ముండే పతనం మొదలైంది
Published Thu, Oct 17 2013 11:45 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
ముంబై: బీజేపీ నేత గోపీనాథ్ ముండే పతనం ప్రారంభమైందని ఎన్సీపీ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు గోపీనాథ్ పెట్టుకున్న దరఖాస్తును సరైన నివాసపత్రం లేదనే కారణంతో ఎన్నికల అధికారి కొట్టివేసిన నేపథ్యంలో పైవిధంగా స్పందించింది. ఈ విషయమై ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం మీడియాతో మాట్లాడారు.‘ దరఖాస్తు తిరస్కరణతో గోపీనాథ్ పతనం ప్రారంభమైంది. ఇది ఆయన రాజకీయ జీవితానికి ఎదురుదెబ్బే’ అని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ గోపీనాథ్ పోటీ చేయలేరని, ఇందుకు కారణం 2009 నాటి ఎన్నికల్లో ప్రచారం కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశానంటూ కొద్దిరోజుల క్రితం ఆయన బహిరంగంగా ప్రకటించడమేనన్నారు. ఈ కేసు గనుక రుజువైతే గోపీనాథ్... ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుకాదన్నారు.
అదంతా గిమ్మిక్కే
సాగునీటి కుంభకోణంపై ఏర్పాటైన చితాలే కమిటీకి అవసరమైన ఆధారాలను సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ బీజేపీ నాయకులు దేవేంద్ర ఫడ్నవిస్, వినోద్ తావ్డేలు ప్రకటించడం ఓ గిమ్మిక్కు మాత్రమేనన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ సదరు కమిటీ వద్ద ఇప్పటికే ఉన్నాయన్నారు.
Advertisement
Advertisement