ఎన్డీఏకు ఎన్సీపీ మద్దతు అవసరం లేదు | NDA will not need NCP's support: Gopinath Munde | Sakshi
Sakshi News home page

ఎన్డీఏకు ఎన్సీపీ మద్దతు అవసరం లేదు

Published Wed, May 14 2014 8:39 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

NDA will not need NCP's support: Gopinath Munde

ముంబై: కేంద్రంలో బీజేపీ పూర్తి మెజార్టీ సాధిస్తుందని, ఎన్సీపీ మద్దతు అవసరం లేదని ఆ పార్టీ నేత గోపీనాథ్ ముండే అన్నారు. ఎన్డీఏలోకి ఎన్సీపీ చేరే ప్రశ్నే లేదని, తమకు ఆ పార్టీ అవసరం లేదని చెప్పారు. ఎన్డీఏకు ఎన్సీపీ మద్దతిచ్చే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముండే స్పందించారు. పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయిన అనంతరం ముండే విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి కనీసం 35 స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చేపడుతానని ముండే చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement