
పాట్నా: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైకి రాళ్లు విసిరిన ఘటన మరొకటి వెలుగుచూసింది. బిహార్ కటిహార్‌లో కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం వందేభారత్ రైలు(22302)పికై రాళ్లు రువ్వారు. బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది.
ఈ దాడిలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. బోగి నంగర్ సీ6 అద్దాలు మాత్రం ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. రైలు కార్యకలాపాలకు ఆంటంకం ఏర్పడినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా వందేభారత్ రైలుపైకి కొందరు రాళ్లు రువ్వారు. మెయింటెనెన్స్ సమయంలో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ రైళ్లకు సంబంధించి తరచూ ఏదో ఒక ఘటన వెలుగుచూస్తోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు మొదలైన తొలినాళ్లలో ఈ రైళ్లు పశువులను ఢీకొట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
చదవండి: డేరా బాబాకు 40 రోజుల పెరోల్