మహోబా: ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై కాంక్రీట్ పిల్లర్‌ను ఉంచిన ఉదంతం మహోబా జిల్లాలోని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఆ పిల్లర్‌ను చూసి, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు మహోబా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అలాగే ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన గురించి స్థానిక పోలీసు అధికారి దీపక్ దూబే మాట్లాడుతూ.. కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందా-మహోబా రైల్వే ట్రాకపై ఫెన్సింగ్ పిల్లర్ ఉంచినందుకు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిని విచారిస్తున్నామన్నారు. ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ట్రాక్‌పై ఉంచిన పోల్‌ను తొలగించిన అనంతరం ఆ మార్గంలో రైలు రాకపోకలకు సంబంధిత అధికారులు అనుమతిచ్చారని అన్నారు.
ఇదేవిధంగా బల్లియా జిల్లాలోని బైరియా ప్రాంతంలో రైలు ఇంజన్.. ట్రాక్‌పై ఉంచిన రాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసి-బల్లియా-ఛప్రా రైల్వే సెక్షన్‌లో పట్టాలపై రాయి కనిపించిందని నార్త్ ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. ట్రాక్‌పై రాళ్లను చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినట్లు కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పిల్లర్లు మొదలైనవి పెడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి.
ఇది కూడా చదవండి: World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు
Comments
Please login to add a commentAdd a comment