బెంగళూరు: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. మైసూరు-చెన్నై మధ్య నడిచే రైలుపైకి దుండగులు రాళ్లు విసిరారు. కేఆర్ పురం, బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ మధ్య శనివారం ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో వందేభారత్ ఎక్సెప్రెస్ రెండు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. గర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రాళ్లదాడిపై కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కొందరు కావాలనే అలజడులు సృష్టించే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి బుల్‌డోజర్ ట్రీట్‌మెంటే సరైందని అభిప్రాయపడ్డారు.
Damaging Vande Bharat Express has become a regular affair & railway must take serious action on stone pellets
— Tinku Venkatesh | ಟಿಂಕು ವೆಂಕಟೇಶ್ (@tweets_tinku) February 25, 2023
Anyone damaging public property deserves Bulldozer treatment
This happened to today morning in Bengaluru pic.twitter.com/qGW8hKASfp
ఇది కొత్తేం కాదు..
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్ల దాడులు జరగడం ఇది కొత్తేం కాదు. పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడు కూడా అద్దాలు ధ్వంసమయ్యాయి. కానీ ప్రయాణికులకు ఏమీ కాలేదు.
చదవండి: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు.. ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment