Parli
-
ఎమ్మెల్యే ధనంజయ్ ముండేకు కారు ప్రమాదం
సాక్షి, ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ధనంజయ్ ముండే ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ధనంజయ్ ఛాతీ, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంవల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. తన అసెంబ్లీ నియోజక వర్గమైన పర్లీలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ధనంజయ్ ముండే పాల్గొన్నారు. అనంతరం రోజంతా స్థానికులతో సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని పర్లీకి బయలుదేరారు. పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న అజాద్ చౌక్ వద్ద కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు ప్రమాదానికి గురైంది. గాయాలైన ముండేను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వదంతులను నమ్మవద్దని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని ముండే ట్వీట్ చేశారు. కాగా, ముందుజాగ్రత్తగా మెరుగైన వైద్య కోసం ఆయన్ని ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. -
ముండే అభిమానుల ఆగ్రహం, రాళ్లదాడి
పర్లీ : కేంద్రమంత్రి ముండే గోపీనాథ్ ముండే అంతిమయాత్రలో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దాంతో తిరగబడ్డ ముండే అభిమానులు పోలీసులపై రాళ్లు విసిరారు. తమ అభిమాన నేత భౌతికకాయాన్ని కడసారి సందర్శించేందుకు వేలాదిగా జనం తరలి రావడంతో ఈ ఘటన జరిగింది. గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
పర్లీ నుంచి హస్తిన వరకూ.....
-
పర్లీ నుంచి హస్తిన వరకూ.....
న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందిన గోపీనాథ్ ముండే మధ్య తరగతి కుటుంబం నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. బీజేపీలో కీలక నేతగానే కాకుండా, మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని పర్లీలో జన్మించిన ఆయన 1980లో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. గిరిజన నాయకుడైన గోపీనాథ్ ముండే.. ఇటీవలి ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల మెజారిటీతో బీద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. 1980-85, 1990-2009 మధ్య ఎమ్మెల్యేగా ముండే సేవలు అందించారు. 1995- 1999 మధ్య మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. లోక్‌సభలో బీజేపీ ఉపనేతగా ముండే వ్యవహరించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ముండే ఇటీవలే కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ సోదరిని ముండే వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ముంబైలో విజయోత్సవ ర్యాలీకి వెళుతూ ముండే మృత్యువాత పడటంతో బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.