బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరో వందే భారత్‌పై రాళ్ల దాడి జరిగింది. ధార్వాడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు.. వందే భారత్‌లో ఫుడ్ సరిగాలేదని ప్రయాణీకులు ఆందోళనలకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. శనివారం (జూలై 1) ధార్వాడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో రైలు కిటికీ అద్దాలకు స్వల్ప నష్టం జరిగింది. దేవంగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య దేవంగిరి స్టేషన్ నుంచి రైలు బయలుదేరి కొంతదూరం చేరుకోగానే రాళ్ల దాడి జరిగింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఆర్పీఎఫ్ రైల్వే చట్టంలోని సెక్షన్ 153 (రైల్వే ఆస్తులను స్వచ్ఛందంగా ధ్వంసం చేయడం) కింద కేసు నమోదు చేసింది. దీని కింద ఐదేళ్ల వరకు శిక్ష విధించే నిబంధన ఉంది. కాగా, ఈ రైలును ప్రధాని మోదీ జూన్ 28వ తేదీన జెండా ఊపి ప్రారంభించారు.
ఇదిలా ఉండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించే ఆహారం చెడిపోయిందని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రైలు ప్రయాణిస్తున్న వారు అధికారులను నిలదీశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: డ్రోన్లతో రోడ్డు ప్రమాదాలకు చెక్ ?
Comments
Please login to add a commentAdd a comment