train attack
-
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైకి రాళ్లు.. అద్దాలు ధ్వంసం..
పాట్నా: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పైకి రాళ్లు విసిరిన ఘటన మరొకటి వెలుగుచూసింది. బిహార్ కటిహార్‌లో కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం వందేభారత్ రైలు(22302)పికై రాళ్లు రువ్వారు. బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రైలు కిటికీ అద్దం ధ్వంసమైంది. ఈ దాడిలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. బోగి నంగర్ సీ6 అద్దాలు మాత్రం ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. రైలు కార్యకలాపాలకు ఆంటంకం ఏర్పడినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో కూడా వందేభారత్ రైలుపైకి కొందరు రాళ్లు రువ్వారు. మెయింటెనెన్స్ సమయంలో ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ రైళ్లకు సంబంధించి తరచూ ఏదో ఒక ఘటన వెలుగుచూస్తోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు మొదలైన తొలినాళ్లలో ఈ రైళ్లు పశువులను ఢీకొట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చదవండి: డేరా బాబాకు 40 రోజుల పెరోల్ -
జై శ్రీరాం అనలేదని.. రైలు నుంచి తోసేశారు
కోల్‌కతా : గత ఏడాది మూక హత్యలు, గో రక్షకుల దాడులతో దేశం అట్టుడికిపోగా తాజాగా జై శ్రీరాం నినాదాల పేరిట హింసాకాండ కొనసాగుతోంది. జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ ముఖ్యంగా ముస్లింల మీద దాడులు చేస్తున్న సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ కొందరు వ్యక్తులు ఓ మదర్సా టీచర్‌పై దాడి చేసి రైలులోంచి తోసేశారు. వివరాలు.. హఫీజ్ మహ్మద్ షారుక్ హల్దార్(26) మదర్సా టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న హఫీజ్ దగ్గరకు కొందర వ్యక్తులు వచ్చారు. అతనిపై దాడి చేస్తూ.. జై శ్రీరాం నినదాలు చేయాల్సిందిగా బలవంతం చేశారు. కానీ హఫీజ్ అందుకు ఒప్పకోలేదు. దాంతో అతడిని ట్రైన్ నుంచి బయటకు తోసేశారు. ప్లాట్‌ఫాం మీద పడిపోయిన హఫీజ్‌ను గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు.. ఈ దాడిలో హఫీజ్ చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డాడు. ఈ విషయం గురించి రైల్వే పోలీసు అధికారులు మాట్లాడుతూ.. హఫీజ్‌పై దాడి చేసిన వ్యక్తుల గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. కానీ త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. -
గొడ్డలితో దాడిచేసింది మావాడే
బెర్లిన్: జర్మనీలో ఉగ్రవాదదాడికి తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఐసిస్ ఈ మేరకు ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి రైలు ట్రూచిన్జెన్ నుంచి వువర్జ్బర్గ్ వెళ్తుండగా ఓ యువకుడు కత్తి, గొడ్డలితో ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జర్మనీ భద్రత సిబ్బంది రంగంలోకి దిగి... యువకుడిని కాల్చి చంపాయి. దాడికి పాల్పడిన యువకుడిని 17 ఏళ్ల శరణార్థిగా భద్రత దళాలు గుర్తించాయి. రెండేళ్ల క్రితం జర్మనీకి వచ్చాడు. ఈ యువకుడు ఇస్లామిక్ స్టేట్ ఫైటర్ అని ఆ సంస్థ వెల్లడించింది. బాంబులు, తుపాకీలతో దాడులు చేసే ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల విభిన్న మార్గాల్లో దాడులకు పాల్పడుతున్నారు. ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఇటీవల ఉగ్రవాదులు జనసమూహంపై ట్రక్ నడిపారు. ఈ దాడిలో 84 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. తాజాగా జర్మనీలో కత్తి, గొడవలితో ఉగ్రవాది దాడి చేశాడు.