలని నా ఉద్దేశం’ - జితేంద్రసింగ్, సిబ్బంది, పీఎంఓ సహాయ మంత్రి ‘పత్రికా స్వేచ్ఛపై మా ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు స్వేచ్ఛ చాలా అవసరం. ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఆంక్షలు విధించటాన్ని నేను వ్యతిరేకించాను. మాది పాత్రికేయుల కుటుంబం. మీడియాపై ఆంక్షలకు వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితం కూడా గడిపాం’ - ప్రకాశ్ జవదేకర్, సమాచార ప్రసార శాఖ -
లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు సృష్టిస్తాం
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 35 సీట్లను మహాకూటమి కైవసం చేసుకుంటుందని బీజేపీ సీనియర్‌నాయకుడు గోపీనాథ్ ముండే పేర్కొన్నారు. దాదర్‌లోని బీజేపీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల అనంతరం నాయకులు, పదాధికారులతో సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో తమ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు అత్యధికంగా లోకసభ స్థానాలను మహాకూటమి గెలుచుకుంటుందని చెప్పారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమిలోని అన్ని మిత్రపక్షాలు సమన్వయంతో వ్యవహరించాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 13 సభలు మహాకూటమి తరఫున నిర్వహించామని, వీటిలో రాష్ట్రంలోని ఆరు విభాగాల్లో రెండేసి చొప్పున సభలు నిర్వహించామని, ఫలితంగానే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నామని ముండే జోస్యం చెప్పారు. వాజపేయి హాయంలో కాషాయ కూటమికి 32 సీట్లు రాగా ఈసారి ఆ రికార్డు బ్రేక్ చేస్తూ 35 సీట్లు కేవసం చేసుకుంటామన్న ధీమాను తమ కార్యకర్తలు వ్యక్తం చేశారని చెప్పారు. ఎన్సీపీ మద్దతు తీసుకోం... అధికారాన్ని దక్కించుకునే స్పష్టమైన మెజార్జీ ఎన్డీయేకు వస్తుందని, మరే ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిన అవసరం రాదన్నారు. ఎన్డీయే అధికారం కోసం ఎన్సీపీ మద్దతు తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో ముండే ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధం... అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, పార్టీ గెలుపుకోసం నేటినుంచే అహర్నిషలు కష్టపడాలని పదాధికారులకు, కార్యకర్తలకు ఆదేశాలిచ్చామన్నారు. జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈసమావేశాలకు రాష్ట్రస్థాయి పదాధికారులు, నాయకులు హాజరవుతారని చెప్పారు. మహాకూటమిగా అసెంబ్లీకి... లోకసభ ఎన్నికల అనంతరం అసెంబ్లీకి ఎన్నికల్లో కూడా మహాకూటమిగానే పోటీ చేయనున్నట్టు గోపీనాథ్ ముండే స్పష్టం చేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనను మహాకూటమిలో చేర్చుకుంటారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. శివసేన, బీజేపీలతో ఉండే తమ కూటమిలో ఆ తర్వాత ఆర్పీఐ, స్వాభిమాన్ సంఘటనలు చేరిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో కూడా తాము మహాకూటమిగానే పోటీ చేస్తామని, ఈ కూటమిలో మరో పార్టీ చేరే ప్రసక్తేలేదన్నారు. సీట్ల పంపకాలపై తొందర్లోనే చర్చలు... రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమైన తాము సీట్ల పంపకాల విషయమై త్వరలో చర్చలు జరపనున్నట్టు ముండే తెలిపారు. గత ఎన్నికలలో పోటీ చేసిన స్థానాల్లోనే ఆయా పార్టీలు పోటీ చేస్తాయని, పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. అయితే తమతో జతకట్టిన పార్టీల్లో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేతోపాటు ఇతర మిత్రపక్షాల నాయకులతోపాటు త్వరలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. దళితులపై అత్యాచారాల కేసులు సీబీఐకి అప్పగించాలి... రాష్ట్రంలో దళితులపై అత్యాచారాల కేసులు బాగా పెరిగాయని ముండే ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే జాల్నా, బీడ్, ఔరంగాబాద్‌లలో కేవలం 15 రోజుల వ్యవధిలో దళితులపై జరిగిన మూడు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేశాయన్నారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన దబోల్కర్ హత్య కేసు విషయంలో పోలీసులు ఇంత వరకు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారని మండిపడ్డారు. ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించడమంటే రాష్ట్ర హోంశాఖ పూర్తిగా విఫలమైనట్లేనని విమర్శించారు. దళితులపై పెరిగిన అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చెప్పడాన్ని ముండే తప్పుబట్టారు. భవిష్యత్తులో ఏం చేస్తారో చెబుతున్నారేతప్ప ఇప్పుడేం చేస్తారో చెప్పడంలేదన్నారు. దళితులపై కేసులన్నింటిని సీబీఐకి అప్పగించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. అవసరమైతే ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గడ్చిరోలి ఘటనలో మరణించిన పోలీ సులకు శ్రద్ధాంజలి ఘటించే తీరిక కూడా హోంమంత్రికి లేకపోవడం శోచనీయమన్నారు. టోల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తాం.... రాష్ట్రంలో టోల్ ధరలను మళ్లీ పెంచాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోందని, దీనిని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ముండే పేర్కొన్నారు. మళ్లీ టెండర్లను పిలిచి, టోల్ వివాదానికి తెరలేపినా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తామన్నారు. డబ్బుల కోసమే... అనేక రోజులుగా పెండింగ్‌లో ఉన్న అనేక మంది బిల్డర్లకు చెందిన 182 ఫైళ్లు ఒక్కసారిగా లోక్‌సభ ఎన్నికల ముందు క్లియర్ చేయడంపై కూడా ముండే అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్డర్ల నుంచి డబ్బులు అందడం వల్లే సదరు ఫైళ్లు ముందుకు కదిలాయన్నారు. ఆ డబ్బులన్నీ ఢిల్లీకి చేరాయని ముండే ఆరోపించారు. పేర్ల గల్లంతుకు కారణం అధికార పక్షాలే... ప్రభుత్వమే తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అనేక మంది పేర్లను తొలగించిందని ముండే ఆరోపించారు. ఏకంగా 11 జిల్లాల్లో ఓటర్ల జాబితాలో అనేక మంది పేర్లను తొలగించారని ముండే ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేసి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎన్డీఏకు ఎన్సీపీ మద్దతు అవసరం లేదు
ముంబై: కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధిస్తుందని, ఎన్సీపీ మద్దతు అవసరం లేదని ఆ పార్టీ నేత గోపీనాథ్ ముండే అన్నారు. ఎన్డీఏలోకి ఎన్సీపీ చేరే ప్రశ్నే లేదని, తమకు ఆ పార్టీ అవసరం లేదని చెప్పారు. ఎన్డీఏకు ఎన్సీపీ మద్దతిచ్చే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముండే స్పందించారు. పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయిన అనంతరం ముండే విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి కనీసం 35 స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చేపడుతానని ముండే చెప్పారు. -
రెండో దశ ప్రచార హోరు
షిండే, ఆశోక్ చవాన్, గోపీనాథ్ ముండే, సుప్రియా సూలే సాక్షి, ముంబై: పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రలతోపాటు మరాఠ్వాడలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎండవేడిమిని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు బహిరంగసభలు, రోడ్ షోలు, పాదయాత్రలు, వీధి సభలు, ఇంటింటి ప్రచారాలతో రాజకీయ నేతలు బిజీగా ఉంటున్నారు. ఈ నెల 17వ తేదీన జరగనున్న రెండో దశ ఎన్నికల్లో భాగంగా 19 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగే పోలింగ్‌లో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. బరిలో 352 మంది... రెండో దశలో 352 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే, శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలే తమ అదృష్టాన్ని మరోమారు పరీక్షించుకుంటున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమి, శివసేన-బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాని షేత్కారీ పార్టీల మహాకూటమి మధ్యే ప్రధాన పోటీ జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పలు నియోజకవర్గాల్లో ఆప్, ఎస్పీ, బీఎస్పీ, ఎమ్మెన్నెస్‌లతోపాటు ఇతర పార్టీలు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ మహారాష్ట్రలో .... పశ్చిమ మహారాష్ట్రలో మొత్తం 10 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో మరాఠా సమాజానికి చెందిన వారి ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. పశ్చిమ మహారాష్ట్రలో సుశీల్‌కుమార్ షిండే, అనీల్ శిరోలే, సుప్రియా సూలే, విజయసింగ్ మోహితే పాటిల్, రాజు శెట్టి, రాహుల్ నార్వేకర్, విశ్వజీత్ కదం మొదలగు ప్రముఖ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పశ్చిమ మహారాష్ట్రలో ఎన్సీపీకి మంచి పట్టున్నా, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. అదే మిత్రపక్షమైన కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేసి మూడింటిని గెలిచింది. దీంతో ఈసారి ఎన్సీపీ ఆరు, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక మహాకూటమి గురించి చెప్పాలంటే పశ్చిమ మహారాష్ట్రలో పెద్దగా ప్రభావం లేదు. అయితే స్వాభిమాని షేత్కారీ పార్టీతో జతకట్టడంతో లాభం చేకూరనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2009 ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ మహారాష్ట్ర నుంచి ఖాతా కూడా తెరవలేకపోయింది. మిత్రపక్షమైన శివసేన ఐదు స్థానాల్లో పోటీ చేసి మూడింటిలో విజయం సాధించింది. ఒక స్థానాన్ని స్వాభిమాని పార్టీ నాయకుడు రాజు శెట్టి విజయం సాధించగా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అయితే ఈసారి ఓటరు నాడి ఎటువైపు ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. మరాఠ్వాడాలో... మరాఠ్వాడాలో మొత్తం ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. జాల్నా, ఔరంగాబాద్ మినహా మిగతా ఆరు లోక్‌సభ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ కూడా ప్రధాన పోటీ మహాకూటమి, ప్రజాస్వామ్య కూటమిల మధ్యనే జరగనుంది. ఇక్కడి నుంచి గోపీనాథ్ ముండే, అశోక్ చవాన్, పత్మసింగ్ పాటిల్ మొదలగు ప్రముఖ నాయకులు బరిలో ఉన్నారు. 2009 ఎన్నికలను పరిశీలిస్తే మరాఠ్వాడాలోని ఎనిమిది స్థానాల్లో ఐదు కాషాయకూటమి, మూడు ప్రజాస్వామ్య కూటమి దక్కించుకుంది. ఈసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ నేత గోపీనాథ్ ముండే మరాఠ్వాడాపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు మాజీ సీఎం ఆశోక్ చవాన్ మరాఠ్వాడాలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉత్తర మహారాష్ట్ర, కోంకణ్‌లో... ఉత్తర మహారాష్ట్రలో మొత్తం పది లోక్‌సభ స్థానాలున్నాయి. అయితే రెండో దశలో కేవలం రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 12 లోక్‌సభ స్థానాలున్న కోంకణ్‌లో రత్నగిరి-సింధుదుర్గా లోక్‌సభ సీటుకు మాత్రమే ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. కోంకణ్లోని రత్నగిరిలో కాంగ్రెస్ నేత నారాయణ రాణే కుమారుడు నీలేష్ రాణే బరిలో ఉన్నారు. మిత్రపక్షమైన ఎన్సీపీ స్థానిక నాయకులు, రాణే వర్గీయుల్లో విభేదాలున్నాయి. ఈసారి నీలేష్రాణేకు గట్టి పోటీ ఎదురుకానుందని తెలుస్తోంది. నీలేష్ రాణే కోసం తాము ప్రచారం చేయమని ఎన్సీపీ స్థానిక నాయకులు స్పష్టం చేశారు. రెండో దశ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
వారసులదే రాజ్యం!
కీలక పదవులు చేపట్టింది నేతలు, వారి కుటుంబసభ్యులే తాజా లోక్‌సభ ఎన్నికల్లోనూ పలువురి పోటీ సాక్షి, ముంబై: రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 30కి పైగా కుటుంబాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో పాటు దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే, దివంగత నేత ప్రమోద్ మహాజన్ తదితర నేతల వారసులు రాజకీయ రంగంలోకి అడుగిడారు. వీరిలో కొందరైతే తండ్రి, కుమారులు కూడా ముఖ్యమంత్రితో పాటు కీలక మంత్రి పదవులను చేపట్టినవారు ఉన్నారు. ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ పలువురు నేతలు, వారి వారసులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ‘పవర్’ ఫుల్... రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో పవార్ కుటుంబం కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దేశంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈయనకు తల్లి నుంచి రాజకీయ వారసత్వం లభించింది. ఆయన ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉండగా, ఆయన సోదరుని కుమారుడు అజిత్ పవార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బారామతి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఆయన కూతురు సుప్రియా సూలే మళ్లీ ఈసారి ఎన్నికల బరిలో దిగారు. తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రులుగా... రాష్ట్ర రాజకీయాలలో తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనత చవాన్ కుటుంబీకులకు దక్కింది. దివంగత శంకర్రావ్ చవాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కేంద్రంలో రక్షణమంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఆయన వారసుడైన అశోక్ చవాన్ కూడా సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటన అనంతరం రాష్ట్రంలో మంత్రి పదవులతో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వహించిన అశోక్ చవాన్‌కు ముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే ఆదర్శ్ కుంభకోణంలో ఆయన పేరు రావడంతో పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నాందేడ్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో హవా ఠాక్రే లదే... శివసేన పార్టీ ఠాక్రే కుటుంబీకులకే వారసత్వంగా లభించింది. ఠాక్రే కుటుంబీకులు ఇంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాలను తెరవెనుక నుంచే నడిపిస్తున్నారు. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే శివసేన పార్టీ స్థాపించారు. ఆయన తర్వాత ఉద్ధవ్ ఠాక్రేను వారసుడుగా ప్రకటించడంతో బాల్‌ఠాక్రే సోదరుని కుమారుడైన రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వెళ్లి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని ఏర్పాటు చేశారు. మరోవైపు బాల్‌ఠాక్రే మనుమడు, ఉద్ధవ్‌ఠాక్రే కుమారుడైన ఆదిత్య ఠాక్రే కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఈసారి ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. దేశ్‌ముఖ్ కుటుంబీకులు... దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వారసులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎనిమిదన్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన విలాస్‌రావ్, ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటనతో పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనకు కేంద్రమంత్రి పదవిని అప్పగించింది. ఆయ న మరణించిన తర్వాత కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్, సోదరుని కుమారుడు దిలీప్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ముండే కుటుంబీకులు.. బీజేపీ సీనియర్ నాయకుడైన గోపీనాథ్ ముండే కూడా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సోదరుని కుమారుడు ధనంజయ్ ముండేతోపాటు ఆయన కుమార్తె పంకజా ముండేలు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే గోపీనాథ్ ముండేతో వచ్చిన విభేదాల వల్ల ధనంజయ్ ముండే ఎన్సీపీలో చేరారు. మరోవైపు దివంగత ప్రమోద్ మహా జన్ కుమార్తె పూనమ్ మహాజన్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై నుంచి మహాకూటమి అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. దివంగత మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ కుటుంబీకులలో ఆయన భార్య శాలినీతాయి పాటిల్, కుమారుడు ప్రతీక్, మనుమడు మదన్ పాటిల్‌కు మంత్రి పదవులు లభించాయి. ప్రస్తుత అటవీశాఖ మంత్రి పతంగ్‌రావ్ కదం కుమారుడు విశ్వజీత్ కదంను పుణే లోక్‌సభ నుంచి బరిలో ఉన్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ రాణే, ఆయన కుమారుడు నీలేష్ రాణే రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎన్సీపీ సీనియర్ నాయకుడు గణేష్ నాయక్‌తోపాటు ఆయన కుమారులు సంజీవ్ నాయక్, సందీప్ నాయక్‌లతోపాటు ఆయన సోదరుని కుమారుడు సాగర్ నాయక్‌లు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సందీప్ నాయక్ ఎమ్మెల్యేగా, సంజీవ్ నాయక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా సంజీవ్ లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు జోరుగానే సాగుతున్నట్టు కనబడుతోంది. -
తండ్రుల కోసం తనయల పోటాపోటీ ప్రచారం
పింప్రి, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ నేత గోపీనాథ్‌ముండే కుమార్తె పంకజ్ పాలవే తమ తండ్రుల ప్రతిష్టను మరింత పెంచేందుకు వివిధ ప్రాంతాల్లో పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం సుప్రియాసూలే బీడ్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొని ప్రచారం నిర్వహించగా, పంకజ్ పాలవే బారామతిలో ప్రచారం చేశారు. సుప్రియా గ్రామగ్రామాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. గోపీనాథ్ ముండేను ఓడించి జిల్లా రాజకీయాల నుంచి దూరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు గోపినాథ్ ముండే పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉండడంతో తన ప్రచార బాధ్యతలను కుమార్తె పంకజ్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆమె బారామతిలో మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న‘రాష్ట్రీయ సమాజ్ పక్ష్’ అభ్యర్థి మహాదేవ్ జానకర్ గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. బారామతిలో శరద్ పవార్ రాజకీయాలకు ముగింపు ఇవ్వండని పిలుపునిస్తున్నారు. ఇదిలా వుండగా బీడ్ జిల్లాలో శరద్‌పవార్, అజిత్ పవార్ ప్రచారం ఒక దశ పూర్తి అవ్వగా, బీజేపీ నేత గోపీనాథ్ ముండే బారామతిలో ప్రచారం చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమ వివరాలను త్వరలోనే తెలుపనున్నామని సంబంధిత నాయకుడొకరు తెలిపారు. -
తగ్గుతున్న అల్లర్లు
ముంబై: రాష్ట్రంలో మతకల్లోలాలు, ఉగ్రవాదదాడులు గతంలో చాలాసార్లు సంభవించినా, వాటి సంఖ్య మెల్లగా తగ్గుముఖం పడుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఇలాంటి అల్లర్లు 50 శాతం తగ్గాయని తెలిపాయి. హింసాత్మక ఘటనల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవడం వల్లే సత్ఫలితాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లర్ల బాధితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం సానుకూల మార్పులకు కారణమవుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన మతఘర్షణలపై బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే, శివసేన సభ్యుడు ఆనంద్ పరాంజపే పార్లమెంటులో ఇటీవల అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్పీఎన్ సింగ్ సవివర సమాధానాలు చెప్పారు. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలో 2010లో 117 హింసాత్మక ఘటనలు సంభవించగా, 16 మంది మరణించారు. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేవలం 64 ఘటనలు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. మనదేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా మతఘర్షణలు జరిగాయి. ఈ ఏడాది అక్కడ 500 ఘటనలు జరగగా, 95 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎలా నియంత్రించారంటే.. మహారాష్ట్రలో గత 15-20 ఏళ్లకాలంలో సంభవించిన మతఘర్షణలు, హింసాత్మక ఘటనలను లోతుగా విశ్లేషించిన అధికారులు, అలాంటివి పునరావృతం కాకుండా నిరోధించడానికి పటిష్ట చర్యలు మొదలుపెట్టారు. మతపరంగా సున్నితపరమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిందిగా కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. మతసారస్య సాధనకు మొహల్లా కమిటీలను నియమించారు. ధుళే జిల్లాలో 2008లో జరిగిన మతఘర్షణలపై మహారాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ... అక్కడ హింసకు దారితీసిన పరిస్థితుల గురించి సమాచారం సేకరించడానికి ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించామని తెలిపారు. ‘చిన్న వివాదం తదనంతరం ఆ జిల్లాలో హింస మొదలయిందని మాకు తెలిసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైన కొందరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశాం. ధుళే అల్లర్ల నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లోని అన్ని వర్గాల నాయకులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహించి సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వివరించారు. తరచూ మొహల్లా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ అశాంతితగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలోని సంఘవ్యతిరేక శక్తులపై గట్టి నిఘా పెట్టడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తపడుతున్నారు. అంతేకాదు మతఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో శాంతిసాధనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి నేతృత్వంలో సమావేశాలు నిర్వహించడం సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘పోలీసుల నిర్లక్ష్యాన్ని మేం ఎంతమాత్రమూ సహించడం లేదు. ఘర్షణల నిరోధంలో విఫలమైన వారిని వెంటనే వెనక్కి పిలిపించి చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, అత్యవసర సమయాల్లో బలగాలను రాష్ట్రానికి పంపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో సాయపడిందని ఆయన వెల్లడించారు. ఉగ్రదాడులు, మతఘర్షణలు, నక్సల్స్ దాడుల వల్ల నష్టపోయిన వారికి కూడా కేంద్రం ఆర్థికసాయం అందజేస్తోంది. అల్లర్ల కారణంగా అనాథలుగా మారిన చిన్నారులకు చదువు చెప్పిండానికి కేంద్రం జాతీయ మతసామరస్య సంస్థ కూడా సహకరిస్తోంది. -
క్రికెట్ ను రాజకీయం చేయకండి : ఉద్దవ్ థాకరే
క్రీడల్లో జోక్యం చేసుకోవద్దని రాజకీయ నాయకులకు శివసేన అధినేత ఉద్దవ్ థాకరేకు విజ్క్షప్తి చేశారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడి స్థానానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీజేపీ నేత గోపినాధ్ ముండేల మధ్య పోటిపై నెలకొన్న తాజా వివాద నేపథ్యంలో ఉద్దవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో ముండే నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరించి.. పవార్ ను ఏకగ్రీవంగా ఎంసీఏ ఎన్నుకోవడం వివాదంగా మారింది. దాంతో ఎంసీఏ అధ్యక్షుడి ఎన్నికను సవాల్ చేస్తూ ముంబై కోర్టులో ముండే పిటిషన్ దాఖలు చేశారు. ముండే పిటిషన్ విచారించిన కోర్టు..పవార్ నియామకంపై వారం రోజుల స్టే విధించింది. రాజకీయ నాయకుల కారణంగా క్రికెట్ లో నెలకొంటున్న వివాదాలపై శివసేన అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయంలో కథనాన్ని వెల్లడించింది. క్రికెట్ ఆడుతున్న 11 దేశాల్లో రాజకీయ నాయకుల జోక్యం లేదని, కేవలం భారత దేశంలోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది అని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. బ్రిటన్ లో ప్రిన్స్ చార్లెస్ ఎన్నడూ క్రికెట్ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని.. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా క్రీడల్లో రాజకీయ నేతల జోక్యం లేదని ఉద్దవ్ అన్నారు. ప్రధాని పదవి రేసులో పవార్, ముంబై ముఖ్యమంత్రి పదవి కోసం ముండే పోటి పడుతున్న ముండేలు ఎంసీఏ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారని ఉద్దవ్ సంపాదకీయంలో రాశారు. క్రికెట్ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడాన్ని ఆపివేయాలని ఉద్దవ్ విజ్క్షప్తి చేశారు. -
హంగ్ కోరుకుంటున్నారు
కొల్హాపూర్: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత హంగ్ రావాలని ఎన్సీపీ అధ్యక్షుడు, శరద్‌పవార్ కోరు కుంటున్నారని బీజేపీ అగ్ర నాయకుడు గోపీనాథ్ ముండే ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీకిగానీ లేదా ఏ కూటమికిగానీ స్పష్టమైన మెజారిటీ రాకూడదని పవార్ అభిలషిస్తున్నారని విమర్శించారు. యూపీఏకిగానీ లేదా ఎన్డీయేకిగానీ మెజారిటీ రాకూడదనేదే ఆయన అభిమతమన్నారు. ఆ విధంగా జరిగితే ప్రధానమంత్రి పదవిని తాను చేపట్టొచ్చనేదే ఆయన అసలు ఉద్దేశమన్నారు. విజేతగా నిలిచే కూటమికి ఎనిమిది లేదా తొమ్మిది స్థానాలు తక్కువ రావాలని పవార్ కోరుకుంటున్నారన్నారు. అయితే ఆయన కలలు ఎన్నటికీ సాకారం కావన్నారు. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సొంత పార్టీకి చెందిన నాయకులపై ఆయనఒత్తిడి చేస్తున్నారన్నారు. తద్వారా తన బంధువైన అజిత్‌పవార్‌కు రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే కూడా పాల్గొన్నారు. -
మూడో కూటమిలో పవార్ చేరరు: ముండే
ముంబై: మూడో కూటమి పేరుతో పలు పార్టీల నేతలు ఒక్కచోట చేరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్రంలో మద్దతునివ్వడమేగాకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న రాష్ట్రవాది కాంగ్రెస్(ఎన్సీపీ) మూడో కూటమి నేతలతో సన్నిహితంగా మెలగడం రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. బుధవారం ఢిల్లీలో వామపక్షాలు నిర్వహించిన కార్యక్రమంలో మూడో కూటమిలో చేరే సభ్యులుగా చెప్పుకుంటున్న పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠి హాజరు కావడంతో మిత్రపక్షమైన కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీజేపీ కూడా స్పందించింది. బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే ఈ విషయమై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మూడో కూటమిలో చేరదు. నా అంచనా ప్రకారం పవార్ మూడో కూటమిలో చేరే ఆలోచన చేయకపోవచ్చు. లోక్‌సభ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు విషయమై ఈ మధ్య కాలంలో కొన్ని విభేదాలు తలెత్తాయి. తాము కోరినన్ని సీట్లను కాంగ్రెస్ ఇచ్చేలా, పాత పొత్తునే కొనసాగించేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఎన్సీపీ మూడో కూటమి సభకు హాజరై ఉండవచ్చు. తమ పంతాన్ని నెగ్గించుకేనుందుకు, కాంగ్రెస్‌ను దారికి తెచ్చుకునేందుకే ఎన్సీపీ అధినేతఈ పాచిక వేశారని నేననుకుంటున్నా. ఇక అత్యాచార నిందితులకు శిక్ష విషయంలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా అజిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెప్పే పరిస్థితి కొనితెచ్చుకున్నారు. మీడియా గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిందిగా శరద్‌పవార్ ఆదేశించినా ఆయన చెప్పలేదు. పండగపూట విద్యుత్ కోతలు విధించడాన్ని కూడా అజిత్ పరిహాసం చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడంలే’న్నారు. కాగా పవార్ స్పందిస్తూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏలోనే కొనసాగుతామన్నారు. -
ఎంసీఏ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కృతిపై కోర్టుకెక్కిన ముండే
ముంబై: ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికలపై బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే కోర్టుకెక్కారు. ఎంసీఏ అధ్యక్ష పదవికి ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంపై ముండే సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న ఎస్ఎం గోర్వాడ్కర్ తన అభ్యర్థిత్వాన్ని అక్రమంగా తిరస్కరించారని పిటిషన్లో పేర్కొన్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసీఏ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటితమైన శరద్‌పవార్‌ను అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టకుండా నిలువరించాలని గోపీనాథ్ తన పిటిషన్లో కోరారు. తన పిటిషన్లో అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పదవీ కాలం ముగిసిన ఎంసీఏ అధ్యక్షుడు రవిసావంత్, సహాయ కార్యదర్శులు నితిన్ దలాల్, పీవీ శెట్టి, సీటీ సంఘ్వీ, ఎన్నికల అధికారి గోర్వాడ్కర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. గోపీనాథ్ ముండే దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శనివారం విచారణ జరపనుంది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి గోపీనాథ్ ముండే అభ్యర్థిత్వాన్ని నివాస హోదా ఆధారంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఎంసీఏ పాలక మండలిలో ఉండే సభ్యులు ముంబై నివాసులై ఉండాలని అసోసియేషన్ నిబంధనలలో పొందుపర్చి ఉంది. పాలక మండలిలో ఉండే అభ్యర్థికి వివిధ నగరాల్లో పలు నివాసాలు ఉన్నా శాశ్వత నివాసం ముంబై అయి ఉండాలని 2006 ముంబై హైకోర్టు తీర్పులో ప్రకటించింది. ముండే శాశ్వత నివాసం ఆయన ఎన్నికల జాబితాలో నమోదైన స్థలమే అవుతుందని పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు సావంత్ తెలిపారు. -
ముండే పతనం మొదలైంది
ముంబై: బీజేపీ నేత గోపీనాథ్ ముండే పతనం ప్రారంభమైందని ఎన్సీపీ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు గోపీనాథ్ పెట్టుకున్న దరఖాస్తును సరైన నివాసపత్రం లేదనే కారణంతో ఎన్నికల అధికారి కొట్టివేసిన నేపథ్యంలో పైవిధంగా స్పందించింది. ఈ విషయమై ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం మీడియాతో మాట్లాడారు.‘ దరఖాస్తు తిరస్కరణతో గోపీనాథ్ పతనం ప్రారంభమైంది. ఇది ఆయన రాజకీయ జీవితానికి ఎదురుదెబ్బే’ అని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ గోపీనాథ్ పోటీ చేయలేరని, ఇందుకు కారణం 2009 నాటి ఎన్నికల్లో ప్రచారం కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశానంటూ కొద్దిరోజుల క్రితం ఆయన బహిరంగంగా ప్రకటించడమేనన్నారు. ఈ కేసు గనుక రుజువైతే గోపీనాథ్... ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుకాదన్నారు. అదంతా గిమ్మిక్కే సాగునీటి కుంభకోణంపై ఏర్పాటైన చితాలే కమిటీకి అవసరమైన ఆధారాలను సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ బీజేపీ నాయకులు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తావ్డేలు ప్రకటించడం ఓ గిమ్మిక్కు మాత్రమేనన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ సదరు కమిటీ వద్ద ఇప్పటికే ఉన్నాయన్నారు.