పట్నా: ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైంది. అయితే ఇప్పుడు రైలులో బాంబు ఉందంటూ ఓ వార్త వచ్చింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే బీహార్‌లోని దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళుతున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందంటూ ఢిల్లీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే రైల్వే అధికారులు రైలును యూపీలోని గోండా స్టేషన్‌లో నిలిపివేసి, రైలులో అణువణువుగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలను గోండా ఎస్పీ, ఇద్దరు ఏఎస్‌పీలు ఒక సివిల్ సివిల్ పోలీసులు నిర్వహించారు. ఇదేవిధంగా డాగ్ స్క్వాడ్‌తో సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో బాంబు బెదిరింపు కేవలం వదంతేనని తేలింది. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును గొండా స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 7:32 గంటలకు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబు లేదని తేలడంతో, రాత్రి 9:45 గంటలకు రైలు ముందుకు కదిలేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ వదంతు వచ్చిన ఫోన్ నంబర్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment