పాట్నా: తల్లిప్రేమ అనంతమైంది. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మృత్యువు ఎదురొచ్చినా పిల్లలకు రక్షక కవచంగా మారుతుంది. తన ప్రాణాలను లెక్కచేయకుండా పిల్లల కోసం పోరాడుతుంది. ఇలాంటి ఘటనే బిహార్‌లో జరిగింది.
ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీ వెళ్లడానికి బార్హ్ రైల్వే స్టేషన్ స్టేషన్ చేరుకుంది. జనం ఎక్కువగా ఉండటంతో తోపులాట జరిగింది. ఇంతలో ప్రమాదవశాత్తు తల్లి ఇద్దరు పిల్లలు రైల్వేట్రాక్‌పై పడిపోయారు. ఈ క్రమంలోనే రైలు కదిలింది. ఇక ఏం చేయాలో తెలియక ఆ తల్లి అక్కడే ఉండిపోయింది.
రైలు పట్టాలపైనే తన పిల్లలకు రక్షణ కవచంగా మారింది ఆ తల్లి. పిల్లలను కిందికి వంచి పట్టాలపై కదలకుండా ఉండిపోయింది. వారికి తగలకుండానే వేగంగా రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. రైలు వెళ్లిన తర్వాత వారిని క్షేమంగా స్థానికులు పైకి తీసుకువచ్చారు. స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
ఇదీ చదవండి: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
Comments
Please login to add a commentAdd a comment