ఐదుగురు అగ్ర నేతలను వెంటాడిన ప్రమాదాలు
ఐదుగురు అగ్ర నేతలను వెంటాడిన ప్రమాదాలు
Published Wed, Jun 4 2014 12:58 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో అసలైన ప్రజా నాయకులుగా కీర్తిప్రతిష్టలు అందుకున్న ఐదుగురు అగ్ర నేతలను రోడ్డు ప్రమాదాలు కబళించాయి. ప్రజలకు మరింత కాలం సేవ చేయాలనున్న వారిని వెంటాడి మృత్యు ముఖంలోకి లాక్కెళ్లాయి.
గోపీనాథ్ ముండే: మహారాష్ట్రలో బీసీ నాయకుడిగా, ప్రజా నేతగా రాజకీయాల్లో రాణిస్తూ వచ్చిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ముంబై వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా దారిలో ఓ కారు పక్క నుంచి ఢీకొట్టడంతో తీవ్ర షాక్‌కు గురైన ముండే గుండెపోటు, అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృతిచెందారు.
వై.ఎస్. రాజశేఖరరెడ్డి: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని 2004, 2009లో ఒంటి చేత్తో గెలిపించిన జన నేత, ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
సాహిబ్‌సింగ్ వర్మ: ఢిల్లీ సీఎంగా (1996-1998), కేంద్ర మంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత సాహిబ్‌సింగ్ వర్మ 2007 జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
రాజేశ్ పైలట్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజేశ్ పైలట్ రాజస్థాన్‌లోని దౌసా సమీపంలో 2000 సంవత్సరం జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
మాధవరావు సింధియా: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా వరుసగా గెలిచిన మాధవరావు సింధియా 2001లో యూపీలో జరిగిన ప్రైవేటు విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
Advertisement
Advertisement