గొడ్డలితో దాడిచేసింది మావాడే | Islamic State group claims responsibility for train attack in Germany | Sakshi
Sakshi News home page

గొడ్డలితో దాడిచేసింది మావాడే

Published Tue, Jul 19 2016 3:49 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

గొడ్డలితో దాడిచేసింది మావాడే

గొడ్డలితో దాడిచేసింది మావాడే

బెర్లిన్: జర్మనీలో ఉగ్రవాదదాడికి తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఐసిస్ ఈ మేరకు ప్రకటించింది.

సోమవారం అర్ధరాత్రి రైలు ట్రూచిన్జెన్ నుంచి వువర్జ్బర్గ్ వెళ్తుండగా ఓ యువకుడు కత్తి, గొడ్డలితో ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జర్మనీ భద్రత సిబ్బంది రంగంలోకి దిగి... యువకుడిని కాల్చి చంపాయి. దాడికి పాల్పడిన యువకుడిని 17 ఏళ్ల శరణార్థిగా భద్రత దళాలు గుర్తించాయి. రెండేళ్ల క్రితం జర్మనీకి వచ్చాడు. ఈ యువకుడు ఇస్లామిక్ స్టేట్ ఫైటర్ అని ఆ సంస్థ వెల్లడించింది.

బాంబులు, తుపాకీలతో దాడులు చేసే ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల విభిన్న మార్గాల్లో దాడులకు పాల్పడుతున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఇటీవల ఉగ్రవాదులు జనసమూహంపై ట్రక్ నడిపారు. ఈ దాడిలో 84 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. తాజాగా జర్మనీలో కత్తి, గొడవలితో ఉగ్రవాది దాడి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement