కేంద్రమంత్రి ముండే గోపీనాథ్ ముండే అంతిమయాత్రలో బుధవారం తోపులాట జరిగింది.
పర్లీ : కేంద్రమంత్రి ముండే గోపీనాథ్ ముండే అంతిమయాత్రలో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దాంతో తిరగబడ్డ ముండే అభిమానులు పోలీసులపై రాళ్లు విసిరారు. తమ అభిమాన నేత భౌతికకాయాన్ని కడసారి సందర్శించేందుకు వేలాదిగా జనం తరలి రావడంతో ఈ ఘటన జరిగింది. గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.