Bihar: ట్రయల్‌ రన్‌లోని ‘వందేభారత్‌’పై రాళ్ల దాడి | Stone Pelting On Vande Bharat Train In Bihar's Gaya | Sakshi
Sakshi News home page

Bihar: ట్రయల్‌ రన్‌లోని ‘వందేభారత్‌’పై రాళ్ల దాడి

Published Wed, Sep 11 2024 6:58 AM | Last Updated on Wed, Sep 11 2024 8:58 AM

Stone Pelting On Vande Bharat Train In Bihar's Gaya

గయ: బీహార్‌లోని గయలో ట్రయల్‌ రన్‌లో ఉన్న వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించనున్నారు. ఇంతలోనే ఈ రైలుపై కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వి, రైలు అద్దాలు పగలగొట్టారు. ధన్‌బాద్ రైల్వే డివిజన్ పరిధిలోని గయలోని బంధువా-టంకుప్ప స్టేషన్ మధ్య ఈ రాళ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ రైలు జంషెడ్‌పూర్ నుండి పట్నా వరకు నడవనుంది.

ఈ ఘటనలో వందేభారత్ రైలు ఇంజన్‌కు ఆనుకుని ఉన్న రెండో కోచ్‌లోని సీటు నంబర్ నాలుగు దగ్గరున్న కిటికీ అద్దం పగిలిందని రైల్వే అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌ కావడంతో ఈ వందే భారత్ రైలులో ప్రయాణికులెవరూ లేరు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ మొదలు పెట్టారు. 
 
ఇదిలావుండగా సోమవారం న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement