chaos
-
HYD: మల్లాపూర్‌లో జీహెచ్ఎంసీ వాహనం బీభత్సం
సాక్షి,హైదరాబాద్: నగరంలోని మల్లాపూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్ రోడ్డుపై నిలిపి ఉంచాడు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది.వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాన్ని ఆపే క్రమంలో జీహెచ్ఎంసీ వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.సాధారణంగా హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ చెత్త తీసుకెళ్లే లారీలతో తరచు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓవర్స్పీడు, ఓవర్లోడులతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగున్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ చెత్త ఊడ్చే వాహనం కూడా అదుపుతప్పి ప్రమాదానికి కారణమవడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ముస్తాబైన మణిహారం -
కుర్చీ కోసం కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి దౌర్జన్యం
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: కడపలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి మళ్లీ దౌర్జన్యానికి దిగారు. సోమవారం(డిసెంబర్23) జరుగుతున్న కడప మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. మేయర్‌తో పాటు తనకూ కుర్చీ వేయాలని మళ్లీ హంగామా చేశారు. దీంతో ఎమ్మెల్యే,మేయర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది.టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే మాధవీరెడ్డి సమావేశ మందిరంలో గొడవకు దిగారు. ఇందుకు ప్రతిగా మేయర్‌కు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆయన సీటు ముందే బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ కార్పొరేటర్లకు మధ్య తోపులాట జరిగింది. దీంతో సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఏడుగురు కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశానికి సభ్యులు మినహా ఎవరికీ అనుమతి లేదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎమ్మెల్యే ఖాతరు చేయలేదు. డబ్బులిచ్చి మరీ మహిళలను నగరపాలక సంస్థ సమావేశానికి తీసుకువచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.గతంలోనూ నగరపాలక సంస్థ సమావేశంలో మాధవీరెడ్డి కుర్చీ కోసం హంగామా చేశారు.ప్రజా సమస్యలపై చర్చించండన్నా వినకుండా గొడవ చేశారు. దీంతో ప్రస్తుతం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యాలయం సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ గుమికూడవద్దని,ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇదీ చదవండి: గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం -
ఇస్కాన్‌పై నిషేధం దిశగా..
ఢాకా/కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) మాజీ సభ్యుడు, సమ్మిళిత సనాతని జాగరణ్ జోత్ సంఘం సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిను బంగ్లాదేశ్‌లో అరెస్ట్ చేసిన వేళ అక్కడ మరో కీలక పరిణామం సంభవించింది. ఇస్కాన్‌ను బంగ్లాదేశ్‌లో నిషేధించాలంటూ అక్కడి హైకోర్టులో బుధవారం రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించగా ఇస్కాన్ మతసంబంధ సంస్థేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ మొహమ్మద్ అసదుజ్జమాల్ కోర్టుకు తెలిపారు. కృష్ణదాస్ అరెస్ట్, ఇస్కాన్, హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా అతివాద ముస్లిం సంఘాల సభ్యుల ఆందోళనలు, మైనారిటీలపై దాడుల నడుమ ప్రభుత్వం తన స్పందన తెలియజేయడం గమనార్హం. ఘర్షణ ఘటనలో 30 మంది అరెస్ట్ కృష్ణదాస్ అరెస్ట్‌ను నిరసిస్తూ మైనారిటీ హిందువులు, కృష్ణదాస్ మద్దతుదారులు వేర్వేరు చోట్ల చేపట్టిన ర్యాలీలను బంగ్లాదేశ్ పోలీసులు అడ్డుకోవడంతో చిట్టోగ్రామ్లో జరిగిన ఘర్షణ ఘటనలో 30 మందిని అరెస్ట్‌చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లామ్ మరణించిన విషయం తెల్సిందే. అయితే కృష్ణదాస్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, వెంటనే విడుదలచేయాలని బంగ్లాదేశ్ హిందూ బుద్ధి్దస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ డిమాండ్చేసింది. ఐరాస జోక్యం చేసుకోవాలి 17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు కేవలం 8 శాతం మంది ఉన్నారు. ఆగస్ట్ ఐదున షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయాక 50కిపైగా జిల్లాల్లో మైనారిటీలపై 200కుపైగా దాడుల ఘటనలు జరిగాయి. తాజాగా కృష్ణదాస్ అరెస్ట్ తర్వాత మళ్లీ మైనారిటీలపై దాడులు పెరగడంతో ఈ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యంచేసుకోవాలని భారత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. ‘‘ అతివాదుల కనుసన్నల్లో అపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. మానవత్వానికి మచ్చతెచ్చే రీతిలో హిందువులపై దాడులు చేస్తున్నారు. ఈ అంశంలో ఐరాస కలుగజేసుకుని సమస్యకు పరిష్కారం కనుగొనాలి’’ అని గిరిరాజ్ బుధవారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో అన్నారు. ఇస్కాన్, హిందువులపై దాడులు ఆగేలా బంగ్లాదేశ్‌పై భారత్ ఒత్తిడి పెంచాలని ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ భారత విదేశాంగ శాఖను కోరారు. హిందువుల పరిరక్షణ కోసం ప్రభుత్వమే పాటుపడాలని ఇస్కాన్ బంగ్లాదేశ్ ప్రధాన కార్యదర్శి చారుచంద్రదాస్ బ్రహ్మచారి వేడుకున్నారు. భారత్ పట్ల వ్యతిరేకత, హిందువులపై ముస్లిం అతివాదుల ఆగడాలు, ఉగ్రదాడులతో తమ దేశం వేగంగా అరాచకత్వం వైపు పయనిస్తోందని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహ్మూద్ ఆందోళన వ్యక్తంచేశారు. -
Video: జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసాగా కొనసాగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో తొలిరోజైన సోమవారం నుంచే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా పునరుద్దరణ అంశాలపై గందరగోళం నెలకొంది. గురువారం అయిదోరోజు అసెంబ్లీలో ఆర్టికల్ 370పై పెద్ద రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ సభలో వాగ్వాదానికి దిగారు.అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే, జైల్లో ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడంతో సభలో రగడ మొదలైంది. ఈ నిరసన ప్రదర్శనపై సభలో బీజేపీ ప్రతిపక్షనేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే మార్షల్స్ జోక్యం చేసుకొని గొడవపడుతున్న ఎమ్మెల్యేలను బలవంతంగా దూరం తీసుకెళ్లారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడి, తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్యేల ముషియుద్దానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This is a reminder to BJP, this is not UP, this is Jammu and Kashmir assembly. ANY misadventure will get befitting reply! Kudos to @sajadlone for being the fierce tiger he is and putting these BJP MLA's in their place. DONT REKINDLE OUR MUSCLE MEMORY!!!!! @JKPCOfficial pic.twitter.com/kJpxTK9n59— Munneeb Quurraishi (@Muneeb_Quraishi) November 7, 2024గురువారం సభ ప్రారంభమైన వెంటనే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరుతూ శాససనసభ బుధవారం ఆమోదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళన చేపట్టింది. పార్టీ సభ్యులు తీర్మానం ప్రతులను చించి సభ వెల్ లోకి విసిరారు. ఈ గందరగోళం మధ్య ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్‌పై స్పీకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర చీఫ్ రవీందర్ రైనా స్పందిస్తూ.. అధికార ఎన్సీ, కాంగ్రెస్‌లు భారత వ్యతిరేక భావాలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కా హాత్ పాకిస్థాన్ కే సాత్, కాంగ్రెస్ కే హాత్ టెర్రరిస్టుల కే సాత్ అంటూ నినాదాలు చేశారు. -
Video: కోర్టులో జడ్జితో గొడవ.. లాయర్లను తరిమిన పోలీసులు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విచారణ సమయంలో జడ్జికి, ఓ న్యాయవాదికి మధ్య వివాదం తలతెత్తడంతో కోర్టు రణరంగంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కోర్టులో గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జితో, లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు గొడవకు దారితీసింది. వెంటనే భారీ సంఖ్యలో లాయర్లు జడ్జీ ఛాంబర్ వద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన అడ్వకేట్లను తరిమేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కూర్చీలు పట్టుకొని మరీ లాయర్లను బయటకు తరిమేశారు. ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలిటరీ దళాలు కూడా కోర్టు ఆవరణకు చేరుకున్నాయి.ఈ ఘటనలో పలువురు న్యాయవాదులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ వివాదంపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ సమావేశానికి పిలపునిచ్చింది. తమను జడ్జి ఛాంబర్ నుంచి బయటకు గెంటేసిన తరువాత న్యాయవాదులంతా కోర్టు బయట ధర్నా చేపట్టారు. జడ్జికి, సెక్యూరిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.In #UttarPradesh's #Ghaziabad, a major disturbance erupted in the District Court following an argument between a district judge and a lawyer during a bail hearing. The altercation soon escalated, leading to a chaotic scene as large numbers of lawyers gathered and tensions… pic.twitter.com/0RsozCFHag— Hate Detector 🔍 (@HateDetectors) October 29, 2024 -
నిమజ్జనం.. గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందుల్లో జనం
దాదర్: నిమజ్జనోత్సవాలు ముగియడంతో స్వగ్రామాలకు తరలిపోయిన వేలాది మంది భక్తులు ముంబై దిశగా తిరగు పయన మయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు బయటపడటంతో ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటికే అనేక మంది గౌరీ గణపతులను గురువారం నిమజ్జనం చేసి శుక్రవారం నుంచి తిరుగు పయనమయ్యారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ఇదిలా ఉండగా బుధవారం మళ్లీ ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు బయటపడటం ఒక కారణమైతే, రోడ్లపై ఏర్పడిన గుంతలు మరో కారణమని తెలుస్తోంది. సాధారణంగా ముంబై–గోవా జాతీయ రహదారి నిత్యం తేలికపాటి, ట్రక్కులు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రాలీలు తదితర సరుకులు చేరేవేసే భారీ వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. గణేశోత్సవాల సమయంలో ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే భక్తుల వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరంతా ముంబై–గోవా జాతీయ రహదారినే ఆశ్రయిస్తారు. దీంతో గణేశోత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై (నిత్యావసర సరుకులు చేరేవేసే వాహనాలు మినహా) భారీ వాహనాలకు నిషేధం ఉండింది. ఉత్సవాలు ముగిసిన రెండు రోజుల వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి. దీన్ని బట్టి ముంబై–గోవా జాతీయ రహ దారి ఏ స్థాయిలో బిజీగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. సాధారణంగా నిమజ్జనోత్సవాలు సాయంత్రం ముగియగానే అదే రోజు అర్ధరాత్రి దాటగానే అనేక మంది తిరుగుపయనమవుతా రు. కానీ ఈ సారి మంగళవారం సాయంత్రం ని మజ్జనోత్సవాలు ముగిసినప్పటికీ అనేక మంది బుధవారం మధ్యాహ్నం తరువాత బయలుదేరారు. బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో గురువారం ఉదయమే విధుల్లో చేరే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కారి్మకులు, కూలీలు, వ్యాపారులు బుధవారం మధ్యాహ్నం తరువాత కుటుంబ సభ్యులతో ముంబై దిశగా తిరుగు పయనమయ్యారు. ఇటీవల కరిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ పాడైపోయా యి. ఎక్కడ చూసిన గుంతలు దర్శనమిచ్చాయి. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్ పడింది. (వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య! 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర )15–17 గంటల ప్రయాణం భక్తుల వాహనాలకు (అప్, డౌన్లో) ప్రభుత్వం టోల్ నుంచి మినహాయింపు నిచ్చినప్పటికీ గుంతల కారణంగా వేగానికి కళ్లెం పడింది. దీంతో పది గంటల్లో పూర్తికావల్సిన ప్రయాణం 15–17 గంటలు పడుతుంది. ముంబై–గోవా జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా పికప్ వాహనాలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలే దర్శనమిచ్చాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి సీట్లో కూర్చుండలేక అనేక మంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డుపక్కనున్న డాబాలను ఆశ్రయించారు. దీంతో డాబా వాలాల బేరాలు జోరందుకున్నాయి. శీతలపానీయాలు, వాటర్ బాటిళ్లు, చీప్స్, తదితర చిరుతిళ్ల ప్యాకెట్లు దొరక్కుండా పోయాయి. కొన్ని చోట్ల మందకొడిగా, మరికొన్ని చోట్ల నిలిచిపోయిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్రమబదీ్ధకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకపక్క గుంతలు, పాడైపోయిన రోడ్లతో వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో వాహనాలు ఇటు ముందుకు వెళ్లలేక అటు తిరిగి వెనక్కి వెళ్లి మరో మార్గం మీదుగా వెళ్లలేక నరకయాతన అనభవించారు. -
విమానాల ఆలస్యంపై ఆందోళనలు.. దిద్దుబాటు చర్యలు!
ఢిల్లీ: పొగమంచు కారణంగా రాష్ట్ర రాజధానిలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పదుల సంఖ్యలో విమానాలు రద్దు అవుతుండగా.. చాలామట్టుకు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోతున్న ప్రయాణికులు.. విమానయాన సంస్థల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనా చూశాం. ఈ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దిద్దుబాటు చర్యకు దిగింది. మూడు గంటలకు మించి ఆలస్యమయ్యే అవకాశం ఉన్న సమయంలో వాటిని ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని విమానయాన సంస్థలకు చెబుతూనే.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెబుతూ కొన్ని డీజీసీఏ సిఫార్సులు విడుదల చేసింది. తాజాగా పొగమంచు ఎఫెక్ట్‌తో విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. లాంజ్, భోజనం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బోర్డింగ్ ఏరియాలో పడిగాపులు కాస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో.. విమానం గనుక మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే ముందుగానే రద్దు చేసుకోవచ్చని DGCA తెలిపింది. అయితే.. ఫ్లైట్ రద్దు, ముందస్తు నోటీసు లేకుండా ఆలస్యం, బోర్డింగ్ నిరాకరించబడిన సందర్భంలో ప్రయాణీకులకు పూర్తి రక్షణ, ఇతర సౌకర్యాల్ని అందించాలి. ఈ నిబంధనలను వెంటనే పాటించాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. విమానాశ్రయంలో రద్దీని నివారించడం, ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా డీజీసీఏ ఈ సిఫార్సులు చేసినట్లు వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, విమాన రద్దును పరిగణించాలి. ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. విమాన సంబంధిత విమానయాన సంస్థ వెబ్సైట్లో విమాన ఆలస్యం గురించి ఖచ్చితమైన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. ముందస్తు సమాచారం తప్పనిసరిగా ప్రయాణీకులకు ఎస్సెమ్మెస్గానీ, వాట్సాప్ ద్వారాగానీ, లేదంటే ఈ-మెయిల్ రూపంలో గానీ తెలియజేయాలి. ప్రయాణీకులకు ఆలస్యం గురించి నిర్దిష్ట సమాచారం అందించాలి. ప్రయాణికులకు సలహాలు, సూచనలు అందించడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి అని DGCA పేర్కొంది. -
రగులుతున్న రాజస్థాన్.. కేంద్రం సీరియస్
జైపూర్: రాజ్‌పుత్‌ల ఆందోళనలతో రాజస్థాన్ అట్టుడికిపోతోంది. కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ హత్యతో రగిలిపోతున్న రాజ్‌పుత్ సంస్థలు రోడ్డెక్కాయి. రవాణా స్తంభించిపోగా.. దుకాణాలు మూతపడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం బంద్ వంకతో నిరసనకారులు రోడ్డెక్కి ఉద్రిక్తతలకు కారణం అవుతున్నారు. దీంతో ఈ పరిణామాలను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాజస్థాన్ ఆందోళనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించింది కేంద్ర హోంశాఖ. దీంతో కేంద్ర బలగాలు రాజస్థాన్ పోలీసులతో కలిసి కవ్వింపు చర్యలకు దిగుతున్నవాళ్లను చెదరగొట్టనున్నాయి. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల విజయంతో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో బిజీగా ఉన్న బీజేపీకి.. ఈ పరిణామాలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. लाठी डंडे लेकर पेट्रोल पंप पर धावा बोलने वाली गुंडों की फौज,उपद्रव करने के लिए, क्या सरकार बदलने का ही इंतज़ार कर रही थी ?#Rajasthan pic.twitter.com/ktNUH5O8JJ — Ruby Arun रूबी अरुण روبی آرون 🇮🇳 (@arunruby08) December 6, 2023 जयपुर - दिल्ली हाईवे....#सुखदेव_सिंह_गोगामेड़ी_हत्याकांड#SukhdevSinghGogaMedi pic.twitter.com/gIJFESZnqg — Kaushal Singh Sudharanpara (@KS_Sudharanpara) December 6, 2023 ఆస్పత్రికి భారీగా.. కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యొదంతం రాజస్థాన్‌ను కుదిపేసింది. ఈ హత్యకు నిరసనగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ రాజ్‌పుత్ కర్ణిసేన, ఇతర కమ్యూనిటీలు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అయితే ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగలేదు. రోడ్లపై టైర్లు తగలబెట్టి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు పలు చోట్ల లాఠీలకు పని చెప్పారు. राजस्थान: उदयपुर में जिला कलेक्ट्रेट के बाहर इकट्ठा हुए करणी सेना के कार्यकर्ता ◆ सुखदेव सिंह गोगामेड़ी की हत्या पर विरोध प्रदर्शन जारी #SukhdevSinghGogaMedi #Rajasthan #KarniSena pic.twitter.com/dHKCwegxjg — News24 (@news24tvchannel) December 6, 2023 మరోవైపు సుఖ్‌దేవ్ మృతదేహం ఇంకా జైపూర్ ఆస్పత్రిలోనే ఉంది. దీంతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో రాజ్‌పుత్‌లు వస్తుండడంతో అక్కడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యపై రాజ్‌పుత్ కర్ణి సేన న్యాయ విచారణకు(జ్యూడీషియల్ ఎంక్వైరీ) డిమాండ్ చేస్తోంది. కానీ, రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఈ కేసు అప్పగించారు. ఇదీ చదవండి: గోగామేడి హంతకులు వీళ్లేనా?.. ఫొటోలు రిలీజ్ -
అసలు... కొసరు
ఏక క్రియా ద్వ్యర్థి కరీ అన్నారు పెద్దలు. రాతి మీద నూరటం కత్తికి పదును కోసం, రాయి నునుపు కోసం కాదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనుకున్న దానితో పాటు కొన్ని అవాంతర ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పనికివచ్చేవి, కొన్ని పనికిరానివి ఉంటాయి. కొన్ని సందర్భాలలో అసలు ప్రయోజనం మర్చిపోయి, ఈ కొసరుదే సరి అనుకునే ప్రమాదం కూడా ఉంది. పిల్లలకి స్నానం చేయించి, శుభ్రమైన యూనిఫారం వేసి, తల దువ్వి, షూస్ బాగా మిలమిలా మెరిసేట్టు పాలిష్ చేసి, పుస్తకాలు సద్ది, బ్యాగులో పెట్టి, ప్రేమతో తినిపించి, డబ్బా కట్టి బడికి పంపటానికి సిద్ధం చేస్తారు. బడికి వెళ్ళటంతో ప్రయోజనం సిద్ధించదు. అసలు ప్రయోజనం అక్కడికి వెళ్ళి చదువుకుంటే కలుగుతుంది. తయారు అవటం క్రమశిక్షణలో భాగం మాత్రమే. వరి సాగు చేయటం ధాన్యం కోసం. కాని వరిగడ్డి కూడా వస్తుంది. దాని వల్ల లాభం వస్తుంది అని గడ్డి కోసం వరి సాగు చేయరు. అంతే కాదు గడ్డి ఎక్కువగా పెరగటం కోసం ఎరువు వేయరు.వడ్లు బాగా రావాలని తగిన ఎరువులు వేస్తారు. ఆవులని పాల కోసం పోషిస్తారు. గోమయం, గోమూత్రం కూడా మానవులకి ఎంతగానో ఉపయోగ పడతాయి. ఒకప్పుడు వాటిని పొలాలలో ఎరువుకి వాడేవారు. గోమయంతో పిడకలు చేసి ఇంధనంగా ఉపయోగించేవారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడేవారు. ఇప్పుడు వాటిని మరెన్నింటికో ఉపయోగిస్తున్నారు. కాని ఎవరూ ఆవులని పేడకోసమో, మూత్రం కోసమో పెంచరు కదా! అవసరం అనుకుంటే ఆవులున్న వారి దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటారు. అరవిందాశ్రమంలో శ్రీ మాతగా ప్రసిద్ధి పొందిన మిర్రా సాధన ప్రారంభించిన మొదట్లో అద్భుతమైన అందంతో ప్రకాశించటం మొదలు పెట్టిందిట. శారీరిక, మానసిక ఆరోగ్యాలు ఉండటమే అందం. వెంటనే ఆవిడ ఇది నా ప్రయోజనం కాదు అని ఆ శక్తిని భౌతిక శరీరం నుండి ఉపసంహరించింది. లక్ష్యసాధనలో ఎదురయ్యే ఇటువంటి వాటిని పరమార్థం అనుకోకుండా ముందుకి సాగాలి. ఖాళీ సీసాలు సేకరించి అమ్ముకునే వాడితో ఒక పెద్దమనిషి ‘‘నీకోసమేనయ్యా నేను రాత్రి అంతా కూర్చుని సీసాలు ఖాళీ చేసేది.’’ అన్నాడట! ఆహా! ఏమి సమర్థింపు!! ఈ సందర్భంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూగారిని స్మరించక తప్పదు. స్వతంత్రోద్యమంలో ప్రధాన భాగంగా విదేశీవస్తు దహనం ముమ్మరంగా జరుగుతున్న సందర్భంలో ఎవరో ‘‘మీరు విదేశీ సిగరెట్లు కాలుస్తున్నారు. మనం విదేశీ వస్తువులు వాడం కదా!’’ అన్నారుట. దానికి నెహ్రూ గారు నవ్వుతూ... ‘‘అందుకే కదా దహనం చేస్తున్నాను.’’ అన్నారుట. పేలాల కోసం కుప్పలు తగల బెట్టటం అనే సామెత ఉంది. వరిపేలాల కోసం వడ్లని వేయిస్తారు. కాసిని వడ్లతో సరిపోయేదానికి మొత్తం కుప్పని తగల బెట్టటం తెలివి గల పనేనా? ప్రధానమైన ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తుంటే కొన్ని అనుకోనివి కూడా లభిస్తాయి. వాటిని పట్టించుకుంటే దృష్టి చెదిరే ప్రమాదం ఉంది. క్షీరసాగర మథనం చేసింది అమృతం కోసం. ఆ లోపు పాలసముద్రం నుండి ఎన్నో విశిష్ట వస్తువులు ఉద్భవించాయి – లోకోపద్రవకారకమైన హాలాహలం నుండి కల్పవృక్షం, కామధేనువు, చంద్రుడు వంటి వారి నుండి లక్ష్మిదేవి వరకు. తెలివిగలవారు దేనిని ఏ విధంగా వినియోగించుకోవాలో, ఆ విధంగా వినియోగించుకున్నారు. తమ లక్ష్యమైన అమృతం సిద్ధించే వరకు పాలసముద్రాన్ని చిలకటం కొనసాగించారు. కల్పవృక్షం వంటి వాటి కోసం మళ్ళీ అటువంటి ప్రయత్నం చేయలేదు. – డా.ఎన్. అనంతలక్ష్మి -
శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో శనివారం పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. నిత్యం ఈ రూట్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటూ రోడ్డును బ్లాక్ చేసి ఆందోళన చేపట్టారు వందల మంది స్థానికులు. దీంతో పోలీసుల ఎంట్రీతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అక్కడ. సిద్ధాంతి గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే.. వీఐపీ, విమాన ప్రయాణాలు చేసేవాళ్ల వాహనాలతో ఈ రోడ్లు నిత్యం బిజీగా ఉంటాయి. ఈ క్రమంలో వాహనాలు వేగంగా రావడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు. గాల్లో ప్రాణాలు కలుస్తున్నా పట్టించుకోవడం లేదని అధికారులను తిట్టిపోశారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు వందల మంది.. యాదయ్య మృతదేహంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళన భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. శంషాబాద్ నుంచి గగన్‌పహాడ్ వరకు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రోడ్డుపై బైఠాయించిన స్థానికులను అరెస్ట్ చేశారు. మరోవైపు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్లియరెన్స్‌కు చాలాసేపు పట్టింది. ఇంకోవైపు ఎయిర్పోర్ట్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వాహనాలను వదిలి ఎయిర్‌పోర్ట్‌కు పరుగులు పెట్టిన దృశ్యాలు కనిపించాయి. -
కర్ణాటక అసెంబ్లీలో రగడ
బెంగళూరు: బీజేపీ ఆందోళనలతో మంగళవారం కర్ణాటక విధానసభ వర్షాకాల సమావేశాలు హీటెక్కాయి. ఐదు ఎన్నికల హామీల అమలును అధికార కాంగ్రెస్ పూర్తిగా పక్కనపెట్టేసిందని విమర్శిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హౌజ్వెల్లోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేల వాగ్వాదం.. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో గందరగోళం ఏర్పడి సభ కార్యకలాపాలకు అవాంతరం ఏర్పడింది. బీజేపీ సీనియర్, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప విధాన సౌధలో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏదో చేస్తామని చెప్పి.. ఏం చేయకుండా ఉండిపోయిందని మండిపడ్డారాయన. నెల దాటినా ఎన్నికల హామీల అమలులో జాప్యం దేనికని సూటిగా ప్రశ్నించారు. తామేమీ కొత్తగా ఏదైనా చేయాలని అడగడం లేదని.. కేవలం ఇచ్చిన హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నామని చెప్పారాయన. వారం వేచిచూస్తామని.. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ తరుణంలో సీఎం సిద్ధరామయ్య జోక్యంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లి కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ‘మోసం.. మోసం.. కాంగ్రెస్ మోసం’ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ మాత్రం వాళ్ల నిరసనను రికార్డుల్లోకి ఎక్కించడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో బీజేపీ నిరసనలపై కర్ణాటక మంత్రి పరమేశ్వర స్పందించారు. ఇచ్చిన హామీల్లో ఇప్పటికే మూడు అమలు చేస్తున్న విషయం గుర్తించాలని బీజేపీకి ఆయన హితవు పలికారు. ఐదు హామీలను ఒక్కోటిగా చేసుకుంటూ పోతున్నామని, ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే క్రమంలో ఆలస్యం కావడం సహజమని వ్యాఖ్యానించారాయన. #WATCH | Bengaluru | Heated scenes at the Karnataka Assembly as BJP MLAs storm the well of the House on the issues of the implementation of the five guarantees of the Congress Government in the State. (Source: Vidhana Soudha) pic.twitter.com/CrYgd5i33j — ANI (@ANI) July 4, 2023 ఇదీ చదవండి: ఆ డిప్యూటీ సీఎం అవినీతిపరుడు.. తొలగించండి -
Adani row: ఉభయసభలు సోమవారానికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై హిడెన్‌బర్గ్ నివేదిక వ్యవహారం.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా సాగనిచ్చేలా కనిపించడం లేదు. సమావేశాల్లో నాలగవ రోజైన శుక్రవారం ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభల్లో గందరగోళానికి కారణమైంది. దీంతో.. సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అనంతరం సభలు మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో లోక్‌సభను సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తునన్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైనా ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు విరమించలేదు. సభ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ఛైర్మన్ రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు అదానీ-హిడెన్‌బర్గ్ విషయంలో పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరు, విపక్షాల దాడులను ఎలా తిప్పి కొట్టాలి అనే అంశంపై ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు బీజేపీ సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. మరోవైపు పార్లమెంటరీ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో విపక్షాల అత్యవసర సమావేశం జరిగింది. ఆప్, బీఆర్ఎస్లు సైతం ఈ సమావేశానికి హాజరు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇరు సభల్లో విడివిడిగా అదానీ-హిడెన్‌బర్గ్ వ్యవహారంపై వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఆప్ కూడా నోటీసులు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అదానీ-హిడెన్‌బర్గ్ నివేదికపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట నిరసనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. सदन में लगातार हंगामे के कारण Speaker हुए गुस्से से आग बबूला, फिर हुआ ये.. | Liberal TV#RajyaSabha #Loksabha2024 #Loksabha #Parliament #parliamentofindia #Adjourned #LiberalTV #Speaker #Ombirla #anger pic.twitter.com/FQU93r0YBC — Liberal TV (@LiberalTVNews) February 3, 2023 -
చైనా రాయబారుల నుంచి కాంగ్రెస్ నేతలకు డబ్బులు: అమిత్ షా
న్యూఢిల్లీ: సరిహద్దులో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో విపక్షాలు ఆందోళన చేయటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు. తవాంగ్ ఘర్షణను చూపుతూ కాంగ్రెస్ మరేదో అంశంపై ఈ విధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. చైనా రాయబారుల వద్ద కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌లో ఖర్చు చేశారని ఆరోపించారు. ‘సరిహద్దు ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేసినప్పటికీ ప్రశ్నోత్తరాల సమయానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. నేను ప్రశ్నోత్తరాల జాబితాను చూశాను. 5వ ప్రశ్న తర్వాత కాంగ్రెస్ అత్యుత్సాహం కనిపించింది. ఆ ప్రశ్నను కాంగ్రెస్ సభ్యుడే అడిగారు. సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ వారు సభకు అంతరాయం కలిగించారు. వారు అనుమతించి ఉంటే నేను సమాధానం ఇచ్చేవాడిని. 2006-06, 2006-07 మధ్య చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు రూ 1.35 కోట్లు అందాయి. అది ఎఫ్సీఆర్ఏ ప్రకారం సరైనది కాదు. నిబంధనల ప్రకారమే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను హోంశాఖ రద్దు చేసింది. నరేంద్ర మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించుకోలేదని స్పష్టం చేస్తున్నా.’ అని తెలిపారు హోంమంత్రి అమిత్ షా. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: చైనా కుతంత్రానికి దీటుగా బదులిచ్చిన భారత బలగాలు: రాజ్‌నాథ్ -
కిక్కిరిసిన అభిమానులు.. భయానక పరిస్థితి.. కొంచెం అటు ఇటు అయినా..
దోహా: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈ దేశం తొలిసారి ఆతిథ్యం ఇస్తుండటంతో అభిమానులు ఊహించిన దానికంటే భారీ స్థాయిలో తరలివచ్చారు. దీంతో ఖతర్-ఈక్వెడార్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంచెం అటు ఇటు అయినా ఊహించని పరిణామాలు ఎదురయ్యేవని మ్యాచ్ తిలకించడానికి వెళ్లిన అభిమానులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా దోహాలో స్టేడియం వద్ద వరల్డ్‌కప్ ఫ్యాన్ జోన్‌ను ఏర్పాటు చేశారు. అయితే అభిమానులు అంచనాలకు మించి వేలాదిగా తరలివచ్చారు. దీంతో ప్రవేశద్వారాలను మూసివేశారు అధికారులు. భారీగా పోలీసులను మోహరించారు. అభిమానులు రక్షణ గీత దాటకుండా పోలీసులు లాఠీలు, కవచాలు పట్టుకుని నిలువరించారు. దీంతో ఫ్యాన్ జోన్ సమీపంలో జనం భారీగా గూమిగూడి ఊపిరికూడా సరిగ్గా పీల్చుకోలేని విధంగా కిక్కిరిసిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లలో మ్యాచ్‌ను వీక్షించారు. అయితే మ్యాచ్ సమయంలో తాము నరకం చూసినట్లు స్టేడియం వద్దకు వెళ్లిన ఇరాక్ అభిమాని హతె ఎల్ బెరారీ పేర్కొన్నాడు. తాను దుబాయ్‌లో పనిచేస్తున్నానని మ్యాచ్ కోసమే ఖతర్ వచ్చినట్లు చెప్పాడు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని వాపోయాడు. చనిపోయేవారు.. 'జనం చనిపోయేవారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇలాంటి భారీ సమూహంలో పరిస్థితి అటూ ఇటూ అయితే వాళ్లు తట్టుకోలేరు. దేవుడి దయ వల్ల నేను కాస్త పొడుగ్గా ఉండటంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడలేదు. కానీ కొంతమంది చిన్నారులను చూసినప్పుడు వాళ్లను పైకి ఎత్తుకోమని తల్లిదంద్రులకు చెప్పాను. పిల్లలు ఈ పరిస్థితిలో ఊపిరి సరిగ్గా పీల్చుకోలేరు. నా కుటుంబం మ్యాచ్ తిలకించడానికే వచ్చింది. కానీ నేను వాళ్లను చేరుకోలేకపోయాను. ఏం చేయాలో తెలియలేదు. ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు.' అని అభిమాని వివరించాడు. ఆ ఘటన గుర్తుకొచ్చింది.. లాంజ్ ఏంజెలెస్‌కు చెందిన మరో అభిమాని లూయిస్ రేయ్స్ కూడా భయానక పరిస్థితిని వివరించాడు. కొద్దిరోజుల క్రితం దక్షిణ కొరియాలో తొక్కిసలాటలో 150 మంది చనిపోయిన ఘటన తనకు గుర్తుకు వచ్చిందని చెప్పాడు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉండని, జనం నలిగిపోయారని వివరించాడు. ఒక్క అడుగు ముందుకు గానీ, వెనక్కి గానీ వేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నాడు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, భయటకు వెళ్లిపోమని తన కుమారుడికి చెప్పినట్లు తెలిపాడు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? లేదా అరెస్టయ్యారా? అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ప్రీ వరల్డ్‌కప్ కన్సర్ట్ సందర్భంగా శనివారం రాత్రి కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్ జట్టు ఈక్వెడార్ చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి మ్యాచ్‌లో ఆతిథ్యజట్టు ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చదవండి: వహ్వా! అయ్యో ఆతిథ్య జట్టు... -
రాజమండ్రి: ‘అమరావతి’ రౌడీయిజం.. ఆజాద్ చౌక్‌లో ఉద్రిక్తత
సాక్షి, రాజమండ్రి: అమరావతి పాదయాత్రకు నిరసన సెగలు తగులుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ నగరంలోనూ మంగళవారం ‘టీడీపీ బినామీలు గో బ్యాక్’ అంటూ నినాదాలు హోరెత్తాయి. మరోవైపు వికేంద్రీకరణ కోరుతూ రాజమండ్రి వాసులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. అయితే అమరావతి పాదయాత్ర ముసుగులో గొడవలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నం బట్టబయలైంది. రాజమండ్రి ఆజాద్ చౌక్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి యాత్ర ముసుగులో టీడీపీ నేతలు కొందరు.. స్థానికులపై చెప్పులు, వాటర్ బాటిళ్లను విసిరేశారు. మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టే యత్నం చేశారు. ఆపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్థానికులపై రాళ్ల దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్లాన్ ప్రకారమే..: ఎంపీ మార్గాని భరత్ అమరావతి పేరిట పాదయాత్ర చేస్తున్న వాళ్లు.. ప్లాన్ ప్రకారమే దాడులకు పాల్పడుతున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోని దాడులకు ప్లాన్ చేశారని ఆయన మండిపడ్డారు. అమరావతి పాదయాత్రలో బ్లేడ్ బ్యాచ్‌ని పెట్టుకున్నారని, పాదయాత్రలో రౌడీ షీటర్లు ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఇది టీడీపీ యాత్ర..: ఎంపీ సుభాష్ అమరావతి యాత్ర రైతుల యాత్ర కాదని.. టీడీపీ యాత్ర అని వైఎస్సార్ సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. రైతుల ముసుగులో టీడీపీ, జనసేన నేతలు దాడులకు దిగారని ఆయన ఆరోపించారు. -
SR Nagar: తప్పుడు అడ్రస్‌తో ఇంట్లోకెళ్లి హంగామా
సాక్షి, అమీర్‌పేట: అకారణంగా ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన 18 ఏళ్ల బాలుడు, 20 ఏళ్ల నవీన్ ఇద్దరూ శుక్రవారం ఎస్ఆర్నగర్లోని నర్మదా అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 202లో చొరబడ్డారు. ఎందుకు వచ్చారని ఆ ఇంట్లో వారు అడుగుతున్నా వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ నానా హంగామా సృష్టించారు. అడ్డుకోబోయిన యజమాని సత్యనారాయణపై దాడి చేసి చేతిలోని సెల్‌ఫోన్ తీసుకుని ధ్వంసం చేశారు. శబ్దాలు విన్న పొరుగువారు వచ్చి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఆ ఇద్దరు యువకులకు ఓ యువతి వాట్సాప్ కాల్ చేసి తిట్టింది. ఆ యువతి చిరునామా చెప్పాలని మరో యువతిని అడుగగా రూ.3 వేలు ఇస్తే చెబుతాననడంతో డబ్బులు పంపించారు. ఆ యువతి చెప్పిన తప్పుడు చిరునామాకు వచ్చి హంగామా సృష్టించినట్లు తెలిపారు. -
GVMC: టీడీపీ కార్పొరేటర్ల గందరగోళం
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ రెండో పాలక వర్గ సమావేశంలో బుధవారం గందరగోళం చోటు చేసుకుంది. నగర మేయర్ హరి వెంకటకుమారి అధ్యక్షతన కోవిడ్ నిబంధనల నడుమ ఉదయం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. 125 ప్రధాన అంశాలు, మరో 11 సప్లిమెంటరీ అంశాలతో కలిపి మొత్తం 136 చర్చనీయాంశాలతో కూడిన భారీ అజెండాను అధికారులు రూపొందించారు. ఈ క్రమంలో నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించకుండా టీడీపీ కార్పొరేటర్లు అడ్టుకొని సమావేశంలో గందరగోళం సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి: కులాలకు కేసులకు సంబంధమేంటి? -
తేజ్ ప్రతాప్ పెళ్లిలో రసాభాస
పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట పెళ్లి వేడుకలో రసాభాస చోటుచేసుకుంది. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన కొందరు దుండగులు చేతి వాటం ప్రదర్శించారు. తినే ప్లేట్లు, ఆహార పదార్థాలు.. ఇలా కంటికి కనిపించిన వస్తువునల్లా దొంగిలించుకుపోయారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. శనివారం రాత్రి పట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్లో లాలూ పెద్ద కొడుకు తేజ్- ఆర్జేడీ సీనియర్ నేత చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. వధువరులు దండలు మార్చుకుంటున్న సమయంలో ఆర్జేడీ కార్యకర్తలమంటూ కొందరు.. వీఐపీ, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హాలులోకి లోపలికి ప్రవేశించారు. టపాసులతోపాటు, ప్లేట్లు, భోజనం, అతిథుల కోసం ప్యాకింగ్ చేసిన గిఫ్ట్‌లను పట్టుకుని పారిపోయారు. వారిని గమనించిన కార్యకర్తలు వెంబడించి అడ్డుకునే యత్నం చేశారు. కానీ, అప్పటికే వారు చాలా దూరం వెళ్లిపోయారు. ఈ పరిణామాల నడుమ తమపై దాడి జరిగిందని, కెమెరాలు ధ్వంసం అయ్యాయని కొందరు మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఆర్జేడీ నేతల జోక్యంతో అంతా శాంతించారు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇది జరిగినట్లు ఆర్జేడీ నేత ఒకరు తెలిపారు. 200 స్టాళ్ల ద్వారా సుమారు 7 వేల మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయగా.. ఊహించని రీతిలో జనాలు హాజరయ్యారు. మరోవైపు భోజనాల దగ్గర తొక్కిసలాట చోటు చేసుకోగా.. ఇంకోవైపు ప్రాంగణమంతా చెత్త చెదారంతో నిండిపోయింది. బాహుబలి తరహా సెట్స్ .. భారీ వ్యయంతో ఈ వివాహవేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలని యత్నించినప్పటికీ చివరకు గందరగోళ పరిస్థితుల్లో వేడుక ముగిసింది. లాలూకి నితీశ్ కౌగిలింత.. కూటమితో విడిపోయాక తొలిసారి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లాలూలు ఒకే వేదికపై సందడి చేశారు. తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరైన నితీశ్.. లాలూను ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. వీరిద్దరు కాసేపు ముచ్చటించుకోగా.. నవ దంపతులు తేజ్ ప్రతాప్-ఐశ్వర్యలను నితీశ్ ఆశీర్వదించారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. -
ఇంతకీ టీడీపీ మోదీ ప్రభుత్వంలోనే ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : ఓవైపు హోదాను కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చే ధైర్యం చేయలేకపోతోంది. మరోవైపు నేటి సభలో గందరగోళం సృష్టించి మొక్కుబడిగా ఏదో చేస్తున్నామనే హడావుడిని సృష్టిస్తోంది. బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై ఎటూ తేల్చలేకపోతోంది. అయితే ఈ పరిణామాలపై ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘లోక్‌సభలో ఊహించని సన్నివేశాలు కనిపించాయి. సభను అర్థాంతరంగా వాయిదా పడింది. అసలేం జరుగుతోంది? టీడీపీ.. మోదీ ప్రభుత్వంలో భాగస్వామి అవునా? కాదా?’’ అంటూ ట్విటర్లో ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఓ వైపు నిరసనలంటూనే.. మరోవైపు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావటం టీడీపీ ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తోంది. Crazy scenes in Lok Sabha: TDP MPs, part of ruling alliance, disrupt the house over AP special status. Force adjournment. Isn't TDP part of the Modi Govt? What the hell is going on here? — Rajdeep Sardesai (@sardesairajdeep) 6 February 2018 -
డార్జిలింగ్‌లో మళ్లీ అల్లర్లు
సాక్షి, కోల్‌కతా : డార్జిలింగ్ మరోసారి అల్లర్లతో అట్టుడికిపోయింది. గురువారం ఉదయం చెలరేగిన ఘర్షణలో ఓ పోలీస్ అధికారితోపాటు ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. గుర్ఖాల్యాండ్ జనముక్తి మోర్చా(జీజేఎం) నేత బిమల్ గురంగ్.. లెప్చా బస్తీలో తలదాచుకున్నాడన్న సమచారం మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న బీజేఎం కార్యకర్తలు పోలీసులపై కాల్పులు జరిపారు. ఘటనలో ఓ అధికారి గాయపడగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై బెంగాల్ పోలీసులు బిమల్ గురంగ్ పై వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలో ఉండగా.. అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే అక్టోబర్ 30న నిర్వహించబోయే భారీ ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లో తాను హాజరై తీరతానని బిమల్ ఓ ఆడియో సందేశంలో కార్యకర్తలకు తెలిపారు. ఇదిలా ఉంటే గురంగ్ మద్ధతుదారులు భారీ ఎత్తున్న మారణాయుధాలను.. పేలుడు పదార్థాలను దాచారని.. అక్టోబర్ 30న బహిరంగ సభ ద్వారా పెద్ద ఎత్తున్న హింసకు వ్యూహరచన చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా తాజాగా నిర్వహించిన దాడుల్లో 6 ఏకే-47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వారు చూపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకై జీజేఎం పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. -
ఇంతకీ మన పల్లెలెన్ని?
♦ దేశంలో గ్రామాల లెక్కపై గందరగోళం ♦ ఒక్కో సంఖ్య చెబుతున్న ఒక్కో శాఖ మనదేశంలో మొత్తం గ్రామాలెన్ని..?మనకు చాలాసార్లు ఇలాంటి సందేహం వస్తూంటుంది. దీనికి సమాధానం కోసం ప్రభుత్వ విభాగాలను అడిగితే స్పష్టమైన జవాబు మాత్రం రాదు. ఎందుకంటే దేశంలో ఎన్ని గ్రామాలున్నాయనే దానిపై ప్రభుత్వ శాఖలకే స్పష్టత లేదు. అందువల్లే ఒక శాఖ 6 లక్షల గ్రామాలు ఉన్నాయని చెపితే.. మరో విభాగం 10 లక్షల గ్రామాలు ఉన్నాయని చెపుతుంది. విభాగాలవారీగా గ్రామం అనే పదానికి నిర్వచనాలు భిన్నంగా ఉన్నాయి. దీనికి అనుగుణంగా గ్రామాల సంఖ్య మారిపోతోంది. మొత్తం గ్రామాల సంఖ్య ఎంత అనే దానిపై స్పష్టత లేకపోవడంతో గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూపకల్పనలో గందరగోళం తలెత్తుతోంది. ఒక్కో శాఖదీ ఒక్కో లెక్క.. దేశంలో పరిపాలనా సరిహద్దుల గురించిన సమాచారానికి అధీకృత మూలం జనాభాలెక్కలే. 2011 జనాభాలెక్కల ప్రకారం దేశంలో ఉన్న మొత్తం గ్రామాల సంఖ్య 6,49,481. ఇందులో 5,93,615 గ్రామాల్లో ప్రజలు నివసిస్తుండగా.. మరో 50 వేల గ్రామాల్లో జనావాసాలే లేవు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వంద రోజుల పని కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సేకరించిన గ్రామాలు, కుగ్రామాల సంఖ్య 10 లక్షలకుపైగానే ఉంది. ఇక తాగునీటి, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ అధీనంలో ఉండే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎంఐఎస్) డాటాబేస్‌లో ఈ సంఖ్య 6,08,662గా ఉంది. ఇదే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛ భారత్ అభియాన్(గ్రామీణ)లో గ్రామాల సంఖ్యను 6,05,805గా పేర్కొనడం గమనార్హం. ఎందుకీ తేడాలు.. వాస్తవంగా చెప్పాలంటే.. ప్రస్తుతం దేశంలో మొత్తం గ్రామాలు ఎన్ననే దానిపై అధీకృత అంచనా లేదు. ప్రణాళికాపరంగా, నిధులు అందజేసే విషయంలో కచ్చితమైన గ్రామాల సంఖ్య తెలుసుకోవడం చాలా కీలకం. ఆర్థిక, పరిపాలనకు సంబంధించి ప్రాథమిక విభాగంగా గ్రామం ఉంటుంది. ప్రభుత్వ రెవెన్యూ విభాగం.. గ్రామాలను నిర్వచించి.. గుర్తిస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఈ కొత్త గ్రామాలను గుర్తిస్తుంది. అయితే ఈ గ్రామాల పేర్లు రెవెన్యూ శాఖ జాబితాలో ఆటోమాటిక్‌గా చేరవు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభాలెక్కల గణన ప్రారంభమైన తర్వాత మాత్రమే అన్ని శాఖల వినియోగానికి అనుగుణంగా రెవెన్యూ గ్రామాన్ని చేర్చుతారు. అందువల్ల ఎప్పటికప్పుడు పెరుగుతున్న గ్రామాలు ఒకే డేటాబేస్‌లో నమోదుకావు. లెక్కల్లో లేని గ్రామాలూ ఉన్నాయ్.. జనాభాలెక్కల్లో రెవెన్యూ గ్రామాలుగానే కాక.. జనావాసాలు ఉన్న.. జనావాసాలు లేని గ్రామాలుగా విభజిస్తుంది. సెన్సెస్ ప్రకారం సుమారు 50 వేల గ్రామాల్లో జనావాసమే లేదు. అలాగే మారుమూల ప్రాంతాల్లో అటవీ గ్రామాలు–కుగ్రామాలు కూడా ఉంటాయి. రాష్ట్ర అటవీ శాఖ అటవీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం వీటిని గుర్తిస్తుంది. జనాభాలెక్కల పరిధిలోకి రాని ఇలాంటి గ్రామాలను సర్వే చేయని గ్రామాలు అంటారు. ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వ విభాగాలు జనాభా లెక్కల్లోని గ్రామాలను సాధారణంగా పరిగణనలోకి తీసుకోవు. జిల్లా అధికారులు, స్థానిక యంత్రాంగం అందించిన సమాచారాన్నే ఎక్కువగా అనుసరిస్తాయి. జనావాసమే లేని గ్రామాలు 50,000. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
తాండూరు కౌన్సిల్లో గందరగోళం
-
డిప్లొమా అభ్యర్థులకు మొండిచెయ్యి
పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో గందరగోళం.. దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించని అధికారులు కాల్ లెటర్లు పంపిన తర్వాత అభ్యంతరాలేంటి? నిరాశతో వెనుదిరిగిన అభ్యర్థులు 13ఏఎన్జీ04ఏ– గోడు వెల్లబోసుకుంటున్న బాధిత అభ్యర్థి గంగాధర్ 13ఏఎన్జీ04బీ– దేహదారుఢ్యపరీక్షలకు హాజరుకావాలని గంగాధర్‌కు పంపిన కాల్‌లెటర్ అనంతపురం సెంట్రల్ : పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన డిప్లొమా అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎంతో ఆశతో వచ్చిన అభ్యర్థులను పోలీసు అధికారులు నిర్మొహమాటంగా వెనక్కు పంపారు. బాధితుని కథనం మేరకు.... హిందూపురం మండలం పత్తికుంటపల్లికి చెందిన సంజప్ప కుమారుడు ఉప్పర గంగాధర డిప్లొమా పూర్తి చేశాడు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. హాల్ టికెట్ నంబర్ 1010192. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించడంతో దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాలని అధికారులు కాల్‌లెటర్ పంపారు. దీంతో మంగళవారం నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం (పీటీసీ)లో ఫిజికల్ మెజర్మెంట్(పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లకు హాజరయ్యాడు. అయితే దరఖాస్తు సమయంలో ప్రాథమిక పరీక్షల్లో ఎలాంటి అభ్యంతరం చేయని అధికారులు.. దేహదారుడ్య పరీక్షలకు అనుమతించకపోవడంతో బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసు కానిస్టేబుల్ పోస్టు కోసం ప్రత్యేకంగా కోర్సు తీసుకొని ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించానని, ఇప్పుడు అభ్యంతరం చెబితే ఎలా అని ప్రశ్నించాడు. డిప్లొమా కోర్సు ఇంటర్‌తో సమానం కాబట్టి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా డిప్లొమా అభ్యర్థులను పదుల సంఖ్యలో వెనక్కు పంపినట్లు పోలీసు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిప్లొమా అభ్యర్థులకు అవకాశం కల్పించలేదని సమాచారం. -
విమానాశ్రయ భూసేకరణ గందరగోళం
దగదర్తి: దగదర్తి మండలం కొత్తపల్లి కౌరుగుంటలో విమానాశ్రాయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామసభ ఆదివానం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జాబితాల్లో తప్పిదాలు, అధికారుల అవకతవకలతో గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణం అవసరమై భూసేకరణ కోసం కొత్తపల్లి కౌరుగుంటలోని 335 సర్వేనంబర్‌లో 119మంది రైతుల నుంచి 153.80 ఎకరాల భూమి కోసం అధికారులు కౌరుగుంటలో గ్రామసభ ఆదివారం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ వై.మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో గ్రామసభ ప్రారంభించిన వెంటనే లబ్ధిదారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అధికారులు తొలుత ప్రకటించిన జాబితాలకు, తాజాగా విడుదల చేసిన జాబితాలకు పొంతన లేదంటూ అధికారులపై ధ్వజమెత్తారు. మరోవైపు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు ఉంటే జాబితాల్లో మరొకరి పేర్లు ఉన్నాయంటూ మరికొంత మంది వాదనకు దిగారు. అభ్యంతరాలు వ్యక్తమైన భూములను పెండింగ్‌లో ఉంచి విచారణ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు శాంతించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల పేర్లు తొలగింపుపై ఆందోళన కొత్తపల్లి కౌరుగుంట సర్వేనంబర్ 335లో 40 మంది లబ్ధిదారుల పేర్లు తొలగింపుపై బాధితులు,ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. 1978లో ఒక్కో కుటుంబానికి రెండెకరాల వంతున 84 మందికి భూమిని పంపిణీ చేశారని, వీరిలో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అధికారులు 40 మంది పేర్లు తొలగించి అనర్హులు, స్థానికేతరుల పేర్ల చేర్చారని ధ్వజమెత్తారు.అధికారులు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీలిస్తామని తహశీల్దార్ వై.మధుసూదన్‌రావు హామీ ఇచ్చారు. -
ఎమ్మిగనూరు మున్సిపల్ సమావేశం రసాభస