stones pelting
-
హర్యానాలో మళ్లీ ఉద్రిక్తత
చండీగఢ్: హర్యానా నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పిల్లలు జరిపిన రాళ్ల దాడుల్లో ఎనిమిది మంది మహిళలు గాయపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత జులైలో నూహ్‌లో రెండు వర్గాల మధ్య ఆందోళనలు జరిగిన తర్వాత తాజా ఘటన ఆందోళన కలిగిస్తోంది. నూహ్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మహిళలు వెళ్తుండగా.. పిల్లలు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి 8:20 సమయంలో జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు వెల్లడించారు. ఆందోళనలు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది జులై 31న నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ యాత్ర చేపట్టిన నేపథ్యంలో అల్లరిమూకలు రాళ్లు విసిరారు. దీంతో భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నిరసనలు పక్కనే ఉన్న గురుగ్రామ్, ఢిల్లీ ప్రాంతాలకు వ్యాపించాయి. ఇదీ చదవండి: కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు! -
అన్నమయ్య: టీడీపీ నేతల అరాచకం.. కర్రలు, రాళ్లతో దాడి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్సీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇక, టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు దిగారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. ఇక, ఈ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న టీడీపీ నేతలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపైకి కూడా రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ‘ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తే పవన్‌ను పట్టించుకునేవారేమో’ -
వందే భారత్‌పై రాళ్ల దాడి.. ఫుడ్ బాగాలేదని ప్రయాణీకులు సీరియస్
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరో వందే భారత్‌పై రాళ్ల దాడి జరిగింది. ధార్వాడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు.. వందే భారత్‌లో ఫుడ్ సరిగాలేదని ప్రయాణీకులు ఆందోళనలకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. శనివారం (జూలై 1) ధార్వాడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో రైలు కిటికీ అద్దాలకు స్వల్ప నష్టం జరిగింది. దేవంగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య దేవంగిరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరి కొంతదూరం చేరుకోగానే రాళ్ల దాడి జరిగింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఆర్పీఎఫ్ రైల్వే చట్టంలోని సెక్షన్ 153 (రైల్వే ఆస్తులను స్వచ్ఛందంగా ధ్వంసం చేయడం) కింద కేసు నమోదు చేసింది. దీని కింద ఐదేళ్ల వరకు శిక్ష విధించే నిబంధన ఉంది. కాగా, ఈ రైలును ప్రధాని మోదీ జూన్ 28వ తేదీన జెండా ఊపి ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించే ఆహారం చెడిపోయిందని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రైలు ప్రయాణిస్తున్న వారు అధికారులను నిలదీశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: డ్రోన్లతో రోడ్డు ప్రమాదాలకు చెక్ ? -
తిరుపతి: వందే భారత్ రైలుపై రాళ్లదాడి..
గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో గురువారం దుండగులు వందే భారత్ రైలుపై రాళ్ల దాడిచేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఆర్పీఎఫ్ సీఐ సందీప్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న రైలు మధ్యాహ్నం గూడూరు దాటిన తరువాత కొండగుంట స్టేషన్ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో కొందరు రాళ్లతో దాడిచేసినట్లు చెప్పారు. ఈ దాడిలో రైలు అద్దాలు పగిలాయని, లోపలి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ చెప్పారు. -
వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి.. దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక!
ప్రతిష్టాత్మక సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జనవరి 15న సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన ఈ రైల్లో ప్రయాణించేందకు జనాలు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వందే భారత్ రైలుపై రాళ్లు విసిరుతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. 2019 ఫిబ్రవరిలో దేశంలో వందే భారత్ సేవలు ప్రారంభమవ్వగా.. బిహార్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ వందేభారత్ రైలుపై అనేక దాడులు జరిగాయి. సికింద్రాబాద్- విశాఖపట్నం మార్గ మధ్యలో వందేభారత్‌పై ఆకతాయిలు రాళ్లు విసురుతున్నారు. ఇటీవల ఖమ్మం, విశాఖపట్నం, మహబూబాబాద్-గార్ల రైల్వే స్టేషన్ల మధ్య మధ్య దుండగులు రాళ్లు విసరడంతో బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అధికారులు రైలును నిలిపి వేయడం, పునరుద్ధరించడానికి సమయం కూడా పడుతోంది..జనవరి నుంచి ఇలాంటి ఘటనలు 9 వెలుగుచూశాయి. వందేభారత్ రైలుపై వరుస దాడుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైళ్లపై దాడికి పాల్పడేవారిని హైచ్చరికలు జారీచేసింది. రైలులో ప్రయాణించే ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే రైళ్లపై రాళ్లు రువ్వడం లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని తెలిపింది వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లపై రాళ్ల దాడి చేయడం.. ఆర్పీఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమని.. దీనికి పాల్పడే నిందితులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని పేర్కొంది. కాగా ఇప్పటి వరకు పలు కేసులు నమోదు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) 39 మందిని అరెస్టు చేసింది. -
యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై లాఠీ ఛార్జ్
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప నివాసం, కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. శివమొగ్గ జిల్లా షికారిపురలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ కోటాలో అంతర్గత రిజర్వేషన్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బంజారా, భోవి సామాజిక వర్గాలకు చెందిన వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈక్రమంలోనే రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. కర్ణాటక ఎస్సీ రిజర్వేషన్లలో మొన్నటివరకు బంజారాలు అధిక ప్రయోజనం పొందేవారు. అయితే సీఎం బసవరాజ్ బొమ్మై సర్కార్.. కొత్తగా ఎస్సీ రిజర్వేషన్లలో కోటాలు తీసుకొచ్చింది. ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. దీంతో గతంలో ఎస్సీ రిజర్వేషన్లలో 17 శాతం వరకు లబ్ధిపొందే బంజారా కమ్యూనిటీ ఇప్పుడు 4.5 శాతానికే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే తమకు అన్యాయం జరుగుతోందని వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. చదవండి: సావర్కర్ వంటి వ్యక్తులు ఏం చేశారో తెలుసా!కేంద్రమంత్రి ఫైర్ -
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం..
బెంగళూరు: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. మైసూరు-చెన్నై మధ్య నడిచే రైలుపైకి దుండగులు రాళ్లు విసిరారు. కేఆర్ పురం, బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ మధ్య శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో వందేభారత్ ఎక్సెప్రెస్ రెండు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. గర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాళ్లదాడిపై కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కొందరు కావాలనే అలజడులు సృష్టించే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి బుల్డోజర్ ట్రీట్మెంటే సరైందని అభిప్రాయపడ్డారు. Damaging Vande Bharat Express has become a regular affair & railway must take serious action on stone pellets Anyone damaging public property deserves Bulldozer treatment This happened to today morning in Bengaluru pic.twitter.com/qGW8hKASfp — Tinku Venkatesh | ಟಿಂಕು ವೆಂಕಟೇಶ್ (@tweets_tinku) February 25, 2023 ఇది కొత్తేం కాదు.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు జరగడం ఇది కొత్తేం కాదు. పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడు కూడా అద్దాలు ధ్వంసమయ్యాయి. కానీ ప్రయాణికులకు ఏమీ కాలేదు. చదవండి: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు.. ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం -
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైకి రాళ్లు.. అద్దాలు ధ్వంసం..
పాట్నా: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైకి రాళ్లు విసిరిన ఘటన మరొకటి వెలుగుచూసింది. బిహార్ కటిహార్‌లో కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం వందేభారత్ రైలు(22302)పికై రాళ్లు రువ్వారు. బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది. ఈ దాడిలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. బోగి నంగర్ సీ6 అద్దాలు మాత్రం ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. రైలు కార్యకలాపాలకు ఆంటంకం ఏర్పడినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా వందేభారత్ రైలుపైకి కొందరు రాళ్లు రువ్వారు. మెయింటెనెన్స్ సమయంలో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ రైళ్లకు సంబంధించి తరచూ ఏదో ఒక ఘటన వెలుగుచూస్తోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు మొదలైన తొలినాళ్లలో ఈ రైళ్లు పశువులను ఢీకొట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చదవండి: డేరా బాబాకు 40 రోజుల పెరోల్ -
రాళ్లదాడి.. బీజేపీకి చేదు అనుభవం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మరో సారి చేదు అనుభవం ఎదురయ్యింది. గతంలో టీఎంసీ కార్యకర్తలు బీజేపీ జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి చేయగా.. ప్రస్తుతం బీజేపీ నాయకుడు సువేందు అధికారి పాల్గొన్న ర్యాలీలో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి దేవశ్రీ చౌధురి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, మాజీ మంత్రి సువేందు అధికారి పాల్గొన్నారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఓటమి భయంతోనే టీఎంసీ నాయకులు మాపై దాడి చేశారు. వారంతా మిని పాకిస్తాన్‌కు చెందిన వారు’ అన్నారు. (చదవండి: వ్యూహాత్మక ఎత్తుగడ: బీజేపీకి దీదీ సవాల్) వచ్చే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ హింస చోటుచేసుకోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఏప్రిల్- మే నెలల్లో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో పాగా వేయాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ రోజు పరివర్తన్ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఈ ర్యాలీపై కొందరు వ్యక్తులు వాటర్ బాటిళ్లు విసిరారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ జెండాలను పట్టుకొన్న కొందరు వ్యక్తులు ‘గో బ్యాక్’ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో దక్షిణ కోల్‌కతాలోని ముదియాలి ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గతేడాది జేపీ నడ్డా పర్యటన సందర్భంగా కూడా కోల్‌కతాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానంటూ చేసిన ప్రకటనపై సువేందు స్పందించారు. ఆమెని 50 వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని తెలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఆమెని(దీదీ) నందిగ్రామ్‌లో అర లక్ష ఓట్ల తేడాతో ఓడిస్తాను. లేదంటే రాకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు. -
రాళ్ల పండుగ.. 400 మందికి గాయాలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో శనివారం జరిగిన రాళ్ల పండుగలో 400 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 12 మందికి తీవ్ర గాయాలవడంతో పాటు ఇద్దరు కంటి చూపు దెబ్బతిన్నట్లు స్థానిక ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రతి ఏడాది ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకునే సంప్రదాయం 400 ఏళ్లుగా కొనసాగుతుంది. జామ్ నదికి ఇరువైపులా ఉన్న పంధూర్నా, సవర్గాన్ గ్రామాల ప్రజలు నదీ తీరానికి చేరుకొని రెండు బృందాలుగా ఏర్పడి నది మధ్యలో ఏర్పాటు చేసిన జెండాను ఒడ్డుకు తెచ్చేందుకు పోటీపడతారు. దీనినే గోట్మార్ పండుగ అని పిలుస్తారు. 'గోట్' అంటే అక్కడి స్థానిక భాషలో రాయి అని, 'మార్' అంటే కొట్టు అని అర్థం. పోటీలో భాగంగా జెండా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకునేందుకు మరో వర్గం రాళ్లతో కొడుతూ వెనక్కు తరుముతారు. కాగా ఈ సారి జరిగిన వేడుకలో పంధుర్నా గ్రామానికి చెందిన వారు జెండాను ఒడ్డుకు తీసుకురావడంతో వారిని విజేతలుగా ప్రకటించారు. 400 ఏళ్ల చరిత్ర ఈ గోట్మార్ పండుగ వెనుక 400 వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. 400 సంవత్సరాల క్రితం జామ్ నదికి ఓ వైపున ఉన్న సవర్గాన్ గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడి అమ్మాయిని తీసుకొని పారిపోతుంటే ఊరివాళ్లు వెంబడించారని, వారు నది దాటుతుండగా రాళ్లతో కొట్టినట్లు స్థానికులు చెబుతారు. ఇది గమనించిన పంధూర్నా గ్రామస్తులు ఆ జంటను కాపాడారని అంటుంటారు. అప్పటి నుంచి ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇదే విషయమై ఎస్పీ మనోజ్‌రాయ్ మాట్లాడుతూ..' ప్రతీ ఏటా అక్కడివారు జరుపుకునే సంప్రదాయ పండుగని , రాళ్లతో కొట్టుకునే సంప్రదాయాన్ని ఆపడం సాధ్యం కాదని, అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని' పేర్కొన్నారు. గోట్మార్ పండుగ మొత్తాన్ని సీసీటీవీ, డ్రోన్లతో చిత్రీకరించినట్లు తెలిపారు. -
‘వందే భారత్’పై రాళ్లదాడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్’ (ట్రైన్ 18)పై దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక విండో గ్లాస్ విరిగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా దగ్గర బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో ట్రైన్ కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తోంది. కాగా, ట్రయల్ రన్ సందర్భంగా వందే భారత్‌పై గతంలో కూడా కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. డిసెంబర్ 20, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈ ఘటనలు జరిగాయి. (‘వందే భారత్’ బ్రేక్ డౌన్!) ఇదిలాఉండగా.. ప్రధాని చేతుల మీదుగా ఢిల్లీలో గత శుక్రవారం ప్రారంభమైన వందే భారత్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ప్రారంభమైన మొదటి రోజున ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఈ రైలు తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్యతో తుండ్లా జంక్షన్ వద్ద నిలిచిపోయింది. పట్టాలను దాటుతున్న పశువులపై ఈ రైలు దూసుకెళ్లడంతో చక్రాలు పక్కకు జరిగాయని పశ్చిమ రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ తెలిపారు. అయితే, పట్టాలపైకి ఎక్కిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.ప్రధాని మోదీ చేపట్టిన మేకిన్ ఇండియా విఫలమైందని ప్రజలు భావిస్తున్నారని, ఈ కార్యక్రమంపై పాలకులు పునరాలోచించాలని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ విమర్శలపై స్పందించిన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్.. భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అహోరాత్రులు కృషి చేసి ప్రతిష్టాత్మంగా రూపొందిన ట్రైన్ 18పై రాహుల్ విమర్శలు గుప్పించడం సిగ్గుచేటని మండిపడ్డారు. -
ముండే అభిమానుల ఆగ్రహం, రాళ్లదాడి
పర్లీ : కేంద్రమంత్రి ముండే గోపీనాథ్ ముండే అంతిమయాత్రలో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దాంతో తిరగబడ్డ ముండే అభిమానులు పోలీసులపై రాళ్లు విసిరారు. తమ అభిమాన నేత భౌతికకాయాన్ని కడసారి సందర్శించేందుకు వేలాదిగా జనం తరలి రావడంతో ఈ ఘటన జరిగింది. గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.